top of page
Original_edited.jpg

వీభోవరా - పార్ట్ 28

  • Writer: Chaturveadula Chenchu Subbaiah Sarma
    Chaturveadula Chenchu Subbaiah Sarma
  • Nov 2
  • 5 min read

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #వీభోవరా

ree

చివరి భాగం

Veebhovara - Part 28 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 02/11/2025

వీభోవరా - పార్ట్ 28 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డీ ఐ జీ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. అది చూసిన  విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు.


బాల్యంలో అనాథ అయిన ఆయనను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటారు రామశర్మగారు. దుర్గారావు అనే వ్యక్తి వలన అంగ వైకల్యం పొందిన విజయ్, సన్యాసం స్వీకరించి విజయేంద్ర స్వామీజీ అవుతారు. గతంనుండి బయటకు వచ్చిన విజయేంద్ర, కాశ్యప శర్మ మృత దేహాన్ని తన వద్దకు తెప్పించుకుంటాడు. రుద్రమతో సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుస్తారు. కాశ్యపశర్మ హత్యలో పాలుపంచుకున్న వారందరికీ  వీబోవరా పేరుతొ హెచ్చరిక లేఖలు అందుతాయి. కేరళలోని బోట్ హౌస్ వద్ద అందరూ వధింపబడతారు.  

  

గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీభోవరా - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక వీభోవరా - పార్ట్ 28 (చివరి భాగం) చదవండి.. 


కేరళ పోలిసులకు బోట్ హౌసులో ’వీభోవరా’ అని వ్రాసి వున్న కాగితం దొరికింది. వారికి తెలుగు తెలియదు. చాలామందికి డిపార్టుమెంటులో చూపించారు.


చివరగా మదన్ అనే తెలుగు పోలీస్ కాగితాన్ని తీసుకొని వీభోవరా అని చదివాడు.

పత్రికలు వీభోవరా చేసిన బోట్ హౌస్ పై దండయాత్రను గురించి ’ఎనిమిదిమంది తలలను నరికి బ్యాక్ వాటర్‍లో పడేసిన విషయాన్ని గురించి “ఇది మహాదారుణం?.... ఎనిమిదిమంది ప్రాణాలను తిసిన ఆ వీభోవరా ఎవరు?... వారికి వీరికి ఏమిటి పగ?....”

ఆ రితిగా విచిత్రంగా వ్రాశారు.


వీభోవరా పేరు అందరి చెవులకూ అందింది. కేవలం కేరళ రాష్ట్రంలోనే కాదు. అన్ని రాష్ట్రాల్లో పత్రికలవారు ఆ విషయాన్ని ఆశ్చర్య సందేహాలతో ప్రచురించారు.


పాలకులు పోలీస్ అధికారులతో సమావేశం జరిపి ఆ వ్యక్తి ఎవరో వెదికి పట్టుకోవలసిందిగా ఆజ్ఞలను జారీచేశారు. ఉన్న పవర్‍తో ఆజ్ఞలను జారీ చేశారే కానీ... వారందరికి కూడా హృదయాల్లో తీవ్రమైన భయం, భీతి కలిగాయి.

పోలీస్ అధికారులు ప్రాణాలను పిడికిట పట్టుకొని వీభోవరా అన్వేషణను ప్రారంభించారు. ఆ వర్గానికి చెందినవారు జూనియర్స్ భయం భీతులతో బొక్కలోకి ఎలుకల వలే దాక్కున్నారు.


ఏ క్షణంలో ఆ మహాశక్తి, ’వీభోవర’ వచ్చి తమను చంపుతుందో లేక పోలీసులు పట్టుకొంటారో అనే దిగులు ప్రాణభీతితో గడగడ వణికిపోయారు. వారు సాగిస్తు సమాజ విద్రోహ వ్యాపారాలకు స్వస్తి పలికారు. బ్రతికి వుంటే బలుసాకు తిని బ్రతకవచ్చనుకొన్నారు.

దేశమంతా చిన్నా పెద్ద నోట ఒకేమాట ‘వీభోవరా!!??’ ప్రతిధ్వనించింది. 

ఉత్తములు, పాపాత్ములకు తగిన దండన జరిగిందని సంబరపడ్డాడు.

నీచులు ప్రాణభయంతో సభ్య సమాజంలో తిరగకుండా కనుమరుగయ్యారు. విదేశీయులు ఇంగ్లండ్ నిక్‍సన్, అరేబియా అల్లామియాలు, పాకిస్థాన్ పఠాన్ బాబాలు తమ అంతరంగికులు పదిమంది ఒక్కసారిగా హత్య చేయబడడంతో, వారి వారి వ్యాపారాలకు స్వస్తి చెప్పారు. వారికి భయం కలిగింది. ఆ మహాశక్తి నాయకుడు వారి వద్దకు వచ్చి వారిని చంపుతాడనే భయం.


కేరళ పోలిసులు ఆ చనిపోయిన వారికోసం ఎవరూ రానందున కార్పోరేషన్ లారీలో శవాలని వేసుకొని స్మశానానికి తీసుకు వెళ్ళి గుట్టగా పడేసి, కిరోసిన్ చల్లి తగలబెట్టారు.

రోజులు.... వారాలు.. వేగంగా సాగిపోయాయి. రెండు వారాలు గడిచినా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. గవర్నమెంటు నుంచి ఒత్తిడి. లోన ఏడుస్తూ ఫలితం లేని ప్రయత్నాన్ని చేస్తూనే వున్నారు పోలీసులు.


మొత్తానికి అన్ని డిపార్టుమెంట్సు ఉద్యోగుల్లోనూ, నాయకుల్లోనూ తీవ్రభయం ఏర్పడింది. గడ్డి తినడం మానేశారు. కాగితాల డిస్‍పోజల్ వేగంగా సాగ సాగింది.


భయం అన్నది ప్రతి ఒక్కరి అత్యవసరం. అది మనస్సున వుంటే కాలజాప్యం, లంచగొండితనం, మోసం, కుట్ర, కుతంత్రాలు ఏ మనిషీ చేయ సాహసించడు. మరుగున త్రోసిన ధర్మాన్ని గౌరవించి తమ తమ విధులను శ్రద్ధతో కాలహారణం లేకుండా, సకాలంలో నెరవేర్చకలుగుతారు. దేశమంతా ఈ ప్రభంజనం ప్రాకిపోయింది.

శ్రీ విజయేంద్ర స్వామీజీ ఆశ్రమానికి పోలీస్ అధికార్లు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. విచారించారు. కానీ అక్కడ వారు వెదుకుతున్నది,


చూడాలనుకొంటున్నది ఏదీ వారికి గోచరించలేదు. ఆలయంలోని జగత్ మాతా పితలకు, స్వామీజీలకు నమస్కరించి వెళ్ళిపోయారు. వయోవృద్ధులు ’ఆహా. కాలం ఎంత ప్రశాంతంగా వుంది. అధికారులు ఎంత గొప్పగా వారి వారి ధర్మాలను పాటిస్తున్నారు’ అనుకొని ఆనందించారు.


ఆశ్రమానికి కాశ్యపశర్మ క్రతువులకు వచ్చినవారంతా తిరుగు ప్రయాణానికి సన్నద్ధులైనారు.


విజయశర్మను సమీపించారు.

గంగ.... వారి చెంతకు తన ముగ్గురు పిల్లలతో చేరింది. 

’ఏం’ అన్నట్లు చిరునవ్వుతో చూచాడు విజయశర్మ.


"నేను మిమ్ములను బావగారూ అని పిలవచ్చునా!" దీనంగా అడిగింది. 


"పిలువు తల్లీ!"


"బావగారు! నాకు మనశ్శాంతి కావాలి. ప్రసాదించండి."


"లక్ష్యంతో దైవచింతనను దీక్షగా సాగించు గంగ. ఇలారా!"


గంగ వారికి దగ్గరగా నడిచింది.

"తలను వంచు!"


గంగ తలను వంచింది.

ఆమె చెవిలో "ఓం నమఃశివాయ.... ఓం నమో నారాయణాయ" మూడుసార్లు మెల్లగా చెప్పాడు.


"గంగా!.... మనం అద్వైతులం. మనకు శివకేశవ భేదం లేదు. సర్వేశ్వరులు ఒక్కరే. వారికి శతకోటి నామాలు. చెప్పిన దాన్ని ఎప్పుడూ మననం చెయ్యి. నీవు కోరుకొన్నది నీకు లభిస్తుంది." తన కుడిచేతిని ఆమె తలపై ఉంచి దీవించాడు.


గంగ పెదవులపై చిరునవ్వు....

సత్యనారాయణ శర్మ వారిని సమీపించారు.

విజయశర్మ లేచి వారి పాదాలకు తన శిరస్సును తాకించారు. 


"మామయ్యా! నా కోర్కెను మన్నించి నా సోదరుని అంత్యక్రియలను నా ఇష్టానుసారంగా మీరు జరిపించారు. నాకు పరమానందం. మీలాంటి పెద్దల దీవెనలు నాకు అవసరం. దీవించండి" ప్రాధేయపూర్వకంగా కోరాడు.


సత్యనారాయణశర్మ వారిని లేవనెత్తి హృదయపూర్వకంగా దీవించాడు.

భాస్కరశర్మ అశ్రునయనాలతో వారిని సమీపించాడు. 

విజయశర్మ చిరునవ్వుతో భాస్కర్ కన్నీళ్ళను తుడిచాడు. 


"నాన్నా! భాస్కరా!... మన తండ్రి ఎంతో గొప్ప మహనీయులు. వారి కడుపున పుట్టిన నీవు వారి ఖ్యాతిని ద్విగుణీకృతం చేసే రీతిలో బ్రతకాలి. నీ వృత్తి న్యాయవాద వృత్తి. దానికి ఏనాడూ కళంలం ఆపాదించే రితిగా వర్తించకు. సత్యం, ధర్మం రెండూ మన కళ్ళలాంటివి. వాటిని కాచి రక్షించడం ప్రతి వ్యక్తి ధర్మం. అదే నీ ధర్మం నాన్నా. నాలుగైదు సార్లు నీ భార్యకు గర్భం విఛ్ఛినమైనది కదా!.... ప్రస్తుతం గర్భిణి కదా!... మన నాన్న పుడతాడయ్య. ఆమెకి నా ఆశీస్సులు సదా నీవెంట వుంటాయి" చిరునవ్వుతో చెప్పి భాస్కర్‍ను దీవించాడు.


రుద్రమ వారిని సమీపించింది.

ఆమె కళ్ళల్లో కన్నీరు....

"రుద్రమా! అమ్మా!... ఏమిట్రా ఆ కన్నీరు? అది నీకు తగదురా!"


ఆ మాటల్లో రుద్రమకు ఎంతో ఆప్యాయత గోచరించింది.

"అన్నయ్యా!...." 


"నేను అప్పుడప్పుడూ ఇక్కడికి రావచ్చా!"


"ఇది పరమ పవిత్రమైన ఆశ్రమం. దైవంమ్మీద నమ్మిక కలవారు ఆస్థికులు ఎవరైనా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు."


రుద్రమ తలవంచి చేతులు జోడించింది.

"అఖండ కీర్తి ప్రతిష్టలు నీ సొంతం అగుగాక!" కుడిచేతిని ఆమె తలపై వుంచి ప్రీతిగా దీవించాడు.


మిగతావారంగా దగ్గరకు వచ్చి నమస్కరించారు.

"సర్వేశ్వరులు మీ అందరి మనోకామితార్థాలను నెరవేర్చుగాక!" హృదయపూర్వకంగా దీవించాడు విజయశర్మ.


గంగ కూతురు అమ్మ ధైర్యశాలి విజయశర్మకు దగ్గరగా వచ్చి... "మీరు నాకు పెదనాన్న గారు కదూ!" అడిగింది.


ఆమె భుజాలను ప్రీతిగా పట్టుకొని ముఖంలోకి చూస్తూ.... "అచ్చం మా అమ్మ!.... అమ్మా!... అవును తల్లీ!...."


"నేను ఒకటి అడగనా?"


"అడుగు అమ్మా!"


విజయశర్మ దగ్గరకు జరిగి చెవి చెంత....

"వీభోవరా అంటే ఏమిటి పెదనాన్నా!"


విజయశర్మ నవ్వుతూ"....వీరభోగ వసంత రాయలు, తల్లీ..." అన్నాడు.


అందరూ వారికి నమస్కరించి వాహనాలను సమీపించారు. కూర్చొన్నారు. మూడుకార్లు బయలుదేరాయి. అంతా చూస్తున్న శివానంద....

"గురుదేవా!..." పలకరింపు.


"ఆ.... వస్తాను శివా!..."


తన గదికి వెళ్ళి మంత్రపూర్వకంగా యజ్ఞోపవీతాన్ని తీసివేశారు. రుద్రాక్షమాలను మంత్ర జపంతో ధరించారు. ప్రార్థనా మందిరానికి సన్యాసిగా వచ్చారు. తన ఆసనంలో కూర్చున్నారు. శిష్యులకు బోధన ప్రారంభించారు శ్రీ శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు. 


"ఓం శ్రీ శ్రీ శంకర అధ్వైతేంద్రస్వామినే నమః

ఓం నమో శ్రీ భగవాన్ రమణేశ్వరాయ.... ఓం నమోశ్రీ భగవాన్ రమణేశ్వరాయ

ఓం నమోశ్రీ భగవాన్ రమణేశ్వరాయ!.....

 

==============================================================================

సమాప్తి

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ చతుర్వేదుల

చెంచు సుబ్బయ్య శర్మ గారి తరఫున, మనతెలుగుకథలు డాట్ కామ్ వారి తరఫున

ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


==============================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page