వీభోవరా - పార్ట్ 21
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Sep 24
- 6 min read
Updated: Sep 29
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 21 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 24/09/2025
వీభోవరా - పార్ట్ 21 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. మురళీ మోహన్ గారి కూతురు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. విజయేంద్రభూపతి తో వివాహం ఇష్టం లేని సింధూ ఆత్మహత్య చేసుకుంటుంది. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు, అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు. సన్యాసం స్వీకరించడానికి శ్రీ శ్రీ శంకర అధ్వైతేంద్ర స్వామీజీ వారి ఆశ్రమము చేరుకుంటాడు విజయ్.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 20 చదవండి..
ఇక వీభోవరా - పార్ట్ 21 చదవండి..
అది విజయశర్మకు ఆశ్రమంలో రెండవరోజు. తొలిరోజు స్వామీజీ వారి ప్రసంగం విజయ్‍కు బాగా నచ్చింది. వారు చెప్పే హైందవ జాతి ఉత్పన్నతను మననం చేసుకోసాగాడు. వారి వద్ద అరవైమంది శిష్యులు దేశపు నలుమూలల నుంచీ వచ్చియున్నారు. వారందరూ అప్పటికి అవివాహితులు. ఆశ్రమ జీవిత విధానం. అందరూ నాలుగు గంటలకు లేవాలి. ఒక గంట సేపు వ్యాయామం, బాణ విద్యా అభ్యాసం, కుస్తీ, చెడుగుడు, పరుగు (ఆశ్రమం చుట్టూ), తదనంతరం నదీ స్నానం (భాక్రా నది) ఆపై యోగాభ్యాసం, దైవధ్యానం.
మరుదినం శిష్యులందరూ ప్రవచన మందిరంలో ప్రవేశించారు. గురువుగారు చెప్పడం ప్రారంభించారు.
"సనాతన అద్వైత యాగ శాస్త్రంలో ఎనిమిది సంఖ్యను మాయకు సంకేతంగా చెబుతారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. అష్టసిద్ధులు అనగా ఎనిమిది రకాల సిద్ధులు. భారతీయ తత్త్వ శాస్త్రంలో ’సిద్ధి’ అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగ మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలకు (ధర్మాలకు / అవసరాలను) దాటి పోతాడన్నది సిద్ధుల వాక్యం / యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ’సిద్ధులు, సాంఖ్యం, భాగవతం, బౌద్ధం, ఈ సిద్ధులను వేరు వేరు రకాలుగా నిర్వచించినప్పటికీ ప్రచారంలో వున్నవి అష్టసిద్ధులే. వాటి ’శ్లోక రూపం’
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా, తథా.....
ప్రాప్తిః ప్రాకామ్య మిశత్వం వశిత్వం చాష్ట సిద్ధయం: అణిమ స్లోకార్థం : అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం మిశిత్వం, వశిత్వం అనే ఎనిమిది అష్టసిద్ధులు సిద్ధి అనగా శక్తిని (మనలోని) జాగృతి చేయడం. ఈ అష్టసిద్ధులు భగవంతుని అచంచల దివ్య ఆరాధనకు ఫలంగా భక్తులకు ప్రాప్తిస్తాయి. మన హిందూ పురాణాల ప్రకారం అష్టసిద్ధులు మొదట శ్రీ మహావిష్ణువు, మరియు మహాశివుని వద్ద మాత్రమే ఉండేవి. వీరి నుండి విశ్వకర్మ ఆ సిద్ధులను పొంది, తన కుమారుడైన సూర్య భగవానుడికి అనుగ్రహించాడు. ఆ తరువాత సూర్య భగవానుడు తన శిష్యుడైన శ్రీహనుమంతుల వారికి ప్రసాదించారు.
అణిమ అనగా....
అణిమ సిద్ధి మూలంగా శరీరమును అణువు కంటే సూక్ష్మంగా మార్చడం. అంటే శరీరమును మిక్కిలి చిన్నదిగా మార్చుట. శ్రీ హనుమంతులవారు లంకా నగరంలో ప్రవేశించినప్పుడు తన శరీరమును ఈ అణిమ సిద్ధిని ఉపయోగించి చిన్నదిగా మార్చారు.
మహిమ అనగా.....
మహిమ సిద్ధి మూలంగా శ్రీ అంజనాసుతులు సీతమ్మ తల్లి జాడను వెతకడం కోసం లంకకు వెళ్ళేటప్పుడు సముద్రాన్ని దాటడానికి తన శరీరాన్ని ఈ మహిమ సిద్ధిని ఉపయోగించే పెద్దదిగా మార్చారు.
గరిమ అనగా.....
గరిమ సిద్ధి అనగా శరీరపు బరువును విపరీతముగా పెంచుట.
లఘిమ అనగా....
లఘిమ సిద్ధి అనగా శరీరమును అతి తేలికగా చేయుట. ఈ స్థితిని ఉపయోగించి వాయు మార్గంలో తేలుతూ ప్రయాణించవచ్చు. నీటిపై నడవవచ్చు.
ప్రాప్తి అనగా....
ప్రాప్తి అనగా పొందటం. ఈ స్థితి వలన దేనినైనా, ఏ వస్తువునైనా పొందవచ్చును.
ప్రాకామ్యం అనగా.....
ఈ స్థితి వలన దూరదర్శనము, దూర శ్రవణము (వినడం) వంటి దివ్య శక్తులను పొందవచ్చు. అనగా మనమున్న చోటు నుండే ఇతర ప్రాంతములలో ఏమి జరుగుచున్నదో చూడవచ్చు. అక్కడి వారి మాటలను వినవచ్చు.
ఈశత్వం అనగా.....
ఈ సిద్ధి ద్వారా ఎవరినైనా, దేనినైనా అధికారముగా పొందవచ్చు.
వశీత్వం అనగా....
ఈ సిద్ధి వలన అన్ని భూతములను, జీవులను లోబరచుకొనవచ్చును. అంటే సకల జీవరాశులు వారు (సిద్ధులు) చెప్పినట్లు ప్రవర్తిస్తాయి.
ఈ సిద్ధులను అష్టాంగ యోగ పద్ధతి ద్వారా సాధన చేసి కుండలినీ జాగృతం చేయడం ద్వారా పొందవచ్చు. అయితే, ఈ పద్ధతిలో కుండలినీ జాగృతి చేయడం అన్నది అంత సులువు కాదు. దీనిని అర్హులైన గురువు సమక్షంలో మాత్రమే సాధన చేయాలి అని మన శాస్త్ర విదితం.
ఈ సిద్ధులను భక్తి యోగం, జ్ఞాన యోగం ద్వారా కూడా పొందవచ్చు. తరువాత అశం కుండలీని యోగ. అనగా అనిర్వచనీయమైన శక్తి. కుండలిని అనేది వెన్నుపాము (పూస) దాగి ఉంటుంది. మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొని వెళ్ళే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ.
కుండలినీ యోగలో కుండలిని జాగృతి చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమార్గం. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి. రెండవది గతి శక్తి.
శరీరంలోని ప్రాణశక్తి గత శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పామువలె చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతి చేయవచ్చు.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వార్గాలను, జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
కుమ్డలినీ శక్తిని జాగృతి చేయడానికి ముందు, దేహశుద్ధి (Purifiation of Body), నాడీ శుద్ధి (Purification of mino) బుద్ధి శుద్ధి అవసరం/ జరగాలి.
నిద్రాణంగా వున్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతి చేసినప్పుడు, అది ఊర్థ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ, తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన ’సమాధి స్థితి’గా పేర్కొంటారు యోగులు.
ఈ స్థితిలో సాధకునికి (ఆచరించువారికి) ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ (బాధలు దుఃఖములు) తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతారు.
సప్త చక్రాల వివరణ (ఆరు చక్రాలు)
వెన్నెముకలో ఉండే చక్రాలు ప్రధాన వ్యాసము : సప్త చక్రాలు మన శరీరంలోని వెన్నుపూస (వెన్నెముక)లోనున్న ప్రదేశాలు.
మొదటిది మూలంధార చక్రము : (ఈ చక్ర అధిష్టాన దేవత సిద్ధ విద్యాదేవి) గుద స్థానమునకు పైన, లింగ స్థానమునకు క్రిందిగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము (ఎరుపు), కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజమంత్రం ’లం’. మూలాధార చక్రమున గల కమల కర్ణికయందు దివ్యసుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమ ప్రభమగు స్వయం భూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామర తూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొని యున్నదనియు వివిధ తంత్రముల వివరణ.
రెండవది స్వాధిష్టాన చక్రము :- లింగ మూలమున కలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వకమలము గలది. దీని బీజమంత్రవం. ’వం’
మూడవది మణిపూరక చక్రము :- నాభి మూలమందు గలదు. పది దళములు కలిగి నీలవర్ణము గల అగ్నితత్వకమలము. దీని బీజ మంత్రం ’రం.’
నాల్గవది అనాహత చక్రము :- హృదయ స్థానమున గలదు. పండ్రెండు దళములు కలిగి, హేమ వర్ణముగల వాయు తత్వకమలము. దీని భీజమంత్రము. ’యం’.
ఐదవది విశుద్ద చక్రము :- కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణముగల ఆకాశతత్వ కమలము. దీని భీజ మంత్రము,’హం.’
ఆరవది ఆజ్ఞా చక్రము :- భ్రూ (కనుబొమల) మధ్యమున ఉన్నది రెండు వర్ణములతో కూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజమంత్రము ’ఓం’
ఏడవది సహస్రారక చక్రము :- బ్రహ్మ రంధ్రమునకు అధోముఖయుగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితియగు పరబిందువు చుట్టును మాయ కలదు. ఆత్మ జ్ఞానమును సాధించిన పరమహంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివ స్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీ (జగన్మాత) భక్తులు దేవీ స్థానమనియు చెప్పెదరు. ఈ స్థానమును ఎరిగిన నరునకు పునర్జన్మ లేదు.
సప్త చక్రాలు :- శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవునియందు పై ఏడు చక్రములు ఉండును."
గురూజీ చెప్పడం ఆపారు. ఆరోజు విజయశర్మ ముందు వరుసలో ఒక చివరన కూర్చున్నాడు. స్వామీజీ విషయాలను చెప్పేటప్పుడు ప్రతి శిష్యుడినీ గమనించేవారు. వారి ఏకాగ్రతను పసికట్టేవారు.
ఉపన్యాసం (బోధ) ముగిసిన తరువాత వారి దృష్టిలో ఎవరు అనాసక్తితో వర్తించారో వారిని పోనీయకుండా ఆగమనేవారు. మిగతావాళ్ళు వెళ్ళిపోయేవారు.
వారంతా వెళ్ళిన తర్వాత ఉండమన్న వారిని దగ్గరకు పిలిచేవారు.
"ప్రియ శిష్యులారా! ఏ పనికైనా ఏకాగ్రత అవసరం. వినడం అన్నది అభ్యాసానికి అంటే నేర్చుకొనేదానికి చాలా ఉత్తమమైన మార్గం. పరధ్యానం, మనస్సున ఏదో తలచుకోవడం వలన నేను చెప్పే విషయాలను మీరు అర్థం చేసుకోలేరు. గ్రహించలేరు. ఈరోజున మీ నలుగురు అనాసక్తులుగా శరీరాలను నాముందు వుంచి, మీ మనస్సును ఎటెటో సంచరింప జేశారు. అది ఆశ్రమ వాసులకు అనుచితం. గురువుయందున వారి మాటలయందున ఆసక్తి చూపాలి. శ్రద్ధగా అన్యమనస్కులు కాకుండా వినాలి. ఈనాటి తప్పును మరోసారి చేయకండి. మీ ముగ్గురూ వెళ్ళండి."
ఆ నలుగురిలో విజయశర్మ ఒకడు.
వారు వెళ్ళిన తరువాత చిరునవ్వుతో విజయశర్మ ముఖంలోకి చూచాడు.
"విజయ్! ఇలారా!"
వినయంగా విజయ్ వారిని సమీపించాడు.
"నీ ఏకాగ్రత అద్వితీయం. నేటినుండి నీవు నా ప్రియశిష్యుడవు. నా గదిలో నా ప్రక్కన శయనిస్తావు" నవ్వుతూ చెప్పారు గురూజీ.
విజయవర్మ వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొన్నాడు. స్వామీజీ వీదించారు. "వీభోవరా!.... విజయోస్తు..."
ఆ రీతిగా విజయశర్మ ఆశ్రమంలో స్థిరపడిపోయాడు. 46 వసంతాలు గడిచిపోయాయి.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments