top of page

ఎటుపోతోంది ఈ తరం?


'Etupothondi Ee Tharam' Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ


''అమెరికా వెడతాను....అని ఆకాష్ చెప్పినపుడు కౌశిక్ అదిరిపడ్డాడు, అనుకున్నంతా అయినందుకు.

అందుకోసమే పుట్టి ఆ ఆశయంతోనే పెరిగి ఎప్పుడు అమ్మ నాన్నలను విడిచిపోదామా అని ఈ దేశంలో లేని సర్వ సుఖాలు అనుభవిద్దామా అని ఎదురు చూస్తున్నారు ఈతరం.

కొందరు తల్లితండ్రులు కూడా అలాగే పిల్లలను పెంచుతున్నారు.

ఆకాష్ నిర్ణయాన్ని సుకన్య భరించగలదా అనుకున్న కౌశిక్ ''నాకు చాలా ఆనందంగా వుంది. నాఫ్రెండ్ పిల్లలు అందరూ అమెరికా వెడితే నాకు చిన్నతనం అనిపించేది'అంటూ కొడుకుని మెచ్చుకుంది సుకన్య.

కాలేజీ నుంచి రావడం ఆలస్యం అయితే బెంగపడి ఏడ్చి రాగాలు పెట్టి ఒకటే హంగామా చేసేది. అలాంటిది ఇప్పుడు అమెరికా మోజు పట్టించుకుందన్నమాట. వున్నవాడు ఒక్కడు . వాడు ఏళ్ల తరబడి కనిపించకపోతే ...అనుభవంలోకి వచ్చాక గానీ తెలియదు.


పోనీ కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉండటం మంచిదే అనుకున్నాడు మనసులో.

ఆకాష్ ఆనందానికి అంతులేదు. అమ్మని ఎలా వొప్పించాలో.....అనే సమస్య లేదు. ...థాంక్ గాడ్ అనుకున్నాడు రీలీఫ్గా .

అప్లికేషన్స్కి లక్ష రూపాయలు వక్కటేకాదు.....కనుక ఇంటిమీద లోను తీసుకుని ఇరవై లక్షలు తెచ్చాడు.

ఇక టిక్కెట్ కొండమే తరువాయి.

వకొక్క కాలేజీ నుంచి రిజక్ట్ లెటర్స్ వస్తున్నాయి.ఆకాష్ నిరాశ పడుతున్నాడు.ఇక నాకు వెళ్లే ఛాన్స్ లేదేమో

మనీ వెస్ట్ అయినది.....అయ్యో అని బాధపడుతున్నాడు. నెలరోజులకు ఎలా ఐతేనేం వచ్చింది అడ్మిషన్ లెటర్.

ఆరోజు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చింది సుకన్య. ...గర్వన్గా నాకొడుకూ అమెరికా వెడుతున్నాడు....అని చెప్పుకుంది.

''ఎందుకు సుకన్య ఈ ఖర్చు .....దీనితో ఆకాశకి డ్రెస్సులు కొనచ్చు....అన్నాడు కౌశిక్.

''అయే ఖర్చు ఎలాగా అవుతుంది. ఈ సరదా తీర్చు కొనివ్వన్ది ....అంది సుకన్య.

ఎలా ఐతేనేమి ఆకాష్ కోరిక తీరి అమెరికా వెళ్ళాడు.

రోజూ ఫోను చేసేవాడు.నెలకోసారి ఎలావున్నాడో పేస్ టైం కాల్ లో కనిపించేవాడు.మెల్లిగా కొత్త చోట అలవాటు పడ్డాడు.

ఆకాష్ లేని లోటును ఎక్కువ బాధపడింది కౌసిక్.వాళ్ళు స్నేహితుల్లా ఉండేవారు. అన్నివిషయాలు చర్చించు కొనేవారు.వాదించుకునేవాళ్ళు. సినిమాలు చూసేవారు.రాజకీయాలు దేశంలో మార్పులు చేయాల్సిన అవసరాలు చెప్పుకునేవారు.


తెలిసి తెలియని వయసులో అమెరికా వెళ్లాలని ఆకాష్ కలగంటే కలక్టర్ ఐ దేశంలో మార్పుకు పునాది వేయాలని కౌశిక్ ఆశపడ్డాడు. కానీ ఆకాష్ కొరికే నెరవేరింది.

చదువు పూర్తి చేసి ఇంటికి తిరిగి రావాలని కౌశిక్ మాట తీసుకోలేదు.

వెళ్లిన వాడు తిరిగి వచ్చే ఆశ లేదని తెలుసు కనుక.


సుకన్య కోసం ఆకాష్ విలువైన బహుమానాలు పంపితే మురిసిపోయి అందరికి చూపించేది.

ఎం ఎస్ పూర్తి కాగానే ఒకసారి ఇండియా వచ్చాడు ఆకాష్.

అందంగా తెల్లగా మెరిసిపోతున్న కొడుకుని చూసి ఆనందపడ్డారు. పెళ్లి సంబంధాలు వచ్చాయి.

బంధువులు అడిగారు మా అమ్మాయిని చేసుకోమని.

అప్పుడే పెళ్లి ఏమిటి నేను ఇంకా ఉద్యోగంలో చేరలేదు ...అన్నాడు.


నెలరోజులుండి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఎవరూ అనుకోలేదు ....ఇదే చివరి చూపని.

'అన్ని అనుకున్నట్టు జరగవు.కానీ జరిగినవన్నీ తట్టుకోలేనివి కావడమే విషాదం కొందరికి.!

ఆకాష్ వెళ్ళగానే గుడ్ న్యూస్ చెప్పేడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వుద్యోగం వచ్చిందని.

హమ్మయ్య ఇక దిగులులేదు. సెటిల్ అయ్యాడు....అనుకున్నాడు కౌశిక్.

''పెళ్లి అయ్యాక ...సెటిల్ ఐనట్టు...అంది సుకన్య.


''పెళ్లి నువ్వు చేద్దాం అనుకుంటున్నావా ...లేదు అదీ నీఇష్టం కాదు....అన్నాడు కౌశిక్.

''వాడు ఆలా చేయడు.....మీరు భయపెట్టకండి.....

''ఇది నిజం సుకన్య !....భయం దేనికి....? కొన్ని నిజాలను వినడానికి సిద్ధం కావాలి. నేను చాల విన్నాను చూసాను.రోజులు మారిపోయాయి. పెద్దలు చెప్పిన మాటలు పిల్లలు వినరు. మనమే వాళ్లకు అనుకూలంగా

మారుతున్నాం.''

''ఎందుకు మారాలి? ఒక్కరో ఇద్దరో పిల్లలు ఉంటే వాళ్ళమీదే ప్రాణాలు ఆశలు పెట్టుకుంటాం కనుక.

ఆప్రేమతో వొదిగి రాజీ పడుతున్నాం.''

''మీరలా మాటాడద్దు....అంతా బాగానే ఉంటుంది.''


''బాగుంటే కావలసిందిలేదు. కానీ మీ తమ్ముడు కూతురు ఏమి చేసింది....ప్రేమ అంటూ కారు డ్రైవర్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.వాడు ఆస్తికోసం నాటక మాడి వలవేశాడు. చివరికి వాడే ఆపిల్లని పొట్టన పెట్టుకున్నాడు.మీతమ్ముడికి మతి చలించింది.


నా స్నేహితుడు త్రినాధ్ కొడుకు కులాంతర వివాహం చేసుకుని మతం మారిపోయాడు. పెళ్లి చేసుకోడం తప్పుకాదు. తండ్రికి ఒక్క కొడుకు. వాళ్ళ కుటుంబంలో అందరికి అమ్మాయిలే.

వాడి భార్య సూసైడ్ చేసుకుంటే త్రినాధ్ ఏటో వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్నో వింటున్నాం.

అందుకే పిల్లలమీద ఆశ పెట్టుకోకూడదు. అన్నిటిని తేలికగా తీసుకోడం నేర్చుకోవాలి.ఆకాష్ గురించి ఎక్కువ ఆలోచించకు ఏది జరిగినా విచారించకు ''


సుకన్య భర్తమాటలకు దిగులు పడింది. ఎవరింట్లోనో ఏవో జరిగాయి. అది మనకూ జరుగుతుందని ఎందుకనుకోవాలి? మీకు అనవసరమైన భయాలు అన్ని! అనుకుంది.

రాను రాను ఆకాష్ నుంచి కబుర్లు ఫోను చేయడాలు తగ్గాయి. అమ్మకి గిఫ్టులు పంపడంలేదు.

ఏమిరా ఫోను చేయలేదు అంటే .....బిజీ ...బిజీ...అనడం విసుక్కోడం మొదలు పెట్టాడు.

చివరికి ఓ మంచి ముహూర్తంలో ఎప్పుడు వినని ఎదో దేశం అమ్మయితో పేస్ టైములో కనిపించి ''ఇదిగో మీకోడలు'వెరోనికా ''అంటూ పరిచయం చేసాడు.బాగుందిరా ! చాలాబాగుంది. అమెరికా వెళ్ళాలి అంటే నా అవసరం వుంది.


పెళ్ళికి మా అవసరం లేదు కనుక సొంత నిర్ణయం తీసుకున్నావ్.. గుడ్ విషెస్ టూ బోత్ ఆఫ్ యు....''అన్నాడు. సుకన్యను పిల్చి చెప్పాడు. సుకన్య కూడా శుభ కాంక్షలు చెప్పింది చేసేదిలేక.

''టిక్కెట్ పంపుతాను వెరోనికా ఫాదర్ పార్టీ ఇస్తున్నారు మా పెళ్లి ఐనా సందర్భంగా మీరు తప్పకుండ రండి....''అన్నాడు.


''ఏదేశం పిల్లో .....మన కోడలుట ...మనం ఎందుకు వెళ్లడం ?అంది సుకన్య విచారంగా.

''ఎవరైతేనేం...కోడలు ఐనది..వెడదాం పద బహుమానాలు తీసుకుని. పెళ్లి ఎలాగా చర్చిలోనే జరిగింది.''అన్నాడు కౌశిక్.

ఆకాష్ కోసం అతని సంతోషం కోసం ఇద్దరూ వెళ్లారు.

అక్కడ పార్టీలో అంతా వెరోనికా బంధువులు స్నేహితులే.ఆ అమ్మయి ఫాదర్ విలియం బాగా ధనవంతుడు.

ఆ ఇల్లు వైభోగం కళ్ళు చెదిరేట్టు వున్నాయి. గాల్ఫ్ కోర్టులు హార్స్ బారన్స్ తో వంద ఎకరాల ల్యాండ్.

వాళ్ళు మర్యాదగానే పలకరించారు.

వాళ్ళ మెప్పుకోసం ఆకాష్ అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు. అడుగులకు మడుగులు వొత్తుతున్నాడు.

ఏదో వెరోనికా కోసం ఏమిచేసినా వయసు ఆకర్షణ సహజం.

ఆమె తల్లి తండ్రులను అంతగా తలకెత్తుకోడం ఎందుకో సుకన్యకు అర్థంకాలేదు.

కౌశికతో అదే చెప్పింది.

''సుకన్యా ఎందుకో ఏమిటో అని ఆలోచించడం అనవసరం . ఆకాష్ ఇష్టం. వాడు ఇప్పుడు

వెరోనికా భర్త విలియం గారి అల్లుడు. మనం మెల్లిగా దూరం అవుతాము.ఈ నిజం తెలుసుకో.

మనసు రాయి చేసుకో. ఆకాష్ చెప్పినట్టు విని మర్యాదగా వెళ్ళిపోదాం.అంతే! అన్నాడు.

తిరిగి వచ్చేముందు ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చారు....విలియం దంపతులు.

వాళ్లకి నలుగురు అమ్మయిలు.''నాకు సిస్టర్స్ లేని లోటు తీరింది ''అన్నాడు ఆకాష్.

నెలరోజులు ఉండి విలియం వెరోనికా తీసుకెళ్ళినచోటుకివెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చేసారు.

వెళ్లిన సంతోషంలేదు. స్నేహితులు బంధువులు అమెరికాలో ఎలా గడిచింది ఏమి వింతలూ చూసారు

అని అడిగితె విలియం గురించే చెప్పారు. పెళ్లి బాగా జరిగింది అంబానీ కూతురు పెళ్లిని మించి అన్నారు.

ఫోటోలు వీడియోలు చూపించారు.

''అదృష్టవంతులు బిలియనీర్తో వియ్యం అందుకున్నారు''అనివాళ్ళు పొగిడితే పైకి థాంక్స్ చెప్పారు.

'అవును విలువైన వియ్యాన్ని అందుకుని బదులుగా కన్నబిడ్డను వదులుకున్నాం' అనుకున్నారు మనసులో.

******


కౌశిక్ కి తర్వాత తెలిసింది విలియం ఫామిలీ పెద్ద వ్యాపార వేత్తలు.హాస్పటల్స్ జిమ్ క్లబ్బులు మూవీ థిఏటర్స్ చర్చిలు కట్టించాడు. ఎక్కడినుంచో వలస వచ్చి అమెరికాలో బాగా స్థిరపడ్డారు.

అనేకదేశాలవారికి గ్రీన్కార్డు సిటిజన్షిప్ కోటాలు ఉంటాయి. విలియం బెల్జియం దేశానికి చెందినవాడు. ఆదేశం నుండి వచ్చే వ్యక్తులు చాల తక్కువ కనుక ఆకాష్ కి విలియం తరపున త్వరగా ఎలాంటి అడ్డంకులు లేకుండా సిటిజన్ షిప్ వస్తుంది వెరోనికాని

పెళ్లి చేసుకున్నందువలన. అందుకే విలియం ని ఆశ్రయిన్చాడు. అతనికి మొదట పరిచయం విలియంతోనే.

చదువుకుంటూ విలియం హాస్పటల్లో పనిచేశాడు. అతని అభిమానం సంపాదించాడు.వెరోనికా మదర్ జింజర్ కి నచ్చాడు....కూతురికి తగినవాడు అని మెచ్చుకుంది.వాళ్ళ ఆదరాభిమానాలు వరంగా భావించిన ఆకాష్ వెరోనికా మీద ప్రేమ పెంచుకున్నాడు.ఆమెకూడా ఇష్టపడింది.

విలియం కి ఆకాశవల్ల కలిసొచ్చేది ఏమిలేదు. అతడి చదువు తెలివి తేటలు ఏవిధంగానూ విలియంకి ఉపయోగ పడవు. కానీ జింజర్ ఇష్టపడింది కూతురు వలచింది కనుక సరే....అన్నాడు.

అమెరికాలో స్థిరపడి సాఫిగా నిలదొక్కుకోవాలి అంటే అదేమీ సులువుకాదు. ఉద్యోగాలు శాశ్వితం కాదు.

చెడు వ్యసనాలు పట్టుబడకుండా వీసాను కాపాడుకుంటూ గ్రీన్కార్డు సంపాదించడం కష్టం.ఇరవై ఏళ్లుగా

గ్రీన్కార్డు లేనివాళ్లు ఎందరోవున్నారు. ఆలా అని ఎవరో ఒకరు పెళ్లి చేసుకోరు. వాళ్ళకీ తెలుసు.

గ్రీన్కార్డు కోసమే చాలామంది దొంగ పెళ్లిళ్లు చేసుకుంటారని.అన్నీకలిసి రావాలంటే అదృష్టం ఉండాలి.

ఈ విషయం గ్రహించి ప్లాన్ వేసాడు ఆకాష్. అయితే అమెరికాలో స్థిరపడటం బాగానేవుంది.కానీ

తల్లి తండ్రులు కొడుక్కు దూరం అవుతారు.

పిల్లలు ఇష్టపడి విదేశాలకు వెళ్లడం ఒక రకం తల్లితండ్రులు కావాలని ఎవఱోవెళ్లారని మన అబ్బాయి వెళ్లకపోతే నామోషీ అని పంపటం మరో రకం.

ఇలా తల్లి తండ్రులు పిల్లలు కూడా విదేశాలకు వెళ్లడమే టార్గెట్గా వున్నారు.

డబ్బు బాగా సంపాదిస్తాడని కావచ్చు లేదా మనమూ ఆదేశం వెళ్ళచ్చు అనే ఆశపడటం కావచ్చు.

రెండూ జరగక పిల్లలు దూరం అవుతున్న కుటుంబాలే ఎక్కువగా వున్నాయి.

అప్పుడప్పుడు ఆకాష్ ఫోన్ చేస్తాడు. కానీ ఇండియా రాడు. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

వీడియోలో చూపించాడు.

'రండి చూద్దురుగాని' అనడు.

''మీరు రండిరా..." అంటే "ఆబ్బె పిల్లలు వుండరు. వాళ్ళు ఫ్రెండ్స్ని మిస్సవుతారు. ఇండియా క్లీన్ గా ఉండదు. అక్కడ అలర్జీలు వస్తాయి..." అంటాడు.

''అమ్మ వెరోనికా నువ్వయినా చెప్పు...." అంటే "ఆకాష్ ఇండియా లైక్ చేయడు... కౌశిక్ సారీ !" అంటుంది.

అవును వాడికే లేనప్పుడు ఆపిల్లని అనడం తప్పు..అనుకున్నారు.

అలాగే రోజులు గడిచి పోతున్నాయి.

ఇప్పుడు సుకన్యకు తెలిసింది, మనవళ్ల ముద్దు ముచ్చట్లు లేనిలోటు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

33 views0 comments

Kommentare


bottom of page