కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Pellikalaa' New Telugu Story Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
శారదా ఎన్ క్లేవ్ ...
"ఆగండీ! నో ! ఈపెళ్ళి జరగటానికి వీల్లేదు! పెళ్ళి కొడుకు అరుపుకి, ఉలిక్కిపడి ఉరిమిచూసి,"ఈడైలాగ్ నీ తాత లాగూలేయక ముందు నుండీ వింటున్నా.
విషయం ఏమిటిరా? "అంది బామ్మ .
"పెళ్ళికి మన ఫామిలీ తప్ప ఇంకెవరన్నా ఉన్నారటే ?! ఆక్సిజన్ సరఫరా ఉన్న కల్యాణ మంటపంలో మాత్రమే పెళ్ళి జరపాలని, అప్పుడయితే పదిమందితో, కళకళ లాడుతామనీ,పెళ్ళిముచ్చట్లలో మాట్లాడుకున్నాం కదా!
అంత ఆక్సిజన్ సప్లై, ఖర్చు భరించలేక ఇదిగో ! ఈ 'కరోనా' వాళ్ళ నాన్న ఈ ఎన్ క్లేవ్ లో పెళ్ళి పెట్టాడా?!.... అందుకే ఎవరూ రాలేదూ! ఆక్సిజనే సరఫరా చేయలేని వాళ్ళు ఆడపిల్లలను ఎందుకు కనాలీ? "
పెళ్ళి కొడుకు కోవిడ్ ఉచ్ఛంనీచం మరిచి చిందులు తొక్కాడు.
"ఏంటండీ ఆ మాటలూ! శుభలేఖ అందరి ఫేస్ బుక్ లకూ పంపినప్పుడే ఎవరి ఆక్సిజన్ సిలెండర్ వాళ్ళ వీపుకు కట్టుకు రావాలని మెసేజ్ పెట్టేసాగా, అయినా లాంఛనాలు మాట్లాడేటప్పుడు, ఇవన్నీ మాట్లాడామా? " పెళ్ళి కూతురు తండ్రి వాక్సిన్ రావు,పోట్లాటకు దిగాడు.
"ఇవన్నీ మా రోజుల్లో మేం ఎరగం. ఎంచక్కా మూతికి మాస్క్ లు బిగించి, సాటిటైజర్ లు పూసుకుంటూ, సామాజిక దూరం పాటించుకుంటూ, వందమంది వరకూ పెళ్ళి కి హాజరయ్యే వాళ్ళం. ఇదేమిటో, ఆ మాస్క్ లూ పోయాయ్...పెళ్ళి కళా పోయింది. అన్నీ పోయి ఆక్సిజన్ సిలెండర్ల దగ్గరకొచ్చాం" పెళ్ళి కొడుకు తల్లి మూతిముడిచింది.
"మీరు చెప్పేది ఎప్పటిమాట? పాతికేళ్ళ క్రితం మాట. అయ్యో అయ్యో! అదేమిటీ ఆ పురోహితుడు గారు కళ్ళు తేలవేసి ఒరిగిపోతున్నారూ. పట్టండీ ఏదన్నా హాస్పిటల్ కి..... "
"హాస్పటల్ కి వెళ్ళే వరకూనా!.. ఆ జాడిలో నవకాయ పిండివంటల, కాప్య్సూల్స్ ఉన్నాయ్ . ఒకటి తెచ్చి వేయండి." పెళ్ళి కొడుకు అరిచాడు.
"మా రోజుల్లోనా ఎంచక్కా ఎన్ని రకాల పిండివంటలూ, ఎన్ని బఫేలూ, ఇప్పుడవేవీ లేవు. కరోనా గోలకి, పౌష్టికాహారం అంతా చిన్న మాత్రల్లో కూరేసీ... కదా వదిన గారూ!"
"యహే! ఆగండమ్మా మీగోల! అవతల ముహూర్తానికీ ఏ పెళ్ళీ జరగక చస్తున్న ఈ రోజుల్లో! మన 'కోవిడ్' దీ 'కరోనా' పెళ్ళినన్నా, సకాలంలోజరిపించుదామంటే, శ్వాస ఆడక చస్తుంటే." పెళ్ళి కొడుకు తండ్రి చిరాకు పడ్డాడు.
"ఈ పేర్లేమిటో! మా రోజుల్లో, ఎంచక్కా శ్లేష్మ, సూక్ష్మ, కుబుస ఇలాంటి సైన్స్ పేర్లు పెట్టుకునే వాళ్ళం. " అంది బామ్మ.
"నీ పెళ్ళి నా మాస్కల్లే ఉందీ. నా పెళ్ళికి వచ్చి టీకా వేయమన్నట్లుంది. వెధవ సంత..
నేను పోతున్నా" పెళ్ళి కొడుకు బెదిరించాడు.
"బెదిరింపులు నీకేనా! నాకూ అక్కర్లా ఈ పెళ్ళి" పెళ్ళికూతురు 'కరోనా'మూతి ముఫ్పై వంకర్లు తిప్పింది, వాక్సినా,నాకా? అన్నంత ఎక్స్ప్రెషన్స్ తో. కానీ మూడు మాస్కుల మాటున మూతి వంకర్లు ఎవరికీ కనబడలా!
"అయ్యో ! హయ్యో! మారోజుల్లో పెళ్ళి అయ్యాక కాపురాలు చేస్తారో లేదో నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు పెళ్ళెళ్ళే జరుగుతాయో లేదో నమ్మకం ఉండట్లేదూ."
వియ్యపు రాళ్ళనబడే ఇద్దరూ కోరస్ లో అరిచారు.
"ఛీ ఊపిరి ఆడట్లా! ఆక్సిజన్ సిలెండర్ కోసం పోతున్నా. " తలుపుతీసుకుని బయటికి పోయాడు పెళ్ళి కొడుకు.
"ఏరా! కోవిడూ! బయట ఉమెక్రాన్, డొమెక్రాన్, మంకీ ఫాక్స్ ముగిసి ఇప్పుడు, స్ట్రెయిన్ ముఫ్పయ్యో వేవ్ నడుస్తోంది. గ్లాస్ మాస్కన్నా పెట్టుకుపోరా! పి.పి.యి డ్రస్ తొడుక్కోరా ! ప్రమాదం రా.
రేయ్ బాబూ ! రేయ్ బాబూ !" అని అరుస్తూ మంచం మీద నుండి క్రింద పడ్డాడు. సన్యాసి రావు.
*************
"ఏరా! సన్నాసీ! ఏంట్రా పట్టపగలే కలవరింతలు " సన్యాసిరావు మేనమామ కుదుపులకు కళ్ళు తెరిచి "నా కొడుకూ! నా కొడుకూ" వేక్సిన్ వేయించినప్పుడు చేసిన ఆర్తనాదం లా అరుస్తూ దిగ్గున లేచాడు సన్యాసి రావు.
"రేయ్! సన్నాసీ! పెళ్ళి కాకుండానే కలవరింతలా? రాత్రికి పెళ్ళి. ముస్తాబు చేయటానికి, ముత్తయిదువలు వచ్చారు.
డెట్టాల్ తో స్నానం చేసి, మూతికి మాస్క్ బిగించి బయటకు పదరా! " అన్నాడు మేనమామ.
అంటే ఇదంతా కలా!... పాతికేళ్ళ తర్వాత .
నిజంగానే ఇలా ఉండబోతోందా? ఊహకే...
ఇంత భయంగా ఉంది..... బాబోయ్
వాక్సిన్ వేయించుకున్నాక వచ్చే ఒళ్ళు నొప్పుల్లా మెలిదిరిగి పోయాడు పిచ్చి సన్నాసి.
////////////
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
Comments