top of page

వీభోవరా - పార్ట్ 24

Updated: 3 hours ago

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

ree

Veebhovara - Part 24 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 11/10/2025

వీభోవరా - పార్ట్ 24 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. 


బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు. దుర్గారావు అనే వ్యక్తి వలన అంగ వైకల్యం పొందిన విజయ్, సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు. గతంనుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యప శర్మ మృత దేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు.

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక వీభోవరా - పార్ట్ 24 చదవండి.. 


ప్రతిరోజు శ్రీ విజయేంద్ర స్వామీజీ ప్రాతఃకాలంలో (ఐదు గంటలకల్లా) నిద్రలేచి కాలకృత్యాదులు, స్నానం ముగించి తన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ వారి సమాధి వద్ద ఆత్మజ్యోతిని (దీపారాధన) వెలిగిస్తారు. ఆ రోజు ఆ కార్యక్రమం ముగించి గురువుల పాదాల వైపుల కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించారు.

అరగంట గడిచింది.


"వత్సా!... విజయేంద్రా!... విభోవరా!... దుష్టశిక్షణకు, ధర్మరక్షణకు సమయం ఆసన్నమైనది. అందుకే కాశ్యప శర్మ మన ఆశ్రమానికి నీ సంకల్పంతో చేరాడు. విజయోస్తు విజయేంద్ర స్వామీజీ! విజయోస్తు..."


అవి పరమగురువులు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వాములు వారి పలుకులు.


విజయేంద్ర స్వామీజీ తొట్రుపాటుతో కళ్ళు తెరిచారు. శ్రీ గురువుల వారి పవిత్ర వాక్కులు వారి చెవుల్లో మారుమ్రోగాయి. లేచి తన గదిలోనికి వెళ్ళారు.


ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన శిష్యులు కేశవానంద, శివానందలు తిరిగి వచ్చారు. గురువుల చూచి నమస్కరించారు. వారు సేకరించిన విషయాలను గురించి స్వామి వారికి వివరించారు. కళ్ళు మూసుకొని శిష్యుల వాక్కులను ఆలకించారు.


"అందరికీ పాపం పండింది. పతనం తథ్యం. విభోవరా!" వ్రాసి అందరి విలాసాలకు ధన్‌బాద్ నుండి పంపు శివానందా," గురువుల ఆజ్ఞ. శివానంద తలాడించాడు.

మరో శిష్యుడు ఆనందుడు వచ్చి స్వామీజీకి వినయంగా నమస్కరించాడు.


"ఆనందా!... ఏమిటి విషయం?" అడిగారు స్వామీజీ.


"డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ రుద్రమదేవి తమరి దర్శనార్థం వచ్చియున్నారు గురుదేవా!" వినయంగా విన్నవించాడు ఆనందస్వామి.


"ఎక్కడ ఉన్నారు?"


"ప్రార్థనా మందిరంలో!"


"పద..." ముందు స్వామీజీ, వెనుక శివానంద, కేశవానంద, ఆనంద నడిచి ప్రార్థనా మందిరంలో ప్రవేశించారు.


కూర్చొని ఉన్న రుద్రమదేవి లేచి స్వామి వారికి నమస్కరించింది.

ఆమె డ్యూటీ డ్రెస్‌లో వచ్చింది.

స్వామి వారిని చూడగానే ఆమెకు ఎంతో ఆశ్చర్యం...


డ్యూటీ డ్రెస్సులో ఆశ్రమానికి వచ్చి తప్పుచేశాననుకొంది రుద్రమదేవి.

ఆ సమయంలో ఆమె మదిలో బాల్యపు పాత జ్ఞాపకాలు. మనస్సున ఎంతో బాధ, నయనాల్లో కన్నీరు.


"పోలీస్ ఆఫీసర్ గారూ! కూర్చోండి," చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ.


ఆశ్చర్యంతో విజయేంద్ర స్వామీజీ వారిని చూస్తూ నిలబడింది డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ రుద్రమదేవి.


"కూర్చోండి!" చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ.


రుద్రమ కుర్చీలో కూర్చుంది.

"ఇది పేదల నిలయం, వైరాగ్యవాసుల స్థావరం. ఆధ్యాత్మిక చింతన, దీక్ష, యోగ, దైవప్రార్థనలకు నిలయం. ఇక్కడికి తమరు రావడానికి కారణం తెలుసుకోవచ్చా ఆఫీసర్?" అడిగారు స్వామీజీ.


రుద్రమదేవి తలపైని టోపిని చేతికి తీసుకొంది.

"ఈ ప్రాంతానికి నేను వచ్చి సంవత్సరం గడిచింది. మీ ఆశ్రమాన్ని గురించి వచ్చిన నెలకే విన్నాను. ఒకసారి ఆశ్రమాన్ని చూడాలనుకొన్నాను. కారణాంతరాల వలన రాలేకపోయాను. నేటికి తమరి అనుగ్రహం లభించింది. రాగలిగాను," చిరునవ్వుతో వినయంగా చెప్పింది రుద్రమదేవి.


'రుద్రమ నా సోదరి, ఒకనాడు నాతో చెప్పినట్లుగానే నాకు మారుగా తాను పోలీస్ ఆఫీసర్ అయ్యింది. ఆనందం... మహదానందం...' అనుకొన్నారు విజయేంద్ర స్వామీజీ.


"మీరు మన సంబంధాన్ని మరిచారా స్వామీజీ?" ప్రాధేయపూర్వకంగా అడిగింది రుద్రమదేవి.


"లేదు."


"నేను మిమ్ములను అన్నయ్యా అని పిలవవచ్చునా?"


"ఆ బాంధవ్యాలను, బంధాలను నేను త్యజించి చాలాకాలమైంది ఆఫీసర్!"


రుద్రమ కొన్ని క్షణాలు వారి ముఖంలోకి పరీక్షగా చూచింది. స్వామీజీ వారి నయనాలు గత జ్ఞాపకాలతో అరుణిమను సంతరించుకొన్నాయి.


"పేపర్లో న్యూస్ మూలంగా నాకు తెలిసింది. వారణాసిలో మా అన్నయ్య కాశ్యపశర్మ గంగామాత స్థానవాటికలో ఎవరో అగంతకులచేత కాల్చిచంపబడ్డాడని, వారు మృతదేహాన్ని మీరు మీ ఈ ఆశ్రమానికి తెప్పించుకొన్నారని — అది నిజమేనా స్వామీజీ?"


అవునన్నట్లు తలాడించాడు విజయేంద్ర స్వామీజీ.

"వారి దహన సంస్కారం?"


"ఇంకా జరుగలేదు," ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ.


"వారిని నేను ఒకసారి చూడవచ్చా?" దీనంగా కన్నీటితో అడిగింది రుద్రమదేవి.


స్వామీజీ తలాడించారు. ఆసనం నుండి లేచారు.

"రండి," వారు ఆశ్రమం వెనుక భాగం వైపుకు నడిచారు.


రుద్రమదేవి విచారవదనంతో వారిని అనుసరించింది.

స్వామీజీ తన గురువుగారి గదిని తాళం తీసి తెరిచారు. ముందువారు, వెనుక రుద్రమదేవి ఆ గదిలో ప్రవేశించారు.


అద్దాల కంటైనర్‌లో శయనరూపంలో వెల్లకిలా ఉన్న కాశ్యపశర్మ మృతదేహాన్ని చూచి రుద్రమ భోరున ఏడ్చింది.


"ఏడుపును ఆపుకోండి, కన్నీటిని తుడుచుకోండి. అంతా దైవనిర్ణయం. మనం నిమిత్తమాత్రులం," అనునయంగా చెప్పారు శ్రీ విజయేంద్ర స్వామీజీ.


కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.

"అన్నయ్యా! ఎలా ఉండేవాడివి? నీకు ఈ దుస్థితి ఏమిటి? నిన్ను ఈ స్థితిలో చూడవలసి వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు... ఎన్నడూ ఊహించలేదు!" మనస్సున ఎంతో బాధతో, కళ్ళల్లో కన్నీటితో అనుకుంది రుద్రమదేవి.


కాశ్యపశర్మ శరీరాన్ని మూలికారసాలతో ఎలాంటి దుర్వాసన రాకుండా భద్రపరిచారు స్వామీజీ. వారి నయనాల్లో ఆవేదన అరుణిమ.

"వెళదామా ఆఫీసర్?"


తలాడించింది రుద్రమ. తన సోదరుని పాదాల వైపునకు నడిచి తన తలను ఆ పాదాలపై వంచింది. కన్నీరు కార్చింది.

ఇరువురూ బయటికి నడిచారు.

శివానంద గదికి తాళం బిగించాడు.


"శవాన్ని మాకు ఇస్తారా స్వామీజీ?" దీనంగా అడిగింది రుద్రమ.


"ఇవ్వను. వారు నా సోదరులు. వారి అంత్యక్రియలను నేనే చేయాలి," ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ.


రుద్రమకు విషయం తెలియగానే గంగకు, భాస్కర్‌కు ఫోన్‌లో తెలియజేసింది. ఆశ్రమం ఉన్న ప్రాంత వివరాలను చెప్పింది. స్వామీజీ, రుద్రమ ప్రార్థనా మందిరంలో ప్రవేశించారు. స్వామీజీ మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. వారి వదనంలో గాంభీర్యం.


రుద్రమదేవి మౌనంగా వారి ముఖంలోకి చూస్తూ వుండిపోయింది. గంగ తన ముగ్గురు పిల్లలు (కవలలు) బలి, శిబి, మాతలు, మురళీమోహన్, శ్యామల్, గౌరి (డాక్టర్), శాంతకుమార్, సుభద్ర, భాస్కర్ శర్మ (లాయర్) — రెండు కార్లల్లో వచ్చి దిగి ఆశ్రమంలో ప్రవేశించారు.


వారంతా వచ్చిన విషయాన్ని గమనించిన రుద్రమ వారికి ఎదురు వెళ్ళి ప్రార్థనా మందిరంలోకి తీసుకొని వచ్చింది.


వారందరి సవ్వడి విని స్వామీజీ కళ్ళు తెరిచారు. అందరినీ చూచారు. మదిలో పరమానందం.

అందరూ వారికి నమస్కరించారు.


"పరమేశ్వరార్పణమస్తు... కూర్చోండి," చిరునవ్వుతో చెప్పారు.


అందరూ కూర్చున్నారు. అందరి దృష్టి ఆశ్చర్యంతో వారి ముఖం వైపే!!!


పదిహేను సంవత్సరాల ప్రాయంలో ఉన్న బలి, శిబి, మాతలను దగ్గరకు పిలిచారు. వారు భయం భయంగా స్వామీజీని సమీపించారు.

"మీ పేర్లు ఏమిటి చిన్నారులూ?" ప్రీతిగా అడిగారు.


ముగ్గురూ వారి వారి పేర్లను చెప్పారు.


"నా సోదరుని తీపి గురుతులు... ఎందుకయ్యా, వీరికి చక్కటి భవిష్యత్తును కల్పించకుండా వెళ్ళిపోయావు?" విచారంగా మనస్సున అనుకొన్నారు.


వారి తలలపై తన కుడి హస్తాన్ని ఉంచి మనసారా దీవించారు.


"మిమ్మల్నందరినీ ఒకేసారి ఇక్కడ చూడడం నా జన్మసుకృతం. నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి అనురాగ బంధాలు, జ్ఞాపకాలు మనస్సున సాగర కెరటాల్లా వస్తున్నాయి," నిట్టూర్చి ఆ జ్ఞాపకాలను ప్రక్కకు తోసి...

"అందరూ భోజనశాలకు వెళ్ళి భోజనం చేయండి. ఆపై రుద్రమతో కలిసి ఆమె చోటికి వెళ్ళండి. త్వరలో నేను కబురు పంపుతాను. అందరూ రండి, నా సోదరుల అంత్యక్రియల్లో పాలు పంచుకోండి. వారి ఆత్మకు శాంతిని కలిగించండి," ఎంతో గంభీరంగా చెప్పారు స్వామీజీ.


ప్రక్కనే నిలబడి ఉన్న శివానందను చూచారు.


"శివానందా! వీరంతా నాకు కావలసినవారు. భోజనానంతరం వారిని జాగ్రత్తగా సాగనంపు," లేచి అందరికి నమస్కరించి గంభీరంగా తన గదికి వెళ్ళిపోయారు శ్రీ విజయేంద్ర స్వామీజీ.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page