top of page
Original.png

మదిలో మల్లెల మాల - పార్ట్ 15

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ధారావాహిక చివరి భాగం

Madilo Mallela Mala - Part 15 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 10/02/2026

మదిలో మల్లెల మాల - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక చివరి భాగం 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ:


తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్‌కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చేయనట్లు తెలుసుకుంటారు రామారావు. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్‌లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేస్తూ ఉంటాడు రమణ. రమణ పనిచేసే కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది రంజని.


రంజనికి సినిమా హీరోయిన్ అవకాశం ఇస్తానని ఆమె అన్న రంగారావుతో చెబుతాడు భీమారావు.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 11  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 12  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మదిలో మల్లెల మాల - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 15 చదవండి.


తల్లి ఆరోగ్యం సరిగా లేదని రంగారావు రంజనికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు.


సెలవు మీద స్నేహితురాలు వనజ హైదరాబాదుకు వెళుతుంటే తనూ వారం రోజులు సెలవు పెట్టి వనజతో బయలుదేరింది. వనజ ఆ వూరి వ్యక్తే అయినందున రంజనిని వారి అన్నగారి ఇంట వదలి తను ఇంటికి వెళ్ళిపోయింది.


రంజని లోనికి పోయి తల్లిని చూస్తే ఆమె నిక్షేపంలా ఉంది. ‘నీకు హీరోయిన్ అయ్యే యోగం ఉందని... అబద్ధం చెప్పి నిన్ను అందుకే పిలిపించా’నని, తన నిర్ణయాన్ని తెలియజేశాడు రంగారావు. తల్లిదండ్రులకు రంగారావు నిర్ణయం నచ్చకపోయినా... ప్రస్తుతంలో అతని నిలయంలో ఉంటున్న కారణంగా... రంగారావును వారించలేకపోయారు.


‘వీడితో పేచీ పెట్టుకుంటే... ఇక్కడినుంచి పారిపోవడం సాధ్యం కాదు, వీడి మాటలను ఒప్పుకొని వాడి ఇష్టానుసారం నడుచుకుంటే... సమయం చూచుకొని ఇక్కడి నుంచి పారిపోవచ్చునని రంజని నిర్ణయించుకుంది.’ వనజకు ఫోన్ చేసి తన కథనంతా చెప్పి సాయం చేయమని కోరింది. వనజ అందుకు అభయ హస్తాన్ని ఇచ్చింది.


రంగారావుతో కలిసి డైరెక్టర్ గారిని... నిర్మాత భీమారావును, ఇతర సినీపరిశ్రమ ముఖ్య వ్యక్తులను కలిసింది. రంజని ఫొటోలను వివిధ భంగిమలలో తీశారు. స్క్రీన్ టెస్ట్ జరిగింది. అన్నింటిలోనూ పాస్.


భీమారావు.... తను వేసిన పాచిక ఫలించిందని సంబరపడ్డాడు. తమ కొత్త చిత్రంలో నాయిక రంజని.... తను హీరో.... రంగారావు విలన్... చిత్రం ముగిసే లోపల రంజనిని తన వశం చేసుకోగలనని భీమారావు ఎంతగానో ఆనందపడ్డాడు.-----ఆనంద్ తన తల్లిదండ్రులతో బెంగళూరు చేరాడు. బిగ్‌బాస్ ఆదేశానుసారం చెన్నైలో వారం రోజులు ఉండి అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళాడు రమణ.


ధర్మారావు గారు రమణకు ఫోన్ చేశాడు. యోగక్షేమాలను పరామర్శించి పెట్టేశాడు. తన టూర్ విషయాన్ని వారికి వివరించాడు రమణ.


వారు ఫోన్ చేసిందానికి కారణం.... సుధ విషయంలో రమణ తన నిర్ణయాన్ని వారికి ఇరవై నాలుగు గంటల్లో తెలియజేయలేకపోవడమే.


తన టూర్ ప్రోగ్రామ్‌ను గురించి... తను బెంగళూరుకు ఎప్పుడు రాబోతున్నది... వివరంగా మెసేజ్ తయారు చేసి... చివరన, రాగానే అమ్మకు విషయాన్ని చెప్పి తన నిర్ణయాన్ని తెలియజేయగలనని, ఆలస్యం అయినందుకు క్షమించవలసినదిగా కోరి ల్యాప్‌టాప్ ద్వారా సమాచారాన్ని ధర్మారావుగారికి పంపాడు రమణ.


తల్లితండ్రి పెద్దమ్మ ఆనందంగా మాట్లాడుకునే సమయంలో.... ఆనంద్ పెద్దమ్మగారి ప్రక్కన కూర్చుని సుధ విషయంలో తనకు ఉన్న అభిప్రాయాన్ని వివరించాడు.


సునంద తొలుత ఆశ్చర్యపోయినా... సుధకున్న లోపాన్ని తెలిసీ ఆనంద్ ఆమెను వివాహం చేసుకోదలచినందుకు ఎంతగానో సంతోషించింది. సుధ మూగదన్న విషయాన్ని విని ఆనంద్ తల్లిదండ్రులు తొలుత సందేహించినా... వారి కుటుంబాన్ని గురించి సునంద చెప్పిన మాటలు విని చివరకు సమ్మతించారు. ఆనంద్ గాలిలో తేలిపోయాడు. తన వారి సమ్మతాన్ని సుధకు తెలియజేశాడు.-----భీమారావు తన ఆశయసిద్ధి త్వరలో జరగబోతున్నందుకు పరమానందంతో మిత్రులకు పార్టీ ఇచ్చాడు. తన ట్రాప్‌లో రంగారావు పడ్డందుకు ఎంతగానో సంతోషించాడు.


పార్టీ ముగిసింది. అందరూ వారి వారి నిలయలకు వెళ్ళిపోయారు. తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తున్న భీమారావుకు బ్యాలెన్స్ తప్పింది. ఫ్లై ఓవర్ మీద నుంచి అతని కారు క్రింద పడిపోయింది. అది రాత్రి పన్నెండు గంటలకు జరిగింది. చూచిన మహనీయులు ఎవరో రెండు గంటల ప్రాంతంలో అతన్ని హాస్పిటల్‌కు చేర్చారు. కాలు చేయి విరిగిపోయాయి. ఒళ్ళంతా గాయాలు.


విషయాన్ని విన్న రంగారావు ఆవేదనతో హాస్పిటల్‌కు వెళ్ళి భీమారావుకు సాయంగా నిలబడ్డాడు. దురాశ దుఃఖానికి చేటు అన్న పెద్దల మాట భీమారావుకు సరిగా వర్తించింది. బంగారయ్య గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు.


ఇది జరిగిన మరు ఉదయం ఆనంద్ తల్లిదండ్రులతో సునంద... ధర్మారావు గారి ఇంటికి వెళ్ళింది. ఆమెను చూచి ఆ కుటుంబ సభ్యులు సంతోషించారు.


ముఖ్యంగా సుధ.... వారు వచ్చిన విషయం ఆమెకు ఆనంద్ ద్వారా తెలిసినందున.


ధర్మారావుగారి ప్రక్కన కూర్చుని సునంద... తను వచ్చిన విషయాన్ని వివరించింది. చివరగా... "నా రెండో కొడుకు ఆనంద్ సుధను వివాహం చేసుకుంటానని నాతో చెప్పాడు. వాడి విశాల హృదయానికి నాకు ఎంతో సంతోషం కలిగింది. మీరు సరే అంటే త్వరలో వారి వివాహాన్ని జరిపించాలన్నది మా ముగ్గురి ఆశయం" నవ్వుతూ చెప్పింది సునంద.


తన చేతిలో మడిచి ఉన్న కాగితాన్ని ధర్మారావుకు చూపుతూ... "దీన్ని మీకు ఇమ్మన్నాడు ఆనంద్" అంది.


ఆశ్చర్యాందోళనలో ఉన్న ధర్మారావు గారు.... ఆ కాగితాన్ని అందుకున్నారు. విప్పి చూడసాగారు.


"సార్!... నమస్తే!.... మీ అమ్మాయిని చూచిన తొలి క్షణంలోనే నాకు ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది. ఆ రోజు అరగంట సేపు మీకు రమణకు మధ్యన జరిగిన చర్చలో, మీరు మీ అమ్మాయి వివాహ విషయాన్ని గురించే మాట్లాడి ఉంటారని నాకు తెలుసు. కారణం రమణ అంటే మీకు ప్రాణం. ఎంతో అభిమానం.... కానీ సార్!.... వాడి కోసం ఒక హృదయం పది సంవత్సరాలుగా పరితపిస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు మీ శిష్యురాలు రంజని. వారిరువురికీ వివాహం జరిపించాలనేది నా ఆశయం. నేను రంజనికి మాట ఇచ్చాను సార్. మీకూ తెలుసుగా ఆమె ఎంత మంచిదో. ఒకనాటి కోటీశ్వరుని కూతురు నేడు నిరుపేద. వ్యక్తిత్వానికే విలువనిచ్చే మా అన్నయ్య రమణ, ఆమె తన ప్రేమను ఆమెగా తెలియజేసిన నాడు కాదనడన్న గట్టి నమ్మకం నాకు ఉంది. హైదరాబాదు నుంచి రేపు వారిద్దరూ ఇక్కడికి వస్తారు సార్. నా ఆశయం మంచిదని మీకు తోస్తే మీరు..... నా కోరికను తీర్చగలరు. మీరు వ్యతిరేకించరనే నమ్మకం నా గుండె నిండా ఉంది సార్!..."


ఉత్తరం సాంతం చదివేసరికి ధర్మారావు నయనాలు ఆశ్రుపూరితాలైనాయి. కాగితాన్ని తన భార్య చేతికి ఇచ్చాడు. పై పంచతో కన్నీళ్ళు తుడుచుకొని... "మీ అందరి ఆశయమే నా ఆశయం అమ్మా!..." అన్నాడు.


దూరంగా నిలబడి హాల్లో జరుగుతున్న సంభాషణ వ్యక్తుల ముఖ కవళికలను ధర్మారావు గారి మాటలను విన్న సుధ నవ్వుతూ లేడి పిల్లల పరుగున తన గదిలోనికి వెళ్ళింది.-----సమయం... రాత్రి ఆరున్నర. రంజని స్నేహితురాలు. వనజతో వచ్చి కాచిగూడలో మూడవ నెంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫస్ట్ క్లాసు కంపార్ట్‌మెంట్‌లో ఎక్కేసింది. ఇంటినుండి బయలుదేరే ముందు అమ్మా నాన్నలతో... త్వరలో ఆనంద్ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకొని వస్తాడని చెప్పి బయలుదేరింది.


రంగారావు, భీమారావు సేవలో హాస్పిటల్‌లో ఉన్నందున, రంజని స్నేహితురాలితో కలిసి నిర్భయంగా స్టేషన్‌కు రాగలిగింది.


రంజనికి.... రమణకు ప్రక్క ప్రక్క నెంబర్లతో టికెట్లు బుక్ చేసి పంపింది ఆనంద్. రమణ స్టేషన్‌కు బయలుదేరే ముందు... ఆనంద్ తనకు పంపిన మెసేజ్‌ను చూశాడు.


అంటే... ఆనంద్ ధర్మారావుగారికి వ్రాసిన లేఖ... రంజని రమణను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నదనే వివరాలు.... చదివి రమణ ఆశ్చర్యపోయాడు. టైం చూచుకొని స్టేషన్‌కు బయలుదేరాడు.


గార్డు.... విజిల్ వేశాడు. రమణ రానందుకు రంజని కలవరంతో ద్వారం దగ్గరే నిలబడిపోయింది. జనాన్ని తోసుకుంటూ రమణ కంపార్ట్‌మెంట్‌ను సమీపించాడు. బండి కదిలింది.


రమణను చూచిన రంజని మనస్సు కుదుటపడింది. రంజని చేతిని అందించి రమణను కంపార్ట్‌మెంట్‌లోకి లాక్కుంది.


నవ్వుతూ... "థాంక్యూ!" అన్నాడు రమణ.


"మరో రెండు నిమిషాలు ఆలస్యం అయి ఉంటే... ఎవరి దారి వారిదై ఉండేది. నేను ఎంతగా టెన్షన్ పడ్డానో.... ఊహించగలవా!... పావుగంట ముందుగా రావాలని తెలీదూ!..." నిష్టూరంగా అంది రంజని.


రమణ చేతిలోని సూట్‌కేసును తన చేతిలోనికి తీసుకొని రంజని... తమ సీట్ల వద్దకు వెళ్ళిపోయింది.


రొప్పుతూ రోస్తూ రమణ ఆమెను అనుసరించాడు. ఆ బోగీలో ఉన్నది వారిద్దరే.


రంజనికి ఎదురుగా కూర్చుని చేతి రుమాలుతో ముఖాన్ని తుడుచుకున్నాడు రమణ.


ఎదురు సీట్లో కూర్చుని ఉన్న రంజని నవ్వుతూ లేచి... రమణ ప్రక్కన కూర్చుంది.


తన కుడిచేతిని రమణ భుజంపై ఉంచి... వంగి అతని ముఖంలోకి చూస్తూ... "ప్రియమిత్రుడు... ఆనంద్ జిందాబాద్. రమణా!... 'నా మనసంతా నీవే' నవ్వుతూ అతన్ని తన చేతులతో చుట్టేసింది."


పరవశంతో... తన చేతులతో రంజనిని తన హృదయానికి హత్తుకున్నాడు రమణ. 'మదిలో మల్లెల మాల....' అనుకుంటూ!!....

============================================================

సమాప్తం


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

============================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page