top of page

ఎవరు బాధ్యులు?

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Evaru Badhyulu' New Telugu Story Written By

A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ


మూడేళ్ళుగా ఎవరూ బంధువులను కలవలేదు.

'మా ఇంటికి మీరు రావద్దు. మీఇంటికి మేము రాము.' అని నిర్మొహమాటంగా చెప్పేసేరు. బంధుత్వాలు కట్ . ఫ్రెండ్షిప్ ఫట్.


తీరిక వుంటే గుర్తువస్తే ఫోనులో పలకరించడం, లేకుంటే లేదు. అసలు ఫోనుకాల్ వస్తే, 'ఏ చెడు వార్త వినాలో' అని భయపడిన రోజులుగా గడిచాయి. ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చి కలుసుకోవడం మొదలు పెట్టారు జనం.


చాలాకాలంగా అమెరికాలో ఉంటున్న సూర్యచంద్ర తాతగారి ఆస్తిని అమ్మి డబ్బు చేసుకుని పోదామని ఇండియా వచ్చాడు. అదే సమయానికి రాజమండ్రిలో తమ్ముడి కొడుకు పెళ్లి వుంది. ఆ చుట్టుపక్కల వున్న స్నేహితులను కల్సు కోవాలని, కలిసి వచ్చేలా టాక్సీ మాటాడుకుని వెళ్ళాడు.


హరికృష్ణకు ఫోనుచేసి "వూళ్ళో ఉన్నావా? మీ ఇంటికి రావచ్చా.." అని అడిగాడు.


''ఓ... సూర్యం!...నిన్ను చూసి ఎన్నో ఏళ్లు గడిచిపొయిన్ది. సందేహం వద్దు . వచ్చేయి '' అన్నాడు హరి సంతోషంగా !


గుమ్మంలో టాక్సీ ఆగగానే పరుగునవచ్చి ఆహ్వానించాడు.


''ఎలా వున్నావ్? పిల్లలు బాగున్నరా! విశేషాలు చెప్పు..." అన్నాడు సూర్యం .


''నేను బాగానే వున్నాను. అమ్మాయిలు ఇద్దరూ విదేశాల్లో హాయిగా వున్నారు. నా కొడుకు నాతోనే ఉంటాడు. ఇక దీపకి కేన్సర్ . అదుగో.. బెడ్ మీదనే నిస్సహాయంగా వుంది" అంటూ టీ చేసి అందరికి ఇచ్చాడు.


భార్య బాత్ రూంకి వెళ్ళా లంటే తీసుకెళ్లాడు. కొడుకు 'ఆకలేస్తోంది ....' అంటే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాడు.


''అయ్యో సారీ రా హరీ ... 75 ఏళ్ళు వచ్చి ఇలా ఇంటిపని నువ్వు చేస్తున్నావా.... పనిమనిషి, బంధువులు.. ఎవరూ సాయం చేసేవారు లేరా? పోనీ కేటరింగ్ ఫుడ్ తెప్పించుకోవచ్చుగా !" సానుభూతిగా అడిగాడు సూర్యం, అలాగ పదిసార్లు అటూ ఇటూ ఏదో ఒక పని చేస్తూ తిరుగుతూనే వున్నా హరిని చూసి జాలితో .


''అవును. అన్ని సదుపాయాలూ వున్నాయి ఈరోజుల్లో. కానీ నాకు పెన్షన్ లేదు కదురా. డబ్బు దేనికీ చాలదు'' అన్నాడు.


''భలేవాడివి . షిప్పింగ్ కంపెనీలో సీనియర్ ఇంజినీరువి. నెలకి లక్ష రూపాయలు జీతం ఆరోజుల్లో. పిల్లల చదువుకి కంపెనీ ఇచ్చేది. హెల్త్ చెకప్ ఫ్రీ . ట్రావెల్ ఫ్రీ. నీ ఉద్యోగానికి వున్న సదుపాయాలూ ఎవ్వరికీ లేవు. బంగారంలాంటి వుద్యోగం. ఎంత ఖర్చు చేసినా కనీసం పదికోట్లు సేవ్ చేసుకోవచ్చు. మరి ఆ సంపాదన ఏమైనట్టు?" ఆశ్చర్యంగా అన్నాడు సూర్యం.


''డాడీ! ఏదైనా డ్రింక్ కావాలి. దాహం ...." అంటూ పిలిచాడు ముఫై ఏళ్ళు వచ్చిన కొడుకు రాజు.


''ఒరేయి! వీడు ఎదురుగ ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. పద.. ఆలా టెర్రస్ మీదకి పోదాం '' అంటూ తీసుకు పోయాడు. బహుశా కొడుకు, భార్య వినకూడదని కూడా అయుండొచ్చు.


''హరీ! రాజు ఆరోగ్యంగా వున్నాడు. ప్రతీది నిన్ను అడుగుతాడు. వాడు తీసుకోడా ... ఏదైనా ప్రాబ్లమ్ ఉందా .....!"


''ఏమీ లేదు. మా ఆవిడ గారం చేసి పాడుచేసింది. అది చదువుతా ఇది చదువుతా అని లండన్, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లి జల్సాగా తిరిగి 50 లక్షలు తగలేశాడు . చదువులేదు, సంపాదనా లేదు. వాడిని మందలిస్తే దీపకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంది. ఏం చెప్పమంటావ్.. నా తలరాత! ఇలా తిని కూర్చుంటాడు . వాళ్ళనీ వీళ్ళనీ బతిమాలి వుద్యోగం వేయించాను. అది నచ్చలేదుట . ఎక్కువ పని చెప్పారట... ఏదో వంక . వీడి వాలకం చూసి ఎవరూ పిల్లని ఇవ్వడంలేదు సూర్యం. నిజమే.. నా సంపాదన ఎవరికీ లేదు. ముగ్గురు పిల్లలు. చూసేవారికి పైకి బాగానే ఉంటుంది.


దీప మొత్తం ఖర్చు పెట్టేసింది. ఆలా అని బంగారం లేదు. ఇంట్లో సామానులేదు. ఖరీదైన చీరలు కట్టదు. కాటన్ మాత్రమే కడుతుంది. ఎప్పుడూ ఇంట్లో వంట చేయదు . పిల్లలు హోటల్ నుంచి తెచ్చుకుంటారు. బ్యాంకు బ్యాలెన్స్ నిల్. ఏడాదికి మూడునెలలు సెలవుమీద వచ్చిన వాడిని.. ఏమి అనలేక పోయే వాడిని.


అమ్మాయిల పెళ్ళికి కట్నాలు లేవు,పెళ్ళిఖర్చు తప్ప. రాజు కూడా అమ్మాయి ఐనా బాగుండేది. ఇలా ఏపనీ లేకుండా సోమరిగా తయారు అయ్యాడు. ఈ ఫ్లాటు మాత్రం వుంది తల దాచుకుందుకు. నేను రిటైర్ అయి వచ్చేసరికి కంపెనీ ఇచ్చిన ఏభై లక్షలు మిగిలాయి. అందులోనే అన్ని ఖర్చులూ గడవాలి. వాళ్ళ అదృష్టం బాగుంది. అమ్మాయిలు సుఖంగా వున్నారు, అదిచాలు.


ఆలా ఉండగా నాకు మరో పనిష్మెంట్ దీపకు కేన్సర్. ఎంత డబ్బూ సరిపోవడంలేదు. ఇక నేనే వంట మొదలుపెట్టాను. ఏమి చేయను? నాకు ఆరోగ్యం అంత గొప్పగా లేదు. బట్ ఐ కెన్ మానేజ్" అన్నాడు హరికృష్ణ.


''మొదట్లోనే వచ్చిన జీతంలో సగం సేవ్ చేయాల్సింది. మొత్తం చేతికి ఇవ్వడం నువ్వు చేసిన పొరబాటు. నీ కుటుంబానికి దూరంగా ఉండాల్సిరాడం వలన వచ్చిన బలహీనత. అయామ్ సారీ!" అని సానుభూతి చూపడం తప్ప ఏమీ చేయలేకపోయాడు సూర్యం .


అంతలో రాజు గావుకేక పెట్టాడు ... "డాడీ! నువ్వింకా వంట చేయలేదు. నేను ఆన్లైన్ ఫుడ్ డిన్నర్ ఆర్డర్ చేసాను. ఆకలివేస్తోంది" అని!


"చూడు! కాస్త ఆలస్యం అయిందని, ఫోనుందిగా.. ఆర్డర్ చేసేస్తాడు"


అయ్యో! ఎంతటి విషాదం..' అనిపించినా, స్వయంకృతానికి ఎవరు ఏమి చేయగలరు? బాధగా చిన్ననాటి మిత్రుడికి వీడుకోలు చెబుతూ ... "ఎవరైనా సహాయం చేసే బంధువులు లేరా?" అన్నాడు.


''వాళ్లంతా వృద్ధులు. అమ్మ, అత్తగారు... వాళ్ళ పాట్లు వాళ్ళు పడుతున్నారు ఒంటరిగా ఉంటూ.


''సరే! నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు బాగుంటేనే దీపకి, రాజుకి వంట చేయగలవు.''అని వెళ్ళిపోయాడు అమెరికా నుంచి సూర్యం.


అప్పుడప్పుడు హరికృష్ణకు ఫోనుచేస్తూ ధైర్యం చెప్పేవాడు. ఏడాది తర్వాత దీపకి ఇక ట్రీట్మెంట్ అవసరంలేకపోయిన్ది.... కానీ దీప అమ్మగారు అత్తగారు హరికృష్ణ ఇంటికి చేరుకున్నారు...వాళ్ళని చూసేవారు లేక.


పోనీ.. 'సీనియర్ సిటిజెన్ హోమ్ కి పంపు....' అందమా అంటే .... అది ఫ్రీకాదు. డబ్బు ఎవరు పెట్టగలరు? మళ్ళీ హరికే పనిష్మెంట్ అవుతుంది. ఇలాంటి కష్టాలు ఒకరు తీర్చేవి కావు.


చిన్న వయసులో భవిత పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదమో ఉదాహరణ

హరికృష్ణ జీవితం. కొందరు అంతే. ఎవరైనా చెప్పినా అప్పుడు గుర్తించరు.

'ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు?' అనుకున్నాడు సూర్య చంద్ర.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.





64 views0 comments
bottom of page