వీభోవరా - పార్ట్ 20
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Sep 19
- 6 min read
Updated: Sep 24
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 20 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 18/09/2025
వీభోవరా - పార్ట్ 20 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. మురళీ మోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయేంద్రభూపతి తో వివాహం ఇష్టం లేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు, అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు. తాను సన్యాసం పుచ్చుకుంటానని చెబుతాడు విజయ్.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 20 చదవండి..
తిరువన్నామలైని సందర్శించిన వారం రోజుల తరువాత విజయ శర్మ ఉత్తరాఖండ్ ధన్‍బాద్ దగ్గరలోని భాక్రా నది ఒడ్డున వున్న శ్రీ శ్రీ శంకర అధ్వైతేంద్ర స్వామీజీ వారి ఆశ్రమము చేరుకుంటాడు. భాక్రా నదిలో స్నానం చేసి దుస్తులు కాషాయం ధరించి ఆశ్రమంలో ప్రవేశించాడు. శిష్యులు స్వామీజీని దర్శించ వచ్చిన వారు కూర్చొని వున్నారు. స్వామీజీ ప్రసంగిస్తున్నారు. హైందవ పురాణాల గురించి విజయశర్మ మౌనంగా చివరగా ఒకవైపున కూర్చొని గురూజీ ఉపదేశాన్ని వినసాగాడు.
"శిష్యులారా! హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టికి మూలం. వారి మానవ సంతతి మరీచి. వారి భార్య కళ, వారి కుమారులు కాశ్యపుల వారే కాశ్యపమహాఋషి. వీరికి ఇరవై ఒక్క మంది భార్యలు. వీరు ప్రజాపతులైన తొమ్మిది మందిలో ఒకరు. బ్రహ్మ మానస పుత్రులు. వారిలో ప్రథముడు కశ్యపుడు. మిగిలినవారు అంగిరో మహాఋషి, క్రతువు, దక్షుడు, నారదుడు, పులస్త్యుడు, బృగుమణి ఋషి, మరీచి, వసిష్ట మహాఋషులు, స్వారోచిషి మన్వంతర కాలంలో కశ్యప మహాముని జీవించినట్లు మన పురాణాలు చెబుతాయి. కశ్యపుల వారి పేరు మీదగానే కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.
ఇప్పుడు మనము వున్నది వైవస్వత మన్వంతం. దీనికి వివస్వతుడు మనువు. ఆ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు.
కశ్యపుల వారికి ఇరవై ఒక్కమంది భార్యలు. వారిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తాత్రు, వశముని మొదలైనవారు దక్షుల వారి కుమార్తెలు. కశ్యపులకు బ్రహ్మదేవుడు విషానికి విరుగుడు చెప్పాడు. పరశురాముడు వారికి భూమినంతా దానం చేశారు. వారికి మరోపేరు అరిష్టనేమి....
కశ్యపులవారికి అదితి మూలంగా ఆదిత్యులు జన్మించారు. వారు సూర్యవంశానికి మూల పురుషులు. దాన్నే ఇక్ష్వాకు వంశంగా కొనియాడుతారు. ఆ వంశీయుడైన ’ఇక్ష్వాకు మహారాజు పేరుమీద వీరి వంశీయులైన ’రఘువు’ పేరు మీద రఘువంశంగా పేరు పొందినది. ఆ వంశజులే దశరధ మహారాజు.... శ్రీరామచంద్రుల వారి తండ్రి. కశ్యపులకు దితి వలన హిరణ్యకశిపుడు, హిరణ్యక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు. అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు, సంహ్లాద..... వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరిమ్చింది.
కశ్యపుల వారికి వినత వలన గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కస్యపులకు కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మమహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు.
తల్లి కారణంగా నాగులకు ’కద్రుజ’ అనే పేరు వచ్చింది.
కాశ్యపమహాఋషుల వారి వలననే అప్సరసలు జన్మించారు.
కశ్యపుల వారు తమ వివిధ భార్యల వలన అనేకమంది బిడ్డలు జన్మించారు.
అదితికి పుట్టినవారు దేవతలు. ఆదిత్యులు. అదితి దేవతలకు అందరికీ తల్లి కనుక ఆమె ఇంద్రునికీ తల్లి. ఆమె అవతార పురుషుడైన వామనుడికి తల్లి.
ఇక ప్రజాపతి, అతను మరీచికి కళవలన పుట్టినవాడు శ్రావణ శుద్ధో పంచమి హస్తా నక్షత్రంలో కూడి ఉన్నప్పుడు కశ్యప మహార్షి.... జయంతిని ఆచరిస్తారు. ఈయన దక్ష / ప్రజాపతి కుమార్తెలతో.... పదమూడు మందిని...... వైశ్వానరుని కుమార్తెలతో ఇరువురిని వివాహం చేసికొన్నారు.
తర్వాత దక్ష ప్రజాపతి తనకు గల మరో ఇరవై ఏడుమంది కుమార్తెలను ( అశ్వని నుంచి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రములు) చంద్రునికి ఇచ్చి వివాహము చేసెను.
మరో కుమార్తె అయిన సతీదేవి పరమశివులను వివాహమాడినది. ఆ బంధుత్వరీత్యా కశ్యపమహామునుల వారికి ఈశ్వరులు.... చంద్రుడు తోడల్లుళ్ళు అయినారు.
’దను’కు పుట్టిన వారు దానవులు. అంటే రాక్షసులు.
అలాగే ’కళ, దనయుల కుమారులు కూడా దానవులే.....
’సింహిక’కు పుట్టినవారు సింహాలు, పులులు....
’క్రోధ’కు పుట్టినవారు కోపంతో నిండిన రాక్షసులు....
’వినత’కు పుట్టిన వారు గురుడుడు, అరుణుడు....
’కద్రువ’కు జన్మించినవారు నాగులు....
’మను’కు జన్మించిన వారు మానవులు.
అయితే కశ్వపుని కుటుంబం గురించి కొంత భిన్నాభిప్రాయాలు కూడా మనకు గోచరిస్తాయి.
కశ్యపుడి భార్యల పేర్లు :
1. దితి
2. అదితి
3. దను
4. కష్ట
5. అరిష్ట
6. సురస
7. ఇళ
8. ముని
9. క్రోధావసు
10. తమ్ర
11. సురభి
12. సరమ
13. తిమి
అనే పేర్లు కలవారు భార్యలని అంటారు. (పేర్లలలో అక్షర దోషం వుండవచ్చును.)
’తిమి’ వల్ల జన్మించినవి జలచరాలు....
’సరమ’ వల్ల భయంకరమైన జంతులు....
’సురభి’ వల్ల గోవులు, గేదెలు తదితర గిట్ట (పగిలిన) వున్న జంతువులు.
’తమ్ర’ వల్ల డేగలు, గద్దలు, తదితర పెద్ద పక్షులు జననం.
హిందూ సాంప్రదాయం ప్రకారం గోత్రము యొక్క ప్రాధాన్యత అతి ముఖ్యమైనది. ముఖ్యముగా వివాహ సమయమందు వధూవరుల మూడు తరాల పెద్దలను అనగా తండ్రి, తాత, ముత్తాతలను స్మరిస్తూ గోత్ర నామాదులను ఇరువర్గీయులూ పరస్పరము తెలుపుకొనుట ఆచారము.
గోత్రము తెలియనివారు.... తమది కాశ్యప గోత్రమని చెప్పుకొనవచ్చును. అలాంటి సందర్భాల్లో నేను చెప్పు శ్లోకమును చెప్పుకొనవలయును.
మహాతపోధనులైన మాహాఋషులు ఏడుమంది. వారు (బుగు...... వసిష్టలు.... ఆంగీరసులు.... అత్రి.... పులస్య్తా.... పులహా... కర్‍తు దక్షుడు తన సంతానము అయిన దితి... అదితి.... కద్రువ... వినత.. దను... అరిష్ట.... సురస... సురభి.... తామ్ర... క్రోధనక..... ఇడ... ఖన..... ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపునకు ఇచ్చి వివాహము చేశాడు.
కశ్యపునకు అదితికి పన్నెండు మంది సంతానము కలిగిరి. వారే అదిత్యులు. వారి పేర్లు ఇంద్ర..... మిత్ర.... ధాత.... భాగ.... త్వష్ణ.... వరుణ.... అర్యమ, విపస్వరుడు.... పవిత్రుడు.... పూష.... అంఘ అను నామములతో ప్రసిద్ధి చెందిరి.
మిత్రకు, సంధ్యకు వివాహము జరిగి వారి కుమారుడుగా శని జన్మించెను.
ఒక మహాయుగము అనగా.... 43,20,000 సంవత్సరములు.
ఆ మహాయుగమున ఇప్పటివరకు మూడు యుగములు గడచినవి.
వాటిపేరు....
కృతయుగము
(సత్యయుగము) 1728000 సంవత్సరములు జనఆయుర్థాయం 1,00,000 సంవత్సరములు
త్రేతాయుగము 1296000 సంవత్సరములు జన ఆయుర్థాయం 11,000 సంవత్సరములు
ద్వాపర యుగము 864000 సంవత్సరములు జన ఆయుర్థాయం 125 సంవత్సరములు
కలియుగము 432000 సంవత్సరములు జన ఆయుర్థాయం 100 సంవత్సరములు
కలియుగము 4440 సంవత్సరములు గడిచినవి. (1938 వరకు) మిగిలియున్నది....
4,27,560 సంవత్సరములు.....
’ముని వలన దేవతలు అప్సరసలు.....
’క్రోధవసు వలన సర్పాలు, దోమలు, తదితర కీటకాలు....
’ఇళ, వలన చెట్లు పాకుడు తీగలు....
’సురస, వలన చెడు ఆత్మలు....
’అరిష్ట వలన గుర్రాల వంటి గిట్టలు పగిలను జంతువులు....
కిన్నెరలు, గంధర్వులు కూడా వారి వలననే జన్మించారని మరో పురాణం / కథ.
’విశ్వ, వలన యక్షులు....
’దితి, వలన నలభై తొమ్మిది వాయుదేవులు....
అదితి వలన 33 కోట్లమంది దేవతలు, 12 మంది అదిత్యులు పదకొండు మంది రుద్రులు, ఎనిమిది మంది వసులు జన్మించారు.
’దను వలన అరవై ఒకటి మంది పుత్రులు జన్మించారు. వారిలో పదెనిమిది మంది ముఖ్యులు.
మత్స్య పురాణం (1.171) ప్రకారం.... పైవారు కాకుండా అనసూయ వలన తీవ్రమైన వ్యాధులు; సింహక వలన గ్రహాలు; క్రోధ వలన పిశాచాలు, రాక్షసులు జన్మించారన్న లిఖతం.
అలాగే అదే మత్స్య పురాణం ప్రకారం... కశ్యపునికి తమ్రకు ఆరుగురు కుమార్తెలు జన్మించారు. వారి పేర్లు సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.....
వీరివలన కూడా ఈ భూమి మీద సృష్ట జరిగింది. ’సుభి వలన చిలుకలు, గుడ్లగూబలను, సేని, గ్రద్ధలను, గృధి వలన రాబందులు, పావురాలు, ’సుచి వలన హంసలు, కొంగలు, బాతులు; ’సుగ్రీవి వలన గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెల వంటి వాటికి జన్మనిచ్చారు.
వీరు కాకుండా కాశ్యపుల వారికి అవత్సర, అసిత అనే ఇరువురు కుమారులు వుండేవారు.
అవత్సర వలన నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వలన శాండిల్య అనే కుమారుడు జన్మించారు.
వైశ్వానరుని కుమార్తెలు, ఇరువురిలోనూ, కాల, యందు కాలకేయులను పులోమ, యందు పౌలోములును పుట్టిరి.
వీరు కాక... కాశ్యపుని కొడుకులు ఇంకనూ కొందరు కలరు. వారు పర్వతుడు అను దేవ ఋషి, విభండకుడు అను బ్రహ్మఋషి వుండిరి.
మన హైందవ జాతి, ఈ సృష్టిలో మనం చూడకలుగుతున్న ప్రతి జీవరాసి ఆ రీతిగా జన్మించినవి.
అన్ని జీవులయందు జీవుడు అదే దేవుడు వున్నాడు. అందుకే మనం మన స్వార్థానికి ఆనందానికి హింసిచేయరాదు. అందుకే మన పెద్దలు అన్నారు ’అహింసో పరమమో ధర్మహః’ అన్ని ధర్మములలో జీవులకు హింసించకుండుట పరమ అంటే గొప్ప ధర్మము. ఈ జన్మలో మనమందరం పాటించవలసినది. శ్రీ శంకర అధ్వైతేంద్ర స్వాముల వారు చెప్పడం ముగించారు. లేచి సభికులకు నమస్కరించి తన విశ్రాంత గదికి వైపుకు నడవసాగారు.
శిష్యులు వారి వారి పనులకు వెళ్ళిపోయారు. వచ్చిన అతిధులు భోజనశాల వైపుకు నడిచారు.
విజయశర్మ లేచి నిలబడి చంక క్రింద కర్రను సరి చేసుకొని నిలబడ్డాడు.
స్వామీజీ వారి చూపు విజయ్ శర్మ వైపు మరలింది. అతని స్థితిని గమనించిన స్వామీజీ చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచారు. విజయశర్మ గురూజీ ముఖంలోకి చూస్తూ చేతులు జోడించాడు.
"నీపేరు విజయశర్మ కదూ!" ప్రీతిగా అడిగారు స్వామీజీ.
అవునన్నట్లు తలాడించాడు విజయశర్మ.
"అన్ని బంధాలను తెంచుకొని వచ్చేశావు కదూ!"
"అవును స్వామీజీ. తమరు మీ ఆశ్రమంలో నాకు ప్రవేశాన్ని కల్పించాలి. జీవితాంతం మీ సేవలో ఇక్కడే వుండిపోతాను" దీనంగా చెప్పాడు విజయ్.
స్వామీజీవారు కళ్ళు మూసుకొన్నారు. కొన్ని క్షణాలు తర్వాత కళ్ళు తెరిచి విజయశర్మ ముఖంలోకి చూచి ’వీభోవరా!...’ స్వాగతంలో అనుకొని....
"నీవు ఇక్కడ ప్రశాంతంగా వుండవచ్చు. నేటినుండి నీవు కూడా నా శిష్యులలో ఒకడివి." ప్రక్కన వున్న శిష్యుడు అక్షర ముఖంలోకి చూచి "అక్షరా!..... ఇతను ఈ క్షణం నుండి నీ సొదరుడు. జాగ్రత్తగా చూచుకో!..." చిరునవ్వుతో తన కుడిచేతిని విజయ్ తలపై వుంచి ఆశీర్వదించి స్వామీజీ తన గదివైపుకు వెళ్ళిపోయాడు.
అక్షర విజయ్ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. విజయ్‍శర్మను ముందుకు నడిపించాడు. ఆ రీతిగా ఆశ్రమవాసం విజయ్ శర్మకు సంప్రాప్తించింది. ఆ రాత్రి భోజనానంతరం విజయ శర్మ, అక్షర గదిలోనే శయనించారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments