top of page

మన జీవితం మనది


'Mana Jivitham Manadi' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

''రాగమతీ !నేను ఇండియా వచ్చేస్తున్నాను. నిన్ను త్వరలో కలుస్తాను...అని అమెరికా నుంచి ఫోనుచేసి వంశధార చెప్పినప్పుడు రాగ మనసు సంతోషంతో గంతులేసింది .

వాళ్ళిద్దరి స్నేహం ముఫై ఏళ్ళనాటిది.నాలుగేళ్లకోసారి ఇండియా వచ్చినపుడు కలిసేవారు. రాగ కూడా రెండుసార్లు అమెరికా వెళ్ళింది. ధార ముఖ్యమైన ప్రదేశాలు తీసుకెళ్లి చూపించింది.

రాగ భర్త అనిల్ అమెరికా వెళ్లిపోవాలని చాల ట్రై చేసాడు కానీ అతనికి వీసా రాక విజిట్కి మాత్రం వెళ్లి వచ్చారు. పోనీ పిల్లలు ఐనా వెడతారేమో అనుకున్నాడు అదీ సాధ్యం కాలేదు.

ఈ విషయంలో రాగ బాధపడితే ఓదార్చింది ధార.

''అనిల్ ! మీరు అనుకుంటున్నారుకానీ ఇక్కడ సమస్యలు ఇక్కడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల పెంపకం

మన చేతిలో ఉండదు. మనం ఇంటిదగ్గిర ఎన్ని విలువలు నేర్పినా బయటి వాతావరణ ప్రభావం ఎక్కువగ

వాళ్ళమీద ఉంటుంది. ఇండియాలో ఆ ఇబ్బందిలేదు.కనీసం వుద్యోగం పెళ్లి అయ్యేటంత వరకూ మీతో వుంటారు .ఇక్కడ అలాకాదు ఎంత త్వరగా ఇంటినుంచి వెళ్లిపోదామా అని చూస్తారు .

మీరు రావాలనుకున్నప్పుడు నిర్ మొహమాటంగా మాఇంటికి వచ్చేయండి. ఇష్టమయినరోజులు వుండండి... ...అనేది.

అదిమాత్రం అంత సుళువా ? నలుగురు వెళ్ళాలి అంటే బోలెడుకర్చు .....కనుక అతడి కోరిక తీరనేలేదు.

ధార చెప్పినట్టు ఆమె కొడుకులు చదువుకంటూ వేరే కంట్రీకి వెళ్లడం వెళ్లడం మళ్ళీ రాలేదు .పెళ్లిళ్లు చేసుకోలేదు . భర్త మోహన్ సెక్రటరీ ప్రేమలోపడి ధారకి విడాకులు ఇచ్చేసి ఆమెతో కాపురంపెట్టాడు.

డబ్బు ఇచ్చి వదిలించుకున్నాడు.

ఈ మాట విన్నప్పుడు రాగ చాలా బాధపడింది. అయ్యో ఇదెక్కడి దారుణం ?పై పై మెరుగులు చూసి

నిక్షేపంలాంటి కుటుంబం వదులుకుంటారా...అనుకుంది.

ధార మోహన్ కంటే వయసులో చిన్నదే. ఆమెకీ వుద్యోగం వుంది .మరో పెళ్లి చేసుకోవచ్చు .

కానీ చేసుకోలేదు. అమెరికాలో నే కాదు ఇప్పుడు ఇండియా లోనూ ఎవరూ లెక్క చేయడంలేదు. హాయిగా

మరో తోడు వెదుక్కుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.భార్య పొతే భర్త , భర్త పొతే భార్యా .....

అని రాగ అంటే ....'వద్దుఇక ఏ మగవాడిని నమ్మకూడదు అని ....నేను మరో సమస్యను తెచ్చుకో కూడదని నిర్ణయించుకున్నాను …’ అంది.... ధార.

''అందరూ ఒకేలా వుండరు ! ఆలోచించు, అన్నివిధాలా సరిపోతేనే చేసుకో …” అంది రాగ.

''నేను రిటైర్ అయ్యాక ఇండియా వస్తాను. ....” అంది మాట మార్చి.

''ఇక్కడ మీ వాళ్ళు ఎవరూలేరు కదా ....వచ్చి ఏం చేస్తావు?''

''ఎవరో ఎందుకు నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి వున్నావుగా…” అంది.

''అవును అనుకో. కానీ నీ పిల్లల తర్వాతే కదా నేను .. వాళ్ళు నిన్ను చూడాలంటె ఇండియా వస్తారా అని!”

''అక్కడ వున్నా రారు. నేను అనిల్ గారికి అదేగా చెప్పాను..... నేను చాలా కోలుపోయాను రాగా.

మోహన్ అందం, వున్నత చదువు, వుద్యోగం, అమెరికాలో సంపాదనా చూసి మా నాన్న మోసపోయారు.

అతనికి ఇతర సంబంధాలు వున్నాయి. నిలకడ లేని మనిషి. అన్నీ తెలిసి చాలాకాలం ఓర్చుకున్నాను. నాన్న అదే దిగులుతో చనిపోయారు. ఇక అతని ప్రసక్తి వద్దు ప్లీజ్ ....!”

''సారి. ఇక తీసుకురాను . … మా ఇంటికే వచ్చేయి....” మనస్ఫూర్తిగా చెప్పింది....రాగ.

పిల్లలకి చెప్పి వాళ్ళదగ్గిర కొన్ని రోజులు ఉండి ఇల్లు అమ్మి వేసి ఇండియా వచ్చేసింది ధార.

ప్రేమగా ఆహ్వానించారు రాగ, అనిల్ !

వాళ్ళు ఉన్న చోటే వన్ బెడ్ అపార్ట్మెంట్ అమ్మకానికి వస్తే ముందుగా చెప్పివుంచాడు అనిల్.

మాకు కావాలని. అది చాల సదుపాయంగా వుంది .వాళ్ళు పక్కనే వుంటారు. ధారకి చాలా నచ్చింది.

''మిడిల్ ఏజ్ లైఫ్ ప్రారంభిస్తున్నాను..... ఇంతవరకూ పాతికేళ్ళు అమెరికాలో గడిస్తే ఇప్పుడు మరో టర్న్

స్టార్ట్ ఐనది…” అనుకుంటూ ఇల్లు సర్దుకుంది.

మొదటినుంచి ధారకి ఎక్కువ సామాను చేర్చడం అలవాటులేదు. చాల ముఖ్యం అనుకున్నవి మాత్రమే

కొనేది. పిల్లలతో వున్నప్పుడు వాళ్ళకోసం కొన్ని కొనాల్సివచ్చేది.

ఇప్పుడు ఒక్కతే కనుక అసలు అక్కరలేదు. ఒకరు వచ్చినా సరిపోతుంది.

ఇక రోజువారీగా ఎలా టైం పాస్ చేయాలో ప్లాన్ వేసుకుంది. ఉదయం 5 గంటలకు లేచి గంట వాకింగ్

రాగకూడా వస్తుంది. తరువాత నెట్లో న్యూస్ పేపర్స్ చదవడం. బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంటిని క్లీన్ చేసుకోడం,

లంచ్ తయారు చేసుకుని ఒంటిగంటకు తినడం. కాసేపు రెస్ట్ తీసుకుని ఇష్టమైన బుక్స్ చదువుకోవడం, ఏదైనా మార్కెట్ పనివుంటే రాగతో కలిసి వెళ్లి తెచ్చుకోడం, తప్పని సరిగా ఎక్సర్ సైజులు చేయడ౦, రాత్రి ఏదైనా టిఫిన్ తిని టీవీలో మూవీ చూడటం .... నిద్రపోవడం.

వీకెండ్లో రాగా అనిల్ తో బయటకు వెళ్ళినా ఒకోసారి అనిల్ తన ఫ్రెండ్స్తో వెడితే రాగా /ధారా కలిసి వెడతారు.

కొన్నిరోజులు ముగ్గురూ కలిసి వెళ్లినా తర్వాత అనిల్ అతడి ఫ్రెండ్సతోనే వెళ్లడం మొదలుపెట్టాడు.

వాళ్ళ ఫ్రెండ్స్ తో డ్రింక్ పార్టీలు ఉంటాయి కనుక అనిల్కి ఈ పధ్ధతి నచ్చింది.

ఆడవాళ్ళు, వాళ్లకి నచ్చినట్టు ఉంటే తనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడం అతడికి హాపీగా వుంది.

''నావలన మీరు మీ ఇష్టాన్ని మార్చుకోవద్దు.'' అంది ధారా. ..... రాగ తో.

ఆమె నవ్వుతూ .... “ధారా .... అదేమీ లేదు. అనిల్ కి ఈ ఏర్పాటు బాగుంది. ఎవరూ లేకుంటే నేను ఇన్నాళ్లూ ఒక్కదాన్నే ఉండేదాన్ని.

తెలిసినవాళ్ళు, నైబర్స్ ఒక్క మార్కెట్కి మాత్రమే కలిసేవాళ్ళం.

నువ్వు వచ్చాక ఆరోగ్యం ఆనందంతో బాటు కాలం బాగా గడిచిపోతోంది .మార్పు కూడా మంచిదే…” అంది .

అనిల్ ద్వారా తెలిసిన కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది. అలా క్రమంగా కొందరు ఒంటరి మహిళలు కూడా పరిచయం అయ్యారు. అందరూ కలసి వేరే కంట్రీస్కి ట్రిప్ వెడతారు ఏడాదికోసారి.

భర్తలేని లోటు వాళ్ళకి ఏమీలేదు. జీవితంలో ఆయన పాత్ర కొందరికి త్వరగా ముగుస్తుంది.

అలాగే ఆవిడ రోల్ కూడా. ఇది సహజం. తరువాత జీవితాన్ని సక్రమంగా గడిపే జాగ్రత్త తీసుకుంటే అంతా

బాగానే గడిచిపోతుంది. ఆరోగ్యం ముఖ్యం. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సోమరితనం అస్సలు కూడదు.

అంతేకాదు ఒకరకంగా ఫ్రీడమ్ వచ్చినట్టు వుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది” అంటూ చెబుతుంది ధారా.

పెళ్లి పిల్లలు సుఖం ఆనందంతోబాటు అనారోగ్యం బాధలు కన్నీళ్లు అనుభవిస్తాం. జీవితం ఎప్పుడూ వందశాతం సంతోషంగా గడవదు. అన్ని సుఖాలేవుండవు ఏదో సమస్యలు ఉంటాయి అందరికీ.

వాటిని అధిగమిస్తూ ఉపాయంతో ధైర్యంగా ఎదురుకోవాలి.

అదే జీవితం!

''అవును ధారా ! నీవలన మేము చాలా నేర్చుకున్నాం. బాగుపడ్డాం. మాకు సంతోషంగా వుంది.

అంతేకాదు మన పిల్లలు కూడా నిశ్చింతగా వున్నారు. మనకి మంచి స్నేహితులు వున్నారని .....”

అంటుంది రాగ.


***శుభం ***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.29 views0 comments

Comentarios


bottom of page