top of page

వీభోవరా - పార్ట్ 16

Updated: Sep 3

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Veebhovara - Part 16 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 27/08/2025

వీభోవరా - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ. 


అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. స్వామీజీ తిరిగి కనబడి మురళీ మోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయ్, కాశ్యప్ ల వివాహాలకి ముహుర్తాలు చూస్తారు పెద్దలు. రామశర్మగారు మిత్రులకు హిందూమత ఔన్నత్యం గురించి వివరిస్తారు.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక వీభోవరా - పార్ట్ 16 చదవండి.. 


భీమారావు పురోహితులను పిలిపించి సింధూను రాజేంద్ర భూపతి ఎం.ఎల్. ఎ గారి కుమారుడు డాక్టర్ విజయేంద్ర భూపతికి నిశ్చితార్థ ముహూర్తాన్ని, వివాహ ముహూర్తాన్ని నిర్ణయించాడు.


నాటికి రెండవరోజు నిశ్చితార్థం.


సింధూ మనస్సున ఎంతో విచారం....

ఆ రాత్రి నిర్ణయించుకొంది. చివరిసారిగా ఒకసారి విజయశర్మను కలవాలని.


డైరీలో వ్రాసుకొంది చివరి ప్రయత్నం ’పండో?.... కాయో?...’ 


మరుదినం ఉదయం విజయ్ ఉంటున్న సీనియర్ తెలుగు లెక్చరర్ మురళీమోహన్ గారి ఇంటికి కార్లో వచ్చింది.

విజయ్ తన గ్రామానికి మురళీమోహన్, వారి సతీమణి శ్యామల, గౌరీలకు చెప్పి బయలుదేరే సమయం.

సింధూ మేడమెట్లు ఎక్కి విజయ్ పోర్షన్‍ను సమీపించింది. విజయ్ లోపల సంచి సర్దుకుంటున్నాడు.


"సార్!" పిలిచింది.


విజయ్ తొట్రుపాటుతో గుమ్మంవైపు చూచాడు.

ఎదురుగా అందంగా అలంకరించుకొని చిరునవ్వుతో సింధూ నవ్వుతూ వుంది.


"లోనికి రావచ్చా సార్!" అంది మృదుమధురంగా.


విజయ్ సరే అన్నట్లు తలాడించాడు. సింధూ లోనికి నడిచింది. అతని మనస్సున ’ఈమె ఈ సమయంలో ఎందుకు వచ్చినట్లు!’ ఆశ్చర్యంతో సింధూ ముఖంలోకి చూచాడు. 

సింధూ చిరునవ్వుతో....

"ప్రయాణమా!...."


"అవును మా వూరికి!...."


"నేను ఎలా వున్నాను?" చిరునవ్వుతో అడిగింది సింధూ.


"మీకేమండీ మీరు రాజకుమారి."


"ఈ రాజకుమారి కోరిక మీకు తెలుసుగా!"


విజయ్ ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూచాడు.


"నాకు మా నాన్నగారు ఎం.ఎల్.ఎ రాజేంద్ర భూపతి కుమారుడు విజయేంద్ర భూపతితో రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించారు!" విచారంగా చెప్పింది సింధూ.


"మంచిది!...."


"అంటే....?"


"సంతోషం.....!"


"కానీ నాకు సంతోషంగా లేదు!"


"ఆ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులతో చెప్పాలి!"


"వారు నామాటను వినిపించుకోరు. మీరు...." సింధూ పూర్తి చేయకముందే....

"నేను!?......" ఆశ్చర్యంగా సింధూ ముఖంలోకి చూచాడు.


"నన్ను పెండ్లి చేసుకోవాలి. మీరు నాకు కావాలి. నా మనస్సు నిండా మీరే!...."


"ఎప్పుడో మీరు అడిగిన ఈ విషయానికి, నేను నా నిర్ణయాన్ని మీకు చెప్పాను."


"ఆనాడు వేరు ఈనాడు వేరు!"


"రోజులు మారవచ్చు. కానీ నా నిర్ణయం మారదు."


"మీరంటే నాకు పిచ్చి ప్రేమ."


"అది మీలోని తప్పుడూ భావన. నేనెవరు?.... మీరెవరు?...."


"ప్రేమకు జాతి, కుల, భేధాలు వుండవని మీకు తెలియదా!"


"నా మనస్సున మీ పట్ల ప్రేమ లేదు. నేను మిమ్మల్ని ప్రేమించలేదు."


"కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను."


"అది తప్పు. ఒక్క చేతిని గాల్లో విసిరితే సవ్వడి రాదు."

"నాకు మీరు కావాలి. మనం దూరంగా, ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసుకొని హాయిగా ఆనందంగా వుందాము. నా దగ్గర చాలా నగలు, డబ్బు వుంది."


"మీరు నా నుండి కోరుకొనే హాయిని, ఆనందాన్ని నేను మీకు ఇవ్వలేను."


"మీరు నన్ను కాదంటే!...." సింధూ స్వరం బొంగురుపోయింది. కళ్ళల్లో కన్నీరు.


"కాదంటే ఏమిటి?.... కాదన్నానుకదా!...."


"నేను చాలా మొండిదాన్ని!"


"ఆ విషయం నాకు తెలుసు..."


"నేను మీ దగ్గరకు ట్యూషన్‍కు వచ్చింది మిమ్మల్ని రోజూ దగ్గరగా చూడాలని, మాట్లాడాలని!"


"అది మీకు సంబంధించిన విషయం. నాకు మీపట్ల మీరు కోరే భావన లేదు. రాదు. దయచేసి మీరు ఇక వెళ్లండి. క్రింద వున్న వారు పైకి వచ్చి మనలను చూస్తే అపార్థం చేసుకుంటారు! ప్లీజ్ మీరు వెళ్ళండి" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు విజయ్‍శర్మ.


సింధూ మౌనంగా కన్నీటితో నిలబడిపోయింది.



"నేను వూరుకి బయలుదేరాలి. బస్సు టైం అయింది. యూ ప్లీజ్ గో!..."


సింధూ పరీక్షగా విజయ్ ముఖంలోకి చూచింది.

"యు ప్లీజ్ గో!!!" దీనంగా చేతులు జోడించాడు విజయ్ శర్మ.


"చివరిసారిగా అడుగుతున్నాను. మీ నిర్ణయం మారదా!" కంఠంలో ఆవేశం.


"మారదు...." ఎంతో సౌమ్యంగా చెప్పాడు విజయ్ శర్మ.


సింధూ నిట్టుర్చింది. ఓణితో కళ్ళనీళ్ళు తుడుచుకొంది. వేగంగా మెట్లవైపు నడిచింది.


విజయ్ శర్మ తల దిమ్మెక్కిపోయింది. గట్టిగా కళ్ళుమూసుకొన్నాడు. వాకిట కారు కదలి వెళ్ళిపోయిన సవ్వడి.


విజయ్ క్రిందికి వచ్చి మురళీమోహన్ గారికి వారి సతీమణి శ్యామల, గౌరీలకు చెప్పి తన గ్రామానికి వెళ్ళేదానికి బస్టాండుకు బయలుదేరాడు.


అతని మనస్సులో సింధూకు సంబంధించిన ఆలోచనలు. ఆచారాలను, కులాలలను లెక్కచేయకుండా నన్ను ప్రేమించానని పిచ్చిదానిలా ఏదో ఆవేశంలో నాకు చెప్పింది. ఏడ్చింది. కోటీశ్వరుల కూతురు ఎక్కడ? మధ్య తరగతి బ్రాహ్మణ యువకుణ్ణి నేను ఎక్కడ? నక్కకు నాగలోకానికి వున్నంత వ్యత్యాసం. ఆమెది పవిత్ర ప్రేమ కాదు. నాపై వ్యామోహం. 


కారణం ఆమె దృష్టిలో నేను చాలా తెలివికలవాడిని. గొప్ప అందగాడిని. నాలాంటివారు వారి జాతిలో ఎందరో!.... నేనెంత నా బ్రతుకెంత?... ఆమెకు నేను ఏ రీతిగానూ తగను. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. ఆవేశంతో వెళ్ళిపోయింది. IPS పూర్తి చేయాలి. ఉద్యోగం రావాలి. నా కాళ్ళమీద నేను నిలబడాలి. అది అంత సులభం కాదు. దైవానుగ్రహం పూర్తిగా అవసరం. 


తండ్రి.. సర్వేశ్వరా!.... సింధూ మనస్సు మార్చు వాళ్ళ తండ్రి మాజీ ఎం.ఎల్.ఎ భీమారావు గారు నిర్ణయించిన సంబంధంతో ఆమె వివాహం ఆమె అంగీకారంతో జరిగేలా చూడు. తన మనసులోని నన్ను తుడిచేయి. ఆమె వివాహం ప్రశాంతంగా జరిగి, ఆమె నిండు నూరేళ్ళు పండంటి బిడ్డలకు తల్లిగా సర్వ సౌభాగ్యాలతో ఆనందంగా వర్థిల్లేలా చూడు. ఆమె మనస్సుకు అన్నివిధాలా సంతోషాన్ని ప్రసాదించు. ప్రభూ!..’ దీనంగా సర్వేశ్వరులను వేడుకొన్నాడు విజయ్. బస్సు వచ్చింది. ఎక్కాడు. అది కదిలింది. 


సింధూ ఇంటికి వెళ్ళి తన గదిలో ప్రవేశించింది. తనివితీరా విజయ్‍ను తలచుకొని ఏడ్చింది. కన్నీటి రూపంలో ఆమెకు విజయ్ పట్ల వున్న ప్రేమ కరిగి ప్రవహించింది.


తెల్లవారితే తనకు విజయేంద్రభూపతితో నిశ్చితార్థం. అది జరుగకూడదు. ఒక నిర్ణయానికి వచ్చింది. పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు.


ఆ మధ్యాహ్న భోజన సమయంలో తండ్రి, తల్లి, సోదరుడు దుర్గారావు మాటలకు తన పెదవులపై చిరునవ్వు. భోజనాలు ముగిశాయి. తన తల్లిని సమీపించింది సంధ్య.


"ఏం చిన్నీ!" ప్రేమతో పలుకరించింది కావేరి.


"అమ్మా! రాత్రి వడలు, సేమియా పాయసం చేయించమ్మా తినాలని వుంది" మెల్లగా చెప్పింది. 


మనస్సున ప్రళయం.


"ఓస్! అంతేకదా! చేయిస్తాను తల్లీ!" ప్రీతిగా చెప్పింది కావేరి. 


సింధూ తన గదికి వెళ్ళిపోయింది.

డైరీని చేతికి తీసుకొంది. గతంలో తాను విజయశర్మను గురించి వ్రాసిన ప్రతి పేజీని చదివింది.


మనస్సున ఎంతో బాధ. తనలో తాను సతమతం కావలసిందే తప్ప ఎవ్వరికీ చెప్పాలని లేదు. ఆ తల్లి తండ్రి అన్నలకు తన ఆతర్వంతో పనిలేదు. వారికి కావలసింది, వారు కోరునట్లు జరగడం, తనకు వారి నిర్ణయం అసమ్మతం. కానీ బయటికి చెప్పలేని స్థితి. కళ్ళు శ్రావణమేఘాలైనాయి. ఏకధారగా కన్నీరు. మంచంపై వాలిపోయింది. కొంతసేపటికి నిద్రపోయింది.


సింధూ మేల్కొని గంటను చూచింది. సాయంత్రం ఐదున్నర. రెస్టు రూంలోనికి వెళ్ళింది. తలస్నానం చేసింది. డ్రస్ చేసుకొని దొడ్లో వున్న సన్నజాజి తీగలలోని సన్నజాజులను కోసింది. ఆ పూలు, ఆ వాసన అంటే సింధూకు చాలా ఇష్టం. దండకట్టి పూలను తలలో పెట్టుకొంది. కావేరి స్వయంగా కూతురు కోరిన వడలను సేమియా పాయాసాన్ని తయారు చేసింది.


"సింధూ! నీవు కోరిన వాటిని నేనే స్వయంగా చేశానురా!" నవ్వుతూ చెప్పింది కావేరి.


"చాలాచాలా సంతోషం అమ్మా!" అంది సింధూ. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు. తల్లి చూడకుండా తలను ప్రక్కకు త్రిప్పుకొంది. తన గదికి వెళ్ళిపోయింది.


ఆ రాత్రి భోజన సమయంలో సింధూ ఎంతో ఆనందంగా వడలను, సేమియా పాయాసాన్ని తాగింది.


అందంగా అలంకరించుకొని తల్లో జాజిపూలను పెట్టుకొని పరమ ప్రశాంతంగా భోజనం చేస్తున్న కూతురును చూచి భీమారావు....


"కావీ! అమ్మాయిని చూచావా! ఎంత అందంగా వుందో. నా తల్లి!" ఆనందంగా చెప్పాడు భీమారావు.


"ఎవరి కూతురు?" ఓరకంట భీమారావు ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో అంది కావేరి.


"నా కూతురే!" గర్వంగా చెప్పి ఆనందంగా నవ్వాడు భీమారావు.


"నాన్నా!" దుర్గారావు మాట.


"ఎందిరా!"


"నిజంగా ఆ నాయాలు విజయేంద్రభూపతికి నా చెల్లి అర్థాంగి కావడం వాడి మహా యోగం!" చిరునవ్వుతో చెప్పాడు దుర్గారావు. 


పెద్దలు ముగ్గురూ ఆనందంగా నవ్వుకొన్నారు.

భోజనాలు ముగిశాయి.


గుడ్‍నైట్ పలుకులతో ఎవరిగదులకు వారు వెళ్ళిపోయారు. సింధూ గదిలో ప్రవేశించింది. తలుపును మూసింది.

సంతోషంతో భీమారావు భార్య కలిపి ఇవ్వగా విస్కీ సేవిస్తూ రేపటి కార్యక్రమాన్ని గురించి అర్థాంగితో ఆనందంగా చర్చించసాగాడు.


దుర్గారావు తన గదిలో అదే పని ప్రారంభించాడు. 

సింధూ మంచంపై కూర్చుంది. డైరీని చేతికి తీసుకొంది. 


’మూడు వత్సరాల ఆశ ముసలిదైపోయింది....

ముసలిదైన ఆశ మరణాన్ని కోరింది......

తనువు కోరుతూ వుంది శాంతిని.....

మనస్సు కోరుతూ వుంది ప్రశాంతిని.....’

డైరీలో వ్రాసింది. 


దిండుక్రింద వుంచింది. తాను విజయ్ దగ్గరనుంచి తిరిగి వచ్చేటప్పుడు తెచ్చుకొన్న బాటిల్ నిద్రమాత్రలను బలవంతంగా మ్రింగింది. మంచం మీద వాలిపోయింది. కడుపులో చిత్రమైన కదలికలు. తనువు నిండా చెమట. శరీరాలలో విచిత్రమైన బాధలు. అరగంట తర్వాత అన్నీ ఆగిపోయాయి. సింధూ ప్రశాంతంగా తలను వేలాడేసింది. 


మరుదినం....

సమయం ఎనిమిదిన్నర....

ఉదయాన్నే ఆరుగంటల కల్లా లేచి బెడ్ కాఫీని తల్లిని అడిగి త్రాగే సింధూ తొమ్మిది గంటలు కావస్తున్నా గది నుండి బయటికి రానందున, కావేరీ, సింధూ గదిలో ప్రవేశించింది. 


సింధూను తాకి....

"సింధూ!...." పిలిచింది.


ఆమె వాలకాన్ని చూచిన కావేరికి ఏదో సంశయం.

శరీరాన్ని నొసటిని తాకి చూచింది.


సింధూ శరీరం చల్లగా తగిలింది కావేరికి.

"సింధూ!..." మరోసారి సందేహంతో పిలిచింది.


సింధూలో కదలిక లేదు. తలగడ ప్రక్కన వున్నా నిద్రమాత్రల సీసాను చేతికి తీసుకొంది. ఆత్రంగా చూచింది. ఆమెకు విషయం అర్థం అయ్యింది.


"ఏమండీ!.... మన సింధూ..... మన సింధూ...." ఆపై చెప్పలేక సింధూ పైబడి భోరున ఏడవసాగింది.


కావేరి ఏడుపును విన్న వంటమనిషి గదిలోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూచింది. పరుగున ఏడుస్తూ భీమారావు గదికి వెళ్ళి విషయాన్ని చెప్పింది పనిమనిషి మంగమ్మ.


భీమారావు లుంగీ సరిచేసుకొంటూ సింధూ గదిలో ఆత్రంగా ప్రవేశించాడు.


పనిమనిషి ఏడుపును విన్న దుర్గారావు కూడా సింధూ గదికి వేగంగా వచ్చాడు.


"ఏమండీ!.... మన సింధూ నిద్రమాత్రలు మ్రింగి...."... ఆపై చెప్పలేక "సింధూ..... సింధూ" అంటూ భోరున ఏడవసాగింది కావేరి.


పరిస్థితి అర్థం చేసుకొన్న భీమారావు, దుర్గారావులు తారాస్థాయిలో ఏడవసాగారు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. అందరి కళ్ళల్లో కన్నీరు. విషయం అరగంటలోపల ఆ వాడంతా తెలిసిపోయింది. 

అదేవాడవాసులైన రాజేంద్రభూపతి అతని భార్య కౌసల్య, కొడుకు విజయేంద్రభూపతి వచ్చారు. ఆశ్చర్యపోయారు. ఎంతగానో విచారపడ్డారు. సాయంత్రం మూడుగంటల కల్లా రావలసిన బంధుజాలం, హితులు అందరూ వచ్చారు. 


అందరి వదనాల్లో విచారఛాయలు. కన్నీరు. ఐదు గంటల ప్రాంతంలో సింధూ పూలపల్లకి స్మశాన వాటికకు చేరింది. 

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page