కాకతి రుద్రమ ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/CGZXy1AS3o8

'Kakathi Rudrama Episode 7' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యముగత ఎపిసోడ్ లో…

రుద్రమదేవిని పురుషుడిగా పెంచడానికి గల కారణాలను వివరిస్తాడు శివదేవయ్య.

తనను పురుషుడిగా ఎంచి వివాహమాడిన ముమ్ముడాంబ గురించి అలోచించి బాధ పడుతుంది రుద్రమదేవి.

ఇక చదవండి...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఓరుగల్లు నగరంలో శ్రీ రుద్రదేవమహారాజు రాజప్రతినిధి అయినందుకు ఉత్సవాలు

అఖండంగా జరుగుతూనే వున్నాయి.


ఆ మహానగరంలో మహారాజు నగరులులలో, దేవాలయాలలో దినదినమూ సంగీత నృత్య గీత వాద్యాదులు , పండిత సన్మానాలు, తోలు బొమ్మలాటలూ, కథా కాలక్షేపములు జరుగుతూ వుండెను.

మహారాజు నగరంలో నృత్య విద్యా సంపన్నత సభికులకు చూరలిచ్చే నర్తకీ బృందంలో వుత్తమురాలు మధుసాని. ఆ మధుసాని కిరువది అయిదు సంవత్సరాలు. బంగారు రంగుహో రంగులతో, పోతపోసిన విగ్రహంవలె, స్ఫుటత్వము కల అవయవములతో భూమికి దిగివచ్చిన ఘృతాచి వలె వుంటుంది.ఆమె జాయప సేనానికి శిష్యురాలు. ఆ సుందరికి జాయప సేనాని భరత, వామ, భట్టోత్పల, రుద్రట రుయ్యక, ఆనంద వర్ణన, అభినవ గుప్త, దంది, క్షేమేంద్ర, ఏకావళీ కార, మమ్మట, వుద్భట , హేమచంద్రాది మహామహుల అలంకారశాస్త్రములు నేర్పియు, నేర్పించియు ఆమెను మహోత్తమ విద్యాసంపన్నను చేసినాడు.( ఈమె మనుమరాలు అయున మాచలాదేవి ప్రతాపరుద్రుని ప్రియురాలు).

ఈమె నగరు - సార్వభౌముల నగరికి దక్షిణమున, ఆ నగరు కంటియున్న జాయప సేనానీ నగరు- నంటియున్నది. ఈ నగరులో అనధ్యయన దినములలో తప్ప, ప్రతి దినము నందు సాయంకాలము రాచనగరు మోసాల యందు మ్రోగినప్పటి నుండి గోధూళి కాలం వరకు సభ జరగుతుంది. ఆ సభలో పండితులు, కవులు, గాయక శ్రేష్ఠులు, నర్తకీమణులు, తమ తమ విద్యలు చూపుతూ వుంటారు. నెలకు ఒకసారి పూర్ణిమ ముందు శుక్రవారము నాడు కామేశ్వరీ పూజా నిరతురాలైన మధుసాని, వుదయమూ, రాత్రీ కామేశ్వరీ దేవికి దివ్య నాట్యము అర్పిస్తుంది. ఆ సమయ మందాహుతులయ్యే వారు పండిత వృషభాలు, రాజసింహాలు, కవిహంసలు, గాయక తల్లజులు మంత్రి పుంగవులు , మాత్రమే ఆమె నాట్యప్రదర్శనం చూడడం తపఃఫలంగా ఎంచుకొనేవారు.

ఆంధ్రనర్తకీమణులకు అత్యంత ప్రియమైనది నందికేశ్వర సంప్రదాయం . నాట్యము మూడు పాళ్ళు , నృత్తము ఒక పాలును వారు ప్రదర్శస్తారు. ఆంధ్రనాట్యము జగత్ప్రసిద్దము. ఆంధ్రలంత నృత్య ప్రియు లాదినాల ఇంకొకరు లేరు.

సర్వశాస్త్ర పారంగతురాండ్రై దేవ గణికలకు పాఠాలు నేర్పడం ప్రాథమిక విద్యగా ఎంచుకొనే కైశికీ మణులతో కామేశ్వరీ కథ చెప్పుతూ నాట్యమాడే జక్కుల పురంథ్రులతో ఆంధ్ర నాట్య వృక్షము పుష్ప ఫలా వృతమై పెరిగింది.


నాట్యమున పూర్వ రంగము ఇష్ట దేవతా ప్రార్థనాత్మకమై , దివ్యగాథా నాట్య ప్రపూర్ణమై

వుంటుంది.

వుత్తర రంగము, వుత్తమ మానవ చరిత్రాభినయ పూర్ణము , చతుర్విధాభి నయములతో , శృంగార కరుణ భక్తి రసాలుగా, కావ్యాలు నాట్యం చేయ బడుతాయి.

మధుసాని ఒక సార్వభౌమ నగరి యందు మాత్రమే నాట్యము చేస్తుంది. శ్రీశ్రీ

రుద్రదేవ మహారాజులు సార్వభౌమ ప్రతినిధిగా అభిషేకించిన ఆ ఉత్సవాలలో రుద్ర

దేవ మహారాజు సభలో శుక్రవారాలు కానటువంటిన్నీ, అనధ్యయ దినాలు కానటు

వంటిన్నీ దినాలలో ఆ మహారాజు సభ నలంకరించి ఉండగా మధుసాని ఉదయం ప్రధమ యామ మధ్యము నుండి ద్వితీయ యామ మధ్యం వరకూ తానే నాట్యం చేస్తుంది.

ఆమె నాట్య సభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానింతురు. ఆ రుద్రేశ్వర నామక మహాసభలో సార్వభైమ సింహాసనానికి దిగువగా రాజప్రతినిధి సింహాసనంపై రుద్రదేవి పురుష వేషంతో అధివసించి ఉంది. ఆమెకు కుడి ప్రక్క శివదేవయ్య మంత్రులవారు , ఎడమ ప్రక్క సర్వ సైన్యాదక్షుల వేదికపై జాయప సేనానుల వారు అధివసించి ఉండిరి. వారికి కొంచెం దిగువగా శివదేవయ్యగారికి కుడి వైపున ప్రసాదిత్యులు , బాయప మహారాజుకు ఎడమగా మహా తలవరి ఉన్నారు.

అక్కడి నుండి సభకు ఈవలావల ఆసనాలపై మహా సామంతులూ, సామ్రాజ్య ప్రధానులు వారివారి మర్యాధల క్రమంగా పీఠికలపై అధివసించి వుండిరి. రాజ ప్రతినిధి సింహాసనానికి దిగువగా జగత్ప్రసిద్ద పండితుల ఆసనాలంటాయి.

వారికి దిగువగా సామంతులు, కళా కోవిదులు, కోటీశ్వరులు , ముఖ్యాధికారులు మొదలైన

వారందరి ఆసనాలు వుంటాయి. పండిత పీఠాలకు దిగువ ఉత్తమ రత్న కంబళీ పరచిన స్థలంలో లాసికా బృందము, మృదంగ ద్వయం, ఈవలావలగా, దేశికులైన

పంజికులు కుడి వైపుగా, చెలియైన వేరొక గణిక ఎడమ వైపుగా మధుసాని నాట్యం చేస్తుంది.

మధుసాని వెనుకగా శ్రుతిగా ఉన్న గణిక బృందానికి కుడివైపునా , ఎడమ వైపునా , ఒక వీణ, ఒక సైరంద్రీ, ఒక రావణ హస్తము, ఒక పిల్లన గ్రోవి పుంటాయి.

మధుసాని శ్రీరుద్రదేవ ప్రభువు ఆజ్ఞ ప్రకారం సభలో ప్రవేశించి రుద్రదేవికి , శివ దేవయ్య దేశికులకు మోకరించి , నమస్కరించి లేచి జాయప సేనానీ తక్కుంగల వారికి నమస్కరించినది.


మధుసాని ::

కాముని వింటినారివలె బంభర వేణి మధుసాని;

పంచబాణుని మందార బాణాలవంటి

పీనస పయోధరి మధుసాని. ;

మీనకేతనుని కేతనం వంటి బెఱుకలాడి మధుసాని;

మధనుని చెరకు వింటివంటి మధురోష్ఠి మధుసాని;

రతి తన్వంగి వంటి జవరాలు మధుసాని;

మధుసాని నవ్వితే శరత్ కాలమూ

మధుసాని నడిస్తే వర్షాకాలమూ

మధుసాని మాట్లాడితే వసంతకాలమూ

మధుసాని కనులు మూసినచో శీతాకాలమూ

ఉదయిస్తవి.

అట్టి మధుసాని నాట్య సౌందర్యము ఉత్తమ కళా భిజ్ఞురాలగు శ్రీ రుద్ర దేవుని చూచి

గ్రహించి, ఆశ్చర్యమంది, ఆనందింపగలిగింది. శ్రీ శివదేవయ్య దేశికులు ఆమె నాట్యంలో ఉదయ సంధ్యా నటేశ్వర నృత్యచ్ఛాయలు చూచి ఆనందించినారు. తక్కిన వృద్దులు , కౌమారులు, యౌవనులు అందరూ మహా మధుర నాట్యము కూడిన ఆమె సౌందర్యముతో మనస్సు లను శలభాలు చేసుకున్నారు.

" ఓం వినాయక, విఘ్నరాజం వందే!

ప్రమథ గణేశ్వర పాహిమాం , పాహిమాం !".

అని పూర్వరంగము ప్రారంభించింది.

నాట్య భేదములలో ఇరువది నాలుగవది యగు

పుష్పాంజలి నాట్యముతో ప్రారంభించి భృంగి నాట్యముతో సమాప్తం చేసింది.

ఆ వెనుక ఉత్తర రంగంలో శృంగార నాట్యం ఆరంభించి ఉత్తమ గీతాలు ఎత్తుకుని

మధురమైన కంఠంతో వాచికాభినయమూ, పరమ పవిత్ర మగు సాత్వికాభినయమూ, మనోహర పద్మలతా హస్తాలతో , పద్మ పత్రక్షులతో , చంద్ర బింబాస్యంతో, శంఖ గ్రీవంతో, నును కొనతో, ఘనకటితో, రంభోరులతో, పద్మపాదాలతో అంగాభినయమూ, నవరత్న ఖచితాలంకారాలతో, దుకూల వస్త్రాదులతో , తనురాగ, లేపకజ్జల, పుష్ప

రాగాలతో ఆహార్యాభినయమూ ఆ ప్రౌఢ చూపించింది.

కాకతి రుద్రమ ఎపిసోడ్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

నాన్నమ్మ పంచాయితీ తీర్పు

ఇన్స్పెక్టర్ శివాణీ

వనమాలి

మైత్రీబంధం

వినమ్రతా కుసుమాలతో అర్చన

చిలిపి తాతయ్య

మారాలి........మనం

అంగద రాయబారము

అమ్మ అంబ ఐతే

పాప ప్రక్షాళణము

అల్లరి-వల్లరి

టంకసాల వారింట్లో కాసుల కొరత

ఋణానుబంధం

శ్రీవారికి ప్రేమలేఖ

సబల

అమ్మ వెళ్ళిపోయింది

ఓ "అమ్మ పోరాటం"

రైతే రాణి

భళి భళిరా భట్టుమూర్తి

మారీచి పరిణయము

మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌

నా జీవన. . . . ఆశాలతా ?

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


84 views0 comments