top of page
Writer's pictureA . Annapurna

పోగొట్టుకున్నా...కానీ...

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Pogottukunna... Kani...' New Telugu Story Written By A. Annapurna


రచన: ఏ. అన్నపూర్ణ


ఆకాశం మేఘావృతమై వర్షం జల్లుగా పడుతోంది ....అప్పుడప్పుడు వస్తూ పోతూ .

నక్షత్ర తన గది బాల్కానీ లో నిలబడి ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ మీద పడిన అల్లరి చినుకులను తుడుచుకుంటూ ఆనంద పడుతోంది.


పొగమంచుతో దూరాన వుండే ఇళ్ళు, చెట్లు.. ఏవీ కనబడటం లేదు.

అప్పుడే ఫోను రింగు అయినది. ఆ రింగ్ టోన్ ఆకాష్ ఫోనుది.


''ఏం చేస్తున్నావ్ డియర్ ...!” అన్నాడు ప్రేమగా .


''చల్లని చిరుగాలి వీస్తూంటే వర్షం వచ్చేలా ఉందని గంట నుంచి ఎదురుచూస్తూ వున్నాను.


నేను కుండీల్లో వేసిన మొక్కలు కూడా ఆకులు కదిలిస్తూ సంతోషం తెలియ చేస్తున్నాయి . కానీ వర్షంలో తడిస్తే పూలు తట్టుకోలేవని కుండీలను షెడ్లోకి మార్చాను.

పదినిముషాలు ముందే వాన జల్లు మొదలైంది. చిలిపి చినుకులు నన్ను నిలువెల్లా తడిపేస్తూంటే ఎంత బాగుందో తెలుసా ...!” భావ యుక్తంగా చెప్పింది నక్షత్ర .


''అవునా ఇట్స్ టూ బాడ్ ...నువ్వు అసలే సెల్ఫీస్టువి (సెల్ఫీలు తీసుకోడం అంటే ఇష్టం అనీ లేదా స్వార్ధ పరురాలివి అనీ కూడా అనుకోవచ్చు )


ఒక్కదానివే ఆనందాన్ని స్వంతం చేసుకుంటున్నావా...అసూయగా వుంది నాకు.

''మరి ఏమి చేయాలి ఆకాష్! నువ్వక్కడ ఆస్ట్రేలియాలో నేనిక్కడ ముంబైలో .....వీడియో కాల్ ఆన్ చేద్దాం....”


''నో.. అది చాలదు. ఇప్పుడు నువ్వు మీ ఇంటినుంచి బయటకు వచ్చేయ్. నీకో సర్ప్రయిజ్ …” అన్నాడు.


''వాట్ డూ యూ మీన్?” ఆశ్చర్యంగా నడుచుకుంటూ బయటకు వచ్చిన ఆమె చుట్టుపక్కల చూసింది.


అక్కడ బైక్ ని ఆనుకుని వానలో తడుస్తూ వున్న ఆకాష్ కనిపించాడు.


''ఆకాష్ ...రియల్లీ నువ్వేనా.. ఐకాన్త్ బిలీవ్ ఇట్ ..” అంటూ ఒక్కపరుగున అతడిని చేరుకుంది.


నక్షత్రను హత్తుకుని బైక్ మీద కూర్చోబెట్టి మెరైన్ డ్రైవ్ కి తీసుకెళ్లాడు.

వాన జల్లు పడుతూ, మళ్ళీ ఆగుతూ.. వాతావరణం ఆహ్లాదంగా వుంది.

బైకుని అక్కడే పాన్ షాప్ దగ్గిర ఆపి, నక్షత్ర చేయి పట్టుకుని నడుస్తుంటే స్వర్గంలో ఉన్నట్టు వుంది ఇద్దరికీ.


ఆస్ట్రేలియా నుంచి ఆకాష్ ఎప్పుడువచ్చాడో తెలియదు.ఇంత గొప్పగా సర్ప్రైజ్ ఇస్తాడని ఊహించలేదు.

ఆనందం తప్ప మాటలు ఎక్కడ!


ఆకాష్ నాన్నగారు పెళ్ళికి ముహూర్తాలు నిర్ణయించి పిలిచారని అసలు తెలియదు.

ఇదంతా అమ్మ నాన్న కి తెలిసినా నక్షత్రకి చెప్పలేదు.

అందుకే ఈ అనుభూతి అంత గొప్పగావుంది.

రెండు కుటుంబాలు తెలిసినవాళ్ళు. ఇద్దరికీ ఇష్టం అనితెలిసి స్వేచ్ఛ ఇచ్చారు.


“తర్వాత మీకు ఇష్టం ఐతే పెళ్లి చేస్తాం” అన్నారు. చదువులు పూర్తి చేసేదాకా ఆకాష్ నక్షత్ర జాబ్స్ వచ్చేదాకా

గడువు అడిగితె ''మీ ఇష్టం'' అన్నారు.

ఇప్పుడు పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు.

రెండేళ్లపాటు జీవితం పూలనావలా గడిచిపొయిన్ది. అమ్మ నాన్నల ఇష్టానికి అనుగుణంగా ఇండియాలో వున్నారు.


కానీ రోజులు గడిచేకొద్దీ ఆకాష్ లో మార్పు. ఇక్కడ బాగానే లాభాలు గడించే కంపెనీ చాలదు అనుకున్నాడు.

అమెరికాతో బాటు మరో రెండు దేశాల్లో కూడా బ్రాన్చీలు ఏర్పాటు చేసి క్షణం తీరుబాటు లేకుండా విదేశీ ప్రయాణాలు చేస్తూ వుంటాడు.


ఒకోసారి నక్షత్ర వెళ్ళేది. ఆతర్వాత విసుగు అనిపించింది.

పాత రోజులు వస్తే బాగుండును. ....ఆకాష్ నేను మళ్ళీ ఒక్కసారి మెరైన్ డ్రైవ్ వెళ్లి వర్షంలో తడవాలని వుంది. కానీ ఆకాష్ కి తీరికేది.?


పెళ్ళికి ముందు ఆకాశ్ వేరు ఇప్పుడువేరుగా ఎందుకు మారాలి?


ఇప్పటి తరం వాళ్ళతో పోటీపడి సంపాదించాలనే ఆశ అవసరమా? డబ్బుతో ఇల్లు నగలు కొనవచ్చు.


సంతోషాన్ని కొనలేం .కాని డబ్బు అవసరం లేకుండా మన పరిధిలో చిన్నపాటి ఆనందం సృష్టించుకోవచ్చు .

నేను సంపద హోదా కోరుకోలేదు. పిల్లలు ఇల్లు చూసుకుంటూ చిన్న చిన్న సరదాలు తీర్చుకోవాలి....

ప్రతివారం బీచ్ కి వెళ్ళాలి ....నాకు ఆకాశ్ దగ్గిరగా నేనే లోకంగా పిల్లలే ప్రపంచంగా ....వానలో తడుస్తూ


'రిం జిమ్ గిర్ సావన్ ....’ అని పాడుకోవాలి....ఈ చిన్న ఆశ తీర్చవా ఆకాశ్ అని అడగాలి.

బర్త్ డే వచ్చినప్పుడు ఆకాశ్ అడుగుతాడు.

''హానీ రిసార్ట్లో పార్టీ యా ...వేరే ఏదైనా కంట్రీ వెడదామా... ఎలాంటి నగలు కావాలి....” అని అడుగుతాడు.


'అవేమి వద్దు. ఇక్కడే మనింట్లోనే చేసుకుందాం. మీ పేరెంట్స్, మా పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలు ...... ఒకరి కోసం ఒకరు ఎప్పుడు కలుసుకుంటామా అని ఎదురుచూసే మధురాను భూతులు పంచుకుందాం…” అంటే...

''అది తెలిసి తెలియని రోజుల్లో ...ఇప్పుడు ఆ అవసరం లేదు గా ...సిల్లీగా మాటాడకు…” అంటాడు తప్ప అర్ధం చేసుకోడు.


ఇంతేనా ఈ జీవితం! ఎవరికోసమో తప్ప మనకంటూ ఏమి లేదా?

అంతలో ఫ్రెండ్ మేఘన ఫోన్ చేసింది.


''కోవిడ్ వలన మరణించిన వారి పిల్లలు ఎందరో ఆనాధలు అయ్యారు. వారిలో ఒకరిని నేను దత్తత

తీసుకుంటున్నాను. నీకు ఏమైనా ఆలోచన ఉందా?”


మేఘనకు ఇద్దరు అబ్బాయిలు .ఇప్పుడు అమ్మాయిని తెచ్చుకోవాలి అనుకుంటోంది.


''నేనూ వస్తాను. పికప్ చేసుకో”మని బదులిచ్చింది.


అమ్మకి అత్తగారికి ఫోన్ చేసి చెప్పింది.... తన నిర్ణయం.


''ఆకాశ్ ని కూడా అడుగు నక్షత్రా.....అతనికి కోపం వస్తుందేమో....!” అన్నారు ఇద్దరూ.

''వచ్చినా పర్వాలేదు. నా నిర్ణయం మారదు....” స్థిరంగా చెప్పి అప్పుడే వచ్చిన మేఘనతో పాటు బయలు దేరి వెళ్ళింది.


పెద్ద పేరుగల కుటుంబాలు కనుక చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఏమీ అభ్యంతరాలు చెప్పలేదు.

అయిదేళ్ళ పిల్లలు అలవాటు అయ్యేసరికి కొంత టైం పట్టినా ఏడాదికి బాగా అలవాటు పడ్డారు.

విచిత్రం ఆకాశ్ ఏమీ అనలేదు. 'నన్ను సాధించదు… అంతేచాలు' అనుకున్నాడేమో .

ప్రతి వీకెండ్లో మెరైన్ డ్రైవ్ బీచ్ కి వెడుతోంది నక్షత్ర పిల్లలను తీసుకుని.


''ఆ పిల్లలు అదృష్ట వంతులు.... తల్లి తండ్రులు కరువైనా ..పెంచుకున్న కుటుంబం మంచిది ...'' అనుకున్నారు తెలిసినవాళ్ళు.


బీచ్లో పిల్లలు ఆడుకుంటారు నక్షత్ర చేతులు పట్టుకుని పరుగులు పెడుతూంటారు.

కెరటాలతో ఎగసిపడే అలలను చూస్తూ అనుకుంది నక్షత్ర .....


'' నా జీవితంలో ఆకాశ్ ఆనాటి ప్రేమను పంచలేడు కానీ ...ఇప్పుడు ఈ పిల్లలు నాకు మరో ప్రేమను పంచుతున్నారు ఇది చాలు అని!


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.




రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.



45 views0 comments

Comments


bottom of page