top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 11

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 11' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


గత ఎపిసోడ్ లో…

రామప్ప దేవాలయ ప్రాభవం కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది.

ఈ ఎపిసోడ్ లో ఉద్యానవనంలో వీరభద్ర, రుద్రమ దేవి ల కలయిక గురించి ..

.. చదవండి

ఇవాళ అపురూపమైనరోజు. తనను మార్చబోతున్న రోజు. తను మారబోతున్న రోజు.

కానీ ఆమెకు తెలియదు.

ఆమెకు అత్యంత ఆప్తుడైన ప్రియుడు శ్రీశ్రీశీ చాళుక్యవీరభద్రుడు, రాజ్యకార్యలని చర్చించటానికి ఏకశిలానగరానికి విచ్చేశాడని. శివదేవయ్య మహామాత్యులకు,

"రుద్రదేవులు, ఏకాంత ఉద్యానవనంలో వంటరిగా విహరిస్తున్నారని, వారు ప్రస్తు

తము ఎవరినీ చూడరనీ " ముఖ్య మైన ఆంతరంగిక చెలికత్తె చెప్పిన వార్త.

ఆమెకూ చెలికత్తె చాళుక్యవీరభద్రులు వచ్చారనే వార్త తెలియనివ్వలేదు. స్వచ్చం

దంగా,వొంటరిగా, ఉద్యానవనంలో విహరిస్తున్న ఆమెన యిబ్బందిపెట్టడం ఎవరికీ యిష్ఠం లేదు.


ఈ రాచకార్యాలు ఎప్పుడూ వుండేవే. ఎన్నడూ తెమలవు. తరగవు. అంతా గజిబిజి.

వీరభద్రప్రభువు ఆంతరంగిక వ్యవహారమని, కాస్సేపు ఏకశిలానగరపు వీదుల

గుండా, గుర్రం స్వారీ చేశాడు.


అతనికి ఎందుకనో రుద్రదేవుణ్ణి వెంటనే చూడాలనే గాఢమైన కోరిక కలుగుతు

న్నది. కానీ వీలపడదే. ఎట్లా అతన్ని కలవటం! ఇద్దరూ వొకర్ని గురించి మరొకరు

ఆలోచిస్తున్నారు. తీరికలేని ఆలోచనలు.

రుద్రమదేవి ఆకాశం వంక చూసినది.


రాత్రి ప్రొద్దుపోయినది. చంద్రుడు తారాహారాలతో కళకళలాడుతున్నాడు. పచ్చటి వెన్నెల నేలన పారాడుతున్నది. చల్లటి వెన్నెలకు, పువ్వులు కళ్ళుగప్పి, ఆనందంతో

మెరుస్తున్నాయి. చల్లనిగాలి. యిది ఎంతయినా అనుభవించగలిగిన మధుర క్షణము.

కాలం వూరికే గడిచిపోతున్నా కదలబుద్ది కావటంలేదు.


కొమ్మ కొమ్మ నూ అడిగింది.

రెమ్మ రెమ్మ నూ అడిగింది.


తాను బాలికననే ఆనందంతో ఆడింది.

సన్నటి గొంతుకతో పాడింది.


ఆమె కళ్ళు, వెన్నెల వాకిళ్ళవలె, పువ్వులబయళ్ళ వలె, నవ్వుల సెలయేళ్ళ వలె వున్నవి.


ఎందురింత ఆనందము?ఎందుకింత ఉద్వేగము?


వసంత కాలారంభము. కోకిలరాణులు గొంతులను శృతిచేసుకుంటున్న వేళ. మొగ్గ మొగ్గా మకరందం నింపుకుని, పువ్వులాగా విచ్చుకుంటున్న వేళ,అల్లరి భ్రమరాలు,

భ్రమరగీతాలు పాడుతూ, పువ్వుల ప్రియురాళ్ళకి ప్రేమ సంగీతాలు వినిపిస్తున్న వేళ.

ఆ వేళ తనను తాను మరిచుపోయింది.


రాత్రి మొదలైన కాస్సేపటికి, వీరభద్రుడు- ఊరుని అట్లా చుట్టి వచ్చి, కాకతీప్రభువులు యింకెంతసేపటికి పిలుస్తారో,కాస్సేపు ఇట్లా విశ్రాంతి గడిపి వస్తే బావుండుననే భావంతో- నెమ్మదిగా ఉద్యానవనంలోకి వచ్చాడు.

కావలివారెవరూ లేరు.


విశాలమైన అంతఃపురపు ఈవలివైపునుంచి,సన్నని కాలిబాట -ఆ పక్కనుంచి నెమ్మదిగా అతడు తలపైకెత్తి చూసినాడు. తలుపును నెమ్మదిగా తోసి లోనికి ప్రవేశించాడు.


అక్కడ ఒక మహా సౌందర్యవతియైన స్త్రీ- కురులు విరబోసుకుని అరుదైన జాతి

శిల్పమువలె కనిపించింది.

మధురమైన వెన్నెల.

చల్ల చల్లని వెన్నెల.

వెండి తీగలు నేలకి దించిన వెన్నెల.


అతని కళ్ళకి ఆమెను యెక్కడో చూసినట్లు గుర్తు. ఎవరు? ఎవరో గుర్తుకు రావడం లేదు. ఇంకా దగ్గరికి వచ్చాడు.

ఆమె అతన్ని చూసింది-

కాలము, ప్రకృతీ పరస్పరం ఆకర్షించబడినట్లు

సాయం మబ్బూ, పొడిచే జాబిల్లీ నవ్వుకుంటున్నట్టు.


ఆనందము-

ఆశ్చర్యము-

సంభ్రమము-


చిన్ని మబ్బు తునక,మబ్బులమీద హాయిగా గెంతుతున్నది.

పువ్వులనుంచి గొప్ప సువాసన వీస్తున్నది.


ఎదురుగా వీరభద్రప్రభువు . తన కళ్ళముందు, ఎందరినో వీరులను జయించ

గలిగిన ఆమె బెదిరినది. బిత్తర చూపులు. పులిని సైతం సంహరించగల జవ్వని,

హృదయమునందలి బితుకు.


వీరభద్రుని పరిస్థితి యింతకంటే విభిన్నం కాదు.


" దేవీ"!

" ప్రభూ"!

"తమరు.... తమరు..... "?

ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చినయ్‌.

"నేను, రుద్రమదేవిని------"


అతను తనకు తెలుసునన్నట్లు చిరునవ్వు నవ్వాడు. -ఆ నవ్వులో వేవేల భావాలు.

ఇట్లా వాళ్ళు మాట్లాడుకోలేదు. వాళ్ళ మనసులు మాట్లాడుకున్నాయి. చూపులు

మాట్లాడుకున్నాయి. భావనలు మాట్లాడుకున్నాయి.


ఈ పురుషుడికోసమేనా తాను యిన్నాళ్ళు ఎదురు చూసినది. అతనే తన కళ్ళ

ముందే నిలబడితే మాట్లాడలేదేం. గొంతు పెగలదేం? పూరేకు పెదవిలో లాలిత్యంతో విచ్చుకుని-


"ప్రభూ! మీరు లేకపోతే బ్రతకలేను. ఈ జన్మ వృధా. నాకు ఈ సువిశాల సామ్రాజ్యం

కన్నా, తమ విశాల వక్షస్థలం ఎక్కువ. నన్ను గ్రహించండి. నా తండ్రిగారితో మాట్లాడండి"-అని చెప్పలేదేం..

ఒకానొక ఉన్మత్త స్థితిలో మాటలు రావు.

మాటలు రాని, పాటలు రాని కొన్ని క్షణాలు వుంటాయి.

వీరభద్రప్రభువు ఏమీ మాట్లాడలేదు.


ఆమెకు గుర్తు వచ్చింది, తను స్త్రీనని, తనకీ కొన్ని నియమ నిబందనలున్నాయని.

తమ తండ్రిగారు తమ మాట కెన్నడూ ఎదురాడరు.

తాను ఉత్తమ కుల సంజాత.


ఇంతలో ఉద్యానవనపు తోటలోనికి ఎవ్వో వచ్చుచున్న సవ్వడి.

ఆమె గబగబా నడిచిపోయింది.


వీరభద్రుడు గంభీరంగా ఈవలికొచ్చాడు.

ఇటునుంచి తలయెత్తి చూసినదెవరు?


మహామాత్యుడు శివదేవయ్య,ఆయన చిరునవ్వుతో నిలబడివున్నారు. ఈ సమాగము

పరోక్షముగా కలగజేసిన, మహామేధావీ. ఆయన గాక మరెవ్వరు? కాకపోతే, కాకతీ

సామ్రాజ్ఞి, భావి చక్రవర్తిణిని, అట్లా కలుసుకుంటే -తలలు ఎగిరిపోవా?


వీరభద్రునికి కనిపించినదెవరు?

ఒక మహా సౌంధర్యవారధి.


ఒక అప్సర భామిని-

ఒక మిన్నాగు నాగిని-


శివదేవయ్యగారి చిరునవ్వుతో నిలబడి, వీరభద్రుని భుజం తట్టి-

" వీరభద్రప్రభూ"!

"మహామాత్యా!"


" ఏమిటీ అంతులేని సంభ్రమము!"

" ఏమీ లేదు. "


"లేదా?"

" వుహూ".


ఆయన నవ్వినాడు. వీరభద్రుడు నవ్వినాడు.


"ఒక మహత్తర తేజోమూర్తి మీ మీద అపార కృపారసము కురుపించినది. - నేను చూడలేదని వీరభద్రుల అభిప్రాయమా? "


" మీరు అనుగ్రహించరాదు".

" ఎన్నటికీ"--


" ఆమె నా జీవనాధారము"

" అవశ్యము".


" ఆమె లేక నేను లేను".

" ఔను. తావి లేక పువ్వు లేదు కదా!"


వీరభద్రప్రభువు కృతజ్ఞత తో చూసినాడు.

చంద్రికా ప్రకాశమాన తళతళ కాంతులు.

" మహామాత్యా!"

"వీరభద్రప్రభూ!"


" నేను వచ్చినది అతి ముఖ్యమైన రాచకార్యమునకు"

" ఔను. మేము ఊహించితిమి".


" మహామంత్రీ! కళింగులు,సింహాచలం దగ్గర, అపారసేనలతో విడిది చేసి, రాజ

మహేంద్రవరం ను జయించి, ఇటునుంచి గోదావరిని దాటి అటునుంచి, ' కోనసీమ'

ని కుళ్ళగించి, జైత్రయాత్రలు చేస్తూ- సంరంభములో వున్నట్టు, మా తండ్రిగారి సేనాపతి సోమనాధులు నమ్మకమైన వార్త పంపించారు. "


" కళింగప్రభువుకు ఈ మద్దతు నిచ్చినదెవ్వరు?

" దాని కోసమే వేగులు, నలుదిక్కుల వార్తలు సేకరిస్తున్నారు".


" అందుకే మేము యింత ఆకస్మికముగా రావటము".

" ఇప్పుడు చేయవలసినదేమిటి?"


" శత్రువుని తరమటమే".

" శహబాష్‌, వీరభద్రప్రభూ".


వీరభద్రప్రభువులూ, శివదేవయ్య మంత్రులూ - వచ్చేటప్పటికే కొలవు తీరి వున్నది సభ.

అందరి ముఖంలోనూ గంభీరతే. ముఖ్యంగా రుద్రదేవులముఖంలో.


" చాళుక్యవీరభద్ర ప్రభువుల రాకకు కారణము".

" విన్నవిస్తాను ప్రభూ".

" ఆ -


పురుషవేషం ధరించిన,రుద్రదేవు అతని ముఖంలోనికి,తీక్షణంగా చూస్తున్నాడు.

అదే విలక్షణ వ్యక్తిత్వము. స్త్రీగా ఆమె కోమలమైనదే కాని పురుషవేషం ధరించినచో,

ఆ మృదుత్వమే మారి,,రాచఠీవి వచ్చును. కరుకు స్వభావము . ఈ రెండు వ్యక్తిత్వము

లు ఎన్నడూ ఒక్క చోట కలవవు. అదే చిత్రము.


'కటకం నుంచి బయలుదేరిన కళింగప్రభువులు, రాజమహేంద్రాన్ని, కోనసీమనూ,

నిడుబ్రోలును కబళించ చూస్తున్నారు. "


"తక్షణము నిర్వర్తించవలసిన కార్యక్రమమేమిటి?"

" మనము మన సేనలతో ఎదురించుటయే".

"ఆ "

" దీనికి జాగు చేయరాదు".

" నిజమే"


" మేము లక్షలకాల్బలముతో, ఇందుశేఖర ప్రభువులను కలుపుకుని కళింగులపై దండయాత్ర చేస్తాము"


"మరి, మీరు కళింగులపై దండయాత్ర చేస్తే- వారు, అనగా మా మీద దుముకటానికి

సిద్దంగావున్న యాదవరాజులు విరుచుకుపడితే, రెండు వైపులా అపార సైన్య

నష్టము. మనకు ఏ విధంగానూ, శ్రేయస్కరం కాదుగదా?

శివదేవయ్య చిరునవ్వు నవ్వి-

"పరిణితి చెందిన ఆలోచనా విధానము యిది ప్రభూ!"

" అందుచేత..... "


" వీరభద్రులు, యిక్కడే వుండి, ఈ సామ్రాజ్యాన్ని కాపుకాస్తారు. రేచర్ల గణనాదులు

మనకు, తమరి వలె ఆప్తులు. వారి దగ్గర దీటయిన, పోటరులైన విలుకాండ్రు వున్నా

రని మనకు తెలిసిన సంగతే. అరలక్ష విలువిధ్యా ప్రవీణులు యిటువైపునుంచి శత్రు

వులను దునుమాడుతారు. అటు నుంచి వేంగీ ప్రభువులు, అటువైపే కళింగులను తొక్కుతారు. గోదావరీ తీర మధ్యబాగాన శత్రువులు భూస్థాపితమౌతారు.


" ఇది అద్భుతమైన నైపుణ్యము".

" చిత్తము".

" మరి మాకు సెలవు".


వీరభద్రప్రభువులు చిరునవ్వుతో నిలబడి వున్నారు. రుద్రదేవులు లోపలికి వెడలినారు.

ఇంకా వుంది...



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


73 views1 comment
bottom of page