top of page

తప్పులు చేసి తప్పుడు కూడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Thappulu Chesi Thappudu Kudu' New Telugu Story


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా

గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా ।। అప్పు।।


చాలా మంది అప్పులు చేస్తుంటారు. కొంత మంది తీరుస్తూ ఉంటారు.

కొంత మంది చేబదులుగా అప్పు తీసుకుంటారు నలుగురైదుగురి దగ్గర.

అవి తీర్చడం కోసం పెద్దమొత్తంలో ఇంకొకరి దగ్గర అప్పులు చేస్తారు.

ఆ అప్పులు తీర్చడం కోసం చిట్‌లు కట్టి వాటికి హామీదార్లను వెతుక్కుని ,

ఆ పిదప కొన్ని వాయిదాలు కట్టి మిగిలినవి కట్టలేక ఉడాయించేస్తూంటారు.

అప్పుడు హామీదార్ల మీద ఆ ఋణభారం పడుతుందట.

దానికి సంబంధించి నీతి కథ లాంటి నాటకం.


భూషణం: ......రామం......రామం...

రామం.. ఆ..మీరా...రండి లోపలికి:

భూషణం.. అబ్బ... ఏమి ఎండలు: ఏమి ఎండలు.

రామం. ....కూర్చోండి మావయ్యా...కూలర్‌ వేస్తాను.


భూషణం: .. ముందు కాసిన్ని మంచినీళ్ళు నాయనా.

రామం. లలితా... మంచి నీళ్ళు తీసుకు రా.

భూషణం. ఊళ్ళో ఉన్నావో లేవో, ఉంటే ఇంట్లో ఉన్నావో లేవో నని అనుకుంటూవచ్చాను. మంచినీళ్ళు తెచ్చావమ్మా, ..ఇటివ్వు .( త్రాగి) అమ్మయ్య.....ఇప్పటికి ప్రాణం కుదుటపడింది.


రామం: ఏదో పనిమీద వచ్చి ఉంటారు.లేక ఇంటి ముందునుంచి పోతున్నాలోపలికి రారు కదా మీరు.


భూషణం.ఆ ( అదేం లేదు గానీ ....రావడం మీదే వచ్చానులే.


రామం. చెప్పండి.చల్ల కొచ్చి ముంత దాచడమెందుకు?


భూషణం: ఏం లేదూ, ఈ మధ్య చిట్‌ఫండ్స్‌ లో చేరి డబ్బు కడుతున్నాను.


యాభై వేలది.-నెలకు ఎనిమిది వందలు కడుతున్నాననుకో. ఈ నెలలో చీటీ నా

పేరున వచ్చింది. చెక్‌ తీసుకోవాలంటే హామీసంతకం ఉండాలిట. చూడు ఇక్కడో సంతకం పడెయ్‌. నేను వెళ్ళిపోతాను.


రామం. నే నిది వరకే ఇద్దరికి హామీ సంతకాలు పెట్టాను. మావయ్యా, ఇన్నిట్లో ఇరుక్కుంటే నేను ఇబ్బంది పడాలి. ఇంకెవరిని అయినా అడిగితే బాగుంటుం

దేమో !!


భూషణం: నీకే రకమైన ఇబ్బందీ కలుగదు. డబ్బు నేను సరిగా కట్టకపోతే కదా ప్రమాదం. ఆ సమస్యే లేదు.


రామం: మావయ్యా, నన్ను వదిలేయండి. మీ మీద నమ్మకం లేక కాదు. నా పరిస్థితీ అంతంత మాత్రం గానే ఉంది.


భూషణం: ఏమిటయ్యా..రామం.. దూరానికైనా అల్లుడివి కదా అన్న చనువు కొద్దీ వస్తే అట్లా అంటావేమిటీ? అయినా పరిస్థితులు బాగా లేవంటున్నావేమిటి? ఏం సంగతయ్యా- డబ్బేమైనా కావాలంటే ఆ ఈ ఐదొందలుంచు.నీకు వీలున్నప్పుడు ఇవ్వు, మరీ అంత మొహమాటపడితే ఎట్లా ? నా గురించి అందరూ తలోమాట అనుకుంటున్నారని నువ్వు కూడా అలానే అనుకుంటున్నావా? నాకు తెలుసు.


అందరూ నన్ను స్వార్థపరుడని , అందరికీ హాని చేసే రకమని , చస్తే మోసేవాళ్ళు కూడా దొరకరని తిట్టుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఒక్కొక్కళ్ళ ఖర్మ- ఎంత మంచికి పోయినా చెడే వచ్చి ఎదుట నిలుస్తుంది. ఇప్పుడే కాదు నీకెప్పుడు డబ్బు అవసరమున్నా నన్నడుగు తెలిసిందా?


రామం: మావయ్యా.. అది కాదు...డబ్బు ..


భూషణం: ఉండవయ్యా... నీ లాంటి వాడు ఎట్లా బతుకుతాడో అర్థం కాదు.ప్రపంచము మన ననుసరించి నడవదు. ప్రపంచాన్ని అనుసరించి మనం పోవాలి. అంటే సవ్యంగా బతకాలంటే ముందు కావలసింది లౌక్యం. ఇదిగో ఈ ఐదువందలు ముందు జేబులో ఉంచుకుని ఇక్కడ సంతకం పడెయ్‌. వచ్చే నెలలో అమ్మాయి పెళ్ళి ఉంది. ఆడపిల్ల పెళ్ళంటే నీకు తెలియనిదేముంది? కొంత అప్పుంది. ఈ డబ్బు చేతికి వస్తే వాటన్నింటి నుంచి కడతేరతాను. ఆ( సంతకం పెట్టావు కదా, రేపు అట్లా ఆఫీసు వైపు వస్తాను. సాలరీ సర్టిఫికెట్‌ తీసి ఉంచు. తీసుకువెళతాను. వస్తా మరి.


రామం: ఆ ( అట్లాగే.


లలిత: ఊరక రారు మహానుభావులు మీ భూషణం మావయ్య వచ్చాడంటే ఊరికే రాడు, ఏదో కొంప ముంచడానికే వస్తాడు. ఎందుకొచ్చాడేమిటీ?.


రామం: ఏదో చిట్‌ తీసుకున్నాడట. హామీ కాయితం మీద సంతకం కోసం వచ్చాడు.


లలిత: కొంపదీసి మీరు పెట్టారా? మొన్నీ మధ్య మా శారద మొగుడు ఎవరికో సంతకం పెడితే డబ్బు కట్టలేదు. మనషి పత్తా లేడట. చచ్చినట్టు మా శారద వాళ్ళే కట్టాల్సి వచ్చింది.


రామం: ఏం చెయ్యమంటావు లలితా, చాలా బలవంతం పెట్టాడు. చాలా మొహమాటం పెట్టాడు. ఎట్లా చెయ్యాలో అర్థం కాలేదు. నీ ఖర్చులు కుంటాయి అని ఇదిగో

ఈ ఐదువందలు చేతిలో పెట్టాడు.


లలిత: దాంతో మీరు ఐసై పోయారు కదూ! అసలాయన వచ్చాడంటేనే ఎవడి నెత్తినో చెయ్యి పెట్టడానికి వస్తాడన్న మాటే. తను, తన సంసారం సుఖంగా ఉండాలి. వేరే వాళ్ళు నాశనం కావాలి, అన్న సిద్దాంతం." తప్పులు చేసి తప్పుడు కూడు" తినటం ఆయనకు అలవాటు.


రామం: (విసుగ్గా) అబ్బ ఏమిటీ? అసలే నేను ఇందులో ఇరుక్కున్నందుకు బాధ పడుతుంటే నీ సొద- వెళ్ళి నీ పని చూసుకో…


లలిత: ( గునుస్తూ) మగాళ్ళందరికీ విసుక్కోవడానికి, విరుచుకు పడడానికి తేరగా పెళ్ళాలు దొరుకుతారు.( లోపలికి వెళ్ళిపోతూ).

-------------

రామం: లలితా.....లలితా......

లలిత: ఆ( ఏంటండి......

రామం: ఏమైనా ఉత్తరాలు వచ్చాయా?

లలిత: ఆ హా వచ్చింది . శ్రీముఖం.


రామం: శ్రీముఖమేమిటీ? సరిగ్గా చెప్పకూడదూ?

లలిత: నేను చెప్పడమెందుకు? మీరే చూడండి.

రామం: చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి వచ్చినట్లుందే.

లలిత: అవును-- వాళ్ళు మన చుట్టాలుగా- సన్మానం చేస్తాం- రమ్మన్నారు.


రామం: ( కోపంగా) లలితా...సమయం, సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు.


లలిత: లేకపోతే ఏమిటండీ, ఎవడో వచ్చి సంతకం పెట్టమనగానే హామీ సంతకం పెట్టేయ్యడమేనా.. ఇటువంటి విషయాల్లో మొహమాటం పడితే చూడండి ఏమైందో ?


రామం: తప్పించుకుందామంటే వీల్లేకుండా నా ప్రాణం తిన్నాడు కదే ఆయన. ఇప్పుడు ఆరు నెలల నుండి డబ్బు కట్టడం లేదుట. ఎన్ని నోటీసు లిచ్చినా సమాధానమివ్వటము లేదుట. సుమారు ఐదు వేలు కట్టాలి. లేకపోతే షూరిటీ ఇచ్చిన పుణ్యానికి నా శాలరీ నుంచి రికవరీ చేస్తారట. ఆఫీసుకు కూడా నోటీసు పంపారట.. నా శాలరీ నుంచి డబ్బులు విరగ్గొట్టమని.


లలిత: కట్టండి. మరి, చేసేదేం ఉంది.

రామం: కట్టగలిగితే బాదెందుకు. నీతో మాటలు పడడమెందుకూ?


లలిత: మరేం చేస్తారు.


రామం: ఉన్న అప్పులే ఎలా తీర్చాలో తేలక సతమతవుతున్నాను.

లలిత: వాళ్ళింటికి వెళ్ళి రండి ఓ సారి.


రామం: ఆయన నాలుగు నెలల క్రితమే ఊళ్ళోంచి బిచాణా ఎత్తేసాడట.


లలిత: అంటే ఈ డబ్బు ఎగ్గొట్టి ఊళ్ళు తిరుగుతున్నా డన్న మాట. ఈ మనుషులకు సిగ్గు అనేది ఎందుకుండదో.


రామం: ఆయన సంగతి కాస్తో, కూస్తో తెలిసి ఇరుక్కోవడం నాదే తప్పు. ఈ గండం ఎట్లా గడవాలో - బహుశా ఆ డబ్బంతా అంటే ప్రతి నెలా ఆ చిట్టి నేనే కట్టవలసి వస్తుందేమో!


లలిత: ఆయన పుచ్చుకునేటప్పుడు పుత్రోత్సాహం లాగా పుచ్చుకుని ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినట్టు ఏడుస్తూ ఎగ్గొట్టి పోయాడు.చూడండి, మనకు తెలియకుండా ఓ పెద్ద గొయ్యి ఉందనుకోండి. అదక్కడ ఉందని మనకు తెలియదు. తెలియకుండా కాలు జారి పడిపోతాం. అప్పుడు పడ్డామే అని బాధపడేకంటే ఏం చెయ్యాలో ఆలోచించడం తెలివిగల పనేమో !


రామం: ఆ తెలివైన పనేదో నువ్వు చేస్తూండు.- బయట నా పాట్లు నేను పడతాను.


లలిత: ఆ ( మీరు ముందుగా తెలివిగా ప్రవర్తించి ఉంటే ఇంత పనయ్యేది కాదుగా.


ఐదొందలు ఎరగా చూపించి గోతిలో దింపాడు.అయిందేదో అయింది. మా పుట్టింటి వాళ్ళిచ్చిన నగ ఉందిగా.- ఇది వదిలించుకుంటే అది వదులుతుంది


రామం: సర్లె , నేను వెళుతున్నా...?


లలిత: ఉండండి...కాఫీ తాగి వెళుదురు గానీ…


రామం: ఆ-- కాఫీ తాగినట్టే ఉందిలే… నే వెళ్ళొస్తా.... తలుపేసుకో.

--------------

రామం: లలితా! మా భూషణం మావయ్య- మనలనే కాదు- చాలా మందిని ఈ విధంగా ముంచాడట!


లలిత: మునిగింది మనం ఒక్కళ్ళం కాదులే అని సంతోషిస్తున్నారా!

రామం: అబ్బబ్బ...నువ్వు అస్సలు నా మాటే వినిపించుకోవేం- మనిద్దరం పోయిన జన్మలో బద్ద శత్రువులు అయి వుండాలి. ఒకటి కాకపోతే ఒక దానికన్నా నా మాటకు విలువ నివ్వవు కదా!


లలిత: చేసేవన్నీ ఇలాంటి పనులు. వీటి క్కూడా మీరు చాలా మంచిపని చేశారని మెచ్చుకోమంటారా? అయినా గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి. మీ రొక్కనాడన్నా

నన్ను సుఖ పెట్టారా ( ముక్కు చీదేస్తుంది).


రామం: ఏమన్నా అంటే చాలు ఇదో బ్రహ్మాస్త్రం తయీరుగా ఉంటుంది. ఏం మాట్లాడలన్నా కష్టం. నోరు మూసుకుంటే నష్టం.


లలిత: సరేలెండి, అసలేం జరిగిందో చెప్పండి.


రామం: చెప్పేదేం ఉంది. ఈ మధ్య మనకాయనతో అంతగా సంబంధం లేదు. రాకపోకలు లేవు గానీ ఉండివుంటే తెలిసేది.- అప్పులు చేసి స్నేహితుల దగ్గర, వడ్డీ

లేకుండా ఇచ్చిన వాళ్ళను ముంచి, బిజినెస్‌ లో పెట్టి, పార్ట్‌నర్‌ గా చేరినవాడిని ముంచి, ఇంకో చిట్‌ తీసుకుని షూరిటీ ఇచ్చిన వాళ్ళను మోసగించటం !


ఇదిట ఆయన చేస్తున్న తంతు. ఆరు నెలలనుంచి ఊళ్ళోనే లేడుట.


లలిత: ఈ వయసులో ఆయన అట్లా అందరినీ మోసగిస్తూ డబ్బు సంపాదించి కాలక్షేపం చేస్తున్నాడన్న మాట.


రామం: ఆయన మోసానికి గురయినవాళ్ళు , ఎట్లాంటి వాళ్ళు? అందరూ చిన్న ఉద్యోగాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. కానీ, నేనొకటి నిశ్చయించుకున్నాను. ఇట్లా ఆయన ఆటలు సాగనిస్తే ఇంకెంత మందిని మోసం చేస్తాడో, భూషణం మావయ్య మీద ఈ రోజే పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేస్తా. నా లాగా మోసపోయిన వాళ్ళనందరినీ కలుపుకుని .

ఇలా "తప్పుడు పనులు చేస్తూ తప్పుడు కూడు తినేవాళ్ళ "భరతం పట్టమని.


***

-------------------శుభంభూయాత్‌-------------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.128 views2 comments

2 comentarios


Good moral unna story

best wishes to the writer

Me gusta

Good story manchi moral cover chesaru

good wishes to the writer

Me gusta
bottom of page