top of page

దూరదృష్టి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండిVideo link

'Duradrushti' Written By A. Annapurna

రచన: A. అన్నపూర్ణ

కూతుర్ని పెళ్లి చేసుకోమన్నారు భారతి, ఆనంద్ లు.

తన పెళ్ళికి ఒక కండిషన్ పెట్టింది రేఖ.

అది తప్పుగా అనుకోలేదు పేరెంట్స్.

మరి ఆమె కోరుకున్న సంబంధం కుదిరిందా లేదా అనేది ప్రముఖ రచయిత్రి ఏ. అన్నపూర్ణగారు రచించిన దూరదృష్టి కథ చదివితే తెలుస్తుంది.

రేఖ బ్యాంకు ఉద్యోగంలో చేరి నాలుగేళ్లు అయింది..

'ఈ కాలం పిల్లలకి 'చదువుకో...' అనీ, 'జాబ్ లో చేర'మని... వేరే చెప్పక్కరలేదు ' అని భారతి, ఆనందు స్వేచ్ఛ ఇచ్చారు.

బ్యాంకు లో ఆఫీసర్ పోస్టుకి అప్లై చేసి, టెస్ట్ పాసయ్యింది.

ఇంటర్ వ్యూలో ఆమె చెప్పిన ఆన్సర్ కి ముగ్ధులై వెంటనే సెలక్ట్ చేశారు.

ఇప్పుడు రేఖకి 35 ఏళ్ళు వచ్చాయి. .

''ఆనంద్…. రేఖకి నచ్చినవాడు ఇంకా కనిపించలేదు. మనకా రేఖ ఒక్కతే! అసలు పెళ్లి చేసుకుంటుందో లేదో..” అని దిగులుగా భర్తతో అంది భారతి.

మరునాడు రేఖతో పెళ్ళివిషయం అడిగాడు.

''మనం ఎన్నో సంబంధాలు చూసాం. నీకు నచ్చినవాడు ఎవరూ లేరా రేఖా ....” అడిగాడు ఆనంద్.

''నువ్వు కోరుకున్న సుగుణాలన్నీ ఒక్కడిలో వుండవు రేఖా. కాంప్రమైజ్ అవ్వాలి.'' అంది భారతి.

''అమ్మా ...నాకుతెలుసు. నేను కూడా సర్దుకు పోతున్నాను. ఏజ్ విషయంలోనే ఎవరూ నాతో కలిసి రావడం లేదు'' చెప్పింది రేఖ.

''అంటే? నాకు అర్థం కాలేదు....” అంది భారతి.

''నా కంటే ఆరు ఏళ్ళు చిన్న వయసు ఉండాలని కండిషన్ పెట్టాను. అదీ విషయం”

''ఇప్పుడు అంతా రెండు మూడు ఏళ్ళు డిఫరెన్స్ కంటే ఇష్టపడటంలేదు. అదీ అబ్బాయి పెద్దవాడు కావాలన్నది వాళ్ళ డిమాండ్.'' అన్నాడు ఆనంద్.

''అదే నాకు నచ్చదు నాన్నా . కాబోయే భర్త చిన్నవాడు అయితే నష్టం ఏమిటి? పైగా ఉపయోగం కూడాను.''

''ఏమంటున్నావ్? నీకంటే ఆరేళ్ళు చిన్నవాడిని చేసుకుంటావా… మతిపోయిందా? ఏమిటి రేఖా! నువ్వు సచిన్ టెండూల్కర్నో మరో సెలబ్రిటీనో ఫాలో అవుతావా? వాళ్లకు కోరినవాళ్లు లభిస్తారు. మనలాంటి వాళ్లకు కాదు.'' అన్నాడు ఆనంద్.

''అదికాదు నాన్నా! నాకు సచిన్ కానీ, మరో సింగర్ కానీ ఆదర్శం కాదు. నాకు క్రికెట్ పడదు. మూవీ స్టార్స్ అంటే మూవీ చూసేవరకే. ఎవ్వరినీ ఫాలో అవ్వను”

''మరి అర్థంలేని నీ కోరికకు కారణం ఏమిటి చెప్పు!” అంది భారతి.

''చెబుతాను విను. నీ తమ్ముడు - భార్యకు రెండేళ్లు తేడా. సుమన్ మామయ్యకు ఎప్పుడూ అనారోగ్యమే . పాపం అత్త హాస్పటల్స్ చుట్టూ తిరగడం, ఇరవై నాలుగు గంటలు సేవ చేయడం… పీహెచ్డీ చేసినా ఇంటిపని సరిపోతుంది. ఆమె ఆశలన్నీ కాలి బూడిద అయ్యాయి అని బాధపడుతుంది.

మామయ్యకు బీ పీ, షుగర్, రుమటాయిడ్ డిసీజ్.

నా ఫ్రెండ్కి పెళ్లి అయి నాలుగేళ్లు అయింది. వాళ్ళిద్దరికీ నాలుగేళ్లు తేడా. భర్తకి దగ్గువస్తే టీ బీ అని, జ్వరం వస్తే ఇంకోటి, కడుపునొప్పి వస్తే కేన్సరేమో అనీ… అనుమానం.

“నేను అస్తమాను సెలవు పెడితే వుద్యోగం ఊడుతుంది...నీకు ఎవరు సేవ చేస్తారు.. వెళ్లి మీ అమ్మ దగ్గిర వుండు. నీతో ఏ సుఖము లేదు. నా సంపాదన నీ జబ్బుకు చాలదు…” అంటూ అత్తవారింట దిగబెట్టి వచ్చింది.

బాబాయి కూతురు మంజుకి మంచి సంబంధం బాగా డబ్బు వున్నవాడు… అంటూ ఇంటర్ చదువుతో ఆపేసి, ఏడేళ్లు తేడా వున్న వాడితో పెళ్లి చేశారు. దానికీ అదే కర్మ. ఆయన రోగాలకే వున్నదంతా ఊడ్చుకు పోతోంది.

పాపం అమాయకురాలు, నోరులేనిది. ఆయనకు ఏదైనా ఐతే ఎలా బతుకుతుందో… చదువైనా లేదు.

ఇదంతా చూసాక నాకు ఆలోచన వచ్చింది. నాకంటే పెద్దవాడు వద్దు. చిన్నవాడైతే బెటరు..... నన్ను బాగా చూసుకుంటాడు. నేను రిటైర్ అయినా అతనూ సంపాదిస్తాడు. నా కష్ట సుఖాలలో తోడుగా ఉంటాడు.

డబ్బుకంటే కావలసింది తోడు-నీడా! భార్యను కంటికి రెప్పలా కాపాడే భర్తను కోరుకుంటాను కానీ భార్య చేత సేవలు చేయిన్చుకునే పాతకాలం భర్త నాకు వద్దు.''

''ఓసి బంగారుతల్లి! ఇంతగా ఆలోచించావా? ఆరోగ్యం అనేది వంశపారంపరగా జీన్స్తో వస్తుంది. దానికి నివారణ కొంతవరకు సాధ్యమే. కొన్ని మొండి జబ్బులు ఏడుతరాలుగా సంక్రమిస్తాయి. అనే పూర్వము రోజుల్లో అన్నీ చూసేవారు. ఈరోజుల్లో అది సాధ్యంకాదు. కనుక విడిచి పెట్టేసారు.'' అంది భారతి .

''అదికాదు అమ్మా! ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్ అడ్వాన్స్ ఐనది. అన్ని జబ్బులకు నివారణ వుంది. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని ఎక్సర్సైజ్ చేస్తూంటే జాగ్రత్త పడవచ్చు.

భార్య భర్తల వయసు ఇలా ఇంత తేడా వుండాలని రూలేమీ లేదు. అదే విదేశీయులు ఏమీ పాటించరు. అందువలన ఏమీ నష్ట పోలేదు కూడా.

జీవన ప్రమాణం లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుందని నా నమ్మకం.

అదే నేను చెబుతుంటాను.'' అంది రేఖ.

''ఆలోచిస్తే నీ వాదనలో నిజం వుంది. ఎవరూ నిన్ను అర్థం చేసుకోడంలేదు. '' అన్నాడు ఆనంద్.

''మీకు తెలుసును. నా నిర్ణయాలు తప్పుగా ఉండవని. వెయిట్ అండ్ సి....''

''ఆలా అని ఎంతకాలం ఎదురు చూస్తావు? వయసు ఆగదు రేఖా...'' అంది భారతి.

''అమ్మా ఒక పని చేయి! నువ్వో బాబుని పెంచుకో....” అంది రేఖ నవ్వుతూ.

''ఆ పని నువ్వు చేస్తే బాగుంటుంది. నిన్ను చేసుకోబోయే వాడికి రెడీమెడ్ కొడుకు రెడీగా ఉంటాడు.''

''ఆ ..నీ ఐడియా బాగుంది అమ్మా.... ఎవరైనా పూర్ ఫ్యామిలీలో బాబుకోసం వెదుకుదాం.'' అంది రేఖ.

''తల్లి కూతుళ్లు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. వినడానికి బాగానేవుంది. ఆచరణలో సాధ్యంకాదు...'' అన్నాడు ఆనంద్.

వాళ్ళు ఆలా సరదాగా మాటాడుకుంటున్నప్పుడు డోర్ బెల్ మోగింది.

భారతి వెళ్లి తలుపు తీసింది .

28 ఏళ్ళ యూవకుడు అనుమతి తీసుకుని లోనికి వచ్చి ముగ్గురితో పరిచయం చేసుకుని ''రేఖగారూ! నేను మీ కండిషన్స్ ఏమిటో టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ మాట్రి మోనియల్ లో చూసాను. ఆమోదం తెలియ చేస్తున్నాను. నావివరాలు.....” అంటూ చెప్పాడు.

అతడు ఆర్మీలో డాక్టర్. రేఖలాగా కొత్త ప్రయోగాలు చేయడం అతనికి ఇష్టం … “మా తల్లి తండ్రులు ఢిల్లీలో వుంటారు. వారి వివరాలు .....” అంటూ చెప్పాడు.

''అవన్నీ ఓకే ! మీరిద్దరూ మాటాడుకోండి…” అన్నారు భారతి, ఆనంద్ వేరే రూంలోకి వెడుతూ.

రెండు గంటల తర్వాత వాళ్ళ నిర్ణయం చెప్పిన తర్వాత

''మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్'' అనుకున్నారు ఆనంద్, భారతి సంతోషంగా!

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.


65 views1 comment

1 comentario


Annapurna Bulusu • 54 minutes ago

I'm very happy to hear to my story. Thank you Manoj Garu.

Me gusta
bottom of page