పంచభూతాలకు కొత్త రూపం

'Panchabhuthalaku Kotha Rupam' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
నీకు కులములేదు రూపులేదు...గాలీ చిరుగాలీ నీవులేనిదే ఊపిరిలేదు
నీకున్నది ఒకటే సేవా భావం !
నీవూరు నీలాకాశం నీకంటూ ఒక చోటులేదు నీ అందానికి సాటిలేదు
ప్రపంచమంతా నీదే!
వెలుగునిస్తావు నీవులేనిదే మనుగడలేదు ....ప్రాణికోటికి జీవములేదు
నీదు జన్మ ధన్యము ప్రభాకరా !
చీకటి అంటే ప్రాణికోటికి విశ్రాంతి.... నిశాచరులకు బ్రతుకుతెరువు నిర్దేశం
విషాదాలకు తెరచాటుకూడా నా !
ఎప్పుడో బడబాగ్ని రగిలిస్తావు..... ఆగ్రహిస్తే అడవుల సైతం ఆహుతిచేస్తావు
ఏమున్నది దీనివెనుక మర్మం?
వర్షపునీరు ప్రాణికోటికి జీవనాధారంగా ...ఎక్కడోపుట్టి నదులుగా మారి వరదలై పొంగి
సాగరుని చేరుతావు!
పంచభూతాలూ ప్రకృతికి సాక్ష్యాలు....మానవుల మనుగడకు అవసరాలు
వాటిని పదిలంగా ఒడిసిపట్టి కాపాడుకుందాం!
ప్రాణికోటి పెరిగి కోట్లు దాటుతోంది...అవసరాలు చాలడంలేదు
మనిషిమేధా కొత్తదారి వెతుకుతోంది!
నింగి నంటే భవనాలు వెలిసినా .... భూమిమీద నిర్మాణాలకు చోటు చాలకుంది
చంద్ర మండలానికి నిచ్చెనవేసింది !
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
అందమైన ప్రకృతికి భాష్యాలెన్నో( కవిత )
అమ్మ చెప్పిన కమ్మని మాట( కవిత )
ఝాపక(జ్ఞాపక) పరిమళాల పూల గుచ్ఛం ( కవిత )

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.