top of page

ఉత్తరాంధ్రకు వన్నెతెచ్చిన కథానిలయం


'Uttharandraku Vanne Thecchina Kathanilayam' Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ


కథానిలయం వ్యవస్థాపకులు, రచయిత, విమర్శకులు గౌరవనీయులు కాళీపట్నం రామారావు మాస్టారు గారితో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు ఈ వ్యాసాన్ని మనకు అందించారు.

కొందరితో పరిచయం విచిత్రంగా జరుగుతుంది. అప్పుడు అది మామూలు విషయంగా అనిపిస్తుంది.

అలాగే ఒక రచయిత గురించి పత్రికలూ నవలలు చదివే నేను విశాఖలో వున్నప్పుడు విన్నాను.

ఆయన కాళీపట్నం రామారావుగారు. మాఇంటికి దగ్గిరలోనే వున్నారని స్కూల్ టీచర్ అని

పిల్లలకు ప్రయివేట్ చెబుతారని తెలిసింది. మావారు లెక్చరర్ అయినందువల్ల ఇంగ్లిష్ మీడియం

చదివే మా పిల్లలకు తెలుగు రాదేమో అని కారా గారి దగ్గిర ట్యూషన్ పెట్టేరు. ఐతే వారికి అటు వుద్యోగం

ఇటు రచన వ్యాసంగంతో తీరిక ఉండేదికాదు. కొద్దిరోజులకే వారు చెప్పేరు. '' నన్ను మన్నించాలి.

మీ పిల్లలకు నేను న్యాయంచేయలేను'' అని. ఎంతటి నిబద్త కలిగిన మనిషో అర్థమై వారిపట్ల గౌరవం

కలిగింది.


ఆతరువాత నేను హైదరాబాద్ రావడం మా పిల్లలు వున్నత చదువులకు అమెరికా వెళ్లడం జరిగింది.

నేను రచనలు చేయడం మీద దృష్టి పెట్టాను.. నా కథలు మొదట సాయి గారి ''రచన ''పత్రికలో వచ్చేవి.

కారా గారు కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉండేవారు. అవి చదివి నేను సాహిత్యం గురించి లేఖలు రాసేదాన్ని.


అప్పట్లో సాయిగారు ప్రతి ఏడాది ఒక సాహితీ సభ ఏర్పాటు చేసేవారు. ఆ సభకి నేను తప్పని సరిగా వెళ్లేదాన్ని. అప్పుడు వచ్చిన కాళీ పట్నం వారిని సాయిగారు పరిచయం చేసేరు. వారిని మొదటిసారి చూడటం అదే! అప్పుడు నేను విశాఖలో మా పిల్లలు మీ దగ్గిరకు ప్రయివేటుకు వచ్చేవారు. ఇప్పుడు

అమెరికాలో సెట్టిల్ అయ్యారని చెబితే ఆయన చాల ఆనంద పడ్డారు. వారికీ ఆశీస్సులు చెప్పమని,

. 'నీ రచనలు లేఖలు చదివి నువ్వు వయసులో చాల పెద్ద అనుకున్నాను. ఇంత చిన్నదానివి ఎంతో అనుభవం ఉన్నట్టు రాస్తున్నావు' అంటూ మెచ్చుకుంటే ''విలువ కట్టలేని బహుమానంగా '' అనిపించింది.


రామారావుగారు ఉద్యోగ విరమణ తర్వాత స్వంత వూరు శ్రీకాకుళం వెళ్లిపోయారు . అప్పుడప్పుడు

లేఖలు రాస్తే వెంటనే బదులు ఇచ్చేవారు. కథానిలయం స్థాపించామని ప్రచురించబడిన నీ కథలను

పంపమని, వచ్చి చూసి వెళ్ళమని లేఖ రాశారు. అప్పుడు ఫోను సదుపాయం లేకపోలేదు. అయినా అందరమూ ఉత్తరాలు రాసేవాళ్ళం. వూళ్ళో వున్నా సాయిగారికి కూడా . అప్పుడు చేతిరాత. ఇప్పుడు టైపింగ్ అంటే తేడా!


నేను కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూసేను. మా బంధువుల అమ్మయి పెళ్లి విశాఖలో జరిగినప్పుడు

శ్రీకాకుళం వెళ్ళాం నేను మావారు . ముందుగా ఫోను చేసి. భోజనం చేయాలని పట్టుబట్టారు. వారి శ్రీమతి

వచ్చినవారికి విందు భోజనంతో ఆతిధ్యం ఇవ్వడం ఒకరి అడుగుజాడల్లో మరొకరు నడవడం అన్నచందంగా వుంది వారి దాంపత్యం.


ఆతరువాత ఇంటి ఎదురుగ ఉన్న కథానిలయానికి తీసుకు వెళ్లారు. ఆ నిలయంలో పుస్తకాలూ పత్రికలతో

బాటు రచయితల చిత్రపటాలు కూడా సేకరించి ఉంచడం విశేషం. అప్పటికి పూర్తిగా సేకరణ జరగలేదు

అన్నారు . ఇలాటి ప్రయత్నం చేసిన రచయిత ఒక్క కారా గారే (గిన్నిస్ రికార్డ్ నెమోకూడా). మావారు కొంత డొనేషన్ ఇచ్చారు. ఉదయం వెళ్లిన మేము సాయంకాలం వరకు కాలమే తెలియకుండా గడిపాము. తిరిగి వస్తుంటే నాకు చక్కని జరీ చీర పసుపు కుంకాలతోబాటూ ఇచ్చారు ఇదేమిటి అని వారిస్తే 'ఇంటి ఆడపడుచువి కాదనకూడదు 'అన్నారు వారి ధర్మ పత్ని. ఆ అనుభూతిని మనసారా హృదయంలో దాచుకుని హాయిదరాబాదుకి తిరిగి వచ్చాము.


ఇంటికి వచ్చాక కథా నిలయానికి ఉడతా సహాయంగా ఇంకా ఏమి చేయగలనా అని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు( శ్రీ బులుసు వెంకటేశ్వర్లు) రచయితగా 150 గ్రంధాలు రాసినా తొమ్మిదేళ్ల వయసులో ఓకే ఒక కథ రాసేరుట.

చాలు ఒక్క కథ రాసిన కథానిలయంలో ఉండాలి అని కారా గారు అనడం గుర్తు వచ్చింది.

ఆకథా, వారి ఫోటో, కనుపర్తి వరలక్ష్మి గారి ఫోటో, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఫోటోలను పెద్ద సైజులో లామినేషన్ చేయించి పంపాను. కాళీ పట్నం వారు సంతోషపడుతూ లేఖరాసేరు….


“అంతా బాగానేవుంది కానీ నీ ఫొటో పంపలేదు. నాకు కోపం వచ్చింది అన్నారు. అయ్యో ! నేను అంత పెద్ద రచయితల పక్కన ఉండ తగిన దానిని కాదు. అందుకే అసలు ఆలోచన చేయలేదు… అని చెబుతూ కథానిలయంలో వారితోబాటు నేను మావారు తీసుకున్న ఫోటో పంపాను.


రచయిత్రి వోల్గా గారి భర్త కుటుంబారావుగారు కాళీపట్నం వారి మీద డాక్యుమెంటరీ వీడియో తీశారు వైజాగ్లో. ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేశారు. నేను వెళ్లి చూసాను చాలా బాగుంది.


అయితే మాష్టారు గానీ వారి కుమారుడు ప్రసాదుగాని రాలేదు. ఎందుకో తెలియదు. నేను కొని తెచ్చుకున్నాను. ప్రసాదు వైజాగులో లెక్చరర్. కనుక అతడితో కూడా మావారికి పరిచయం వుంది. ఒకసారి అతడు మా ఇంటికి వచ్చినపుడు వీడియో గురించి చెప్పాను. అతను ‘మాకు పంపలేదు…’ అని చెప్పి నా దగ్గిరున్న సీడీ కాపీ చేసుకుని ఇచ్చేసాడు.


ఆతరువాత మేము అమెరికా వెళ్లి పోయాము . ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే వున్నాము. అందువలన

ఆ తరువాత వారిని కలుసుకునే అవకాశం రాలేదు. ''మనిషిగా పుట్టి ఏదోలా జీవించడం కాదు. ఏదో చేయాలని ఆశయంవుంటే వారు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అనేందుకు నిదర్శనం కారా మాష్టారు.


కాళీపట్నంవారు చివరి శ్వాసవరకు తపనపడింది ''కథానిలయాన్ని ''ఎంతగా తీర్చి దిద్దాలనే. . . ఆలోచనతోనే!


ఎందరో వూరు పేరులేని సినిమా వాళ్ళని, సన్నాసులను తానా ఆటా బాటా తూటా అంటూ కులాలవారీగా

సంఘాలు పెట్టుకుని అమెరికా తీసుకెళ్లి నిజమైన సాహిత్య సేవ చేసేవారిని నిర్లక్ష్యం చేయడం బాధాకరం.


అవార్డులు బిరుదులూ ఇవ్వక్కరలేదు. కాస్తంత చేయూత. అదే ఆయనకు దక్కలేదు. వారి అభిమానులు

సహాధ్యాయులు, వారి విలువతెలిసినవారు ఇచ్చిన ప్రోత్సహమే ''కథానిలయానికి ఊపిరి పోసింది. ''


అది అంతటితో ఆగిపోయేదికాదు కాదు. కనుక నిరంతరం సాగాలి….అనుకునేవారు తప్పక అండగా ఉంటారని ఆశిద్దాం. !

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

70 views0 comments

Comments


bottom of page