top of page

నా మది మెచ్చిన చెలికాడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Na Madi Mechhina Chelikadu' New Telugu Story

Written By N. Dhanalakshmi

రచన: N. ధనలక్ష్మి



“వావ్! ఇంటర్లో 90% రావడం అంత ఈజీ కాదు స్వేచ్ఛా .. కానీ నువ్వు సాధించావు. నెక్స్ట్ ఏమి చదవాలను కుంటున్నావు?” అడిగింది సిరి.

“సిరీ... ఇంకేమీ చదవాలి అనుకోవడం లేదు” చెప్పింది స్వేచ్ఛ.

“ఎందుకు స్వేచ్ఛా ....” ఆశ్చర్యంగా అంది సిరి.

“నాన్న ఇప్పటికే మా గురించి చాలా కష్టపడ్డారు. నేను ప్రభుత్వ కొలువులో ఏదైనా ఉదోగ్యం తెచ్చుకొని ఇంటికి కొంచం చేదోడు వాదోడుగా ఉంటూ తమ్ముడ్ని, చెల్లిని చదివించాలని అనుకుంటున్న సిరి…” అంది స్వేచ్ఛ.

“సరే నే! నీకున్న ప్రతిభకు తప్పకుండా జాబ్ తెచ్చుకుంటావ్ ఆ నమ్మకం నాకుంది..” అంది సిరి.

“అల్ది బెస్ట్ స్వేచ్ఛా. నాన్నకి ట్రాన్స్ఫర్ రావడంతో మేము గుంతకల్లుకి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు సాయంత్రమే వెళ్తున్నాము. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తుంటాను. బై …”

“బై సిరి....”

స్వేచ్ఛ నాన్న కృష్ణ ప్రసాద్ గారిది కూరగాయల వ్యాపారం. అమ్మ ఇంటి దగ్గర చిల్లర అంగడి పెట్టుకొని జీవితం కొనసాగిస్తున్నారు...

తన ఆలోచనను తల్లి, తండ్రితో పంచుకోవాలని ఎంతో అరాటపడుతు ఇంటికి చేరుకుంది స్వేచ్ఛ. ఇంటి దగ్గర కార్ ఆగి ఉంది.. లోపలకి వెళ్లి చూస్తే ఎవరో వచ్చి ఉన్నారు. తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అందరి మొహంలో చిరునవ్వు ...

తల్లి ఆత్రంగా చీర కట్టి, చేతికి కాఫీల ట్రే ఇచ్చి, వారికి ఇవ్వమ్మని చెప్పారు.. తన ఇష్టం లేకుండానే పెళ్ళి చూపులు జరిగిపోయాయి..

“ఏమి జరుగుతుంది ఇక్కడ.. వారి ముందర మాట్లాడకూడదని సైలంట్ గా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి.. నన్ను అడగకుండా ఎందుకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు?” అంటూ ఏడ్చింది స్వేచ్ఛ.

“చూడు స్వేచ్ఛ.. అబ్బాయి సొంతగా ఏజెన్సీ పెట్టుకున్నారు. పైగా ఒక్కడే కొడుకు. ఆడపడుచు పోరు కూడా ఉండదు. నువ్వు సుఖపడతావు. ఈ సంబంధం మిస్సైతే ఇటువంటి సంబంధం మళ్లీ మనకు రాదేమో..” అంటూ అమ్మ..

“తల్లి! పెళ్ళికి మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, పైగా వాళ్ళే పెళ్ళి ఖర్చులన్నీ పెట్టుకొని, ఎదురు కట్నం ఇచ్చి నిన్ను తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆ ఇంట్లో మహారాణిలాగ ఉండచ్చు” అంటూ నాన్న..

“ప్లీజ్! అందరూ కాసేపు ఆపండి....

అమ్మ, నాన్న... నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు.. నేనెప్పుడూ మీకు భారం కాను. మంచి జాబ్ తెచ్చుకొని ఆర్థికంగా మనం సిర్థపడాక పెళ్ళి చేసుకుంటాను. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి..”

“చూశారా వదిన! నేను అంటూనే ఉన్నాను..

ఆడపిల్లను ఎక్కువ చదివించకు , మన చేయి దాటిపోతారని..

మీరు వినలేదు. ఇప్పుడు చూడండి.. మీకే ఎదురుమాట చెప్తుంది” అంటూ ఎదురింటి పంకజం

“ఇదే సంబంధం మాకే వస్తే కళ్ళకి అద్దుకొని భద్రంగా కాపాడుకుంటాము.. మీ స్థాయికి ఇంత పెద్దింటి సంబంధం ఏరి కోరి వస్తుందా!” అంటూ పక్కింటి లక్ష్మి

“ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద పనులు చేసినా పెళ్ళి చేసుకొని తీరవలసిందే” అంటూ ఇరుగుపొరుగు..

తలా ఓ మాట అనేశారు.

చూడు స్వేచ్ఛ! మేము వారికి మాట ఇచ్చేశాము..పెళ్ళి చేసుకొని తీరాలి. కాదు.. చదువుకుంటాను అంటావా.. చక్కగ చదువుకో, మా శవాల మీద నడుచుకొని వెళ్ళు”అంటూ ఎమోషనల్ గా మాట్లాడి పెళ్ళికి ఒప్పించేశారు.

నిశ్చితార్థం,పెళ్ళి లో స్వేచ్ఛ వేసుకున్న డ్రెస్ నుంచి పెట్టుకున్న నగల వరకు మొత్తం పెళ్ళి కొడుకు రాహుల్ కొని తీసుకొని వచ్చారు.

ఎంతో ఆర్బాటంగా పెళ్ళి ఖర్చంతా తానే పెట్టారు.

ఆ పెళ్ళికి వచ్చిన ప్రతిఒక్కరూ స్వేచ్ఛ అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారు. ఇంకొందరు ముచ్చటైన జంట అంటు ఆశీర్వదించారు.

ఇదంతా చూసి తమ బిడ్డ ఇకపై మహారాణిలా బ్రతుకుతుందని మురిసిపోయారు స్వేచ్ఛ అమ్మ, నాన్న...

ఆ రోజు రాత్రి కార్యానికి ఏర్పాట్లు చేశారు....

‘జీవితంలో ఇక రాజీ పడాలి, తప్పదు’ అనుకొని తన ఆశయాన్ని వదులుకొని గదిలోకి అడుగుపెట్టింది.

బిడియంగా, భయంగా తలుపు దగ్గరే ఆగిపోయిన

స్వేచ్ఛను చూసి రాహుల్ నవ్వుతూ వెళ్ళి తన చేయిని పట్టుకొని అక్కడే ఉన్న చైర్ లో కూర్చో పెట్టి

తాగడానికి నీళ్ళు ఇచ్చాడు..

స్వేచ్ఛ నీళ్ళు తాగాక " ప్లీజ్! కొంచం రిలాక్స్ గా ఉండు.. ఏ ఆడపిల్ల కూడా తాళి కట్టేటప్పుడు కన్నీరు పెట్టుకోదు. అలా పెట్టుకుంది అంటే బహుశా తనకి ఈ పెళ్ళి పెద్దల బలవంతం మీద జరిగి ఉండాలి లేదా తన మనసులో ఇంకా ఎవరైనా ఉండాలి..." అన్నాడు.

“ఆయ్యో! అలాంటిది ఏమీ లేదండి.. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించి అమ్మ, నాన్నకు సాయంగా ఉండాలని అనుకున్నాను.. కానీ అవేమీ జరగలేదు. అందుకే కన్నీరు పెట్టుకున్నా తప్ప మీరంటే ఇష్టం లేక కాదు. నా పెళ్ళి అమ్మ, నాన్నలకి భారం కాకుండా చూసుకున్నారు. అప్పుడే నాకు చాలా నచ్చేశారు. కాకపోతే నా జీవిత లక్ష్యం మధ్యలోనే ఆగిపోయింది కదా! అందుకే ముభావంగా ఉన్నాను. బహుశా నా పేరులో ఉన్న స్వేచ్ఛ జీవితంలో లేదు.. ఇకపై మీరు నా లోకం. ఏమి చెప్పినా వింటాను. మీకు నచ్చినట్టుగా ఉంటాను” అని తన మనసులో మాట చెప్పి తల దించుకుంది స్వేచ్ఛ.

“నిన్ను చూడగానే నాకు తెగ నచ్చేశావు. ఈ మాటలు విన్నాక ఇంకా ఎక్కువగా నచ్చావ్. అమ్మ, నాన్నకు తోడుగా ఉండాలి అనుకోవడంలో తప్పేమి లేదు. నేను ఏమి చెప్పినా చేస్తావు గా....” అడిగాడు రాహుల్

“హా అండి.. తప్పకుండా చేస్తాను” అంది స్వేచ్ఛ.

“పరిస్థితుల వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. నిన్ను నేను చదివిస్తాను. నువ్వు జాబ్ తెచ్చుకున్న తరువాతే మన జీవితం మొదలు పెడదాము” అన్నాడు రాహుల్.

తనని అర్థం చేసుకునే భాగస్వామి దొరికినందుకు ఎంతగానో సంతోషపడింది స్వేచ్ఛ.

సరిగ్గా అప్పుడే పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి జీవో రిలీజ్ అయింది. స్వేచ్ఛ అప్లై చేసింది.. ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడింది. ఇంటి పనుల్లో రాహుల్ సాయం చేసేవాడు.

స్వేచ్ఛ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి జాబ్ తెచ్చుకుంది. జీతంలో సగభాగాన్ని తండ్రికి ఇచ్చేది.

రాహుల్,స్వేచ్ఛ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు.

స్వేచ్ఛ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం అంత తేలికగా ఉండేది కాదు. పై ఆఫీసర్ ఏమి పని చెప్పినా చేయవలసి వచ్చేది. టీ లు తీసుకురమ్మని చెప్పినా, కూరగాయలు తీసుకురమ్మని చెప్పినా, ఇంటికెళ్ళి బట్టలు ఉతకమని చెప్పినా, లంచ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పినా చేయాలి. అది వారి ఉదోగ్య ధర్మం. స్వేచ్ఛ ఎంతో ఓపికగా పని చేసేది. ఎందుకుంటే తనకి ఉద్యోగం అవసరం.

ఒక్క పక్క ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్ గా డిగ్రీ చదువుకుంది. తనకి ఓ బాబు పుట్టాడు. బాబును రాహుల్ చూసుకుంటుంటే తను అటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయింది.

ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యి టాపర్ గా నిలిచి

డిఎస్పీ గా సెలెక్ట్ అయింది. అన్నీ పత్రికల్లో తన గురించి కథనం ప్రచురితమయింది. ఎవరైతే ఒకప్పుడు కానిస్టేబుల్ అంటూ తక్కువ చేసి హేళన చేసి మాట్లాడారో, టీలు, కూరగాయలు తెప్పించుకున్నారో.. వారు ఇప్పుడు తనను చూసి సెల్యూట్ కొడుతున్నారు.

స్వేచ్ఛ అనుకున్నట్టుగానే ప్రభుత్వ కొలువులో ఉద్యోగం సాధించడమే కాకుండా తల్లి తండ్రికి సాయంగా ఉంటుంది. తమ్ముడిని చెల్లిని చదివిస్తుంది.

డీఎస్పీ అయ్యాక ఎన్నో కేసులను తన తెలివితో చాలా చక్కగా పరిష్కరించింది.. చేరిన తక్కువ కాలంలోనే మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది డిపార్ట్మెంట్లో.

స్వేచ్ఛ ను ఇంటర్వ్యూ చేయడానికి ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంతో ఓపికగా ఇచ్చింది .

మీ విజయానికి కారణం ఎవరని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా " ఇంకెవరు.. నా మది మెచ్చిన చెలికాడు మా ఆయన రాహుల్. నా కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఎన్నిటినో వదులుకున్నారు. మరెన్నిటినో తట్టుకున్నారు.ఆయన లేకపోతే నేను లేను, ఈ జాబ్ లేదు. రాహుల్ లాంటి భర్త నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం.

అర్థం చేసుకునే భాగస్వామి లభిస్తే నేనే కాదు, నాలాంటి ఆడవాళ్ళందరూ తమ లక్ష్యాన్ని సులువుగా సాధిస్తారని తన విజయానికి ముఖ్య కారణం తన భర్తేనని చాలా గొప్పగా చెప్పింది. టివిలో స్వేచ్ఛ ఇస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న రాహుల్ గర్వంగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. తన తండ్రిని చూస్తూ బుల్లి యువన్ కూడా తల్లిని చూస్తూ చప్పట్లు కొడుతూ టీవీ దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మ ముఖానికి ముద్దు పెట్టాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.


27 views0 comments

Kommentare


bottom of page