'Chitrakaruda Abhinandanalu' New Telugu Poetry Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
జగతిలో అందాలు చిత్రించిన ఆ కనిపించని చిత్రకారుడు ఎవరు?
దూరాన నీలాకాశంలో దేశాలకు తరలిపోయే వేలాది పక్షులు సృష్టిస్తావు ...
నీ కుంచెతో సప్త వర్ణాలను విదిలించి నచ్చక అంతలోనే రంగులు మార్చుతావు..
గర్జించే మేఘాలు కురిపించిన వర్షాన్ని గాజు దారాల్లా భ్రమింపచేస్తావు .....
మడుగులుకట్టిన వాన నీటిని తటాకాలుగ మార్చి మురిపించేవు .....
ఎండి మోడులైన మొక్కలకు వృక్షాలకు జీవంపోసి పూలు పళ్ళు ఇస్తావు .....
పచ్చని ఆకులతో కొమ్మలతో గూడు కట్టి చిన్నారి పక్షి కూనలకు ఆశ్రయం ఇస్తావు .....
భువిని స్వర్గంగా మార్చి స్త్రీ పురుషులను కలిపి మరో సృష్టి చేస్తావు..... .
నీ కష్టానికి ఫలితం ఆశించక అణువణువునా అందాలు నింపుతావు ...
నువ్వు పొందలేని ఆనందం ఎందరికో పంచుతావు.....
నీ భగ్న ప్రేమను మరచి ప్రేమికులను వొకటిచేస్తావు...
నీ కలలను నిజం చేసుకోలేక మా కలలకు ప్రాణం పోసేవు....
సూర్య చంద్రులను నేలమీద దించుతావు పగలే చుక్కలను చూపించగలవు.....
అందం ఎక్కడవుంటుందో ఎలా ఉంటుందో తెలియదు .....
కానీ నీ కుంచెకు అందని అందాలు తాకని చోటు అంటూ లేవుకదా .....
ప్రకృతే నిన్ను అడుగుతుందేమో ... నీకుశాశ్వితమైన 'మోడల్‌గా' ఉంటానని....
అందుకే నీ కుంచె ఎప్పుడు కొత్త అందాలకు ప్రాణాలు పోస్తుంది....
నిన్ను చూసి కలతలు మరచిపోతాము నీతో కలసి పయనిస్తాము....
నీవులేని మేములేము ఈ ప్రపంచమేలేదు నీ మేలు మరువలేనిది ....
నీవొక అదృశ్యశక్తి వి మాకు జీవితాన్నిచ్చిన గొప్ప సృష్టి కర్తవు....
నీకిదే మానవాళి సమర్పించు కృతజ్ఞతాభినందనలు!
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్‌గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comentários