వీభోవరా - పార్ట్ 26
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Oct 22
- 6 min read
Updated: Oct 27
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

Veebhovara - Part 26 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 22/10/2025
వీభోవరా - పార్ట్ 26 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు విజయేంద్ర స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన.
బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు. దుర్గారావు అనే వ్యక్తి వలన అంగ వైకల్యం పొందిన విజయ్, సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు. గతంనుండి బయటకు వచ్చిన విజయానంద కాశ్యప శర్మ మృత దేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు. రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు. కాశ్యపశర్మ హత్యలో పాలుపంచుకున్న వారందరికీ వీబోవరా పేరుతొ హెచ్చరిక లేఖలు అందుతాయి.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 26 చదవండి..
ఆశ్రమం వెనుక భాగంలో అనగా జగన్మాతా పితల ఆలయం. ప్రక్కన బోధనామందిరం, వాటి వెనుక వేపచెట్టు, చుట్టూ అరుగు.. దానిముందు ఆ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ వారి సమాధి వున్నాయి. ఆ సమాధి (గురువుగారి పాదాలవైపున) కూర్చొని ధ్యానం చేయడం శ్రీ విజయేంద్ర స్వామీజీ వారి ప్రధమ దినచర్య. ధ్యానం ముగిసింది.
"శివానందా!" పిలిచారు గురూజీ.
పది అడుగుల దూరంలో వున్న శివానంద ఆ పిలుపు విని ఆవైపుకు చూచాడు. పిలిచింది తన గురుదేవులు విజయేంద్ర స్వామీజీ.. శివానంద చిరునవ్వుతో వారిని సమీపించాడు. ప్రశ్నార్థకంగా వారి ముఖంలోకి చూచాడు.
"శివానందా!.. "
"స్వామీజీ!.. "
"ఈరోజు సత్యానందరావు గారు రావాలిగా!"
"అవును స్వామీజీ!"
"వారు ఒకటి రెండు రోజులు ఉండవచ్చు. సతీ సమేతంగా రావచ్చు. వారు వసతిని వుండేటందుకు ఈ మన ఆశ్రమంలో ఏర్పాట్లను సరిగా చేయి. "
"చేశాను స్వామీజీ!"
"దైవ నివేదనకు వేళ అయింది కదూ!"
"అవును స్వామీజీ!"
"పద.. " ఇరువురూ మాతాపితల ఆలయం వైపుకు నడిచారు.
శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ కాలం నుండి ఎందరో భక్తులు ఆశ్రమానికి వచ్చి ఒకటి రెండు రోజులు వుండి, వారి బోధనల్ను విని యధాశక్తి విరాళాలను సమర్పించి వెళుతుండేవారు. ఈనాడు కూడా ఆ విధానం అలాగే సాగుతూ వుంది. ఆశ్రమానికి వచ్చిన వారెవరైనా ప్రథమాన, ఆశ్రమం ముందు భాగంలో వున్న విశాలమైన వరండాలో కుర్చొని వారి ప్రియ శిష్యుడు శివానంద ద్వారా తాము వచ్చిన వివరాన్ని స్వామివారికి తెలియజేస్తారు.
స్వామీజీ వారిని తన చెంతకు రమ్మని కబురు పంపుతారు. శివానంద వచ్చిన వారికి స్వామి ఆహ్వానాన్ని తెలియజేసి వారి వద్దకు పంపుతారు. ప్రస్తుతంలో అది అపరార్ణవేళ. ఆశ్రమ మధ్య భాగంలో వున్న శ్రీ జగత్ రక్షకులు సర్వేశ్వరుల, జగన్మాత భవానికి మాధ్యాన్నిక నివేదికలను సమర్పించవలసిన తరుణం.
విజయేంద్ర స్వామీజీ వారు శివానంద ఆలయంలో ప్రవేశించారు. జగత్ మాతాపితలకు నైవేద్య నీరాజనాలు సమర్పించారు. శిష్యులందరూ పాల్గొన్నారు. పాత అతిధులందరూ మాతా పితలను దర్శించారు. తీర్థ ప్రసాదాలని స్వీకరించారు. అతిధులు బోధనా మందిరంలోకి వెళ్ళారు. శివానంద స్వామీజిని సమీపించాడు.
"స్వామీజీ!.. "
"ఏమిటి శివానందా!" అడిగాడు.
ఢిల్లీ నుండి.. విశాఖపట్నం నుండి.. ఇరువురు దంపతులు తమ దర్శనార్థం వచ్చియున్నారు గురుదేవా!" చెప్పాడు శివానంద.
"ఊఁ.. అపర్ణార్ణవేళ. నివేదన అయ్యిందిగా వారిని మనతో కలిసి భోజనం చేయమని చెప్పు. ఆ తర్వాత.. వారితో ప్రసంగిస్తానని వారికి తెలియజేయి" చిరునవ్వుతో చెప్పి వారికి సొంతం అయిన రాజఠీవితో ఆ యోగి పుంగవులు ఆశ్రమంలోని వారి గదికి వెళ్ళిపోయారు స్వామీజీ.
వారి వద్ద ప్రస్తుతం ఎనభై మంది శిష్యులు వున్నారు. వారు ఆ ఆశ్రమంలో చేరి నలభై ఎనిమిది సంవత్సరాలు. విజయేంద్ర స్వామీజీ వారికి తన గురువుగారి చివరి రోజులు గుర్తుకు వచ్చాయి.
వేపచెట్టు క్రింద గురువులు శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వాముల వారు తపస్సు చేసుకొంటూ ఉండేవారు. ఆ వేపచెట్టు క్రింద.. ఆనాడు దాని చుట్టూ నేడు వున్న విశాలమైన అరుగు లేదు. దాన్ని నిర్మించింది శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు.
ఆ అరుగు ముందు నేడువున్న శివపార్వతులు మందిరం.. దానిముందు విశాలమైన ప్రార్థనా మందిరం.. దానికి ఉత్తరపు వైపున అతిథుల నిలయం.. దక్షిణపు వైపున అతిథులకు వసతి గృహాలు, కాలగతిలో ఆ ప్రాంతాన్ని దర్శించిన యోగ్యులు ప్రసాదించిన విరాణాలతో శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వామీజీ వారు కొన్ని వసతులను కల్పించారు. శిష్యులకు, వచ్చినవారికి ఉండేటందుకు అనువుగా తన హయాంలో శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు మరికొన్ని వసతులను ఏర్పాటు చేశారు.
పన్నెండు సంవత్సరాల క్రిందట మహా గురువులు శ్రీ శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ పరమపదించవలసిన దినం ఆసన్నమైంది. తన నిర్యాణ విషయం వారికి ఎరుక శిష్యుడు.. విజయేంద్ర స్వామి వారిని దరికి పిలిచారు.
అప్పటివారు తన విశ్రాంతి ధ్యానాలకు అనువుగా ఒక గదిని నిర్మించుకొన్నారు. వారు ఆ గదిలో వున్నారు. గురువుగారి పిలుపును విని విజయేంద్ర స్వామీజీ వారిని సమీపించారు. కూర్చో అన్నట్లు గురువుగారు సైగ చేశారు. తన తలవైపు నేలను తట్టి చూపారు.
విజయేంద్ర స్వామీజీ వారికి హృదయంలో ఏదో సందేహం.
ఆశ్చర్యంతో గురువుగారి ముఖంలోకి చూచారు. చిరునవుతో గురువుగారు మరోసారి తన తలవైపున నేలను తట్టారు. విజయేంద్ర స్వామీజీవారు చెప్పిన చోట కూర్చున్నారు. విచారంగా గురువుగారి ముఖంలోకి చూచాడు.
"విజయా!.. "
"గురూజీ!.. "
"మన అనుబంధం ఎన్ని సంవత్సరాలో గుర్తు వుందా!"
ఉందన్నట్లు విచారవదనంతో తలాడించారు విజయేంద్ర స్వామీజీ.
"చెప్పు!.. "
"ముప్పై ఆరు సంవత్సరాలు గురుదేవా!"
"ఆ.. ముఫ్ఫై సంవత్సరాలు.. ముఫ్ఫై ఆరు రోజులుగా మన మధ్యన జరిగిపోయినట్లు వుంది విజయేంద్రా! నాకు నీతో కలిసి మరి కొంతకాలం బ్రతకాలని వాంఛ" విరక్తిగా నవ్వారు గురూజీ.
కొన్ని క్షణాల తర్వాత.. "కానీ.. లేదు.. పొద్దు లేదు. సమయం ఆసన్నమైంది. నాకు ఒక కోరిక.. చివరి కోరిక.. తీరుస్తావా విజయేంద్రా!" అభ్యర్థనగా అడిగారు శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వాములవారు.
విజయేంద్ర స్వామీజీ వారి నయనాల్లో కన్నీరు. హృదయ సంకోచ వ్యాకోచ స్పందనలో వేగం మదిలో తీవ్ర కలవరం. గురువుగారి వదనంలోకి పరీక్షగా చూచారు.
"చెప్పండి గురూదేవా!.. " వణుకుతున్న పెదిమలు అప్రయత్నంగా పలికాయి. కళ్ళల్లో కన్నీరు చెక్కిళ్ళపైకి దిగజారాయి.
"నాకు జీవ సమాధి కావాలని వుంది విజయా! నా కోర్కెను తీరుస్తావా!" నీళ్ళు నిండిన కళ్ళతో దీనంగా స్వామీజీ వారు తన శిష్యుని ముఖంలోకి చూచాడు.
విజయేంద్ర స్వామీజీ వారు తన రెండు చేతులను జోడించి పెదవులకు అడ్డుగా నిలువుగా పెట్టూకొని గురువుగారి ముఖంలోకి దీనంగా చూచాడు.
"విజయేంద్రా!.. "
ఏం అన్నట్లు తలాడించారు. విజయేంద్ర స్వామీజీ వారికి గురువుగారి కోరిక.. వారి నోటినుండి మాటలను రానియ్యకుండా చేసింది. గురువుగారి ఆ నిర్ణయం, తనకు ఇష్టం లేదు కానీ.. తీర్చక తప్పదు. అది గురువుగారి చివరికోరిక అయినందున మనస్సున వేదన..
"విజయేంద్రా!" మరలా పిలిచారు గురుదేవులు.
"గురూజీ!.. "
"నన్ను లేవదీయ్యి!"
విజయేంద్ర స్వామీజీ వారి తలక్రింద నుంచి.. నడుము వరకూ తన ఎడమ చేతిని జరిపి వారిని లేపి కూర్చొన జేశారు. కూర్చొని.. గురువుగారు ఆనందంగా విజయేంద్ర స్వామీజీ ముఖంలోనికి చూచారు. తన చేతితో వారి కన్నీటిని తుడిచారు.
"నాయనా విజయేంద్రా!"
"గురూజీ!.. "
"అందరికి మరణం అఇచ్ఛాపూర్వకంగా జరుగుతుంది. నాకు అది ఇఛ్ఛాపూర్వకం కావాలి. ఆ తండ్రిని తలుచుకొంటూ ఆ అంధకార గృహంలో.. భూమాత గర్భంలో అతి ప్రశాంతంగా ఈ అవతారాన్ని చాలించాలి. నాకు ఆ విషయంలో శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఆదర్శమూర్తులు.. "
"గురూదేవా! మీ ఆ నిర్ణయం.. "
"మారదు విజయేంద్రా! అది నా నిర్ణయం కాదు. నాకు అది ఆ సర్వేశ్వరుల ఆదేశం. నాయనా!" ఎంతో సౌమ్యంగా తన మనో అభిప్రాయాన్ని శ్రీశ్రీ శంకర భూపతేంద్ర స్వాముల వారు ప్రియ శిష్యుడు విజయేంద్ర స్వామీ వారికి చెప్పారు.
శిష్యుని సాయంతో లేచి నిలబడ్డారు.. చెవిలో.. దగ్గరగా జరిగి శ్రీ విజయేంద్ర స్వామీజీ వారికి కొన్ని క్షణాలు చెవిలో ఏదో చెప్పారు. చూపుడు వ్రేలితో దక్షిణ దిశ వైపు చూపించారు. విజయేంద్ర కన్నా ముందు పరమ గురువుల ప్రియ శిష్యులుగా వున్న అక్షకుడు వారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రాలేదు.
వారు నిర్ణయించుకొన్న తొలి కార్తీకపు సోమవారం నాడు శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వామీజీ జీవ సమాధి అయినారు.. అప్పటి వారి శిష్యులు అరవై మంది. ప్రధముడు విజయేంద్ర స్వామీజీ. ఆ రీతిగా జీవితాన్ని ముగించిన శ్రీ శ్రీ శంకర భూపతేంద్ర స్వామీజీ వారి సమారాధన ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో శిష్యులందరూ జరుపుతారు.
ఆరోజుకు స్వామివారి శిష్యులు సంసార జీవనంలో వున్నవారు కొందరు వచ్చేవారు. అందరూ కలిసి శ్రీ గురునామ జపాన్ని.. గురూజీ సమాధికి నైవేధ్య దీపారాధనలను ఎవరికి వారు భక్తులు చేసికొనవచ్చుననే గురువు వాక్య ప్రకారం బయటి శిష్యులు.. ఆశ్రమ వాసులైన శిష్యులు కల ఆ సుదినాన్ని ఎంతో గొప్పగా దానధర్మాలతో పూజా పునస్కారాలతో పద్ధతిగా దీక్షగా జరుపుకొంటారు. పూర్తిరోజు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం అల్పాహారాన్ని సేవించి.. గురూజీ.. జగన్మాతాపితల నామసంకీర్తనలతో రాత్రంతా ఆనందంగా పరవశంతో గడుపుతారు.
బయటినుంచి వచ్చిన వారు.. మరుదినం ప్రాతఃకాల పూజాదులను చేసి.. భోజనం చేసి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఆసుదినం ఆనాటికి మూడువారాలు ఉంది. శ్రీ విజయేంద్ర స్వామీజీ దైవ అర్చనను ముగించారు. వచ్చిన వారితో.. శిష్యులతో కలిసి భోజనం చేశారు. భోజనానంతరం అరగంట సేపు ఆశ్రమం చుట్టూ వాహ్వాణి చేయడం వారికి పరిపాటి. అది ముగిశాక తన గదిలో గంటసేపు విశ్రాంతి.. ఆ తరువాత వేపచెట్టు అరుగుపైకి చేరారు. వచ్చిన వారిని ఆహ్వానించి.. వారి సమస్య సందేహాలను విని తగిన రీతిలో వారికి సలహాలను ఇచ్చి సాగనంపారు.
అనునిత్యం శిష్యులతో ధర్మచింతన.. ధార్మిక చింతనలను సాగిస్తారు. ఎక్కడైనా ఏదైనా సమస్య అన్న విషయం తెలిసిన ఆ ప్రాంతానికి సహాయ కార్యక్రమాల నిర్వహణకు కొందరు శిష్యులను పంపుతారు. ఆశ్రమంలో అన్ని రకాల ఫల వృక్షాలు వున్నాయి. వృక్ష సంపద అంటే వారికి ఎంతో ప్రీతి. ఒక్కోసారి వాటితో మాట్లాడుతారు కూడా..
ఆ రోజు ఆ సమయంలో.. "విజయేంద్రా! వీబోవరా!.. సమయం ఆసన్నమైంది. వేకువనే కేరళ అలప్పీ బోట్ హౌస్ ప్రాంతానికి బయలుదేరు" వినిపించాయి ఆ పలుకు తన గురుదేవులు శ్రీ శ్రీ శంకర అద్వైత స్వామీజీ వారివి.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments