కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Nene Chinna Kodalu' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
ఈసారి వెళ్ళిన దసరా పండుగను, దీపావళిని నా జీవితంలో ఎప్పుడు జరుపుకోని విధంగా మా అత్తమామలతో కలిసి చాలా సంబరంగా జరుపుకున్నాము. ప్రస్తుతానికి మేము సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి అనే ప్రణాళికను తయారుచేస్తూ ఉన్నాము. అయినా నేటి ఆధునిక, కంప్యూటర్ ప్రపంచంలో అత్తమామలతో కలిసి కొడుకు కోడలు, అక్కా బావలతో కలిసి పండుగ జరుపుకోవడం ఏమిటీ అని మీ సందేహమా?? అయితే నా కథను చెపుతాను వినడానికి రండి!.
నా పేరు కావ్య, మా ఆయన పేరు హరి. మా పెళ్లి 2016 లో జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. నాకు మేనమామ అవుతాడు హరి. అంటే మేనరికపు పెళ్లి అన్నమాట. నాకు పెళ్ళి అయిన కొన్ని నెలలు మాత్రమే చాలా మంచిగా సంతోషంగా జీవితం అత్తామామాలతో గడిచింది. తరువాత గొడవలు మొదలు అయ్యాయి. అంటే అత్తా మామ చెప్పే పనులు నాకు నచ్చడం లేదు. ఎందుకంటే ప్రతి రోజూ ప్రతి చిన్న పనీ నాకు చెప్పడంతో నాకు చాలా విసుగు వచ్చేది.
అదీ కాక మా నానమ్మకు మా అమ్మ భోజనం సరిగ్గా చేసి పెట్టేది కాదు. అందువల్ల నాకు కొంచం కోపం కూడా వుంది మా అమ్మమ్మ మీద. ఇక్కడ మీరు సందేహంలో పడ్డారుకదూ.. ఏమీ లేదు. మా అమ్మ వాళ్ళ అమ్మ కొడుకుని నేను పెళ్లి చేసుకున్నా. ఇపుడు మీకు అర్థం అయింది అనుకుంటా.
సరే.. అసలు విషయానికి వద్దాం. మా అత్తా మామ పని చేయాలి అంటారు. తిట్టినా ఎదురు చెప్పకూడదు అంటారు. మా ఆయన మాత్రం నోట్లో నాలుక లేని మనీషాయే..
అందులోనూ నాకు కాస్త కోపం ఎక్కువ. ఇంకా గొడవలు పెరిగే కొద్దీ కోపంతో ఎవరేమి చెప్పినా వినకుండా .నాకు ఎంత ఆస్తి వస్తుందో నాకు ఇవ్వండి. అని అడిగేశాను.
ఇంక మా అమ్మ వచ్చి “మా అమ్మను నువ్వు బాగా చూసుకుంటావని నిన్ను ఇచ్చి వివాహం చేస్తే ఇలా చేస్తావా” అని కోప్పడింది.
అపుడు నేను “నువ్వు మాత్రం మీ అత్తకు అన్నం పెట్టవు. నేను మాత్రం మీ అమ్మ అయిన నా అత్తకు అన్నం పెట్టాలా? నీకో న్యాయం నాకో న్యాయమా.. ఇదెక్కడి న్యాయం?” అని అన్నాను.
అపుడు మా అమ్మ నిశబ్ధంగా ఉండిపోయింది. నా మాటలను విని. అపుడు.. అంటే గొడవ పడిన తరువాత విడిపోయినపుడు బాగానే ఉంది. తరువాత నాకు కష్టాలు మొదలు అయ్యాయి. నేను గర్భం దాల్చిన సమయంలో చాలా జాగ్రత్తగా వుండాల్సిన నేను ఒంటరిని కాబటి అన్ని పనులను నేనే చేసుకోవాల్సి వచ్చి, దానితో చాలా బాధ వేసింది. మొదటి సారి ప్రసవ సమయంలో మా అమ్మ నన్ను చూసుకుంది. రెండవ సారి మా అమ్మకి నాకు గొడవ జరగడంతో మా అమ్మతో కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అటువంటి సమయంలో మా అత్తమ్మ నాకు దగరగా వచ్చి నేను తిట్టినా, చీదరించుకున్నా నన్ను ఓపికతో చాలా కష్టపడి, ప్రసవించే వరకు నాకు అన్ని సేవలను చేసింది.
అపుడు మా అత్తమ్మ గురించి తెలుసుకుని ఆమెకు సేవ చేస్తూ అందరం కలిసి ఉంటున్నాం.
సరే అండి.. నేను సంక్రాంతికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి వెళ్ళొస్తాను.........
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comentarios