top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

https://youtu.be/fCTCrSUQ2yU

'Kakathi Rudrama Episode 8' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


గత ఎపిసోడ్ లో…

జాయప సేనానికి శిష్యురాలు మధుసాని. ఆమె నాట్య సభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆమె నాట్య కౌశలాన్ని అందరూ అభినందిస్తారు.

ఇక చదవండి...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఆమె నాట్యమాడినది కుమారసంభవ యక్షగానము.

నవ యౌవనవతి యై

పార్వతి చెలితో అంటున్నది.

" నాతీ! ఏల నా మనసూ నన్ను విడిచి పోయే

నా కలలు తోచేనే నాట్యమాడేడు ఒకడూ!

జటలే తాల్చినవాడు , జాహ్నవి ముడిలో ఆడు,

చంద్రశేఖరుడమ్మా సుందరీ విను, కొమ్మా!

అప్పుడు చెలి ఏమన్నది?

"నగరాజూ నీ తండ్రి నగుబాటు పాలౌ

తగదమ్మా ఈ వలపు తలవంపులౌనౌ,

పార్వతి ; " నాతో మేలం వద్దు

నవ్వులు కావమ్మా:

నాగభూషణునొకని నలినాక్షి చూచితిని!

నిద్దుర మెలకువవచ్చి నిలువెల్ల పులకిస్తి

అద్ధిర హృదయము మ్రోగె; అలమె సిగ్గులు నన్ను, నాతీ...

ఒడలు ఝల్లున పొంగె కడలి కెరటము రీతి

చిడిముడి పాటున మనసు చేడె! వశము దప్పె

ఎవ్వరే ఆ వయసుకాడు ? ఎవ్వరే ఆ జటాధారి?

అవ్వరో! ఆ సుందరాంగుడు అంగముల విభూతి వాడె?

నాతీ........

చేత కలదే ఢక్క ఒక్కటి; చేర్చె వహ్నిని ఇతర కరమున

నాతి, ఆ దివ్యమూర్తే నా తలంపుల నిండిపోయెనే!"

చాళీయయై , లవణియై, విద్యుద్భ్రమరకమైన మధుసాని నాట్యము పాల సముద్ర వీచికలా , మంద మలయా నిలంలా చంచల గతిని సభ్యుల ఆత్మలనే కరగించి వేసింది.

నాట్యం పూర్తి అయి ఆమె తాను వేషము వేసుకొనే అభ్యంతర మందిరము లోకి రుద్ర మహాదేవరాజు యొక్క , ఇతర సభాసదుల యొక్క సెలవునంది వెడలి పోయినది.

ఆమె లోనికి వెళ్ళగానే , ఒక వృద్ధ ఆమె కడకు వచ్చి " మధుమావతీ దేవీ! శ్రీ జాయప సేనానులుంవారు సైన్యంతో బయలుదేరి లకుమయా రెడ్డి సైన్యాన్ని ఎదురు కొనేందుకు అవసరమని శివదేవయ్య దేశికుల కోరిక. ఇది అతి రహస్యంగా జరగాలీ

శ్రీ జాయప మహారాజులుంవారు మూడవ సైన్యాన్ని పానగల్లు పంపించి వున్నారు. ఆ పానగల్లు పట్టణంలో సారంగపాణి దేవ మహారాజువారుల తన సైన్యంతో సిద్దంగా వున్నారట. నీవు కూడా శ్రీ జాయప రాజుల వారితో బయలు దేరాలీ. సంతోషానికి. మీరిరువురూ బయలుదేరి నట్లుండాలట. అవసరమైతే లకుమయ ప్రభువు సైన్యాన్ని నాశనం చేసి, లకుమయ ప్రభువును బంధీగా పట్టి ఓరుగల్లుకు సగౌరవంగా కొని

రావలసిందని గురుపాదులు తమ ఆలోచనగా శ్రీ మహారాజుల వారికి మనవి చేయమన్నారు" అని రహస్యంగా నివేదించింది.

శివదేవయ్య దేశికులు శివావతారులని మధుమా వతికి నమ్మకం. మధుమా వతి

మహా భక్తురాలు, రాచరికపు వ్యవహారా లెరిగిన శేముషీ సంపన్న. ఆమె శివ దేవయ్య

దేశికుల భావం అర్థం చేసుకున్నది. ఆ మరునాడు శ్రీశ్రీ జాయప మహారాజుల వారు

మధుమా వతితో , తన రాణీవాసంతో సంగమేశ్వర పుణ్య క్షేత్ర దర్శనానికి పరివార యుక్తు లై బయలు దేరారు.

----------------------------------------------

చీకటి రోజులు.

రేపు అమావస్య. కోట నిదుర పోతున్నది. కావలి వారు వెయ్యి కళ్ళతో పహరా కాస్తున్నారు. అన్నమాంబిక కు నిద్ర రావటము లేదు. తన వివాహం యింకా ఎన్నో రోజులలో లేదు. ఊరుని అద్భుతంగా అలంకరిస్తున్నారు. లేఖలు సిద్దమౌతున్నాయి. పిలుపులు పిలవటానికి వార్తా హరులు మేలు గుర్రాలని సిద్ధం చేసుకుని వున్నారు.

" ఈ సారి వివాహానికి రుద్రదేవులు కూడా వస్తారట".

తన తండ్రిగారు తల్లిగారితో అంటూండగా తను విన్నది.

తనకి పాపం అంటుకుంటుందా!

తను ఆ దొంగ వంక ఎందుకు చూడవలెను .

అతగాడు తనను మెరపుకళ్ళతో ఏల వీక్షించవలెను. అతను తనని చూడకపోతే యింత అశాంతి లేదు. ఇంత గందర గోళం లేదు.

తను ఏమీ అనలేదు.

తన మాట ఎవరు వినరు.

అంతా పెద్దల యిష్టమే. ఇందులో పిన్నల ప్రసక్తి లేదు. ముఖ్యంగా తనబాధ ఎవరికీ అర్థంకాదు.

అమె పడకగదిలో , ఆ విశాల రాజాంతఃపురములో మిణుకు మిణుకుమని

వెలుగుతున్న చిన్నదీపము. రక్తము చిందినట్టు గదంతా ఎర్రని వెలుతురు. ఊరంతా చీకటి కాపురము పెట్టి కూర్చున్నది.

ఎక్కడో అడుగుల సవ్వడి.

'దబక్‌' మని దూకిన శబ్దము.

" ఎవరు?"

ఆమె లేచి కూర్చున్నది.

అతడు నిర్భయంగా నడచివచ్చాడు.


కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

నాన్నమ్మ పంచాయితీ తీర్పు

ఇన్స్పెక్టర్ శివాణీ

వనమాలి

మైత్రీబంధం

వినమ్రతా కుసుమాలతో అర్చన

చిలిపి తాతయ్య

మారాలి........మనం

అంగద రాయబారము

అమ్మ అంబ ఐతే

పాప ప్రక్షాళణము

అల్లరి-వల్లరి

టంకసాల వారింట్లో కాసుల కొరత

ఋణానుబంధం

శ్రీవారికి ప్రేమలేఖ

సబల

అమ్మ వెళ్ళిపోయింది

ఓ "అమ్మ పోరాటం"

రైతే రాణి

భళి భళిరా భట్టుమూర్తి

మారీచి పరిణయము

మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌

నా జీవన. . . . ఆశాలతా ?

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


110 views0 comments
bottom of page