top of page
Original.png

వారం వారం బహుమతులు - ఏప్రిల్ 2026



వారం వారం బహుమతులు - ఏప్రిల్ 2026 - Weekly Prizes - April 2026 By manatelugukathalu.com Published In manatelugukathalu.com On 15/05/2026

మనతెలుగుకథలు.కామ్ వారి వారం వారం బహుమతులు ఏప్రిల్ 2026

నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్


విషయ సూచిక

1). బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2). విజయదశమి 2026 కథల పోటీలు

3). ఉగాది షడ్రుచుల కథల పోటీలు

4). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) ఏప్రిల్ 2026  ఫలితాలు

5). ఏప్రిల్ 2026 ఉగాది షడ్రుచుల కథల పోటీల ఫలితాలు

6). గమనిక


1). బహుమతులకు సహకరిస్తున్న వారు

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.


రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీ భళ్ళముడి నాగరాజు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*G. S. S. కళ్యాణి గారు తమ అమ్మమ్మాతాతయ్యలు కీ. శే. ఉప్పలూరి సత్య ఫల్గుణ వెంకట అప్పారావు మరియు కీ. శే. ఉప్పలూరి లలిత నాంచారమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక బహుమతుల ఎంపికలో కూడా మాకు సహకరిస్తున్నారు.


*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


గతంలో కొసమెరుపు కథల పోటీలు, హాస్య కథల పోటీలు స్పాన్సర్ చేసిన శ్రీ కర్లపాలెం హనుమంత రావు గారు ఇప్పుడు ఉగాది షడ్రుచుల కథల పోటీలు స్పాన్సర్ చేస్తున్నారు.

( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )


*M. K. కుమార్, భళ్ళముడి నాగరాజు, Dr. లక్ష్మీ రాఘవ కామకోటి, Dr. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, Dr. M. N. బృంద, శ్రీపతి లలిత, కర్లపాలెం హనుమంత రావు ఇంకా మరికొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.


తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే మా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నందుకు వీరందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


2). విజయదశమి 2026 కథల పోటీలు:

విజయదశమి 2026 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి    : రూ: 5000 /- 

ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి: 



3). ఉగాది షడ్రుచుల కథల పోటీలు:

కీ.శే. కర్లపాలెం మోహనరావు గారి స్మారక పురస్కారం

  • 🥇 ప్రథమ బహుమతి – ₹500

  • 🥈 ద్వితీయ బహుమతి – ₹300

  • 🥉 తృతీయ బహుమతి – ₹250

👉 ప్రతి నెల 3 బహుమతులు 

👉 మొత్తం 12 నెలలు ఈ పోటీ కొనసాగుతుంది 

👉 ఒక రచయితకు ఒకసారి మాత్రమే బహుమతి.


బహుమతులను శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.

పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి:


4). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) ఏప్రిల్ 2026  ఫలితాలు: 

అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2026 వరకు పొడిగిస్తున్నాము.

రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.


ఏప్రిల్ 2026 వారం వారం బహుమతుల ఫలితాలు: ( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)

5). ఏప్రిల్ 2026 ఉగాది షడ్రుచుల కథల పోటీల ఫలితాలు:

(కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)


విజేతలకు మా అభినందనలు.

వారికి వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు ప్రశంసాపత్రం పంపడం జరిగింది.

బహుమతి మొత్తం 22/05/2026 లోగా పంపడం జరుగుతుంది.

పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.


మల్లవరపు సీతారాం కుమార్

గౌరవ సంపాదకులు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page