శుక్లాంబర ధరం
- Srinivasarao Jeedigunta

- 1 day ago
- 3 min read

Sukhlambara Dharam - Telugu Moral Story | Jeedigunta Srinivasa Rao
శుక్లాంబర ధరం - తెలుగు నీతి కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 05/09/2026
శుక్లాంబర ధరం ఒక ఆధ్యాత్మిక నేపథ్యంతో కూడిన కుటుంబ విలువల తెలుగు కథ. వినాయక చవితి పూజ సందర్భంగా రవి తన తల్లి కుసుమ పడుతున్న శ్రమను గుర్తించి, తండ్రి నారాయణను ఒక అమాయకమైన ప్రశ్న అడుగుతాడు. మానవసేవ ఇంటి నుంచే మొదలవ్వాలి అనే సందేశాన్ని అందించే ఈ కథ ప్రతి కుటుంబానికీ ఆలోచన కలిగిస్తుంది.
"అమ్మా, ప్రతీ వినాయక చవితికీ నువ్వు, నేనే పూజ చేసుకుంటాం. నాన్నా ఎందుకు కూర్చొని పూజ చెయ్యరు?" అని వంట చేస్తున్న తల్లి కుసుమని అడిగాడు రవి.
కొడుకు వంక, వినాయకుడి వంక ఒకసారి చూసి, "మనం ఎల్కేజీలో వున్నాము. మీ నాన్నా పీహెచ్డీ చేశారు. ఆయనకు పూజలు అక్కర్లేదు, తను 'మానవసేవే మాధవసేవ' అని నమ్ముతారు" అంది.
"ముందు యింట్లో నీకు సహాయపడితే, తరువాత బయట సేవ చేయాలి కదమ్మా!" అన్నాడు రవి.
"యింట్లో పనులు చేస్తూ కూర్చుంటే మీ నాన్న ఇద్దరు పేద పిల్లలకి ఎలా చదువు చెప్పించగలరు రవి? యిప్పుడు నేను నీ చేత చక్కగా పూజ చేయిస్తాను, బాగా చదువు రావాలి అని తలుచుకో" అంది కుసుమ.
రవి ఆగిపోలేదు. అమాయకంగా చూస్తూ, "కానీ అమ్మా, నాన్న గంటలు గంటలు బయట సేవ చేస్తుంటారు కదా... రోజూ పొద్దున్నే లేచి నీకు కాస్త సహాయం చేస్తే నాన్నకి వచ్చిన నష్టమేంటి? పేద పిల్లలకి చదువు చెప్పించే నాన్న, నన్ను రోజూ బడికి సిద్ధం చేసే నీ ఓపికని ఎందుకు గుర్తించడం లేదు?" అని ప్రశ్నించాడు.
కుసుమ చేతిలోని గరిటె ఒక్కసారిగా ఆగింది. ఎప్పుడూ పూజా విధానం, మంత్రాల గురించే అడిగే కొడుకు నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఆమె గుండెల్లో ఏదో తెలియని వేదనని కదిలించాయి.
పిల్లాడు ఎదుగుతున్నాడు అనుకుంది కుసుమ, తల్లిమీద ప్రేమ, పెళ్లి అవ్వగానే ఎందుకు మాయం అవుతుందో అనుకుంది తనలో తాను నవ్వుకుంటూ.
అప్పుడే తలుపు తోసుకుని లోపలికి వచ్చిన నారాయణ ఆ మాటలు విన్నాడు. చేతిలోని సంచులను కింద పెట్టి, రవి దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చున్నాడు.
రవి తల నిమురుతూ, "రవి, ఈ రోజు నీ మాటలు నన్ను ఆలోచనలో పడేసాయిరా. నేను ఊరందరికీ మంచి చేసే క్రమంలో, నా ఇంటికి ఆదరణగా ఉన్న మీ అమ్మ త్యాగాన్ని, శ్రమని చూడటంలో విఫలమయ్యాను. దేవుడికి పూజ చేయడం కంటే, నా సేవ కంటే మీ అమ్మ నిశ్శబ్దంగా చేసే ఈ త్యాగమే చాలా గొప్పది" అన్నాడు.
"ఈ ప్రేమ నీ తల్లిదండ్రుల మీద ఎప్పుడూ ఉండాలి అని గణేష్‌ని కోరుకో. పక్కింటి అంకుల్‌ని చూసావుగా! ప్రేమగా పెంచిన తల్లిదండ్రులని 'తిన్నారా' అని పలకరించకుండా రాగానే తన గదిలోకి వెళ్ళిపోతాడు.
ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూసిన ఆ ముసలి తల్లిదండ్రులకు నిరాశ అంతే!" అన్నాడు నారాయణ కొడుకు చెయ్యి పట్టుకుని.
"అందుకే కదా నాన్నా, బామ్మగారి ఇంటికి వెళ్లి రోజూ తాతయ్యతో నేను మాట్లాడుతాను" అన్నాడు రవి.
కుసుమ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. "అదేం లేదండీ, మీ లక్ష్యం ముందు నా శ్రమ ఎంత..." అని సర్దుకోబోయింది.
నారాయణ ఆమె చేతులు పట్టుకుని, "లేదు కుసుమా, కొడుకు కళ్లు తెరిపించాడు. మానవసేవ ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఇన్నాళ్లూ నిన్ను ఈ పనుల్లో ఒంటరిని చేశాను. ఈ రోజు నుంచి నీ వంటలో, నీ ప్రతి పనిలో నేను సగభాగం పంచుకుంటాను" అని వంటగదిలోకి వెళ్ళాడు.
ఆ రోజంతా ఇంట్లో వేరే వెలుగు కనిపించింది. నారాయణ స్వయంగా కుసుమకి సహాయం చేస్తూ పాయసం కలిపాడు. రవి ఆనందంగా వినాయకుడి విగ్రహాన్ని అలంకరించాడు.
పూజ పూర్తయ్యాక రవి నవ్వుతూ, "అమ్మా! ఈ రోజు నాన్న కూడా మనతో ఎల్కేజీలో చేరిపోయారు. ఇప్పుడు మన ఇంట్లోనే అసలైన పూజ జరిగింది!" అన్నాడు.
కుసుమ ఆనంద భాష్పాలతో దేవుడికి నమస్కరిస్తూ, కుటుంబం అంతా కలిసి ఉండటమే దేవుడు ఇచ్చిన నిజమైన ఆశీర్వాదం అని మనసారా అనుకుంది.
శుభం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

















Comments