top of page

పూల తావి


'Pula Thavi' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

ఆనాటి జ్ఞాపకాలు గురుతున్నాయా సఖా నీకు?

ఒకసారి మనజీవిత చిత్రపటంలోకి( ఆల్బమ్) తొంగి చూద్దాము(చిత్ర

సంకలనం)

సాయం సంధ్యవేళ సాగర తీరాన ఇసుక తిన్నెలపై

చేయి చేయి కలిపి పరుగులు తీసిన ముచ్చటలు

ఉవ్వెత్తున ఎగిసిపడే పున్నమినాటి కెరటాలతో

పోటీపడి మనం చేసిన చిలిపి తనపు అల్లరి

నురుగులు కక్కే నీటిలో కొట్టుకువచ్చిన అందమైన

గవ్వలు ముత్యపు చిప్పలు ఏరుకున్న బాల్యపు చేష్టలు

నాకునువ్వు నీకునేను తప్ప లోకమే తెలియని

తుళ్ళి పడే దోర వయసుకు పగ్గమేలేక

కాలమే మరిచి పంచుకున్న పరిష్వన్గా డోలికలు

మనసుపాడిన అనురాగ గీతాలు మమతల పొదరిల్లు

అలసిసొలసి ఆదమరచి కన్న తీయని కలలు

మన ఇంటి తోటలో మల్లె పందిరి నీడలో కోనేటి దాపున

నీవు రాసిన ప్రేమ లేఖ చదువుకుంటే

మనసులు పరవసించి మల్లెలు గుబాళించి

మధురోహలు ముంచెత్తాయి మనసంతా నిండాయి .


***శుభం ***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

77 views0 comments

Comentarios


bottom of page