అందరూ వినండి.!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/Yw-6iMOdNMo

'Andaru Vinandi' New Telugu Article On Atrocities On women Written By A. Annapurna


రచన: ఏ. అన్నపూర్ణ


హైదరాబాద్ నగరంలో నేరాలు కోవిడ్ తో బాటు పెరిగాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు దేశాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి. కోవిద్ 19 లా దేశరాజధాని ఢిల్లీలో నిర్భయపై దాడి మొదలుకొని ఈనాటివరకు ఆగలేదు. కొద్దిగా మరుగున పడ్డాయి అంతే!

అడపా తడపా విజృంభిస్తూ అమ్మాయిల జీవితాలకు సంకటంగా మారాయి. పోరాటానికి ఓపికలేని మహిళా సంఘాలు సైతం మవునం వహించాయి.

కాలేజీలకు, స్కూలుకు సెలవులు వచ్చాయి. కాలం ఎలా గడపాలి… అని ఏ ఆశయం ఒక గోల్ అంటూ లేని యూత్ ..

పెద్దలు అనబడే ప్రజా నాయకుల పుత్ర రత్నాలు..

వారి ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ మెంట్ కోసం

పనికిరాని ఆలోచనలతో పార్టీల పేరుతొ మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. అక్రమమో సక్రమమో.. సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. పిల్లలకేగా .. అని తల్లి తండ్రులు వారు అడిగినంతా ఇస్తూ ఎందరో అమ్మాయిల పాలిట రాక్షసుల్లా తయారు అయ్యారు. పార్టీ అంటే ఏమిటో ఎందుకో ఎక్కడో పట్టించుకోరు.

అబ్బాయిలేమో విదేశీ సంస్కృతీ అనుకుంటూ పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారు.

‘చదువులో వున్నత శిఖరాలు చేరుదాం.. క్రీడల్లో పేరు తెచ్చుకుందాం.. మ్యూజిక్ లేదా మరొక రంగంలో రాణిద్దాం…’ అనే ఆశయం లేకుండా అమ్మాయిలను ఆట బొమ్మలుగా చేసి వారి శరీరాలతో ఆడుకుంటున్నారు. మరి వారి ఇంట్లో అమ్మాయిలు ఉండరా?

‘మా నాన్న రాజకీయ నాయకుడు.. నేనంటే గారం .. ఏవెధవ పని చేసినా తప్పిస్తాడు’ అనే ధీమా.

‘పోలీసులు, చట్టాలు.. మనలను ఏమి చేయలేవు .... అనే చులకన భావం, నిర్లక్ష్యం యువతను క్షణిక మైన ఆనందం కోసం పెడదారి పట్టిస్తోంది. నిజంగా కన్న కొడుకులు ఇలాంటి వెధవ పనులు చేసినందుకు తల్లులు వాడిని హత్య చేయాలి లేదా ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలి.

కానీ అన్నము పున్నెము తెలియని బాలికల యువతుల ప్రాణాలు పోతున్నాయి.

అమ్మాయిలు కూడా ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా అబ్బాయిలను ఎందుకు నమ్ముతున్నారు? పార్టీ అనగానే వాళ్ళ వెంట వెళ్ళడము తప్పిదమే!

ఒకసారి పరిచయం లేదా కొద్దిపాటి పరిచయంతో

పార్టీలకు వెళ్లవచ్చా? స్నేహం వేరు,

కేవలం పరిచయం వేరు. సమాన వయసు వున్నవారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఆకర్షణకు లోనవుతున్నారు.

'ప్రలోభానికి, ఆకర్షణకి గురికావడం.. అందులో థ్రిల్ తెలుసుకోవాలనే కుతూహలం.. వారి భవితను ఛిద్రం చేస్తోంది.

పబ్బులకు వెళ్లే అమ్మాయిల్లో విదేశీయులు, రాష్ట్రేతరులు ఎవరో పిలిచారని..

మనం ఈనాటి తరానికి ప్రతినిధులం .. ఇలా ఉండాలి. అనే వ్యామోహంతో కోరి బలిపీఠం ఎక్కుతున్నారు.

బలవంతాన కొందరు, అన్ని తెలిసే మరి కొందరు ఆకర్షితులు అవుతున్నారు. అదే స్వేచ్ఛ, స్వతంత్రం, ఆనందం అనుకుంటున్నారు.

ఎవరినీ ‘పాపం అమాయకులు’.. అనుకోనక్కర లేదు. ఇంటర్నెట్ టెక్నాలజీ ఎన్నో తెలియచేస్తుంది. కొందరు యువత టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ వ్యసనాలకు లోనవుతూ దుర్మార్గాలు చేస్తున్నారు.

ఇందులో తల్లి తండ్రుల పాత్ర ఎంత! పిల్లలు వారికీ నిజం చెబుతున్నారా?

వాళ్ళు తెలిసే ప్రోత్సహిస్తున్నారా … వారికే తెలియాలి. ఆతర్వాత మాకు అన్యాయం జరిగి పోయినది …

కారకులైనవారిని ఉరితీయాలి …

అంటూ గొంతు చించుకున్నా ఎవరికీ జాలి ఉండదు. చేసినతప్పుకు బలి అయ్యేది వేరెవరోకాదు. స్వయంకృతమే!

''ఆడపిల్లకు ఎందుకు ఇన్ని ఆంక్షలు?మగవారికి అక్కరలేదా? అని ఆవేశంతో ఊగిపోతూ కొందరు హడావిడి చేస్తారు.ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అనే మృగాలవంటి మనుషులకు లేడిపిల్ల లాంటిసున్నితమైన ఆడపిల్లలు బలి అవుతారనే జాగ్రత్తలు చెబుతారు. విద్య ఉద్యోగాలు ప్రతిభలో అమ్మయిలు అబ్బయిలతో సమానంగా వున్నారు ఇంకా ఎక్కువే కూడా....కానీ దేహ ధారుధ్యం లో బలహీనులే!

ఎక్కడో ఒకటీ అరా ఆడవాళ్లు బలశాలురు ఉండవచ్చు. ఎలాంటి ధైర్య సాహసాలు వున్నా ఒక్క అమ్మాయి నలుగురిని ఎదురుకోలేదు. చేతిలో ఆయుధం వున్నా నిస్సహాయురాలే!

కథలు వ్యాసాలు రాయడం, టీవీ చర్చలో ఆవేశంగా రెచ్చిపోయినట్టు.. నిజంగా అబ్బాయిలను ఎదిరించడం సులువుకాదు. ఆచరణలో సాధ్యంకాదు.

స్వీయ రక్షణకు చాలా ఆలోచించండి. పార్టీలు కుటుంబ పరమైనవి అయినప్పుడే వెళ్ళండి. అప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అనుభవం వున్న పెద్దవాళ్ళు చెప్పింది వినండి.

అమ్మాయిలు.. అబ్బాయిలను సులువుగా నమ్మవద్దు. వారి హావ భావాలు ప్రవర్తన గమనిస్తే మీరు గ్రహించగలరు.. వారి ఆలోచన ఏమిటో.

తల్లి తండ్రుల ప్రేమను అలుసుగా తీసుకోవద్దు.

ఫోనులో మాటాడ నీయలేదనో, బాయ్ ఫ్రెండుతో పబ్ లకు వెళ్లనీయలేదనో అలిగి కోపం తెచ్చుకుని అఘాయిత్యాలు చేయద్దు. ఇంటినుంచి వెళ్లి అబ్బాయిలతో చెప్పకండి. పరాయి వారితో అస్సలు చెప్పవద్దు.

మీ మీద సింపతీ చూపినట్టు నటించి లోబరచుకుంటారు. అమ్మానాన్నలు మీ శ్రేయస్సు కోరేవారు. మీ మీద ప్రేమతోనే వారిస్తారని తెలుసుకోండి. వారి కట్టుబాట్లే మీకు రక్షణ.

స్నేహితులు హేళన చేస్తారని పిలిచిన చోటికి వెళ్ళద్దు...స్నేహితులు జస్ట్ కొంతకాలమే మీతో వుంటారు. శాశ్వతంగా ఉండేది అమ్మ నాన్నలు. ఎవరో వెళ్లారని, నిన్ను తీసుకు రమ్మని చెప్పేరని వారితో వెళ్ళవద్దు.

ప్రమాదం జరిగితే వారు ఆదుకోరు. వారు తప్పించుకుంటారు. మిమ్మలను ఒంటరిచేసి వెళ్ళిపోతారు.

మీ రక్షణకు మీరె బాధ్యులు. ఒక్క దుర్ఘటన జీవితకాలం మీ కుటుంబాన్ని వేధిస్తుంది.

విదేశాల్లో పబ్బులు పార్టీలకు భారత దేశంలో సరదాలకు తేడావుంది. ఇక్కడ చట్టం చలామాణికాదు.

రూల్స్ పలుకుబడి కలవారికి వర్తించవు. అధికారమే చలామణీ అవుతుంది....

విదేశీయులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టుకు వెళ్లినా శిక్షలు పడేసరికి మీరు విసిగి పోతారు. ఒకవేళ సత్వర న్యాయం జరిగినా మీ బాధను ఎవరూ తీర్చలేరు.

తల్లి తండ్రులూ! మీరు కూడా సంపాదన, పదవులు ధ్యాసగా పిల్లలు ఎలా వున్నారో గమనించడం లేదు.

సంపాదనకంటే ముఖ్యమైనది పిల్లల ప్రవర్తన. అది తెలుసుకోండి. ఆడ మగా ఎవరైనా నైతికవిలువలు,

మంచి ప్రవర్తన అలవరచుకోవాలి.

పిల్లలు పెడదారిన పడకుండా కాపాడుకోవడంలో తల్లి తండ్రులు, తరువాత విద్యాలయాలు కూడా

బాధ్యులే ! కనుక డబ్బుకంటే ప్రధానం పిల్లల భవిత అని మరువద్దు.

ఏదైనా ప్రమాదం జరిగితే నేరం చేసినవాళ్లు సులువుగా తప్పించుకుంటున్నారు. వారికి ఎలాంటి శిక్షలు పడవు. నష్టపోయేది మీరే.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

ఆమె ఒక అపురూప

గౌరవం

బాధ్యత

మ్యారేజెస్ ఆర్ మేడ్ విత్ బిజినెస్

కదిలించిన ఆత్మీయత

ఎటుపోతోంది ఈ తరం?

ఉత్తరాంధ్రకు వన్నెతెచ్చిన కథానిలయం

ఆమె విజేత

దూరదృష్టి

మనసున మనసై

జ్ఞాపకాల పందిరిలో

మనసు చెబుతుంది విను

ఆపాటకు నీరాజనం!

మనిషి -మనసు

విజ్ఞత

మనసుంటే చేయగలం(కవిత)

డబ్బుతోనే స్నేహం

ఓ మనిషీ మేలుకో !

మన జీవితం మనది

ప్రేమకు సోపానం

పెంపకం

నేరానికి శిక్ష ఏది?

అనుబంధం

అందమైన ప్రకృతికి భాష్యాలెన్నో( కవిత )

నా తప్పు ఏమిటి???

ప్రకృతిని కాపాడుదాం (కవిత)

ప్రేమంటే ఏమిటో తెలియదే

అమ్మ చెప్పిన కమ్మని మాట( కవిత )

అత్త అంటే స్నేహితురాలు

మనసంతా నువ్వే!(కవిత)

మార్గ దర్శకులు

ఝాపక(జ్ఞాపక) పరిమళాల పూల గుచ్ఛం ( కవిత )

విధి చేసే వింత

అంతులేని ఆశ !

ఎందుకు ఈ కలరవము

పూల తావిరచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.33 views0 comments