కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Kapadukuntanu' New Telugu Poem Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
నా ఇంటి బాల్కానీ కుండీలో వేసిన మల్లెతీగ చిగురులు వేసింది
అప్పుడే పుట్టిన చిన్ని పాపను చూసినట్టు మురిసిపోయాను
ప్రతిరోజూ సాగే తీగలను తాకి సంబర పడుతుంటాను
ఆ చిగురులనుంచి వచ్చే చిట్టి మొగ్గలు ఎంత బాగుంటాయో
రోజూ నీళ్లు పోస్తూ వాటిని పలకరించకపొతే తోచదు నాకు
చూస్తూ ఉండగానే తీగలు సాగి బాల్కానీ గ్రిల్లుకి అల్లుకు పోతుంటే
నా కన్నబిడ్డ అందంగా యవ్వనిగా ఎదుగుతున్నట్టే అనిపిస్తుంది
మొగ్గలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ పరవశం మాటలకూ అందనిది
హఠాత్తుగా ఒకరోజు నా మనసును కలచి వేసే దృశ్యం కనబడింది
ఆప్యాయంగా ఆనందంగా అపురూపంగా చూసుకునే నా మల్లె తీగ
పక్కింటి ఫ్లాట్ ఫెన్సింగ్ వైపు అల్లుకుంటూ వుంది
అక్కడవున్న నాగ జెముడు పొద ముళ్లలో చిక్కు కుంటుందేమో
అనే భయం నన్ను నిలువునా విచారంలో ముంచి వేసింది
ఆ ఆపద నుంచి నా మల్లి తీగను కాపాడటం ఎలా
లాగితే తెగిపోతుంది
కాలం మారేదాకా వేచివుంటే
పక్కింటి ఫెన్సింగ్ కి అతుక్కుపోతుంది
విరిసిన పూలు రాలి మళ్ళీ చిగుళ్లు వచ్చే నాటికి
నిరోధించాలి అంటే కట్ చేయాలి
అల్లారు ముద్దుగా పెంచుకునే మల్లి తీగను కట్ చేయడం బాధాకరం
కానీ తెలిసి తెలియని వయసు మల్లిని దుష్ట సాంగత్యానికి
దూరంగా ఉంచాలి
ఆ బంధానికి అడ్డు వేయాలి
తప్పదు వేసాను
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నా ఇంటికి మాత్రమే పరిమితం చేసాను
ఇప్పుడు నా మల్లి తీగ నా గ్రిల్ కే అల్లుకుని వొదిగిపొయిన్ది
నాకు మాత్రమే మిగిలినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాను
అవును
దాన్ని కాపాడుకునే బాధ్యత నాదే!
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments