కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Nerchukundam' New Telugu Poem Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
మనిషి జీవితం పూలబాటకాదు
అన్నీ సంతోషాలు వుండవు
నడిచేదారి ఏదైనా
ఎత్తుపల్లాలు ముళ్ళ పొదలు అగాథాలు ఉంటాయి
ఆవేదన కలిగితే తట్టుకోవడం కష్టమే కానీ
మనసు కుదుట పరచుకుని
బాధను అధిగమించే ప్రయత్నంలో
ఎక్కడో ఒక వెలుగురేఖ ఉదయిస్తుంది
విషాదానికి సమాధికట్టి
మంచికాలం వస్తుందని
నమ్మకానికి పునాది వేసుకోవాలి
కాలచక్రం తిరిగి పోతున్నప్పుడు
వెలుగు నీడలు సహజమే
పగలు రేయి వున్నట్టే
వెన్నెల అమావాస్య వచ్చి పోయినట్టే
రుతువులు మారినట్టే
జీవన యానంలో మార్పు తప్పదు
ఈ నాటి విషాదం
కాలక్రమంలో మరుగున పడిపోతుంది
బిడ్డ పుట్టినప్పటి కష్టం
ఆ పసిపాప ఎదుగుతూ
తన చిలిపి చేష్టలతో
మురిపించినపుడు మరిచి పోతాము
కష్టం శాశ్వతం కాదని తెలుస్తుంది
నిర్మలమైన నింగిలో
నల్లమబ్బు వర్షం కురిసే వరకే ఉంటుంది
ఆ తర్వాత తెల్లని మేఘాలు
దూది పింజల్లా అలరిస్తూ చెదరిపోతాయి
రోజూ ఉదయిన్చే సూర్యుడు
సంధ్యా సమయంలో అస్తమించడం
సహజమైన చర్యగా అనుకుంటాం
రేపు తిరిగి సూర్యోదయాన్ని చూడగలమనే భరోసాతో
ప్రకృతి మనకు గురువు స్నేహితుడు
ఆప్త బంధువు అనుకుంటూ
ఎవరికీ తగినట్టు వారు అన్వయిన్చుకోవచ్చు
స్వాంతన పొందవచ్చు
అన్నీ పంచుకుని ఎన్నో నేర్చుకోవచ్చు
హేమంత ఋతువులో
ప్రకృతిని మంచుతెరలు కమ్ముకుని దారికనిపించదు
సూర్య కిరణాలు సోకగానే మంచు కరిగి
చెట్లకు జీవితాధార మైన నీటిని అందిస్తుంది
చూసేకళ్లకు ఎన్నో అందాలు కనిపిస్తాయి
కొత్తఆశలు చిగురిస్తాయి!
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments