top of page
Original.png

వీభోవరా - పార్ట్ 23

Updated: Oct 11, 2025

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా


Veebhovara - Part 23 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 06/10/2025

వీభోవరా - పార్ట్ 23 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. 

అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. విజయ్ శర్మ పైన కక్ష కట్టిన దుర్గారావు, అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు. ఆ దిగులుతో రామశర్మ దంపతులు మరణిస్తారు. సన్యాసం స్వీకరించడానికి శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ వారి ఆశ్రమము చేరుకుంటాడు విజయ్. 

విజయ్ ను ప్రధాన శిష్యుడిగా ఉండమంటాడు స్వామీజీ. తన నిర్యాణానికి ముంది విజయ్ కు శక్తివంతమైన మంత్రోపదేశం చేస్తాడు. గతంనుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యప శర్మ హత్య కేసు దర్యాప్తు వివరాలు ఎస్. ఐ త్రిపాఠి ద్వారా తెలుసుకుంటాడు. 


గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక వీభోవరా - పార్ట్ 23 చదవండి.. 


ప్రముఖ వ్యాపారవేత్తలు దుర్గారావు అతని మిత్రులు.. ముస్తఫామున్న (నిక్ నేమ్ ML. MM), వారి రైట్ హ్యాండ్ కలకత్తా ఖాన్ (కలకత్తా), రొయ్యల రోశమ్మ (నిక్ నేమ్ ML. RR), వారి రైట్ హ్యాండ్ రాణిపేట రంగా (మద్రాస్), వజ్రాల వరహాలు (నిక్ నేమ్ Mr. VV), వారి రైట్ హ్యాండ్ బాంబే బాబా (బొంబాయి), సాల్మన్ శాస్త్రి (నిక్‍నేమ్ Mr. SS), వారి రైట్ హ్యాండ్ బద్వేల్ బాలమ్మ (విశాలాంద్ర) తమ శత్రువు అయిన కాశ్వప్ శర్మ చావుకు పరమానందంగా పార్టీ జరుపుకొన్నారు. 


వీరికి కాల్‍సన్ - ఇంగ్లండ్, (నిక్ నేమ్ ks) అల్లామియా - అరేబియా (నిక్ నేమ్ Am) పఠాన్ బాబా పాకిస్తాన్ కూడా వారికి వ్యాపార భాగస్వాములు. వీరు నిర్వహించే వ్యాపారాలు హైందవాలయాల విగ్రహాల దొంగతనం, యుక్త వయస్కులైన పేద ఆడపిల్లల అమ్మకం, నకిలీ నోట్లు చెలామణి, భారతదేశంలో ఫారిన్ డ్రగ్స్ విక్రయం. 


విశాలంధ్ర రాష్ట్రంలో కాశ్యప శర్మ IPS ముగించి, డిప్యూటి సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్‍గా (DSP) డ్యూటీలో గుంటూరులో ప్రవేశించిన నాటి నుండి (ప్రవేశం 1927) ఎక్కడ ఎలాంటి హత్యాచారాలు జరిగినా భయం అనేది లేకుండా సాహసంతో ధర్మ రక్షణకు కర్తవ్య నిర్వహణ చేసినవాడు కాశ్యప శర్మ. 


మూడేళ్లలో అసిస్టెంట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ మరో ఐదేళ్ళలో అడిషినల్ సూపరిటెండెంట్‍గా, పన్నెండేళ్ల సర్వీస్‍కు సూపరిటెండెంటన్ ఆఫ్ పోలీసుగా ఎదిగిన పక్కా పోలీస్ కాశ్యప్. 


తరువాత కాలంలో రాజకీయ నాయకుల కులతత్వ లలూచీ కారణంగా ప్రమోషన్స్ రాకపోయినా, తన విద్యుక్త ధర్మంలో ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. 


ఆ తరువాత ఇన్స్ పెక్టర్ జనరల్‍గా పనిచేస్తున్న కాలంలో దుర్గారావు కుమారుడు యూత్ కాంగ్రెస్ సభ్యుడు అయిన భీమారావు (జూనియర్ తాతగారి పేరు) సినిమా హాలు నుండి ఇంటికి వెళుతున్న ఒక యువతి (వింధ్య)ని బలవంతంగా కార్లో త్రోసి వూరికి దూరంగా వున్న వారి గెస్ట్ హౌస్‍కు తీసుకొని వెళ్ళి అతను అతని మిత్రుడు శ్రీహరి కలిసి రేపు చేసి, చంపి రైల్ ట్రాక్ మీద పడేశారు. 


ఆ దృశ్యాన్ని చూచిన కాశ్యప్ శర్మ అతన్ని అరెస్టు చేయించాడు. జైల్లో త్రోశాడు. 


ధనబలం, పదవీ బలం వున్న దుర్గారావు కొడుకును బెయిల్ మీద విడిపించాడు. 


కోర్టులో కేసు.. అది క్రిమినల్ కేసు.. 

వాయిదాల మీద వాయిదాలు.. 


చనిపోయిన వింధ్య తండ్రి పరంధామయ్య సోదరుడు సురేష్ కోర్టు లాయర్ చుట్టూ తిరగలేక వేసారిపోయారు. 


పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ సాగించాలంటే అనారోగ్య కారణంగా జూనియర్ భీమారావు అతని తరుపున వారు కోర్టుకు హాజరయ్యేవారు కాదు. వారి వాదనకు అనుకూలంగా పరంధామయ్య సాక్షులను సమకూర్చలేకపోయాడు. డిఫెన్స్ లాయర్ పరంజ్యోతి చేయి పైచేయి అయ్యింది. 


ప్రేమ విఫలమైనందు వలన అంటే తన ప్రేమికుడు తనను నిరాకరించిన కారణంగా అవమానం, బాధ భరించలేక వింధ్య రైలు క్రింద పడి ఆత్మహత్య చేసికొందని, ఆమెకు జూనియర్ భీమారావు ఎలాంటి సంబంధం లేదని వాదించి, కేసును కొట్టివేయ వలసినదిగా జడ్జిగారిని కోరారు డిఫెన్స్ లాయర్. 


పబ్లిక్ ప్రాసిక్యూటర్ తగిన సాక్ష్యాధారాలతో జడ్జిగారి ముందు వాదించలేక పోయాడు. తన ఆఫీసులో సాక్ష్యం చెబుతామని పరంధామయ్యతో కలిసి వచ్చినవారు, దుర్గారావు రౌడీల బెదిరింపులకు భయపడి సాక్ష్యాన్ని చెప్పేదానికి కోర్టుకు హాజరు కాలేదు. కోర్టులో జరిగిన వాదోపవాదాలను విన్న కాశ్యపశర్మ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. 


ఆరోజు జూనియర్ భీమారావు, అతని స్నేహితుడూ కలిసి వింధ్యను బలవంతంగా కార్లో తోసి వేగంగా ఎటో వెళ్ళిపోయారని, తాను వారిని ఫాలో చేసినా, వారు ఎటు వెళ్లారో గమనించలేకపోయానని, వింధ్య మరణానికి జూనియర్ భీమారావే కారణం, నేను బలవంతంగా జూనియర్ భీమారావు వింధ్యను కార్లోకి త్రోయడం నేను చూచానని జడ్జీగారి ముందు సాక్ష్యం చెప్పాడు కాశ్యప శర్మ. జడ్జీగారు జూనియర్ భీమారావు ఆ జన్మ కారాగార శిక్ష ఐదు లక్షల జరిమానాను తీర్పుగా చెప్పారు. 


బీమారావు జూనియర్ జైలుపాలైనాడు. కేసు హైకోర్టుకు మార్చాడు దుర్గారావు. బెయిల్స్ మీద బయటికి వచ్చాడు జూనియర్ భీమారావు. కాశ్యపశర్మ కారణంగా దుర్గారావు అవమానం పాలైనాడు. ఆవేశంతో పగ ప్రతీకార వాంఛతో రగిలిపోయాడు. 


మధ్యప్రదేశ్ గోరక్ పూర్ నుంచి రౌడీలను పిలిపించాడు. కాశ్యప్ శర్మను వారికి చూపించాడు. సర్వీస్ అక్‍టెన్‍షన్‍లో వున్న కాశ్యప శర్మ (ఇన్స్ పెక్టర్ జనరల్) ను తన పరపతితో పదవి నుంచి తొలగించాడు దుర్గారావు. 


ఆ దుండగులు కాశ్యప్ శర్మను సన్యాసుల వేషంలో ఫాలో చేసి కాశీలో కాల్చి చంపారు. తన కోరిక నెరవేరినందుకు తన మిత్రులందరినీ ఆహ్వానించి ఘనంగా పార్టీని జరిపాడు ఆ దుర్గారావు. 


అండర్ గ్రౌండ్ బిజినెస్ చేసేవారందరికీ పరమానందం కలిగింది. కొందరు పోలీస్ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో పోటీపడితే కాశ్యపశర్మ స్థితే తమకూ సంభవిస్తుందేమో అనే భయం ఏర్పడింది. 

*

ఆశ్రమానికి శ్రీ విజయేంద్ర స్వామీజీ అతని శిష్యుడు కేశవానంద చేరారు. కేశవానంద కాశీలో కాశ్యప్ బసచేసిన గదిలో వారి సామాగ్రిని పరిశీలిస్తున్న సమయంలో దొరికిన డైరీని గురువుగారికి ఇచ్చాడు. వారు చేరిన ఎనిమిది గంటల తర్వాత కాశ్యప్ మృతదేహం ఆశ్రమానికి చేరింది. 


సురక్షిత స్థలంలో కాశ్యప శర్మ మృతదేహాన్ని వుంచాడు శ్రీ విజయేంద్ర స్వామీజీవారు. 


కాశ్యపశర్మ డైరీలోని పేజీలను పరీక్షగా తిలకించారు స్వామీజీ. అన్ని పేజీలలోని విషయాన్ని చదివారు. ఆ వ్రాతలలో స్వామీజీకి గొచరించిన పేర్లు, దుర్గారావు, అతని హితులు, ముస్తఫామున్నా, అతని హితుడు కలకత్తా ఖాన్, రొయ్యల రోశమ్మ, వారి హితుడు రానీపేట రంగా.. వజ్రాలవరహాలు, వారి హితుడు బాంబే బాబా, సాల్మన్ శాస్త్రి, వారి హితుడు బద్వేలు బాలమ్మ, వీరేకాక, కాల్ సన్ ఇంగ్లడ్, అల్లామియా అరేబియా, పఠాన్ బాబు పాకిస్థాన్. 


వీరు నిర్వర్తించే వ్యాపారాలు, హైందవ ఆలయాల విగ్రహాల దొంగతనం.. యుక్తవయస్కులైన పేద ఆడపిల్లల విక్రయం.. నకిలి నోట్లు చెలామణి దేశంలో ఫారన్ డ్రగ్స్ విక్రయం. 


శ్రీ విజయేంద్ర స్వామీజీ వారికి కాశ్యపశర్మకు సంబంధించిన అన్ని విషయాలు అవగతమైనాయి. అతని విరోధులు ఎవరో, అతని మరణానికి కారకులు ఎవరో గ్రహించాడు శ్రీ విజయేంద్ర స్వామీజీ. 


ఆ సమయం శ్రీ స్వామీజీ వారు తన శిష్యులు ఉపదేశాలను వివరించే సమయం. 

శిష్యుడు శివానంద వచ్చాడు. 


"స్వామీజీ! అందరూ బోధనా మందిరానికి వచ్చారు. "


"ఆ.. పద శివానంద.. " గురూజీ ముందు వారి వెనుక శివానంద బోధనా మందిరం వైపు నడిచారు. మందిరంలో ప్రవేశించారు. 


స్వామీజీని చూచి శిష్యులందరూ లేచి నిలబడి వారికి నమస్కరించారు. వారు వారి స్థానంలో కూర్చున్నారు. శివానంద నేలపై వొంగి వారి వెనుకగా కూర్చున్నాడు. శ్రీ విజయేంద్ర స్వామీజీ చెప్పడం ప్రారంభించారు. 


"ప్రియ శిష్యులారా! ఈనాటి మన చర్చనీయాంశములు. పురాణములు, వేదములు, ఆర్య ద్రావిడ సంతతి. మన దేశానికి విదేశీయుల రాక.. 

వ్యాస మహర్షి 18 పురాణాలను వ్రాశారు. 


1. అగ్ని పురాణము

2. నారద పురాణము

3. పద్మ పురాణము

4. నాగ పురాణము

5. గరుడ పురాణము

6. కూర్మ పురాణము

7. స్కాంధ పురాణము

8. మత్య్స పురాణము

9. మార్కండేయ పురాణము

10. భరత పురాణము

11. భవష్య పురాణము

12. బ్రహ్మ పురాణము

13. బ్రాహ్మాండ పురాణము

14. బ్రహ్మ వైవర్త పురాణము

15. వరాహ పురాణము

16. వాయనపురాణము

17. వాయు పురాణము

18. విష్ణు పురాణము


హిందూ మతము (విభాగములు)

1. శైవిజం 

2. వైష్ణువిజం

3. శక్తిజం


హిందూ ధర్మ శాస్త్రములు : వేదములు : నాలుగు

1. ఋగ్వేదము

2. యజుర్వేదము

3. సామవేదము

4. అధర్వణ వేదము


వేద భాగాలు : నాలుగు

1. సంహిత

2. బ్రాహ్మణము

3. అరణ్యము

4. ఉపనిషత్తులు


ఉపనిషత్తులు పదకొండు :

1. ఐతరేయ

2. బృహధారణ్యక

3. ఈశ

4. తైత్తిరీయ

5. చాందోగ్య

6. కఠ

7. కేత

8. ముండక

9. మాండుక్య

10. ప్రశ్న

11. శేతాశ్వర


వేదాంగములు (సూత్రములు)

శిక్ష

చంధస్సు

వ్యాకరణము

నిరుక్తము

జ్యోతిషము

కల్పము

స్పృతులు - ఇతిహాసములు

భాగతము

రామాయణము

మహాభారము (పంచమవేదము)


వేద నిర్వచనము

హిందూ మతములో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ అంటారు. ’విద్’ అనే ధాతువుకు ’తెలియుట’ అన్న అర్థాన్ని బట్టి వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని అవి మానవుని చేతనూ రచింపబడలేదు అని హైందవ విశ్వాసము.. కనుకనే వేదములను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట, అంటే దర్శించవాడు అని అర్థము. హిందూ శాస్త్ర ప్రకారము వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వాటిని శ్రుతులు అని కూడా అంటారు. 


"ఏనం విందంతి వేదేన తస్మా ద్వేధస్య వేదతా.. (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం) కావాల్సిన వాటిని తీర్చి.. అక్కర్లేని వాటిని రాకుండా చేసే ఆధ్యాతమిక ఉపాయమే వేదం.. 


వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి ఒకే ఒక వేదరాశిగా వుండేది. ఎవరైనా వేదం నేర్చుకొనేవారు.. చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే! 


కృతయుగం నుండి ద్వాపర యుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహు కష్టమని.. ఎక్కువమంది అంతగా ఉత్సాహము చూపించేవారు కాదు. మొదట కలగలుపుగా వున్న వేదరాశి (వేదాలను)ని వ్యాసమహర్షి ఒక క్రమం ప్రకారం విభజించారు. 


ఆ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సం హితగాను, యజస్సులు అన్నింటినీ యజుస్సంహితగాను సామాలనన్నింటినీ సామసంహితగాను.. విడదీసి, అలాగే అధర్వంత్రాలన్నీ ఒకచోట చేర్చి అధర్వసంహితగా తయారుచేశారు. కనుక.. ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యారని చెబుతారు. 


ఆ నాలుగు వేదాలు 1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అధర్వణవేదములు

వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు.. వైశంపాయనుడు.. జైమిని.. సుమంతుడు అనేవారికి ఉపదేశించారు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురు శిష్యపరంపరగా ఆ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలుగా ఒకరినుండి ఒకరికి సంక్రమిస్తున్నాయి. వేదాలను ఉఛ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత వున్నది. సక్రమంగా గురుసేవతో అభ్యసించిన వారికే అది సాధ్యం.. సామాన్యులకు అసాధ్యం.. 


ఋగ్వేదము : తొలుత క్రీ. పూ 1700 సంవత్సరం ప్రాంతంలో ఉఛ్చరింపబడినది. ఒరిజినల్ భాష వైదిక సంస్కృతము (EDIC Sanskrit) కాలము C1500 - 1000BCB (10552 మంత్రములు) పది భాగములు సూక్రులు 82 మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి ఋగ్వేదము అత్యంత పురాతనమైనది. ఇది ప్రధానంగా యాగాధులతో దేవతా ఆహ్వానానికి ఉపయోగించేది. ఆ కారణంగా ఈ వేదానికి దేవతా వేదముగా చెప్పబడిచున్నది. అష్టకాలంలో అధ్యాయాలు.. అధ్యాయాలలో వర్గాలు ఉంటాయి. మండలాలలో అనువాకాలూ, అనువాకాలలో సూక్తులు వుంటాయి. మొత్తం 1017 సూక్తాలు 10500 ఋక్కులు 153826 శబ్దాలు, వాటిలో 432000 అక్షరాలు వున్నట్లు మహర్షి శౌనకుల వారి వర్ణన. ఋగ్వేదము పద్యరూపములో వుంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి. అవి 1. శాకల 2. భాష్కల 3. అశ్వలాయన 4. మాండూక్య 5. సౌంఖ్యాయాన.. 

యజుర్వేదము : వేదా అంటే జ్ఞానము. ఈ వేదమున యాగబలి, దానం ఏ రీతిగా చేయవలయునను విషయాలని విశదీకరించునది. 40 అధ్యాయాలు, మంత్రములు 1975. భాష వైదిక సంస్కృతము కాలము C 1200-800BCE

సామవేదము : సామము అనగా మధురమైనదని అర్థము. దేవతల గొప్పతనాన్ని, మహిమలను కీర్తించునది. దీనిని వేదవ్యాసుడు.. జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ. పూ 1000వ శతాబ్దానికి చెందినవిగా హైందవ శాస్త్రము. ప్రాముఖ్యతలో, పవిత్రతలో సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంది. 


అధర్వణ వేదము : హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాల్గవది అధర్వణ ఋషి పేరు మీదుగా.. దీనికి ఆ పేరు వచ్చినది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడినది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరసవేదం. ఋగ్వేదం లాగే ఇది కూడా స్తోత్రాలచే కూర్చబడినది. అంతేకాక కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయములూ చేర్చబడియున్నవి. 


నాలుగు వేదాలను అభ్యసించి వారిని చతుర్వేది. రెండు వేదములను అభ్యసించిన వారిని ద్వివేది.. మూడు వేదములు అభ్యసించిన వారు త్రివేదులుగా భారతావనిలో వెలిశారు. సాటికాలీయ్యులకు ధర్మబోధన చేశారు. 

ఆర్యజాతి : ఆర్యుడు, అన్న పదానికి క్రీ. పూ 6 శతాబ్దిలో బెహిస్తున్ శాసనం అత్యంత ప్రాచీనంగా లభిస్తున్న శాసనాధారం. ఈ శాసనంలో శాసనాన్ని ఆర్య భాష లేక లిపిలో రాసినదాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆర్య భాష అంటే ఇరానియన్ భాష. 


ఆర్య అన్న పదబంధం సాధారణంగా ఇండో ఇరానియన్ భాషల మూల భాషను సూచించేందుకు ఉపయోగిస్తారు. సంస్కృతంలో దానికి సమానమైన పదం ఆర్య (దేవనాగరి) అన్నపదం సంస్కృత భాషలో తమను తాము సంబోధించుకొనేందుకు వాడే జాతి వాచకం. ప్రాచీన సంస్కృతిలో దాని అర్థం గౌరవింపదగ్గ వారు ఉన్నతులు. ప్రాచీన పర్షియన్ భాషలో సమానమైన రూపం అరియ (ప్రాచీన పర్షియన్) అన్నది. ఆధునికమైన ఇరాన్ అన్నపేరుకు పూర్వపదం, అలాగే ఇరాన్ ప్రజలకు జాతి వాచకం. ప్రాచీన సంస్కృతిలో దాని అర్థం గౌరవింపదగ్గ వారు ఉన్నతులు. ప్రాచీన పర్షియన్ భాషలో సమానమైన రూపం అరియ (ప్రాచీన పర్షియన్) అన్నది. ఆధునికమైన ఇరాన్ అన్న పేరుకు పూర్వపదం, అలాగే ఇరాన్ ప్రజలకు జాతివాచకం. 


18వ శతాబ్దంలో ఇండో యూరోపియన్ భాషల్లో అప్పటికి వెలిసిన అత్యంత ప్రాచీన భాషలు ఇండో ఇరినియన్ భాషలే. దానితో ఆర్యన్ అన్న పదంతో కేవలం ఇండో ఇరానియన్ ప్రజలనే కాక రోమన్లు, గ్రీకులు, జర్మన్లు సహా మొత్తం స్థానిక ఇండోయూరోపియన్ భాషా వ్యవహర్తలు అందరికీ సూచించసాగారు. బాల్డ్ సెల్డ్, సెల్విక్ భాషలు కూడా అదే విభాగానికి చెందినవని కొద్ది కాలానికే గుర్తించారు. యూరోపియన్లు, ఇరానియన్లు ఇండో ఆర్యన్ ప్రజలకు పూర్వీకులని భావించిన కాలపు ప్రజలు మాట్లాడిన ఓ మూల భాష (ప్రస్తుతం ప్రోటో - ఇండో - యూరోపియన్ అంటున్నారు) ఉండేదని, దాని నుంచి ఈ భాషలన్నీ పుట్టాయని వారించారు. 


ఈ పద (ఆర్య) ప్రయోగం 19వ శతాబ్ది చివరభాగం, 20 వ శతాబ్ది తొలినాళ్ళనాటి విజ్ఞానవంతులైన రచయితల్లో సర్వసాధారణం. ఉదాహారణకు 1920ల నాళ్ళలో ఆ పదం విస్తృత ప్రాచుర్యం పొందినది. 


ద్రావిడులు : వీరు దక్షిణ భారత దేశమందున, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, బంగళాదేశ్, మాల్దీవ్స్, నేపాల్, భూటాన్ మరియు శ్రీలంక ప్రాంతీయులు. వీరి మొత్తం జనాభా సుమారు 245 మిలియన్ దక్షిణ భారతదేశమునందలి ద్రావిడులు రాతి ఆలయ శిల్పకళ యందు నేర్పరులు. చోళరాజుల కాలంలో వారి శిల్ప కళ చాతుర్యము హైందవతకు సిద్ధాంతాలకు చిహ్నంగా నెలకొల్పిరి. రాతి శిల్పాలను చెక్కడంలో ఆలయాలు గాలి గోపురాల నిర్మాణంలో మహా నేర్పరులు. వారి శిల్పకళ తమిళనాడు కర్ణాటక కేరళ ప్రాంతాలలో సాక్షీ భూతాలుగా వెలిసి వున్నవి. ఆంధ్ర ప్రాంతంలోనూ వారు నిర్మించిన కొన్ని ఆలయములు చూడగలము. 

దేశ పర్యాటనకు వచ్చు విదేశీయులు ఆయా ఆలయాలను శివరీతులను చూచి ఆశ్చర్యచకితులుగా మారారనే విషయం ఆ మహా నైపుణ్య కళకు వారసులం మనం.. మన హైందవ జాతి అనే విషయం యావత్ భారతీయులకు ఎంతో గర్వకారణం. 


అనాదిగా ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్ళిఒ వృత్తి వ్యాపారాలను సాగించి సత్ స్నేహ సౌభాత్రాలతో వర్తించిన వారు మన ఆర్య ద్రావిడులు. సువిశాలమైన దేశంగా ఎన్నో భాషలు, దేశంలో ఏ ప్రాంతమైన.. భాష ఏదైనా భారతీయులందరి హృదయ స్పందన ఒక్కటే. 

సత్యం, ధర్మం నీతి న్యాయం, నిజాయితీ మన చుట్టూ మనుగడకు పంచభూతములు ఎలా వున్నాయో ఈ సద్భావాలుకు ప్రతి హైందవుడు వారసుడు. 


ఆ కారణంగానే.. దేశంలోకి మొదటి ముస్లిములు.. తర్వాత తెల్లవారు ఆంగ్లేయులు (ఫ్రెంచి డచ్చి వారు) రాగలిగారు. మొదట వచ్చింది. ఫ్రెంచ్ వాస్కోడిగామా (మే 20వ తేది -1498) తిరిగి వెళ్ళి మరలా (1502) వచ్చాడు. అనుచరులతో వారి తర్వాత డచ్చివారు ఆపై ఆంగ్లేయులు బ్రిటన్ వంశీయులు వచ్చారు. డచ్చి వారిని ఫ్రెంచి వారితో యుద్ధాలు చేసి డచ్చివారిని పారద్రోలారు. 


స్వదేశ రాజులు అందరూ ఏకమై తమని దేశాన్నించి వెళ్ళకొడతారనే భయంతో ఫ్రెంచి వారిని ఆదరించి మిత్రత్వాన్ని సాగించారు. దేశంలో రాజ మధ్యన అభిప్రాయబేధాలను కల్పించి బలహీనుడిని ఓడించి బలమున్న వారి పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటూ యావత్ భారతదేశానికి రెండు గొప్ప యుద్ధాలు ప్లాసీ యుద్ధము 1757లో బాస్సార్ యుద్ధం 1764లో చేసి మన వారిని ఓడించి, ఆంగ్లేయులు చక్రవర్తులై మన దేశాన్ని 1947 వరకూ పాలించారు. "

స్వామీజీ చెప్పడం ఆపి లేచారు. "శిష్యులారా! నేను రెండు మూడు రోజులు దక్షిణ దేశ యాత్రలకు ఒంటరిగా వెళుతున్నాను. నా ధర్మాలను శివానంద నిర్వహిస్తాడు. అతనితో సహకరించండి" స్వామీజీ తన గదికి వెళ్ళిపోయాడు. 

=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page