వీభోవరా - పార్ట్ 15
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Aug 22
- 6 min read
Updated: Aug 27
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 15 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/08/2025
వీభోవరా - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. స్వామీజీ తిరిగి కనబడి మురళీ మోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయ్, కాశ్యప్ ల వివాహాలకి ముహుర్తాలు చూస్తారు పెద్దలు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 15 చదవండి..
రామశర్మగారు తన వద్ద వైదికవిద్యను అభ్యసించువారికి నిత్య దైవ ఆరాధనా మంత్రాలను నేర్పుతున్నారు. ఇరవైమంది బాలురు వారి వద్దకు వచ్చి నేర్చుకుంటున్నారు.
శుక్లాంభరదరం విష్ణుం శశివర్ణ చరుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయె
అగజాఆనన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానం ఏకదంత ముపాస్మహే
ఓం శ్రీ వరసిద్ధి వినాయకా నమోన్నమః ఓం శ్రీవరసిద్ధి వినా
యకా నమోన్నమః ఓంశ్రీ వరసిద్ధి వినాయకా నమోన్నమః
ఓంనమః శివాయః ఓంనమఃశివాయ.. ఓం నమఃశివాయ
ఓంనమోనారాయణాయః ఓంనమోనారాయణాయః ఓంనమోనారాయణాయః
హరిఓం.. హరిఓం.. శివఓం.. శివఓం.. హరిఓం.. హరిఓం..
శివఓం.. శివఓం.. హరిఓం.. హరిఓం.. శివఓం.. శివఓం..
1. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి
నెయ్యమును నితాంతాపార భూత దయయును,
తాపస మందార నాకు దయసేయగదే!..
2. హరియను రెండక్షరములు హరియించును పాతకంబు అంబుజనాభా.. హరి నీ నామమహిమను కొనియాడగ
నాకు వశమో హరిహరి కృష్ణా
3. ఎంత దయో దాసులపై పంతంబున మకరిబట్టి బాధింపంగా
శ్రీకాంతుడు చక్రమున్ బంపెను
దంతావళి రాజుగాయ దత్తాత్రేయ
4. చేతులారంగ శివును పూజింపరేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువరేని
దయసత్యంబులోనుగా దలపరేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు
5. కృష్ణావాసుదేవ కేశవ పరమాత్మ
అప్రమేయవరద హరిముకుంద
నిన్ను చూడగంటి నీకృప కనుగొంటి
అఖిల సౌఖ్య పదవులన్ అందగంటి
6. అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృతోర్మా అమృతంగమయ
ఓం శాంతి.. ఓం శాంతి.. ఓంశాంతిః..
పిల్లలారా! ప్రతి దినమూ స్నానానంతరం దైవం ముందు కూర్చొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని నేను ముందు చెప్పిన వాటిని స్మరిస్తూ దైవధ్యానం సలపాలి. తదనాంతరం ఇంటి బయటికి వచ్చి సూర్యదేవునకు నమస్కరించి చిత్తశుద్ధితో..
దినకరా శుభకరా దివ్యతేజా
అహస్కరా భాస్కరా అరుణతేజా
సురలోకవందితా నిత్యసత్య
సూర్యదేవా సర్వేశ్వరా తమోవశరణం
తమేవశరణం తమేవశణం
ఆ పద్యాన్ని చెప్పాలి. అనుదినం సూర్యదేవ ప్రార్థన, రోజు ఆనందంగా గడవటానికి మన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, సంతోషంగా, ఆరోగ్యంగా వుండటానికి ఆధారం అవుతుంది.
నేను చెప్పిన దైవ ప్రార్థనా విధానం అన్ని వయస్సువారు అన్ని కుల మతాల వారూ ఉదయాన్నే ఆ రీతిగా దైవ ప్రార్థన చేయడం శుభప్రదం. ఆనందప్రదం. మనోశాంతిప్రదం.
తాను చెబుతుంటే వ్రాసుకొన్న కొత్త పిల్లల నోట్సును తీసుకొని అక్షర దోషాలను సవరణం చేసి వారికి ఇచ్చారు రామశర్మ.
అందరూ ’నమస్తే సార్’ చెప్పి వారి వారి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
రామశర్మ మిత్రులు సయ్యద్, సత్యయ్య వచ్చి నమస్కరించారు.
రామశర్మ చిరునవ్వుతో..
"మిత్రులారా! రండి కూర్చోండి.."
ఇరువురూ కూర్చున్నారు. వారికి ఎదురుగా రామశర్మ కూర్చున్నారు.
"సయ్యద్, సత్యయ్యా!.. మీ వారంతా కుశలమే కదా!"
"ఆ స్వామీ అందరూ బాగున్నారు. నా కొడూకు రహీమ్ ఎస్.ఐ అయ్యాడు."
"ఓ.. అలాగా! చాలా సంతోషం సయ్యద్. ఆ.. సత్యయ్య నీ కొడుకు బాలరాజు ఎలా వున్నాడు?"
సత్యయ్య విచారంగా తలదించుకొన్నాడు.
"ఏం సత్యయ్యా! విచారంగా వున్నావ్?"
"స్వామీ!.. ఆ బాలరాజు మతం మారాడు. అదే సత్యయ్య బాధ" చెప్పాడు సయ్యద్.
"ఓహో అలాగా!.."
"అవును స్వామీ!.." మెల్లగా విచారంగా చెప్పాడు సత్యయ్య.
రామశర్మ ముఖంలో చిరునవ్వు.
"ప్రాచ్యాత మతాధిపతుల మహిమ, రాజకీయ తంత్రం. మతాలు మానవ నిర్దేశకం కాదు. ఆ పరమాత్ముని నిర్ణయం. భగవత్ గీత గ్రంధంలో శ్రీ కృష్ణ పరమాత్మ ’చతుర్ వర్ణమయా సృష్ట్యా!.. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, సూద్ర.(మిగతా అన్ని కులాలు) మన కుల మతాలు ఆ రీతిగా ఏర్పడినవి. అది దైవ సంకల్పం. ప్రతి ఒక్కరూ వారి వారి మత ధర్మాలను పాటించాలి. అప్పుడే సమాజం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. అన్ని మతాల సందేశం.. సారం ఒక్కటే. మనిషి తన జీవిత గమనాన్ని ధర్మబద్ధంగా క్రమశిక్షణతో ముందుకు సాగించడం, ప్రతి మతస్థుల కర్తవ్యం అవుతుంది.
ఎవరి మతం వారికి గొప్ప, ఎవరి నమ్మకాలు, సిద్ధాంతాలు వారికి ఆనందం. ఈ విషయంలో ఒక మతస్థులు మరో మతస్థులను ఆక్షేపించడం, విమర్శించడం మహాపాపం. జన్మించిన మతాన్ని మారడం, ఇతర మతస్థులను తన మతంలోకి మాయ మాటలతో స్వల్ప ధనం యిచ్చి మార్చ ప్రయత్నించడం అమానుషం. వ్యక్తిగత స్వార్థం.
నేను హైందవుడను. నా మతంలో అన్య మతస్థులను మా మతంలోకి మార్చే ఏ మంత్రం తంత్రం లేదు. మనస్సున పరమత ద్వేషం పనికిరాదు. సాటి మతాలను గౌరవించడం మానవత్వం. సర్వేశ్వర నిర్దేశమో ప్రతి వ్యక్తి జననానికి మూలం ఏ మతంలో పుట్టిన వాడు, ఆ మత సిద్ధాంతాలను పాటించడం ధర్మం. మా హైందవం అధ్వైతం. అంటే రెండు కానిది ఒక్కటే. సర్వమత సారం ఒక్కటే. సర్వేశ్వరులు ఒక్కరే. వారే జగత్‍కర్త విధాత..
మీ ఇద్దరినీ నేను ఒకమాట అడుగుతాను నిర్భయంగా నాకు సమాధానం చెప్పాలి. అడగనా!"
"అడగండి స్వామీ!.." అన్నాడు సయ్యద్.
"సయ్యద్ మీ ఖూరాన్‍లో అన్య మతాలను ద్వేషించండి, అన్య మతస్థులను హింసించండి అని ఎక్కడైనా వ్రాసి వుందా! అలాగే సత్యయ్యా.. బైబిల్‍లో ఆ విషయాన్ని గురించి ఎక్కడైనా వ్రాసివుందా! చెప్పండి సోదరులారా!.."
సయ్యద్, సత్యయ్యలు మౌనంగా తలలు దించుకొన్నారు.
"ప్రియహితులారా!.. మా అధ్వైత తత్వ ప్రమాణిక గ్రంధము భగవద్గీత. శ్రీ కృష్ణ పరమాత్మ అర్జుననుకు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఉపదేశించినది. మహర్షి వేదవ్యాసులవారు యధాతదంగా వ్రాశారు. లక్షణములు అనగా గుణములు మూడు. అవి ఔతిక (ప్రకృతి) ప్రాపంచిక (ప్రపంచానికి) వర్గ మతాలకు సంబంధించినవి. మూలం.
రాజస లేదా రజోగుణం, తామస లేదా తమోగుణం, సత్వ లేదా సన్మార్గగుణం. ఇవే త్రిగుణములు. మానవుల్లో వుండేవి.
రజోగుణం కలవారి లక్షణాలు : ప్రాపంచిక భోగము లందు ఆసక్తి. అధిక కోరికలు, వాటియందు ఆసక్తి. లోభము మోసము, అశాంతిలతో కోరికలను తీర్చుకొనేటందుకు అనుచిత కర్మలను విచక్షణారహితంగా ఆచరిస్తారు.
2. తమోగుణం కలవారు : అజ్ఞానము వలన జనించు ఈ గుణం కారణంగా సమస్త జీవరాసుల యందున నిర్లక్ష్యము, సోమరితనము, జడత్వము (దయారహితము), మోసము, మోహము కేవలం స్వార్థవర్తనులై వర్తిస్తారు.
3. సత్వగుణం కలవారి లక్షణాలు : ఈ గుణం మిగతా రెండింటికంటే పవిత్రమైనది. క్షేమదాయకమైనది. ఈ గుణంతో చేయు పనులు సత్ఫలితాలను ఇస్తాయి. వీరు ఆనందంగా వుంటూ ఇతరులకు ఆనందాన్ని పంచుతారు.
మన మానవ సమాజంలో ఆ మొదటి రెండు గుణాలు కలవారు ఎందరో వున్నారు. ఆ కారణంగా పరస్పర ద్వేషం, పగ, ప్రతీకారలు జరుగుతున్నాయి. వీరికి స్వపర భేదం లేదు. వారి వాంఛ, కోరికే వారికి ముఖ్యం.
మూడవ గుణమైన సత్వగుణం, బహుకొద్దిమందిలో వుంది. నేను మీ మసీదుకు వచ్చి, మీ చర్చికి వచ్చి ఆ దైవాన్ని ప్రార్థిస్తాను. మీరు ఇచ్చు నైవేధ్యాన్ని (శాకాహారాన్ని) తింటాను. కానీ మీలో చాలామంది మా దేవాలయానికి రారు. మా దైవ నివేదనను తినరు. కారణం ఏమిటి? మేము మీలాంటి మనుషులం కాదా!.. మేము మీ దృష్టిలో అల్పులమా!.. మీరు మహోన్నతులా!.. మా తత్త్వం తప్పా?.. మీ తత్త్వం ఒప్పా!.. సయ్యద్.. సత్యయ్యా నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వినాలని వుంది. మా భావనలు తప్పు అయితే మనస్సు మార్చుకోవాలని వుంది" రామశర్మ చెప్పడం ఆపేశాడు. చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూచాడు.
ఆ ఇరువురూ ఒకరినొకరు చూచుకొన్నారు. తలలు దించుకొన్నారు. రామశాస్త్రి గారికి ఏం చెప్పాలో వారికి తోచలేదు. రామశర్మ నవ్వుతూ "ఏం చెప్పాలో తోచటం లేదు. కదూ! నేను చెప్పనా!.. తాత చేశాడు, తండ్రి చేశాడు, నేనూ చేస్తున్నాను. ఈ మాట మన ముగ్గురికీ వర్తిస్తుంది."
మా హైందవ పురాణ ఇతిహాసాల మూలంగా మాకు తెలిసింది ఇప్పటికి మూడు యుగాలు అనగా కృతయుగము (దాని కాలము 4800 దివ్య సంవత్సరములు అనగా 1728000 మానవ సంవత్సరములు.
రెండవది త్రేతా యుగము (దాని కాలము 3600 దివ్య సంవత్సరములు అనగా 1296000 మానవ సంవత్సరములు.
మూడవది ద్వాపర యుగము (దాని కాలము 2400 దివ్య సంవత్సరములు అనగా 864000 మానవ సంవత్సరములు.
ప్రస్తుతం నడుస్తున్నది కలియుగము. దీని కాలము 1200 దివ్య సంవత్సరము, అనగా 432000 సంవత్సరములు. హిందూ మత జననం సింధూనది తీర ప్రాంతంలో మహాతపోధనులైన మహాఋషులు వేద సంస్కృతిని అభివృద్ధి చేశారు. ఆ వేదమత ప్రతిరూపమే హిందూమతం.
యుగయుగాలు చరిత్ర కల మహోన్నత మతం. ఆదిలో హైందవులందరూ ఋషుల సంతతే. తరువాత కాలంలో వారు వారు వుండే ప్రదేశము, వారు చేపట్టిన ఉపాధి మార్గములను అనుసరిమ్చి కులతత్వాలు వృద్ధి చెందాయి.
శ్రీ జీసస్ జననం 4BC (Before christ) జననం బెత్లెహేము (Bethlehem), శ్రీ మొహమ్మద్ జననం 570 AD (ANNO Domin) జననం మక్కా (Macca) శ్రీ మహమ్మద్ జననం, జీసస్ జననం తరువాత 600 సంవత్సరాల తరువాత జరిగినది.
పరమత అభిమానం అందరికీ ఆనందదాయకం. పరమత ద్వేషం మహాపాతకం. ఇది సనాతన అద్వైత హైందవ ధర్మసూక్తి."
"సోదరులారా!.. చాలాసేపు మాట్లాడి మిమ్ములను విసిగించనేమో. నాలోని భావావేశం సత్యాలను వెల్లడిచేసింది.
ప్రస్తుత మన భారతావనికి మనందరికీ కావలసినది స్వధర్మ ఆచరణ పరస్పర సఖ్యత. అదే దేశ శాంతికి మూలం" రామశర్మ చెప్పడం ఆపేశాడు. చిరునవ్వుతో హితుల ముఖాలను పరిశీలించాడు.
"స్వామీ!.. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. నాకు చాలా ఆనందం" నవ్వుతూ చెప్పాడు సయ్యద్.
"అవును స్వామీ! సయ్యద్ భావనే నా భావన. మనస్సుకు చాలా సంతోషంగా ఉంది."
సత్యయ్య కొడుకు బాలరాజు అక్కడికి వచ్చాడు.
రామశర్మకు నమస్కరించాడు.
"బాగున్నావా బాలరాజూ!" ప్రీతిగా అడిగాడు రామశర్మ.
వున్నట్లు తలాడించాడు బాలరాజు.
ఈ బాలరాజు, సయ్యద్ కొడుకు రహీమ్ రామశర్మ వద్ద విద్యను అభ్యసించినవారే.
"చూడు బాలరాజు! కన్నతల్లితండ్రుల సేవకు మించిన సేవ లేదు. వారి జీవితకాలంలో వారి ఆనందమే నీ ఆనందంగా భావించాలి. మీ తండ్రి చెప్పిన మాట ప్రకారం నాకు అర్థం అయినది నీవు ఉపాధి కోసం మతం మారావని. కొందరు నీ మాటలను నమ్మి మతం మారవచ్చు. మారి తెలిసికొన్న ఆ ధర్మాలను పాటించు. ఆనందించు. ఇతరులను మార్చ ప్రయత్నించకు. అది అనుచితము." ప్రీతిగా చెప్పాడు రామశర్మ.
సయ్యద్, సత్యయ్య లేచి రామశర్మకు నమస్కరించారు. ఆ ముగ్గురూ సాలోచనగా ముందుకు నడిచారు
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments