top of page

వీభోవరా - పార్ట్ 22

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

ree

Veebhovara - Part 22 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 29/09/2025

వీభోవరా - పార్ట్ 22 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.

అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు, అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు. సన్యాసం స్వీకరించడానికి శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ వారి ఆశ్రమము చేరుకుంటాడు విజయ్. విజయ్ ను ప్రధాన శిష్యుడిగా ఉండమంటాడు స్వామీజీ. 

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



ఇక వీభోవరా - పార్ట్ 20 చదవండి.. 

ఇక వీభోవరా - పార్ట్ 22 చదవండి.. 


"స్వామీజీ!....." సబ్ ఇన్స్ పెక్టర్ త్రిపాఠి పిలుపు.


విజయేంద్ర స్వామీజీ వారు తొట్రుపాటుతో కళ్ళు తెరిచారు. ఇరవై నాలుగు సంవత్సరాల బాల్యం. నలభై ఆరు సంవత్సరాల ఆశ్రమవాసపు జ్ఞాపకాలు చెదిరిపోయాయి.

శిష్యులు శివానంద, కేశవానందలు స్వామివారిని సమీపించారు. 


"త్రిపాఠి సార్ వచ్చారు గురుదేవా!" చెప్పాడు శివానంద.


"లోనికి పిలువు శివా!" 


శివా బయటికి వెళ్ళాడు.

"పాత జ్ఞాపకాలు వేకువనే నిద్రలేవనీయ్యలేదు!" స్వగతంలో అనుకొన్నారు విజయేంద్ర స్వామీజీ వారు.


ముందు శివానంద, వెనుక త్రిపాఠి లోనికి వచ్చారు.

"నమస్తే స్వామీజీ!"


"పరమేశ్వరార్పణమస్తు, కూర్చోండి త్రిపాఠిగారు"


త్రిపాఠిగారు స్వామివారి పడకకు వ్యతిరేక దిశలో వున్న ప్లాప్ టక్ కుర్చీలో కూర్చున్నారు.


కేశవానంద సాయంతో స్వామీజీ లేచి త్రిపాఠి ప్రక్కన వున్న కుర్చీలో కూర్చున్నారు.

"చెప్పండి సార్!...." అడిగారు స్వామీజీ.


"కాశ్యప శర్మ గారిని చంపిన వాళ్ళ ఆచూకి తెలిసింది. వారు ఈ ప్రాంతపు వారు కాదు. మధ్యప్రదేశ్ నుంచి నలుగురు వచ్చారు. అక్కడ వీళ్ళది పెద్ద ముఠా. దేశంలో ఎక్కడైనా కాశ్యపశర్మ గారిని చేసినట్లు చేయాలంటే కొంతమొత్తం డబ్బును మాట్లాడుకొని మూడువంతులు అడ్వాన్స్ తీసుకొని, పని ముగించాక మిగతా నాలుగో వంతు తీసుకొంటారట. నా స్నేహితుడు ఎస్.ఐ ముకుంద్ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. అతని మూలంగా నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను."


"త్రిపాఠిసార్! అంటే ఆంధ్రాప్రాంతంలో ఎవరో దీనికి మూల పురుషులై వుండాలిగా!"


"తప్పకుండా సార్ వుండి తీరాలి."


"విచారించగలరా!"


"తప్పకుండా సార్! నేను రేపు హైదరాబాద్ వెళుతున్నాను. రేపు పేపర్లలో కాశ్యప శర్మ గారి హత్యను గురించిన వివరాలు తప్పక ప్రచురిస్తారు. కనీసం ఒక వారం ఇది హాట్ న్యూస్ అవుతుంది. ఆ సమయంలో నేను అక్కడ వుంటే ఏదైనా సమాచారం వినగలనని నా ఆశ. ప్రయత్నే ఫలి అన్నారు కదా స్వామీజీ, మీలాంటి పెద్దలు!....." చిరునవ్వుతో చెప్పాడు త్రిపాఠి.


"ఆ కాయాన్ని మా జార్ఖండ్ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లు చేశారు కదూ!..."


"చేశాను సార్! బై రోడ్ అంబులెన్స్ లో ఇరువురు పోలీసులతో పంపుతున్నాను. ముఫ్ఫై గంటలలోపల ఆశ్రమానికి చేరుతుంది. తమరి ప్రయాణం ఎప్పుడు స్వామీ!" వినయంగా అడిగాడు త్రిపాఠి.


క్షణం తర్వాత......

"స్వామీజీ! నా బృందంలో ఇద్దరు సీనియర్ కానిస్టేబుల్స్ ను కూడా మధ్యప్రదేశ్ పంపుతున్నాను. వారు వెళ్ళి, నా మిత్రుడు ముకుంద్‍ను కలుస్తారు. బహుశా నా మిత్రుని సాయంతో వారు కొంత సమాచారాన్ని సేకరించవచ్చు."


"మంచిది. మీరు మా ప్రయాణ విషయంలో అడిగారుగా.. ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరుతాం. రేపు ఒకటి రెండు గంటల మధ్య ఆశ్రమాన్ని చేరుకుంటాం."


"హైదరాబాద్ నుండి ఆంధ్రా ప్రాంతాలలో విచారించి నేను తమరి ఆశ్రమానికి వచ్చి సేకరించిన అన్ని విషయాలు తమరికి తెలియజేస్తాను స్వామీజీ!..."


"అలాగే!.... త్రిపాఠి...."


త్రిపాఠి లేచి నిలబడి స్వామీజీకి నమస్కరించాడు.


శిష్యుడు శివానంద త్రిపాఠికి ఆశ్రమ అడ్రస్‍ను ఇచ్చాడు. త్రిపాఠి వెళ్ళిపోయాడు.

’దైవ నిర్ణయం చాలా విచిత్రం. నలభై ఆరు సంవత్సరాల తరువాత సోదరుడు కాశ్యప్ శర్మ కాశీకి నేను వచ్చినప్పుడే రావడం, ఒక్క బసలోనే వుండి కలిసి మాట్లాడుకోలేక పోవడం, గంగా మాత ఒడిలో దూరంగా ఒకే సారి మునగడం, తుపాకుల ప్రేలుడు, కాశ్యప శర్మ మరణం, అంతా చిత్రం విచిత్రం" అనుకొన్నారు స్వామీజీ మనస్సున విచారంగా....

"కేశవానందా!...."


"గురూజీ చెప్పండి."


"నీవు ఆంధ్రాలోని విశాఖపట్నం వెళ్ళి చివరగా కాశ్యప శర్మ ఏ ప్రాంతంలో ఏ హోదాలో పనిచేశాడు? ఉద్యోగ ధర్మంలో అతనికి ఎలాంటి పేరు వుంది? అతనికి ఎవరెవరు శత్రువులు? అతన్ని అంతం చేయించడం ఎవరికి ఎందుకు అవసరం? అన్న విషయాలను వీలున్నంత వరకు సేకరించి ఆశ్రమానికి రా!.."


"చిత్తం గురుదేవా!"


"శివానందా!"


"గురూజీ!"


"మరలా ఈ జీవితంలో నేను ఈ మహాక్షేత్రానికి రాగలనో లేదో చివరిసారిగా జగత్ మాతా పితలను దర్శించాలని వుంది!" అభ్యర్థనగా అడిగాడు స్వామీజీ.


"అలాగే స్వామీజీ!"


ముగ్గురూ బయలుదేరి వీధిలోకి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ నిర్మల్ శర్మ జీప్‍తో వచ్చి దిగి స్వామీజీకి నమస్కరించాడు.


"స్వామీజీ! బాస్ ఆజ్ఞ. మిమ్ములను స్టేషన్ చేర్చే వరకు నన్ను ఈ వాహనంతో తమరి సేవలో వుండమన్నారు. తప్పుగా అనుకోకండి, అడుగుతున్నాను. ఎక్కడికో బయలు దేరుతున్నట్లుగా..." నిర్మల్ శర్మ పూర్తి చేయకముందే.....

"ఆలయానికి సార్!" చెప్పాడు శివానంద.


"పరమానందం గురూజీ. స్వాములూ జీప్‍లో కూర్చోండి. వెళదాం" ఆనందంగా నవ్వుతూ అన్నాడు నిర్మల్ శర్మ. 


ముగ్గురూ జీప్ ఎక్కారు. జీప్ ఇరవై నిముషాల్లో ఆలయం పరిసరాలను సమీపించింది. అక్కడినుండి ఏ వాహనాలు ముందుకు పోలేవు. మార్గం వెడల్పు చాలా తక్కువ. జీప్ దిగి నలుగురు మెల్లగా నడిచి ఆలయాన్ని చేరారు. గంగా నదిలో స్నానం చేశారు. జగత్ మాతా పితలను దర్శించారు. శివయ్యకు పాలాభిషేకం చేశారు. మెల్లగా వాహన ప్రదేశానికి చేరి జీప్‍లో కూర్చున్నారు.


నిర్మల్ శర్మ జీప్ స్టార్ట్ చేశాడు. ఇరవై నిముషాల్లో బసకు చేరారు. వేకువనే శివానంద తయారుచేసిన అల్పాహారాన్ని ఆరగించారు. లగేజిని జీపులో వుంచారు. కూర్చున్నారు. అరగంటలో జీప్ రైల్వే స్టేషన్‍కు చేరింది. గురుశిష్యులు బోగీలో ఎక్కారు. రైలు కూడా కూసింది. నిర్మల్ శర్మ వారికి వినయంగా నమస్కరించాడు. రైలు బయలుదేరింది. 

స్వామీజీ శ్రీ విజయేంద్రులకు వారి ఆశ్రమవాసం గుర్తుకువచ్చింది. 


విజయశర్మకు వారి గురుదేవులు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ రెండు సంవత్సరాలు తరువాత విజయశర్మ ఆశ్రమ విధులను నిర్వాణ విషయంలో వారు బోధించు విషయాలను గ్రహించిన తీరుకు సంతసించి శిష్య కూటమి ముందు....


"ప్రియ శిష్యులారా!.... నేటికి విజయశర్మ మన ఆశ్రమవాసిగా మారి రెండు సంవత్సరాలైంది. అతని ఆశ్రమ వర్తనం నాకు మహదానందాన్ని కలిగించింది. ఈనాటి నుంచీ విజయశర్మ పేరు శ్రీ విజయేంద్ర స్వామీజీ. వారు న ప్రియ ఏకలవ్య శిష్యుడు. మీరంతా అతని సూచనలను గౌరవించాలి. పాటించాలి. నా తరువాత ఈ ఆశ్రమానికి వారసులు శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు" మహదానందంతో శ్రోతలకు తెలియజేశారు శ్రీ శంకర అధ్వైతేంద్ర స్వామీజీ వారు.


శిష్యులందరూ కరతాళ ధ్వనిని చేశారు. శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు వారందరికీ నమస్కరించారు. గురుదేవుల పాద పద్మాలను తాకారు. వారు ప్రీతితో విజయేంద్ర స్వామీజీ వారి భుజాలు పట్టుకొని లేపి తన హృదయానికి హత్తుకొన్నారు. మనసారా దీవించారు. కుశాగ్ర బుద్ధిగల విజయేంద్రకు ఎన్నో విషయాలను నేర్పారు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ.


కాలం ఎంతో ప్రశాంతంగా ఎనిమిది వసంతాలను ఆశ్రమ వాసులకు చూపించింది. అప్పటికి శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామి వారి వయసు తొంభై రెండు.

ఆ రోజు ప్రాతఃకాల విధులన్నింటినీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ నిర్వర్తించి శ్రీ విజయేంద్ర స్వామీజీ వారిని దగ్గరకు పిలిచారు. అది వారి గది వారిరువురే వున్నారు.

"వత్సా!....."


"గురూజీ!..."


"నాకు అవతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైనది. అది ఆ సర్వేశ్వరుల నిర్ణయం. విజయేంద్రా! బాధపడకు. వ్యవధి మరికొన్ని గంటలే. మన కలయికా విడిపోవడం అంతా, ఆ సర్వేశ్వర నిర్దేశం. ధైర్యంగా కావలసిన ఏర్పాట్లును చేయించు విజయేంద్రా!...." ఎంతో ప్రశాంత చిత్తంతో పలికారు గురుదేవులు.


విచారవదనంతో విజయేంద్ర స్వామీజీ తల ఆడించారు. శ్రీ విజయేంద్ర స్వామీజీ వారి నయనాలలో కన్నీరు....

"గురూజీ!..." గద్గద స్వరంతో పలికారు.


"విజయేంద్రా!.... నీవు కలత చెందకూడదు. గురువు ఆజ్ఞను పాటించాలి. నీ సోదరులను ఊరడించాలి. ఆశ్రమ విధులు యధాతథంగా జరిగేలా చూడాలి సరేనా!"


కన్నీటిని తుడుచుకొని.... "చిత్తం గురుదేవా!..." ఎంతో వినయంగా చెప్పారు శ్రీ విజయేంద్ర స్వామీజీ.


"వెళ్ళి స్నానం చేసిరా!" గురువుల ఆదేశం.


శ్రీ విజయేంద్ర స్వామీజీ భద్రానదిలో స్నానం చేసి దుస్తులు మార్చుకొని గురువు గారిని సమీపించి చేతులు కట్టుకొని విచారంగా నిలుచున్నారు. శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ శిష్యుని దగ్గరకు పిలిచారు. వారి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన నోటిని విజయేంద్రుల చెవి దగ్గరకు చేర్చి ఏదో ముఖ్యమైన మంత్రోపదేశం చేశారు పదినిమిషాలు.


"ఆ మంత్రాన్ని నిత్యం 108 సార్లు త్రికాలములయందున జపించు విజయేంద్రా!.... లోకంలో ధర్మ రక్షణకు అధర్మ నిర్మూలనం అత్యవసరం. అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆ మంత్రాన్ని ఉపయోగించు. సభ్య సమాజంలో సత్య ధర్మాలను రక్షించి, నీ చివరి దశలో ఆనాడు నీకు ప్రితిపాత్రుడైన నీ శిష్యునికి ఉపదేశించు. కలియుగం వున్నంతకాలం సత్య ధర్మ రక్షణను చేయడం మనలాంటి వారి ధర్మం. అర్థం అయ్యిందా వత్సా!..." చిరునవ్వుతో ప్రీతిగా అడిగారు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ.


"చిత్తం గురుదేవా!..." ఎంతో వినయంగా చెప్పారు విజయేంద్రులు.


ఆశ్రమానికి పడమటి వైపున పెద్ద వేపచెట్టు ఉంది ఇరువురూ అక్కడికి వచ్చారు.

"విజయేంద్రా! ఇదే నా సమాధి స్థలం. వేపచెట్టు ముందలి ఖాళీస్థలాన్ని చూపించారు గురుదేవులు.


విచారవదనంతో తలాడించారు శ్రీ విజయేంద్ర స్వామీజీ.


ఇరువురూ ఆశ్రమంలో ప్రవేశించారు. గురువుగారు శయనించారు. వారి పాదాల ప్రక్కన కూర్చొని మెల్లగా నిమరసాగారు శ్రీ విజయేంద్రులు. గురువుగారి శ్వాస ఆగిపోయింది. బావురుమని ఏడ్చాడు శ్రీ విజయేంద్రులు. శిష్యులందరి పరిస్థితి అదే!.... ఆశ్రమం విషాద సాగరంలో మునిగిపోయింది. గురువుగారు కోరిన స్థలంలో వారి సమాధి వెలిసింది. 


=======================================================================

ఇంకా వుంది..

వీభోవరా - పార్ట్ 23 త్వరలో

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page