top of page

గౌరవం


'Gouravam' New Telugu Article On Self Respect Of women Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ

భారతీయ మహిళల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది.ఒకప్పుడు నాలుగు గోడలకె పరిమితమై తెలిసి తెలియని వయస్సులో పెద్దలు చేసిన పెళ్ళికి తలవంచి అదృష్టమో దురదృష్టమో ఎలాగో జీవించారు.


క్రమంగా తల్లి తండ్రుల ఆలోచనలు మారి పిల్లల పెళ్ళికంటే చదువు లోక జ్ఞానము ముఖ్యమని తెలుసుకున్నారు.డిగ్రీ వరకూ చదివించి ఆతరువాత పెళ్లి చేశారు.

ఆతర్వాత కాలంలో ఇంజినీరింగ్ మెడిసిన్ సీఏ లా అంటూ వివిధ రకాలైన చదువులపై ద్రుష్టి పెట్టారు.


కాలం మారింది సినిమాలు టీవీ సీరియళ్లు ప్రారంభమై అమ్మాయిలు మోడల్స్గా నటులుగా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకున్నారు. . ఫ్యాషన్స్ వస్త్ర ధారణలో కొత్తపోకడలు పోతున్నారు.

ఇంతవరకు బాగానేవుంది.


యువత విదేశీ అలవాట్లను వంటబట్టించుకుని డేటింగ్ తో మొదలైన స్నేహాలు వికృత చేష్టలకు దారితీసి వివాహ వ్యవస్థను పరిహాసం చేయడం జరుగుతోంది.

ఎవరికీ నచ్చుతాయో తెలియదు.పిచ్చి సీరియళ్లు అసభ్యమైన సంభాషణలు మహిళకే సిగ్గు చేటుకలిగిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పత్రికలూ వ్యాపార ప్రకటనలకు వినియోగించుకునే స్థాయికి దిగజారిపోయాయి..పేపర్ చదివే అలవాటు వున్నవారు మానుకొలేరు. కోవిద్ కారణంగా పేపర్ కొనేవారు తగ్గిపోయారు.అందువలన పత్రికాధిపతులు సినిమా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఫ్యాషన్ దుస్తులు అలంకరణ వస్తువులు ప్రకటనలకు మోడల్స్ను అరమరికలు లేకుండా చూపిస్తున్నారు.


ఫిబ్రవరి 23 వ తేదీ బుధవారం టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ (సప్లిమెంట్)చూసివుంటే తల దించుకోవలసిందే!


నాకైతే అసహ్యం తోబాటు వాంతి వచ్చింది. కారణం మెటర్నిటీ దుస్తుల ప్రకటనకు మోడల్స్ పేద్ద పొట్టలతో ఇచ్చిన చిత్రాలు.( వారు మోడల్సో, సినీ నటులో, సెలబ్రిటీలో ఎవరో చదవ బుద్ధికాలేదు.)


వారు ఎవరైనా మహిళలుగా ఇలాంటి ఫోటోలు ఇవ్వడం ఏమిబాగాలేదు.

ఈ ముచ్చట ప్రతి వారికీ స్వంతం అంతే .దేనికైనా పరిమితి ఉండాలి.ఇవి కుటుంబానికి మాత్రమే చెందాలి.


మహిళకు మాతృత్వం ఏ ఒక్కరికో సంబంధించినా ఘనకార్యం కాదని గుర్తువుంచుకోండి.దీనికి పబ్లిసిటీ శరీర ప్రదర్శన అవసరంలేదు. మహిళలు గౌరవం నిలబెట్టుకోండి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.110 views0 comments

Comments


bottom of page