top of page

ఈసునసూయలు


'Esunasuyalu' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుజన కి హాల్లో వదిన చెల్లెలు సరోజ కనిపించేసరికి హాయ్ సరోజా ఎప్పుడొచ్చావని పలుకరించింది.


నేను పొద్దుటే వచ్చాను సుజా ! ట్రైన్ రెండుగంటలు లేట్. నేను వచ్చేసరికి నీవు ఆఫీస్ కు వెళ్లిపోయావని అక్క చెప్పింది అనగానే, అవునా, సారీ.. నీవు వస్తావని నాకు తెలియదు సరోజా అంటూ, కుశల ప్రశ్నలు వేసాకా బట్టలు మార్చుకొస్తానని చెప్పి లోపల తన గదిలోకి వెళ్లింది !


వదిన చెల్లెలు సరోజ. పెద్దగా చదువు అబ్బలేదు. వదిన ఎవర్తోనో అనగా తను వింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏదైనా కోర్సులో జాయిన్ చేయాలి మా చెల్లెలని అంటూ ! తన చెల్లెలు చాలా తెలివైనదని , అందగత్తె అని అందరికీ చెపుతుంది. తన చెల్లెలిని వివాహం చేసుకోడానికి ఫారిన్ సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయని మరీ చెపుతుంది తనని క్రీగంట చూస్తూ ! తనకు ఆమె చెప్పే విషయాల పట్ల ఆసక్తి లేదు !


సుజన బి.బీ.ఏ చేసి " సుందరమ్ ఫైనాన్స్ " లో పనిచేస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యావిధానంలో ఎమ్.బి.ఏ చేస్తోంది. తల్లీ తండ్రీ రెండు సంవత్సరాల వ్యవధిలో పోతే అన్నయ్యా వదిన దగ్గర ఉంటోంది. సుజన వదిన రోహిణి చెప్పాలంటే అహంభావి ! సుజన అంటే జాలి ప్రేమ లేకపోగా ఒకరకంగా అసూయ ఉంది ఆమెకు. చక్కని ఉద్యోగం, అందం, సంస్కారం కలిగిన సుజనను చాలా మంది అభిమానిస్తారు. సుజనను ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ చిన్నబుచ్చడం, కాస్తంత అందంగా తయారయితే ఓర్వలేకపోవడం, సుజనకు జీతం రాగానే ఆమె జీతంలో మూడువంతుల భాగం తీసేసుకుంటుంది. పైగా సుజనతో నీవు డబ్బు ఖర్చుచేసేస్తావని, నేను దాచిపెడ్తానని అంటుంది. సుజనకు అన్నీ తెలిసినా మౌనంగా ఉండిపోతుంది. సుజన కొలీగ్ ' వాసవి అంటూ ఉంటుంది, అక్కడ నుండి వచ్చేయి సుజా, నేను ఎలాగూ ఎపార్ట్ మెంట్ లోఉంటున్నాను కదా, ఇద్దరం కలసి ఉందామని. ఆరోజు వస్తే చూద్దాములే అంటూ నవ్వేస్తుంది !


సరోజ వచ్చినప్పటి నుండి రోహిణి ప్రవర్తన మితిమీరిపోయింది. తన చెల్లెలిని నెత్తిమీద పెట్టుకుంటూ, ప్రత్యేకంగా ట్రీట్ చేయడం, బలహీనంగా ఉన్నావంటూ పళ్లరసాలూ అవీ బ్రతిమాలుతూ త్రాగించడం, భోజనం కొసరి కొసరి వడ్డిస్తూ గారాబం చేయడం అవీ చేస్తోంది ! తను అక్కడ ఉంటే మరీ రెచ్చిపోతోంది వదిన . అందం లేకపోయినా విపరీతమైన మేకప్ చేసుకునే సరోజకు సుజన చూస్తుండగానే రాళ్ల ఉప్పుతో దిష్టితీసేది రోహిణి ! సుజన ఆఫీసు నుండి కాస్త లేట్ గా వస్తే సరోజ ఎదురుగానే అనేక ఆరాలు తీయడం సుజనకు చాలా బాధ గా ఉంటోంది. తనకు అన్నయ్యా, వదినా తప్పించితే నా అనే వాళ్లెవరూ లేరు ! అన్నయ్య వదినకు ఎదురుచెప్పలేని నిస్సహాయుడు.


తన పరిస్తితి అంతా చూచాయగా తెలిసిన కిరణ్ తనకు ధైర్యం చెబుతూ మెయిల్ ఇస్తూ ఉంటాడు. ఇంకొక ఆరునెలలు ఓర్చుకో సుజా, నిన్ను నా దాన్నిగా చేసుకుంటానంటూ. కిరణ్ ,సుజనా ఇంటర్ వరకు కలసి ఒకే కాలేజీలో చదివారు. ఇంటర్ తరువాత కిరణ్ ఇంజనీరింగ్ చదవడం, తరువాత IISC బెంగుళూర్ లో ఎమ్ టెక్ చేసాడు. వాళ్ల స్నేహం అలా సాగిపోతుండగా, ఉన్నట్టుండి కిరణ్, తన ఎమ్ .టెక్ పూర్తి అయిపోయి ఉద్యోగం లో చేరిన వెంటనే సుజనని ప్రపోజ్ చేస్తూ అడిగాడు, సుజనను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని, ఆమె అభిప్రాయం ఏమిటో చెప్పమనేసరికి సుజన ఆలోచించి చెపుతానని కాస్త సమయాన్ని కోరడం, ఆ తరువాత కిరణ్ ని అతని కంపెనీ ఆఫీస్ పనిమీద రెండు సంవత్సరాలకు లండన్ పంపించింది. లండన్ వెళ్లిన కొన్ని రోజుల తరువాత సుజనని అడిగాడు. ఏమి ఆలోచించావు సుజా అని ! అతనిని వివాహం చేసుకోడానికి తన అంగీకారాన్ని తెలిపింది ! ఇంకో నాలుగైదు నెలల్లో కిరణ్ ప్రోజక్ట్ అయిపోయి ఇండియా వచ్చేస్తాడు !


కాలానికి వేగం ఎక్కువ అన్నట్లు ఒకరోజు సుజన ప్రొద్దుటే లేచి తలంటు పోసుకుంది. తుమ్మెద రెక్కల్లాంటి ఒత్తెన శిరోజాలను అలాగే దువ్వి ఒక క్లిప్ పెట్టేసింది ! చక్కని పట్టుచీర కట్టుకుని ముస్తాబైంది. తన తల్లి పచ్చల నెక్లెస్ ను మెడలో ధరించింది. ఆ మధ్య తన కంపెనీ బోనస్ ఇస్తే, చెవులకు పెద్ద పెద్ద బంగారు బుట్టలు కొనుక్కుని, తరువాత వదినకు చూపిస్తే, వదిన రుస రుస లాడిపోయింది. బాగున్నాయని కూడా అనలేదు. ఆరోజు అన్నీ ధరించి అద్దం ముందు ముస్తాబు అవుతోంది. అసలే అందమైన సుజన ఆ అలంకరణలో పచ్చగా మెరిసిపోతోంది. ఏవో కొత్త అందాలు ఆ అమ్మాయి ముఖంలో దోబూచులాడుతున్నాయి. రోహిణి సుజన వైపు చూస్తూ " ఎవరి కోసం తల్లీ ఈ అలంకరణ, మీ ఆఫీసులో మొగాళ్లంతా ఈరోజు పనిచేయకుండా నిన్నే చూస్తారని వెటకారాంగా అనేసరికి సుజన "పోనీలే వదినా, నేను తిరిగి రాగానే నాకు కూడా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేయ్ " అంటూ, హేండ్ బేగ్ తీసుకుని, ఆ... వదినా... సాయంత్రం నీవూ, సరోజా రెడీగా ఉండండి, అన్నయ్యకు కూడా నేను చెపుతానులే, ఒక పార్టీకి వెళ్లాలి మనమంతా అంటూ కేబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది సుజన వెళ్లిన వైపే చూస్తూ మూతి తిప్పుకుంది రోహణి !

ఆసాయంత్రం రోహిణి భర్త మోహన్ రోహిణితో తన చెల్లెలు ఈరోజు ఉదయాన్నే కిరణ్ అనే వ్యక్తిని రిజిస్టర్ మేరేజ్ చేసుకుందని చెప్పాడు.. తనుకూడా వెళ్లి వచ్చానని చెప్పేసరికి రోహిణి హృదయం భగ భగ మని మండిపోయింది..

ఎవడో ఆ రాకుమారుడు అంటూ వ్యంగంగా అనేసరికి ' నిజంగానే రాకుమారుడు' , ఇద్గరూ ఎప్పటినుండో ప్రేమించుకుంటున్నారట అనగానే 'ఆ...ఎవడో ... అంతకు తగ్గ బొంత అయి ఉంటాడులే అని సంబరపడుతూ, తమకు ఖర్చు , శ్రమ తప్పిందని మురిసిపోతున్న రోహిణితో చెప్పాడు, తన చెల్లెలు వివాహం చేసుకున్న కిరణ్ గురించి, అతని చదువు , ఉద్యోగం , ఆస్తిపాస్తులు గురించి !

ముఖం తెల్లగా పాలిపోయింది. ఈలోగా సుజన, కిరణ్ కారులోంచి తమ ఇంటి ముందు దిగారు. కిరణ్ ను చూడగానే రోహిణి తల తిప్పుకోలేకపోయింది, అంత అందంగా ఉన్నాడతను !. పచ్చని మేని ఛాయతో, చక్కని శరీరాకృతి తో మెరిసిపోతున్నాడు. పట్టు బట్టల్లో, మెడలో పూల దండలతో మెరిసిపోతున్న ఆ దంపతులను చూస్తూ రోహిణి ముఖం నల్లగా మాడిపోయింది..

వదినా, " మాకు హారతి ఇచ్చి లోపలకి ఆహ్వానించవా ఏమిటీ " అని సుజన నవ్వుతూ మాటలాడేసరికి, ఇంక తప్పదనుకుని, ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ లోపలకి నడిచింది రోహిణి !


అన్నయ్యా వదిననూ పక్క పక్కనే నిలబడమంది.. నూతన దంపతులిరువురూ వారిరువురికీ పాదాభివందనం చేసారు..

ఆ సాయంత్రం నూతన దంపతులు ఇస్తున్న మేరేజ్ రిసెప్షన్ కు జూబ్లీహిల్స్ లోని హొటల్ దస్పల్లా కి అందరూ బయలదేరారు !

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఆనంది

పుష్యమి

అవకాశాలూ - విలువలూ

నీ మనసంటే ఇష్టం

మనసు - మార్పు

మౌన మంత్రం

తోడబుట్టినవాడు

ఈ జన్మకీ శిక్ష చాలు

అత్త ఒడి

శుభవార్త

వచ్చెను కనవే ఆమని

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి

ప్రేమకు ఆవలి తీరం

ఒక ఇల్లాలి కధ

తీరం చేరిన కెరటం

చేసుకున్నవారికి చేసుకున్నంత

మానస వీణ

సొంత ఇంటి కల

మమతలూ - అనుబంధాలు

అపర్ణ

రివార్డ్

కురువింద

డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్

పరిణితి

తరాలూ - ఆంతర్యాలూ

నీతోనే నా జీవితం

హేపీ ఉమెన్స్ డే !

మా బామ్మ మాట బంగారు బాట


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


46 views0 comments
bottom of page