top of page

ఆమె ఒక అపురూప


'Ame Oka Apurupa' New Telugu Poetry Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ





ఆమె సాహితీ వనంలో విరబూసిన మల్లె చెట్టు

ఆమె మాటలు జల తరంగిణుల మృదు రవళులు

ఆమె నవ్వులు సెల ఏటిలో చిరు గలగలలు

ఆమె వాక్ ప్రవాహం అందమైన జలపాతం


ఆమె సకల విదుషీమణి సాహిత్య మేరు శిఖరం

ఆమె ప్రతిభా పాటవాలకు లేవు హద్దులు

ఆమె రూపానికి దేవత అందరిని ఆకట్టుకునే స్నేహిత

ఆమె తన మాటలతో అందరిని కట్టి పడవేయగలదు


ఆమె తన రచనలతో పాఠకులను మురిపించగలదు

ఆమె ఆంగ్ల సాహిత్యాన్ని అవలీలగా తర్జుమా చేయగల దిట్ట

ఆమె తెలుగువారికి తెలుగు నేర్పగల గురువు

ఆమె అనంత మేధగల విదుషీమణి


ఆమె సాహిత్య ప్రియులకు సెలబ్రిటీ

ఆమె ఇల్లు సరస్వతి నివసించు ఆలయం

ఆమె పరిచయం అభిమానులకు గొప్ప వరం

ఆమె స్నేహం నిత్యసంతోష దాయకం


ఆమె అరుదైన నామ ధేయురాలు

నాకు ఆత్మీయురాలు ఆమె

ఆమె ఎవరు .... మృణాళిని

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

గౌరవం

బాధ్యత

మ్యారేజెస్ ఆర్ మేడ్ విత్ బిజినెస్

కదిలించిన ఆత్మీయత

ఎటుపోతోంది ఈ తరం?

ఉత్తరాంధ్రకు వన్నెతెచ్చిన కథానిలయం

ఆమె విజేత

దూరదృష్టి

మనసున మనసై

జ్ఞాపకాల పందిరిలో

మనసు చెబుతుంది విను

ఆపాటకు నీరాజనం!

మనిషి -మనసు

విజ్ఞత

మనసుంటే చేయగలం(కవిత)

డబ్బుతోనే స్నేహం

ఓ మనిషీ మేలుకో !

మన జీవితం మనది

ప్రేమకు సోపానం

పెంపకం

నేరానికి శిక్ష ఏది?

అనుబంధం

అందమైన ప్రకృతికి భాష్యాలెన్నో( కవిత )

నా తప్పు ఏమిటి???

ప్రకృతిని కాపాడుదాం (కవిత)

ప్రేమంటే ఏమిటో తెలియదే

అమ్మ చెప్పిన కమ్మని మాట( కవిత )

అత్త అంటే స్నేహితురాలు

మనసంతా నువ్వే!(కవిత)

మార్గ దర్శకులు

ఝాపక(జ్ఞాపక) పరిమళాల పూల గుచ్ఛం ( కవిత )

విధి చేసే వింత

అంతులేని ఆశ !

ఎందుకు ఈ కలరవము

పూల తావి



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.





63 views0 comments
bottom of page