top of page

వీభోవరా - పార్ట్ 27

Updated: Nov 2

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

ree

Veebhovara - Part 27 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 27/10/2025

వీభోవరా - పార్ట్ 27 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డీ ఐ జీ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. అది చూసిన  విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు.


బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు. దుర్గారావు అనే వ్యక్తి వలన అంగ వైకల్యం పొందిన విజయ్, సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు. గతంనుండి బయటకు వచ్చిన విజయేంద్ర, కాశ్యప శర్మ మృత దేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు. రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు. కాశ్యపశర్మ హత్యలో పాలుపంచుకున్న వారందరికీ  వీబోవరా పేరుతొ హెచ్చరిక లేఖలు అందుతాయి. 

  

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక వీభోవరా - పార్ట్ 27 చదవండి.. 


తపోశక్తి, మంత్రశక్తి, యోగ దీక్షసాధనతో సాధించలేనిదంటూ ఈ జగతిన ఏదీ లేదు.

సమయం వేకువన మూడు గంటల సమయం. శ్రీ విజయేంద్ర స్వామీజీ, శివానంద, నదిలో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చారు. మిగతా శిష్యులందరూ నిదురించే సమయం అది.


తన గురువుగారి గదిలో వుంచిన కాశ్యపశర్మ దేహాన్ని ఆ కంటైనర్ నుండి బయటికి తీశారు. 


"శివానందా! చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం వున్నాయిగా.. జాగ్రత్త. గదిలోనే కూర్చొని ధ్యానాన్ని ప్రారంభించు. అందరికీ చెప్పావు కదా మన ఇరువురినీ వెదకవద్దని. నేను రాత్రి కేశవానందకు చెప్పాను."


"కేశవుడు నాతో చెప్పాడు స్వామీజీ!"


"సరే!.... జాగ్రత్త!" కాశ్యపశర్మ ప్రక్కన పడుకొన్నారు శ్రీ విజయేంద్ర స్వామీజీ.


పదినిముషాలు గడిచాయి. 

’పరకాయ ప్రవేశం’ జరిగింది. 


చిత్రమైన శబ్దం వినిపించింది శివానందకు. కాశ్యప శర్మ లేచి నిలుచున్నాడు. చిరునవ్వు నవ్వుతూ శివానంద ముఖంలోకి చూచాడు.

శివానందుడు ఆశ్చర్యపోయాడు.


చిరునవ్వుతో కాశ్యపశర్మ కుడి పిడికిలిని బిగించి గదినుండి బయటికి వచ్చాడు. తన చేతిలోని విభూతిని నోటితో గాలిలో ఊదాడు. ఐదునిముషాల్లో తెల్లని అశ్వరాజం వారి ముందు నిలబడింది. 


కాశ్యపశర్మ గుర్రం వెనుక నుండి ఎగిరి దానిపై కూర్చున్నాడు. కాళ్లతో చేసిన సౌంజ్ఞతో గుర్రం పరుగును ప్రారంభించింది. శివానందకు అంతా అయోమయంగా తోచింది. తెప్పరిల్లుకొని గదిలోనికి వెళ్ళి తన స్వామీజీ విజయేంద్ర స్వామీజీ వారి పాదాన్ని తాకి చూచారు. అవి ఐస్ గడ్డలా చల్లగా తగిలింది. కాశ్యప శర్మ ధవళఅశ్వం, ఆకాశ మార్గంలో పరుగిడసాగింది. పుణ్యాత్ములు కొందరికి ఆ విచిత్ర దర్శనం లభించింది. గుర్రం అలప్పీ పురం వీధుల్లో దిగింది. కాళ్ళ డెక్కల లయ బద్ధ శబ్దంతో బోట్ హౌస్ ప్రాంతానికి చేరింది.


ప్రముఖుల బోట్, జల మధ్యలో వుంది. తీరానికి బోట్‍కు ముక్కాలు మీటర్ దూరం. అక్కడినుండి మరో చిన్న బోట్‍లో తీరానికి వచ్చి కావలసిన సామాగ్రి, మందు, ఫలాలను కొనుగోలు చేసి కలకత్తా ఖాన్ వారి బాస్ ముస్తఫా మున్నా, రొయ్యల రోశమ్మ, బద్వేలు బాలమ్మలు నలుగురూ సామాగ్రి చిన్నబోట్లో ఎక్కించి, బోటులో ఎక్కబోయే సమయం.

శ్వేత అశ్వంపైన కాశ్యప శర్మ, చేతిలో పొడుగాటి కత్తితో వారిముందు ప్రత్యక్షం....

"వీభోవరా!...." అరుపు....


కాశ్యపశర్మను చూచిన కలకత్తా ఖాన్ గుర్తుపట్టాడు. ’దయ్యం.... దయ్యం...’ భయంతో చిందులు త్రొక్కాడు. మరుక్షణంలో అతని తల తెగి నీళ్లల్లో పడి తేలసాగింది. తరువాత ముస్తఫా మున్నా తల కూడా తెగి నీట పడింది. ప్రళయ రుద్రుడులా ఎర్రని కళ్ళతో నెరిసిన జుట్టు, గడ్డంతో భయంకరంగా కనిపించే కాశ్యప శర్మను చూచి రొయ్యల రోశమ్మ, బద్వేలు బాలమ్మ స్పృహ కోల్పోయి నేలకూలారు.


మాయమై కాశ్యపశర్మ బోట్ హౌసులో ప్రవేశించాడు. రొయ్యల రోశమ్మ హితుడు, రాణపేట రంగా... వజ్రాల వరహాలు హితుడు, బాంబే బాబా... సాల్మన్ శాస్రి... దుర్గారావుతనయుడు జూనియర్ భీమారావు.... ఆరుమంది మందు తాగి నాట్యం చేస్తున్నారు. పాటలు ఎవరి నోటికి వచ్చింది వారు పాడుతూ మహా సంబరంలో వున్నారు. 

"వీభోవరా!...." అది సింహగర్జన....


అందరూ పాటాఆటను ఆపి కాశ్యపశర్మను చూచారు. భయంతో వణికిపోయారు. ఆవేశంతో ఒకరి తరువాత ఒకరి తలలను తెగనరికి నీట విసిరాడు కాశ్యపశర్మ.

ఎనిమిది తలలు ఏకకాలంలో నీటిపై తేలాయి. దుష్ట సంహారం ముగిసింది. వీభోవరా వికటంగా పెద్దగా నవ్వాడు. కొన్ని క్షణాల్లో అతని ఆవేశం అంతరించింది.


మరుక్షణం ఒడ్డున వున్న అశ్వాన్ని సమీపించాడు కాశ్యపశర్మ. 

రొయ్యల రోశమ్మ, బద్వేలు బాలమ్మలు, లేచి, భయంతో వూరివైపుకు పరుగిడసాగారు.

వారి వెనుకాల కాశ్యపశర్మ గుర్రం....


భయాందోళనతో పరుగిడుతున్న రోశమ్మ, బాలమ్మలు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. తలలు పగిలి నేలకూలారు.

కాశ్యపశర్మ ఆశ్వం గగనానికి ఎగిరింది....

బోట్‍మెన్ ఊర్లోకి పరుగెత్తి తాను కళ్ళార చూచిన హత్యల విషయాన్ని కనబడినవారికల్లా చెప్పాడు.


కొందరు బోట్ హౌస్ ప్రాంతానికి చేరారు. పత్రికా విలేఖర్లు, ఫొటోగ్రాఫర్స్ వచ్చారు. ఫొటోలు తీశారు. ఇంతలో స్థానిక పోలీసులు వచ్చారు. మెల్లగా చిన్నబోట్లో పెద్దబోట్ హౌసులో ప్రవేశించారు. తలలు లేని ఎనిమిది మొండాలను, శవాలను చూచారు. ఆశ్చర్యపోయారు. స్పెషల్ న్యూస్ పేపర్లో విడుదలైనాయి.


శివానంద కళ్ళు మూసుకొని ధ్యానంలో వున్నాడు.

"శివానందా!" అది తన గురువుగారి పిలుపు. కళ్ళు తెరిచి భయం భయంగా చూచాడు శివానంద. ఎదురుగా తన గురూజీ చిరునవ్వుతో కనిపించాడు. 

గదిలో వారి స్థానంలో కాశ్యపశర్మ శవం. ఇరువురూ కలిసి శవాన్ని కంటైనర్‍లో పెట్టి మూశారు.


సమయం ఆరుగంటలు. అరుణకాంతులు ఆశ్రమాన్ని చుట్టుముట్టాయి. శిష్యులందరూ లేచి వారి వారి కార్యక్రమాలను ప్రారంభించారు.

శ్రీ విజయేంద్ర స్వామీజీ, శివానంద, నదికి నడిచారు. స్నానం చేసి సూర్య నమస్కారాలు చేశారు. 


రుద్రమ దేవికి అందరితో కలిసి రావలసిందిగా వర్తమానాన్ని ఒక శిష్యుని ద్వారా పంపారు స్వామీజీ.


మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం. స్వామీజీ తన శిష్యులందరినీ బోధనామందిరానికి పిలిపించారు. సాధారణంగా ఆ సమయంలో గురు శిష్యుల సమావేశం జరుగదు. కారణం ఏమిటా అని అందరూ ఆశ్చర్యంతో గురువుగారి రాకకు ఎదురు చూడసాగారు.


శ్రీ విజయేంద్ర స్వామీజీ ఆ మందిరంలో ప్రవేశించారు. దూరంగా నిలబడి వున్న శివానందను దగ్గరకు పిలిచారు. శివానంద గురూజీని సమీపించారు.


"సంసారిక జీవనంలో వున్న నేను నలభై ఎనిమిది సంవత్సరాల క్రింద సన్యాసిగా ఈ ఆశ్రమంలో మారిపోయాను. నేను తిరిగి ఈనాడు సంసారిక జీవనాన్ని సాగించవలసిన అవసరం ఏర్పడినది. మీలో కొందరికి తెలుసు. నేను వారణాసి నుంచి ఒక మృతదేహాన్ని తెప్పించానని. ఆ చనిపోయిన వారు ఎవరో కాదు, నా సోదరులు. నాకంటే చిన్నవాడు.... వాడి ఖర్మ క్రతువులను జరిపించడం మనిషిగా నా ధర్మం.


మొన్న ఆశ్రమానికి వచ్చిన డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ రుద్రమదేవి నా సోదరి. తర్వాత వచ్చినవారంతా నా బంధువులు. వారు త్వరలో రాబోతున్నారు. వారందరి సమక్షంలో నేను నా సోదరులకు అంత్యక్రియలు నిర్వర్తించాలి. ఈ సాయంత్రం బరకర్ లేదా భాక్రా నదీ తీరాన వారి దహనం జరుగుతుంది. మరో ముఖ్యమైన మాట. నా తర్వాత ఈ ఆశ్రమ నిర్వహణను నా ప్రియ శిష్యుడు శివానంద నిర్వహిస్తారు.


ముఫ్ఫైఆరు సంవత్సరాలుగా నా నీడలా నాతోనే వున్నారు. వారికి మీరంతా నాకు ఇచ్చే గౌరవాన్ని, మర్యాదను ఇవ్వాలని మీ అందరినీ సవినయంగా కోరుతున్నాను. నా విన్నపాన్ని చిత్తగించండి. " చేతులు జోడించారు శ్రీ విజయేంద్ర స్వామీజి వారు.


కొన్ని క్షణాలు  అందరినీ పరిశీలనగా చూచారు. తన గదివైపుకు నడిచారు. శివానంద వారిని అనుసరించాడు.


సమయం సాయంత్రం మూడుగంటలు. రుద్రమ, మిగతవారంతా వచ్చారు. సత్యనారాయణ శర్మను కాశ్యప శర్మ అంత్యక్రియలను నిర్వహించవలసినదిగా శ్రీ విజయేంద్రస్వామీజీ వారు కోరారు.


శివానంద, కాశ్యపశర్మ గారి అంతిమ యాత్రకు కావలసిన ఏర్పాట్లను చేశారు. శ్రీ విజయేంద్ర స్వామీజి అనే విజయ శర్మ గారు మంత్ర పూర్వకంగా యజ్ఞోపవీతాన్ని ధరించారు. 


కాశ్యపశర్మ పార్ధీవ దేహానికి స్నానం చేయించారు. గంగ, గౌరి, బలి, శిబి, మాత, భాస్కరశర్మ మిగతా బంధువులు అందరూ కాశ్యపశర్మ పాదాలకు అశ్రునయనాలతో చివరి నమస్కారాన్ని చేశారు.


నలుగురు వాహకులు కాశ్యపశర్మ శవాన్ని స్మశానం వైపుకు తీసుకొని బయలుదేరారు. ముందు విజయశర్మ, ప్రక్కన, వెనుక బంధుమిత్రులు విచారవదనాలతో నడిచారు. శవం నది ఒడ్డుకు చేరింది. దించారు. సమిధలు పిడకలు పేర్చారు. విజయశర్మ, కాశ్యపశర్మ తలవైపు నిప్పంటించారు, అశ్రునయనాలతో. అందరూ కన్నీరు కార్చారు. కాశ్యపశర్మ అగ్నిజ్వాలల్లో కాలి బూడిదగా మారిపోయాడు. 


దశదిన ఖర్మ పది, పదకొండు, పన్నెండు రోజుల కార్యక్రమాలను విజయశర్మ, సత్యనారాయణ శర్మ గారి అధ్వర్యంలో యధావిధిగా నిర్వహించారు.


=======================================================================

ఇంకా వుంది..


=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page