వీభోవరా - పార్ట్ 25
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 7 hours ago
- 5 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 25 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 16/10/2025
వీభోవరా - పార్ట్ 25 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు. దుర్గారావు అనే వ్యక్తి వలన అంగ వైకల్యం పొందిన విజయ్, సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు. గతంనుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యప శర్మ మృత దేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు. రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 25 చదవండి..
అతిరథమహారధులు సమాజధారకులందరికీ శ్రీ ముఖాలు అందాయి. కవరును చించి అందులోని తెల్ల కాగితాన్ని చేతికి తీసుకొన్నారు. ఆత్రంగా మడ విప్పారు.
"పాపం పండింది పతనం తథ్యం.. వీభోవరా!?"
ఆశ్చర్యపోయారు ఎవరికి వారు. ఆ పదిమంది. సంఘసంస్కర్తలు (దుర్గారావు, తనయుడు జూనియర్ భీమారావు.. , ముస్తఫామున్నా వారి హితుడు కలకత్తా ఖాన్.. , రొయ్యల రోశమ్మ వారి హితుడు రాణిపేట రంగా.. వజ్రాల వరహాలు వారి హితుడు బాంబే బబా.. , సాల్మన్ శాస్త్రి వారి హితుడు బద్వేలు బాలమ్మ.. మరియూ వీరి విదేశి దోస్తులు అల్లామియా అరేబియా, నిక్‍సన్ ఇంగ్లండ్, పఠాన్ బాబా పాకిస్థాన్ ఆందోళనతో హడలిపోయారు.
అందరూ ఒకరికి మరొకరికి ఫోన్ చేసి మాట్లాడుకొన్నారు. ’ఎవరు ఈ వీభోవరా!’ అందరి హృదయాల్లో అదే ప్రశ్న. ధన్‍బాద్ జార్ఖండ్ నుంచి వచ్చాయి అన్నీ కవర్లని గ్రహించారు. ’పాపం పండింది. పతనం తథ్యం’ అర్థం ఏమిటి? అందరూ తల జుట్టును పీక్కున్నారు. పరిపరి విధాల ఆలోచించారు. కానీ వారికి ఏమీ తోచలేదు.
అందరి హృదయాల్లో భయం ప్రారంభమయింది. ఎవరు ముందు? ఎవరు వెనుక? వీభోవరా గురికి బలైపోయేది? ప్రతి ఒక్కరూ వారి భావి జీవితాల్లో చేసిన పాపాలను తలుచుకోసాగారు.
దుర్గారావు :- చిన్నతనం నుండీ తండ్రి భీమారావు అండను చూచుకొని అనేక నేరాలు చేశాడు. ఇల్ ఈగల్ వ్యాపారాలు దొంగ సారాయం, గంజాయి, నల్లమందు వ్యాపారం, తాలూకా జిల్లాల వారిగా శిష్య బృందం. నిక్‍సన్ ఇంగ్లండ్ తో చేతులు కలిపి విషపూరిత డ్రగ్స్ విక్రయం, అల్లామియాతో కలిసి దొంగ (డూప్లికేట్) నోట్లు చెలామణి. బాలికలను రేప్ చేయడం.
కొడుకు జూనియర్ భీమారావు : ముమ్మూర్తులా తండ్రి బాటలోనే నడిచి తన తండ్రి స్టేట్ ట్రాన్స్ పోర్టు మినిష్టర్ రాజకీయ దురంధరుడై మ్యాన్ మేకర్ అన్న పేరు సంపాదించుకొన్న మహా గొప్ప నాయకుడైనందున తాను ఏమి చేసినా ఎవరూ, ఎదుట నిలబడలేరని, యూత్ కాంగ్రెస్ లీడర్ పేరుతో పైలా పచ్చీస్‍గా రౌడీ స్నేహితులతో త్రాగడం జూదం ఆడడం, ఆడపిల్లలను బలాత్కారంగా హింసించడం, చంపడం, ఆలయాల విగ్రహాల దొంగతనం, అమ్మకం, దొంగనోట్ల చెలామణి, డ్రగ్స్ విక్రయాలతో డిటో తండ్రి దుర్గారావుగా వర్తించడం.
ముస్తఫా మున్నా వారి హితుడు కలకత్తా ఖాన్ : దొంగ నోట్ల వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, కల్తీ సారాయం వ్యాపారం, పేద ఆడపిల్లలకు బ్రతుకు తెరువు ఉద్యోగాలను కల్పిస్తామని మాయమాటలు చెప్పి, బొంబాయికి, కలకత్తాకు, ఢిల్లీకి రెడ్ లైట్స్ ఏరియాలకి అరబ్ దేశాలకు తరలించి విక్రయించడం.
రొయ్యల రోశమ్మ వారి హితుడు రాణి పేట రంగా ; బ్రోతల్ హౌసెస్ నిర్వహణ, డ్రగ్స్ విక్రయం, దొంగ నోట్ల వ్యాపారం ఆడపిల్లలను మభ్యపెట్టి అమ్మకం.
వజ్రాల వరహాలు వారి హితుడు బాంబే బాబా: వయస్సుకు వచ్చి పేదరికంలో వున్న ఆడపిల్లలకు ఉపాధి ఆశ (ఉద్యోగం) కల్పించి బాంబే కలకత్తా ఢిల్లీలకు తరలించి విక్రయించడం, డ్రగ్స్ పంపకం, దొంగ సారాయం వ్యాపారం, గంజాయి నల్లమందు విక్రయం. యువతులను అరేబియాకు ఉద్యోగ నెపంతో పంపడం.
సాల్మన్ శాస్త్రి వారి హితులు బద్యేలు బాలు : ఆశలు కల్పించి పేద నిరక్షరాస్య హైందవులను మతం మార్పిడి చేయించడం, మందు పొందు కల్పించడం, దొంగనోట్ల మార్పిడి, డ్రగ్స్ విక్రయం యుక్తవయస్కు బాలికలను, పేద ఆడవారిని అరేబియా గల్ఫ్ కంట్రీలకు పంపడం.
అందరూ వారి వ్యాపారాలు సజావుగా సాగేదానికి కొందరు చీప్ క్యారెక్టర్ పోలీసులను తమ గుప్పెట్లో పెట్టుకోవడం, అన్యాయాన్ని న్యాయంగా నిరూపించడం దానికి తోడుగా కొందరు న్యాయవాదులను, డాక్టర్స్ ను తమ ఆధీనంలో ఉంచుకొని, తమ తమ కార్యకలాపాలను, కేవలం వ్యక్తిగత స్వార్థం డబ్బు కోసం, విచక్షణారహితంగా వర్తించడం వారందరికీ షరా మామూలే.
ఆ స్థితిలో జీవితాన్ని సాగిస్తున్న ఆ సంఘ విద్రోహుల ’వీభోవరా’ సందేశం, నెత్తిమీద పిడుగు పడ్డట్లయింది.
ఆ సందేశం ఎప్పుడు ఎవరితో ఆరంభం కానున్నదనే భయం అందరికీ ఏర్పడింది. యదార్థంగా వారందరూ చెడ్డవారు కాదు. కొందరు మంచివారే. కానీ కారణాంతరాల వలన డబ్బుకొని ఆ విష వలయంలో పడిపోయినవారు. కాలగతిలో వారు ప్రవాహంలో పడిన వస్తువు ముందుకు సాగిపోవలసిందే కాని వెనుతిరిగి, వారి వ్యతిరేకతను మిగతా వారికి చెపితే, వీరి ప్రాణాలకు ప్రమాదం. ఆ కారణంగా వ్యతిరేకతో మనస్సు మారం చేస్తున్నా ఆవలయం (సమూహం) నుండి బయటకు రాలేకపోతున్నారు. అందరూ వారి సుప్రీమ్ బాస్ దుర్గారావుకు ఫోన్ చేసి వారి వారి అభిప్రాయాలను చెప్పారు.
కొందరు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి సెక్యూరిటీ కావాలని అడుగుదాం అని సూచించారు.
జవాబుగా దుర్గారావు "పోలీసుల్లో అందరూ మనకు సాయం చేస్తారని మనం నమ్మకూడదు. కాశ్యప్ వర్గం వారు చాలామంది వున్నారు. వారు మనలను సవాలక్ష ప్రశ్నలడుగుతారు. వారి ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేము. వారు మనలనే అనుమానించవచ్చు. కనుక ఈ స్టేజిలో మనం పోలీసుల శరణ్ కోరణం తగదు.
కోర్టులో మన జూనియర్ భీమారావు నిర్ధోశిగా వింధ్య కేసులో ఋజువైంది. ఆ సందర్భంలో నేను గొప్ప పార్టీని ఏర్పాటు చేస్తున్నాను. మీరంతా రావాలి. అందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం" అన్నారు డెభ్భై సంవత్సరాల దుర్గారావు.
అందరూ సమ్మతించారు.
పార్టీ ముందు గానా బజానాతో చాలా గొప్పగా సాగింది. ఆ పార్టీలో హైదరాబాదు నుండి వచ్చిన నర్తకమణులతో కలిసి నలభై సంవత్సరాలు పైబడ్డ రొయ్యల రోశమ్మ, బద్వేలు బాలమ్మ నాట్యం చేయడం విశేషం. అన్ని ఘనంగా వున్న వారి భంగిమలకు పురుష పుంగవులంతా పులకించి పోయారు. పార్టీ ఘనంగా ముగిసింది. నృతకీమణులు వెళ్ళిపోయారు.
సభ్యులందరూ మిగిలారు.
"సోదర సోదరీమణులారా! మనమంతా రెండు వారాల పాటు ఆనందంగా గడిపే దానికి కేరళ అలప్పీ బోట్ హౌస్‍కు వెళుతున్నాము" దుర్గారావు నవ్వుతూ ఎనౌన్స్ చేశాడు.
అందరూ ఆనందంగా తలలు ఆడించారు.
అనుకొన్న ప్రకారం మిత్రులందరూ ఆనందంగా రైల్లో ఎ. సి ఫస్ట్ క్లాసులో కొచ్చిన్ చేరుకున్నారు.
కొచ్చిన్ నుండి అలప్పీకి యాభై కిలోమీటర్లు. మూడు టాక్సీలలో అందరూ అలప్పీకి బయలుదేరారు. ఒకటిన్నర గంటలో అలప్పీ చేరారు.
వీరిని టాక్సీవాలస్ అలప్పీ బోట్ హౌసెస్ ప్రాంతంలో దించారు. బాడుగ తీసుకొని వారు వెళ్ళిపోయారు. మరో టాక్సీలో జూనియర్ భీమారావు, కలకత్తా ఖాన్ బజారుకు వెళ్ళి కావలసిన మందు తినుబండారు పండ్లు కొనుక్కొని మిగతావారిని చేరారు.
బోట్ ఓనర్స్ వీరిని చుట్టు ముట్టారు. బేరమాడి పదిమందికి రోజుకు ఇంతని తీర్మానం చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి అందరూ కళ్ళకు బాగా సుందరంగా కనుపించిన రెండు అంతస్థుల బోట్‍లో ప్రవేశించారు.
బోట్ దరినుండి నీటి మధ్య భాగానికి కదిలింది. అందులో బెడ్ రూంలు, టాయిలెట్స్, ఫర్నీచర్, కిచెన్ అన్నీవున్నాయి.
అందరూ కూర్చొని మందు బాటిల్స్ ఓపెన్ చేశారు. ఆనందంగా త్రాగారు, తిన్నారు.
మత్తులో తూలుతూ పడకలపై వాలి నిద్రపోయారు.
నాలుగు గంటల తరువాత లేచారు.
కొందరు కావలసినవి తిన్నారు. కొందరు మందును రెండవ రౌండ్ ప్రారంభించారు.
కొందరు గ్యాలాలతో చేపలను పట్టసాగారు. ఒక అరగంటలో దాదాపు ఇరవై చేపలను పట్టారు.
బోట్ డ్రైవర్ చేత చేపలను క్లీన్ చేయించి, అన్నం చేపల పులుసును తయారు చేయించుకొని ఆనందంగా మందు తాగుతూ రాత్రి భోజనం చేశారు. అందరూ పై అంతస్థుకు వెళ్ళి బోట్ పైన అటూ ఇటూ పచార్లు చేశారు. సమయం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం.
’వీభోవరా, జ్ఞాపకం వచ్చాడు. గుండెల్లో దడ ప్రారంభమయింది. అందరూ మౌనంగా ప్రాణభయంతో పడకలు చేరారు. ఉదయాన్నే లేచి బెడ్ కాఫీలు త్రాగి పళ్ళు తోమడం, స్నానం ముగించి మందు, గానా భజానాతో, చేపల వేటతో మూడురోజులు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా బోట్ హౌస్‍లో పరమానందంగా వుండిపోయారు.
=======================================================================
ఇంకా వుంది..
వీభోవరా - పార్ట్ 25 త్వరలో
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments