top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

కాకతి రుద్రమ ఎపిసోడ్ 19

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 19' New Telugu Web Series




అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 19 వ భాగం

గత ఎపిసోడ్ లో…

శివదేవయ్యామాత్యులు, చాళుక్య వీరభద్ర ప్రభువును కలుస్తాడు.

రుద్రమదేవితో అతని వివాహానికి గణపతి దేవులు విధించిన షరతులు వివరిస్తాడు.

అన్నిటికీ అంగీకరిస్తాడు చాళుక్య వీరభద్రుడు.

గణపతిరుద్రదేవ చక్రవర్తులు శివ సాయుజ్యం పొందుతారు.

రాజ్యంలో తిరుగుబాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తారు రుద్రమదేవి , శివదేవయ్య.


ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 చదవండి..

-----------------------------------------------------------------------

" రామప్ప ఆలయం- మన వారసత్వ వైభవము"

--------------------------------------------

భారతావనిలో ఆలయాలు నిర్మించని రాజులు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, చితకా రాజులే ఆలయాలు నిర్మిస్తుంటే కాకతీయుల్లాంటి చక్రవర్తులు ఊరుకుంటారా!

అసలు ఆలయ నిర్మాణశైలిని ప్రపంచానికిచ్చారు.


కాకతీయుల శిల్పకళాచాతుర్యానికి పరాకాష్ట అని చెప్పదగ్గ నిర్మాణం 'రామప్ప ఆలయం'. ఇక్కడున్న ప్రతిశిల్పం ఓ సజీవమూర్తిగానే తోస్తుంది చూపరులకి అందుకే.... ఎనిమిది వందల ఏళ్ళక్రిందట ఈ ఆలయాన్ని చూసిన ప్రఖ్యాత యాత్రికుడు మార్కొపోలో 'ఆలయాలనే నక్షత్రరాశిలో ..............ఇదో వేగు. చుక్క!' అని రాశాడు.


అంతగా ఏముంది ఇందులో అంటే..................

మిగతా గుడుల్లాగా రామప్ప ఆలయం కేవలం భక్తి కోసం నిర్మంచింది కాదు.....దీని

నిర్మాణం వెనక గొప్ప కళానురక్తి ఉంది.


ఓ రకంగా చెప్పాలంటే నాట్యరీతుల్ని భావితరాలకోసం నిక్షిప్తం చేయాలనే తలంపుతో, ఆలోచనలతో కట్టిన ఆలయం ఇది.కాకతీయ గజసేనాధిపతి జాయప రాసిన ' నృత్తరత్నావళి' అనే గ్రంథానికి ఈ ఆలయం ఓ శిల్పరూపం.


ఇప్పుడైతే ఎవరైనా ఏదైనా పుస్తకం ఇస్తే దాన్ని ఆడియో రూపంలోనో, డిజిటల్‌

రూపంలోనో పదిలం చేస్తున్నారు.ఆ కాలంలో అవన్నీ లేవు కదా! అందుకే .....ఆ

పుస్తకం కోసం ఇలా ఓ ఆలయాన్ని నిర్మించి శాశ్వతం చేశారు.


అందుకే ఈ గుడిని ' నృత్తరత్నావళి' అన్న గ్రంథానికి ' లక్షిత'( Refrence)

ఆలయం అంటున్నారు పరిశోదకులు.మనదేశంలో ఇలాంటి ఆలయం ఇంకొకటి

కనిపించదు.అందుకే ఈ ఆలయం అడుగడుగునా నాట్యభంగిమలే కనిపిస్తాయి.

ముఖ్యంగా ఇక్కడి శివతాండవ శిల్పాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు.24

గంటలూ సరిపోవు.

అన్నింటా మేటి...........

కాకతీయులు ఒకప్పుడు పశ్చిమచాళుక్యుల సామంతులు.అందువల్ల కర్ణాటక ఆలయ

నిర్మాణశైలి ప్రభావం వీళ్ళపైన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.నక్షత్ర ఆకారం లాంటి అడుగుబాగందానిపైన ప్రధానఆలయం తోపాటు మరో రెండు ఆలయాలని నిర్మించడం ( త్రికూటం అంటారు) .దక్షిణాది ( వేసర) ఉత్తరాది( నాగర) శైలుల్ని మిళితం చేయడం ....ఇవన్నీ చాళుక్యుల నుంచి వీళ్ళు తెచ్చుకున్నవే.కానీ రామప్ప ఆలయం లో తమదైన ప్రత్యేకతలెన్నో చాటారు.ఆలయ పునాదిని ఇసుకమట్టి( శాండ్‌బాక్సు) పైన నిర్మించడం అందులో మొదటిది .దాని వల్లే 1819 లో ఇక్కడ తీవ్రమైన భూకంపం వచ్చినా ఆలయ పైకప్పు పడటం తప్ప ఇంకే నష్టమూ జరగలేదు.ప్రధాన ఆలయం లోని విమానాన్ని అతితేలికైన ఇటుకరాయితో నిర్మించారు.


మనం వాడుతున్న ఇటుకల బరువుతో పోలిస్తే ఇది కేవలం మూడో వంతే తూగుతుంది....నీటిలోనూ తేలుతుంది.ఇక, మధ్యలో ఉన్న శిల్పాలన్నింటికీ ' మెత్తటి' కొండరాళ్ళని వాడారు.లావా గడ్డ కడితే ఏర్పడే బసాల్ట రాళ్ళివి.వరంగల్‌లో విరివిగా దొరికే ఈ రాళ్ళు శిల్పి రామప్ప చేతుల్లో మైనపు ముద్దల్లాగా మారాయేమో అనిపిస్తాయి.ముఖ్యముగా ముఖమంటపంలో రవంత ఖాలీ కూడా లేకుండా శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు రామప్ప. సాధారణంగా ఒకదానికొకటి ముడిపడినట్టుండే వరస శిల్పాలు.......


వేర్వేరుగా చూస్తే పెద్దగా అందంగా అనిపించవు.ఇక్కడలా కాదు......ప్రతి శిల్పమూ,

దానికి ప్రతి అలంకరణా ప్రత్యేక సౌందర్యముతో మైమరపిస్తుంది.ఇక స్తంభాలపైన

చెక్కిన మోహినీ, నాగినీ ( మదనికలు) లు ....కాకతీయ శిల్పకళ ప్రత్యేకతకు నిలువెత్తు

సాక్ష్యాలు.ఆ సన్నటి నడుమూ, నాట్యం చేస్తునట్టున్న కాళ్ళూ... కాకతీయుల శిల్ప

సౌందర్య శైలిగా నిలిచి పోయాయి.ఆ తరువాత దేశమంతా వ్యాపించాయి.13 వ శతాబ్దంలో మాలిక్‌కపూర్‌ దండయాత్రలో శిథిలమైన ఈ ఆలయాన్ని నిజాంనవాబు

మీర్‌ఉస్మాన్‌ఆలీ పునరుద్దరించి 1931 లో జనసందర్శనకు తలుపులు తెరిచారు.

-----------------------------------------------------------------------


చోళులకూ -కాకతీయులకు కొన్నితరాల శత్రుత్వం వుంది.అయితే దెబ్బతీసిన కాక

తీయులు మరిచిపోయారు గానీ దెబ్బతిన్న చోళప్రభువులు తమకు జరిగిన అవమా

నాన్నీ మరిచిపోలేకపోయినారు.వారు అన్నేళ్ళ నుంచీ అవకాశం కోసం ఎదురు

చూస్తూనే ఉన్నారు.వేగులు తెచ్చిన వార్తలవల్ల -


గణపతి చక్రవర్తి వృద్ధుడై అవసానదశలో వున్నాడనీ, అంతా తండ్రిగారిపేరు మీద రుద్రమదేవి చూసుకుంటున్నదనీ తెలియవచ్చినది.

ఇది నమ్మకమైన వార్తే.


ఇది కాకతీయసామ్రాజ్యము పై దండెత్తుటకు సరైన సమయమని వేగులు వార్తలు

తెస్తున్నారు. తోటి సామంతరాజులు చోళప్రభువు చోడోదయుని మాట మాటలకు 'తానా' అంటే -' తందానా' అన్నారు. యుద్దం చేద్దామంటే సంసిద్దమేనన్నారు. లక్షలకొద్దీ సైన్యం, ఆయుదాలు, అశ్వాలూ, రధాలూ, ఏనుగులూ సిద్దం చేసినారు. తన

పరాక్రమం తెలియటానికి ' కందూరు' పైకి దండయాత్ర చేసి , కొన్ని గంటలలో ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఆ రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నాడు. ప్రాణ

భయం వున్న బలంలేని చిన్నచిన్న సామంతులు తమ రాజ్యల్ని చోడోదయుడికి అప్ప

జెప్పారు.


ఇంతకాలం అణిగిమణిగి ఉన్న చోడోదయుడు కాకతీయ ప్రభువుల సామంతుడు

స్వతంత్రరాజు కావలెనని కలలు కంటున్నవాడు. అందువలన తాను స్వతంత్రరాజు

ననీ, కాకతీయులకు సామంతుడు కాననీ , పశ్చిమాంధ్ర దేశంలో వున్న సామంత

రాజులు యికనుంచీ తమ అధీనంలో వుంటూ తమని విశ్వాసం గా కొలుస్తూ -కప్పాలు తమకే కట్టాలనీ ఫర్మానా లు జారీచేశాడు.


సామంతరాజులు సంధిగ్దస్థితిలో పడ్డారు.కొందరు రాజులు కాకతీ ప్రభువులకు

అవిధేయులుగా ఉండలేక - చేడోదయునికీ ఎదురు తిరగలేక కొట్టుమిట్టాడుతు

న్నారు. అటు చూస్తే నుయ్యి- ఇటు చూస్తే గొయ్యి.


అయితే చోడోదయుని ప్రగల్భాలు కాకతీ నగరమునకు చేరకపోలేదు.అవి చాన్నాళ్ళ

క్రితము తెలిసినవి.గణపతి చక్రవర్తి అంతిమ క్షణాల్లో వున్నారు.ఇక్కడ రుద్రమదేవి

రాజ్యకలాపములలో అన్యమనస్కంగా వుంది.


ఆగవలెను. వేచి చూడవలెనని శివదేవయ్యామాత్యులు అనుకుని , మొత్తానికి చోడో

దయుని ప్రగల్భాలు రుద్రమదేవికి తెలియజెప్పినారు.ఆమె కన్నులు ఎర్రజేసుకుని,

తర్వాత నిభాయించుకుని నిశ్శబ్ధంగా వూరుకున్నది. దాని అర్థము-

" బాబయ్యగారూ ! ఇది అదను కాదు" అని.


ఆనాడే చోడోదయుడు మానవనాడు పై దండెత్తి, ఓడించి కాకతీయప్రభువుల సామంతరాజును బంధీగా చేశాడు. అనగా చక్రవర్తి సైన్యాన్ని నాశనం చేశాడు. ఆ

మరునాడే వర్ధమానపురపు ముట్టడికి చోడోదయు రాజుల అఖండసైన్యం బయలు

దేరింది.


అదీ శివదేవయ్యలకూ తెలుసు. కానీ ప్రభువుల విగత శరీరము కోటలో పెట్టుకుని

దండయాత్ర చేయుటెట్లు?


అందువలననే నగర సంరక్షణకు గట్టి కట్టుబాట్లు జరిగాయి.

------------------------------------

ఓరుగల్లు-అంతర్భాగాన - సేనాపతులచే , దండనాయకులచే రాజప్రముఖోద్యోగు

లతో కిటకిటలాడుచున్నది.


శివదేవయ్య లేచినారు.ఆయన ముఖం చిరునవ్వుతో స్వచ్ఛంగా నున్నాడు.ఆయన గొంతు స్పష్టంగా వినిపించుచున్నది.


" రుద్రమదేవ చక్రవర్తికి, సామంత-దండనాయక, సేనానయక, రాజప్రముఖులకు

కృతజ్ఞతలు.

ఇప్పుడు నేను చెప్పబోవుచున్నది- ఒక మహావీరుని గురించి.


ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెలు గుభిల్లుమంటాయో-

ఎవరి పేరు జెప్పి , తల్లులు పాలిస్తూ , తమ పిల్లలకు వీరత్వం నేర్పుతారో-

ఎవరి పేరు జెప్పి కథలూ- కావ్యాలూ- వీరగాధలు వుద్భవిల్లాయో-

ఎవరి పేరు జెప్పి , తాడిత, పీడిత, జనాలు దీపారాధన చేస్తారో -


ఎవరిని పేరు చెప్పి -ఆశ్రితులు ప్రత్యక్షదైవంగా కొలుస్తారో -

ఎవరు కో యంటే కొండలు ప్రతిధ్వనిస్తాయో-

ఎవరి పేరు జెపితే -లోయలు లొంగిపోతాయో-

క్రూరసింహాలు కూలబడిపోతాయో - వీరబెబ్బులులు బేజారెత్తి పోతాయో-


ఎవరికి ఏ ఆపద వచ్చినా , కామధేనువై -కల్పవృక్షమై -దయా సింధువై ప్రత్యక్ష

మౌతాడో -


ఎవరు న్యాయాన్యాయ విచక్షణతో ధర్మం ఖచ్చితంగా పాటిస్తారో-

ఎవరిని ప్రజలు దొంగగా పిలుస్తారో-


అతడు- అతని పేరు- ప్రభువులకు ప్రీతిపాత్రుడై , విశ్వాసమూర్తయి , మేరునగధీరుడై

ప్రజాహృదయాల్లో ప్రతిష్టు డై న - శ్రీగోన బుద్దారెడ్డి పెద్ద కుమారుడు శ్రీగోన గన్నారెడ్డి

ప్రభువు . అతడు నిజానికి కాకతీయ ప్రభువుల కోటలో చక్రవర్తికి దుర్గముగ వుండవల

సిన కార్యధురీణుడు.

గణపతిరుద్రదేవులు వృద్దాప్యంలో పడగానే -ఎందరో సామంతులు, ద్రోహులు, స్వార్థంతో కాకతీరాజ్యాన్ని పొందాలని ప్రయత్నించారు.రుద్రమదేవి సాహసం తెలియక, ఆవిడ స్త్రీ, మననేమి చెయ్యగలదన్న ధీమాతో, అజ్ఞానంతో-


ఎదురుతిరిగిన ప్రతివారినీ గన్నారెడ్డి ప్రభువులు పట్టి పాతరేశాడు.

సింహాలను సైతం కుక్కలవలె లొంగదీసుకొనినాడు.

అతను మామూల దొంగ కాదు.గజదొంగ.అతడు ఏనుగులను, సైన్యాలను, అపార

వస్తువాహనాలను, ఆఖరికి వారి సైన్యాన్ని , చివరకు వారి మానాభిమానాలని

సయితం హరించినాడు.


నేడు- అతడు మనకు ఆరాధ్యుడు.

రుద్రమదేవి చక్రవర్తిణికి కుడిభుజం.అతడు ప్రభువులకు సమర్పించుకున్న వెలలేని

కానుకలు యింకెవ్వరునూ యింతవరకు యిచ్చి వుండరు.ఇవ్వలేరు.


ఇప్పటికి కాలుదువ్వినవారు తోక ముడుచుకుని , అభాసై శృంగభంగమై ,సిగ్గుపొంది

గన్నారెడ్డి ప్రభువు పాదాలమీదతలవాల్చి వెళ్ళి పోయినారు.


నేడు రుద్రమదేవిచక్రవర్తిణి - వారికి కబురుచేసి , మహాగౌరవముతో సమాదరించి

తమ తండ్రిగారికి చెందియున్న వర్దమానపురమును పరిపాలించుకోవలసిందిగా చెప్పవలెనని నా అభిమతము.


ప్రజలలో విజయధ్వానులు-

" అదీగాక మీరు వినవలసింది యింకనూ చాలా వున్నది.


" దక్షిణాపధం నుంచి మనమీదకు దండయాత్రలకు వచ్చునవారందరినీ గన్నయ్య

ప్రభువు శృంభంగం చేయగలిగినాడు. కానీ అసూయజ్వాలలు యిప్పుడు పడమట

వైపుకు పాకింది.


నిన్నటివరకూ ప్రభువులకు ముఖ్యుడూ, నమ్మినబంటు గా వున్న సామంతుడు యాదవప్రభువు కృష్ణభూపతి దివంగతులైనారు. వారి మాటను జవదాటని వారి

పుత్రుడు మహాదేవరాజు తండ్రిగారు జీవించియుండగా నిశ్శబ్దంగా వుండి, నేడు

యుద్ద సన్నద్దులైనారు. అతడు ఓరుగల్లు కోటను ముట్టడించటానికి వురుకులు పరుగులతో ఏనాడైనా రావచ్చును. అందులకు అందరూ సిద్దముగా నుండవలెను.

ఆంధ్ర ప్రతాప పౌరుషాగ్ని ముందుతరాలకు , వీరకావ్యాలుగా , మహత్తర చరిత్ర

లుగా మిగిలిపోవలసిన కాలం ఆసన్నమైంది."


ప్రజల విజయధ్వానములు- అంగీకారముగా కేకలు వినిపించినవి.


-----------------------------------------------------

ఇంకా వుంది...

------------------------------------------------------


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


95 views0 comments

Comentários


bottom of page