top of page

బాధ్యత

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Badhyatha' New Telugu Story Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ

తెలిసీ తెలియని వయసులో తప్పుదారి పడుతున్న ఒక జంటను చూసింది ఆమె.

ఎవరి పిల్లలో అని నిర్లక్ష్యం చేయకుండా వారిని మందలించింది. అన్ని తెలిసిన స్త్రీగా తన బాధ్యత నెరవేర్చింది. ఈ కథను ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం


వేసవి వచ్చింది. ఏడు అయితే ఎండ వస్తుంది. ఒకటే వేడి ఉక్కపోత. అందుకని ఉదయమే వస్తోంది పారిజాత.....


పార్కులో వాకింగ్ చేస్తుంటే ఆమెకు కనిపించారు చెట్ల చాటున ఆ అబ్బాయి అమ్మాయి. మాస్క్ వేసుకోడం జుట్టు విరబోసుకోడం వలన ఆ అమ్మయి ఎవరో తెలియలేదు.

అలా ఇద్దరు కలసి కనిపించడం చాల రోజులుగా చూస్తోంది.


ఈ మధ్య మనదేశంలో ఇలా చెట్టా పట్టాలు వేసుకుని పార్కుల్లో కనిపించడం మామూలు అయింది.

ఈరోజు శృతిమించిన వారి చేష్టలు చూసింది.ఇక ఊరుకుంటే మంచిదికాదు.వాడుచూస్తే కొత్త ఫ్యాషన్ గడ్డంతో ఉంగరాల క్రాపుతో అదోలా వున్నాడు.ఇలాటి అబ్బాయి, అమ్మాయిలపట్ల మంచి అభిప్రాయం ఉండదు పారిజాతకి. ఆడ మగా స్నేహం తప్పుకాదు. ఇప్పటి పిల్లల్లో స్నేహం కంటే ఆకర్షణే ప్రమాదం తెస్తోంది.


ఆలోచిస్తూ వాళ్ళకి దగ్గిరగా వెళ్ళింది. పరిశీలనగా చూస్తే వాడు తన ఫ్రెండ్ యామిని కొడుకు తేజ .

అప్పుడే వస్తున్న వెలుగులో దగ్గిరగా ఆ అమ్మాయి మొహం కనబడింది....కానీ ఎవరో తెలియదు.

ఇద్దరు కలిసి తప్పుచేస్తే ఇద్దరికీ పనిషమెంట్ ఇవ్వాలి.


కానీ అమ్మాయిని మందలిస్తారు. అబ్బాయిని మాత్రం ఏది చేసినా తప్పు పట్టరు.

ఇదేమి న్యాయం!

ఈమద్య కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. ''అబ్బాయి లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోడానికి గర్ల్ ఫ్రెండ్'' వుండితీరాలట.


అలాగే అమ్మాయి ''జడపదార్ధం కాదు'' ఆడదే అని నిరూపించుకోడానికి మగపిల్లలను ఎట్రాక్ట్ చేయాలట.

దిక్కుమాలిన లాజిక్ ఒకటి కనిపెట్టారు ఎవరో.

ఎవరు ఎప్పుడు మొదటి అడుగువేశారో తెలియదు.


ఇప్పుడు అన్ని స్థాయిలవారికి పాకిపొయిన్ది. ఓపక్కన చేతిలో సెల్ల్ మరోపక్క భుజం మీద అబ్బాయి చేయి ఉన్న దృశ్యాలు పార్కుల్లో కనిపిస్తున్నాయి.


హైస్కూల్ ల్లో ప్రారంభం ......అది ఎంతకాలమో....తెలియదు. అమ్మానాన్నలకు తెలుసో లేదో ...తెల్లారకుండా విహారాలు ఏమిటని అడిగారా లేదా తెలియదు.

ఈ సీలపరీక్షలు అవసరం అని వాళ్ళుకూడా అనుకుంటారా!

పిల్లలు అబద్ధాలు చెబుతున్నారని తెలుసుకోరా....ఇవన్నీ సందేహాలే.

నేను మాత్రం ఊరుకోను .కనీసం నా కళ్ళఎదుట ఏది సహించను ...అనుకున్న పారిజాత

''హలో తేజా ... అని పలకరించింది.


మొదట వాడు విననట్టు నటించాడు.


దగ్గిరగా వెళ్లి “ఎవర్రా ఈ అమ్మయి .....మీ ఇంటికి బంధువులు వచ్చారా....మమ్మి నాతో చెప్పలేదు....”

అంది ఆపిల్లని చూస్తూ. అప్పటిదాకా ఈలోకంలో లేనివాళ్లు దూరం జరిగి....కూర్చున్నారు.

''లేదు...ఆంటీ! ఈ అమ్మాయి ఇక్కడే పార్కులో పరిచయం ...అన్నాడు.


వాళ్ళిద్దరిమధ్యా కూర్చుని ....”ఇంట్రెస్టింగ్...ఈ పిల్లకోసం చీకటినే లేచి పార్కు కి వస్తున్నావా బాబూ..

నువ్వు చెప్పమ్మా...చీకటిలో భయం లేదా? ఎంత ప్రమాదం....బహుశా తేజతో బైక్ మీద వచ్చి ఉంటావు...అవునా...!”


ఇద్దరూ తల దించుకున్నారు.

''మీరు తప్పుచేస్తున్నారు.మీ ఇద్దరి తల్లి తండ్రులు స్నేహితులు అయితే పర్వాలేదు. ఇక్కడ పార్కులోనో

రోడ్డుమీద వెడుతుంటేనో ..పరిచయాలు మంచిదికాదు. స్నేహం తప్పుకాదు. దానికి తగిన వాతావరణం ఇదికాదు. మీ అమ్మ నాన్నకి పరిచయం చేయండి. వాళ్ళ దగ్గిర దాచవద్దు. మీ మంచికోరేవాళ్ళు. చక్కగా చదువుకోండి. సహాయం చేసుకోండి.స్నేహాన్ని సరదా కోసంఅవసరంకోసం వాడుకోవద్దు.

తేజా ఈవిషయం మీ మమ్మీకి చెప్పమంటావా...నువ్వే చెబుతావా?

అమ్మాయి నువ్వెవరో తెలియదు. చదువుకుంటున్నావా..” అడిగింది...పారిజాత .


''ఆ ...పది.చదువుతున్న …” భయంగా చెప్పింది.

''మీ అమ్మ నాన్న ఏం చేస్తారు?”

ఆ పిల్ల ఇష్టం లేక చెప్పలేదు.

“సరే నువ్వు ధైర్యంగా చెప్పడంలేదు. అంటే నువ్వు తేజతో సరదాకి స్నేహం చేస్తున్నావని అర్ధం అయింది.తేజా.. నీసంగతి?”


''ఆంటీ ...సారీ! నేను ఇక ఈ అమ్మాయితో మాటాడను.ప్రామిస్ ..” అన్నాడు తప్పించుకోడానికి.

''అదేవద్దు. నిలదీస్తే ఇలా అబద్ధం చెప్పడం తప్పు. మీ మమ్మి డాడీలకు ఈ అమ్మాయిని పరిచయం చేయి.''అంది పారిజాత.....ఇంటికి వెళ్ళడానికి లేచి .


మర్నాటినుంచి వాళ్ళు కనబడలేదు.

తేజ మగపిల్లాడే ఐనా వాడిని చెడిపోనివ్వకూడదు..పార్క్ పిల్లకి అన్యాయం జరగకూడదు. యామినికి చెప్పడం మంచిది...అనుకుంటూ ఉండగానే

యామిని ఫోన్ చేసింది....’మాకు ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ వచ్చింది ముంబైకి…’ అంటూ.

భార్యా భర్తలు ఇద్దరు బ్యాంకు ఆఫీసర్లు.

ఇప్పటికి సమస్య తీరిందిలే...తేజ గురించి వాళ్ళే జాగ్రత్త తీసుకుంటారు .....అనుకుంది పారిజాత.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
62 views0 comments

Opmerkingen


bottom of page