కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 13' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
తనను గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తుంది సమీర. బయటకు ఆ వాసన రావడంతో నవ్వుకుంటారు పర్వీన్, శిల్ప.
ఇక్కడ జయా అంటీ ఇంట్లో సందీప్ తో కలిసి స్నేహ మీద అటాక్ చెయ్యడానికి ప్లాన్ వేస్తారు ప్రవీణ్, ఆంటీ.
ఇక చదవండి...
కీ హోల్ నుండి చూసిన స్నేహ, బయటనుంచి ఎవరో లోపలి చూస్తూ ఉండటంతో భయపడుతుంది. గబుక్కున పక్కకు జరిగి గోడకు ఆనుకొని నిలుచుంటుంది.
ఇంతలో అతను బయటనుండి "అమ్మా స్నేహా! నేనమ్మా .. వినీత్ అన్నయ్యను' అనడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.
సందేహం లేదు. అది తన కజిన్ వినీత్ గొంతే! అయినా అనుమానం తీరక మరోసారి కీ హోల్ నుండి బయటకు చూసింది.
అది గమనించిన అతను తన మొహం కనిపించేలా వెనక్కి జరిగి, "తొందరగా తలుపు తియ్యమ్మా! నేను బయట నుంచి లాక్ తీసేసాను. గౌతమ్ తన దగ్గరున్న కీ ఇచ్చాడు. నువ్వు లోపలి గడియ తియ్యి. చాలు" అన్నాడు వినీత్.
వెంటనే గడియ తీసింది స్నేహ. వినీత్, అతనితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు వెంటనే లోపలి వచ్చి లోపలినుండి మళ్ళీ లాక్ చేసి గడియకూడా పెట్టారు.
తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని స్నేహకు పరిచయం చేస్తూ "వీళ్ళిద్దరూ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు. సమీర వాళ్ళ నాన్నగారు, గౌతమ్.. ఎసిపి ప్రతాప్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏర్పాటు చేశారు" అని చెప్పాడు వినీత్.
"ముందు మనం బెడ్ రూమ్ లోకి వెడదాం. ఇక్కడి మాటలు పక్క పోర్షన్ వాళ్లకు వినపడవచ్చు" చిన్నగా అంటూ బెడ్ రూమ్ లోకి నడిచింది స్నేహ. ఆమె వెంటే లోపలి వెళ్లారు ముగ్గురూ.
వాళ్ళను బెడ్ పైన కూర్చోబెట్టి తాను ఒక స్టూల్ లాక్కుని కూర్చుంది స్నేహ.
"డోర్ దగ్గర శబ్దం కాగానే భయపడి పోయాను. నీ గొంతు విన్నాకే ధైర్యం వచ్చింది. ఇంతకీ ఇక్కడికి పోలీసులు ఎందుకు? సమీర వచ్చాక ఏదైనా అటాక్ ప్లాన్ చేశారా ఆంటీ వాళ్ళు?" ప్రశ్నించింది స్నేహ.
"అటాక్ ప్లాన్ చేశారు. కానీ సమీర పైన కాదు. నీ మీదే స్నేహా!" చెప్పాడు వినీత్.
అంతలోనే స్నేహ ముఖంలోని భయాన్ని గమనించి "ముందు నేను చెప్పేది పూర్తిగా విను. చాలా సార్లు సర్ప్రైజ్ కావాల్సి ఉంటుంది" అన్నాడు వినీత్.
తాను ఓ గ్లాస్ మంచి నీళ్లు తాగి, వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చి తిరిగి స్టూల్ మీద కూర్చుంది స్నేహ, "ఇక చెప్పన్నయ్యా.." అంటూ.
"ముందుగా ఒక సర్ప్రైజ్.. సందీప్ ఇండియా వచ్చాడు" చెప్పాడు వినీత్.
ఆనందంతో కేక పెట్టబోయింది స్నేహ. ఆమెను అరవద్దని సైగ చేసి, "సందీప్ పక్క పోర్షన్.. అంటే జయా ఆంటీ ఇంట్లోనే ఉన్నాడు. నిన్ను చంపెయ్యమని జయా ఆంటీతో చెప్పాడు. అది తను స్వయంగా చూడాలట" అంటూ చెప్పడం ప్రారంభించాడు వినీత్.
***
మాములుగా అయితే ఇలాంటి సమయంలో ఇంటర్వ్యూ కి ఒప్పుకోడు కనకారావు.
కానీ ఎలెక్షన్ లు దగ్గర్లోనే ఉండొచ్చంటున్నారు. కాస్త మంచిగా ప్రచారం చేయించుకుంటే అసెంబ్లీ సీటుకు ట్రై చేసుకోవచ్చు. సీట్ ఇవ్వక పోతే పార్టీ మారితే సరి. ఎలాగూ మాజీ ఎంపీ కూడా పార్టీ మారబోతున్నాడు. అతను కనకరావుకి బాగా క్లోజ్.
ఆలోచిస్తూనే ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన వాళ్ళ వంక ఒకసారి పరిశీలనగా చూసాడు కనకారావు.
మొత్తం ముగ్గురు ఉన్నారు వాళ్ళు. ఒక వ్యక్తిని ఇదివరకే చూసి ఉన్నాడు కనకారావు. మరో ఇద్దరు మాత్రం కొత్త వ్యక్తుల్లా ఉన్నారు.
తనకు తెలిసిన వ్యక్తి వంక చూస్తూ..."నువ్వు శివా కదూ! నాకు తెలుసులే.. వీళ్ళను మాత్రం ఎప్పుడూ చూడలేదే..' అంటూ తన అనుచరుడిని పిలిచి "అందరికీ ముందు కూల్ డ్రింక్స్ ఇవ్వు. తరువాత ఏంకావాలో వాళ్ళను అడిగి ఏర్పాటు చేద్దాం"" అన్నాడు.
శివా మాట్లాడుతూ " నేను మీకు తెలుసుగా.." అంటూ కాస్త ముందుకు వంగి కనకరావుతో రహస్యం చెబుతున్నట్లుగా " వీళ్ళిద్దరూ యు ట్యూబ్ న్యూస్ ఛానల్ వాళ్ళు. మంచి పార్టీ ఏర్పాటు చేస్తే మీరు అడిగినట్లు రాస్తారు. మేడ మీద ఒకసారి ఏర్పాటు చేశారట కదా! మా ఫ్రెండ్ చెప్పాడు" అన్నాడు.
ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల వంక మరింత పరిశీలనగా చూసాడు కనకారావు.
"నాకు బాగా తెలిసిన వాళ్లే. నేను చెప్పినట్లే వాళ్ళ ఛానల్ లో చూపిస్తారు " అభయం ఇచ్చాడు శివ.
"అందుక్కాదు. చూస్తుంటే ఇద్దరూ కమాండోల లాగా ఉన్నారు.ఎలెక్షన్ టైం లో బాడీ గార్డ్ ల లాగా ఉంటారేమో కనుక్కో.. ఇక పార్టీ సంగతి.. మేడ పైన బంధువులు ఉన్నారు. అందుచేత పార్టీ మరో రోజు పెట్టుకుందాం. లేదా నీకు డబ్బులు ఇస్తాను. నువ్వే బయటెక్కడైనా అరేంజ్ చెయ్యి" అన్నాడు కనకారావు.
ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి మైక్ కనకారావు ముందు పెడుతూ "మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని వదిలి వేరే పార్టీకి ఫిరాయించ బోతున్నారా?" అని అడిగాడు.
గతుక్కుమన్నాడు కనకారావు.
"మీ కాంపౌండ్ వాల్ కి వెనుక వైపు ఒక గేట్ ఉంది. దానివల్ల మీకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ కదా! ఆ ఎంట్రన్స్ ఎందుకు ఉంచారు?" ప్రశ్నించాడు మరో వ్యక్తి.
చెమటలు పట్టాయి కనకరావుకి.
"మా ఆవిడ ఊర్లో లేదు. పార్టీ కింద గదిలోనే ఏర్పాటు చేయిస్తాను. నేను మా బంధువులతో పైన పడుకుంటాను" గొంతు తగ్గించి, శివాతో చెప్పాడు కనకారావు, దిగి వస్తూ.
"మీ బంధువులతో ఒక ఫోటో తీసుకోనిస్తారా.. మా ఛానల్లో పెడతాను" అన్నాడు ఆ వ్యక్తి.
భయపడుతున్న కనకరావుతో "మీరేం పరేషాన్ కాకండి. ఇంతకీ వీళ్ళని మీకు పరిచయం చెయ్యలేదు కదూ.. ఇతను ఉదయ్. పక్కనున్న వ్యక్తి కిషోర్" అని చెప్పి, వాళ్ళ వైపు తిరిగి' కనకరావుగారు నాకు బాగా కావలసిన వ్యక్తి. ఆయనను ఇబ్బంది పెట్టకండి" అన్నాడు.
“అయితే ఇందాకటి ప్రశ్ననే మరోలా అడుగుతాను.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పార్టీలో కొనసాగడం తప్పు కాదా? కొత్త పార్టీలో పదవి రాకపోయినా ప్రజలకోసం త్యాగం చేయబోతున్నారా?" తిరిగి అడిగాడు ఉదయ్ అనే వ్యక్తి.
“మీకు ప్రస్తుత పార్టీలో సీట్ రాకపోతేనే ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేస్తాం. ఒకవేళ వీళ్ళే సీట్ ఇస్తే ప్రసారం చెయ్యడానికి నేను ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటాను" చెప్పాడు కిషోర్ అనే అతను.
ఖుషీ అయ్యాడు కనకారావు.
"మీలాంటి వాళ్ళు మీడియాలో వుంటే నాలాంటి వాళ్లకు అడ్డే ఉండదు. ఆ గదిలోకి పదండి. మంచి పార్టీ చేసుకుందాం" అన్నాడు కనకారావు.
“మీకెందుకు సార్ శ్రమ! నేను కంపెనీ ఇస్తానులే. పైగా మీ బంధువులు ఉన్నారని చెప్పారు.." అన్నాడు శివ.
"ఇంత మంచి కంపెనీ వుంటే నేను రాకుండా ఉండలేను. పార్టీ ముగించి, నేను మేడ పైన సెపరేట్ రూమ్ లో పడుకుంటాలే.." అన్నాడు కనకారావు.
చేసుకోబోయే పార్టీ, ఆ తరువాత సమీరతో అనుభవం... ఊహించుకుంటేనే మత్తెక్కుతోంది అతనికి.
అందరూ పక్కనే ఉన్న డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లారు.
అతని అనుచరుడు క్షణాల్లో అన్ని ఏర్పాట్లూ చేసేసాడు.
నలుగురికీ గ్లాసుల్లో మందు సర్వ్ చేసి ఫుడ్ తీసుకురావడానికి బయటకు వెళ్లాడతాను.
మిగతా వాళ్లకు చీర్స్ చెప్పి తాగడం ప్రారంభించాడు కనకారావు.
ఉదయ్ అనే వ్యక్తికి మందు తలకెక్కిందేమో.. "కనకారావు గారూ! మీకు ఎం ఎల్ ఏ సీటు తప్పకుండా వస్తుంది. రప్పించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ప్రతి రోజూ మీ గురించి న్యూస్ వేస్తాం. మీరు ఎక్కడికి వెళ్లినా కవర్ చేస్తాం. మీ వెనక వేలాది మంది వస్తున్నట్లు గ్రాఫిక్స్ కూడా చేస్తాం" అంటూ భజన ప్రారంభించాడు.
కనకారావు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.అదే అదనుగా శివా కనకరావుకు దగ్గరగా జరిగి, "పైన బంధువులు కాదు, అమ్మాయిలు ఉన్నట్లు మాకు తెలుసు. మా కుర్రాళ్లకు ఏదైనా ఛాన్స్ దొరుకుతుందా? మరోలా అనుకోకండి. ఒక్క ఛాన్స్ ఇస్తే, దెబ్బతో మీ అనుచరులుగా మారిపోతారు" అన్నాడు.
క్షణం ఆలోచించాడు కనకారావు. 'ఆ సమీర తనకు అంత తేలిగ్గా లొంగే రకం కాదు..
వీళ్లకు శిల్ప, పర్వీన్ లను ఎరగా వెయ్యడం మంచిది. ఇక ఎప్పటికీ తన మాట జవదాటరు. తన జోలికి రారు. అవసరమైతే సమీరా మానభంగ కార్యక్రమంలో వీళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు..'
ఇలా అలోచించి, తన అనుచరుడికి ఫోన్ చేసాడు.
"ఫుడ్ కి తొందరేం లేదు. ఓ రెండు గంటలాగి రా" అని చెప్పి ఫోన్ పెట్టేసి వీళ్ళవంక చూసి, తన బ్రాండ్ వంకర నవ్వు నవ్వాడు.
"ఆ నవ్వుకర్థం ఏమిటో..మా మీద దయ కలిగినట్లుంది.." అన్నాడు శివ.
"అంత మాటొద్దులే. ఏదో ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవడం మాములేగా.. మీరు ముగ్గురూ ఈ రోజు నక్క తోక తొక్కి వచ్చినట్లున్నారు. పైన మీకోసం అందగత్తెలు ఎదురు చూస్తున్నారు" అన్నాడు శివ వంక అదోలా చూస్తూ.
ఇంకా వుంది…
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14 త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Commenti