top of page

మహిళలూ - ఆరోగ్యం


'Mahilalu Arogyam' New Telugu Article

Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ




స్నేహితులారా - మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది. ఆహార నియమాలు, ఎక్సర్ సైజులు... డాక్టర్ సలహాలు పాటిస్తూ జీవించినంతకాలం సంతోషంగా ఉండవచ్చు.


మనం వింటున్నాం.... వంద సం. దాటినా మహిళలు

ఇంటిపని, వంట పని చేసుకోవడం...


అవును. ఇప్పటి రోజుల్లో ఏజ్ అనేది అంకె మాత్రమే.

ఒకప్పుడు నూటికి కోటికి ఒకరే ఉంటే ఇప్పుడు చాలామంది వున్నారు.


కుటుంబాలలో 7 తరాల జీన్స్ వుంటాయని అంటారు. ఈ రోజుల్లో వచ్చిన ఆధునిక వైద్య సదుపాయాలు కొంత కారణం కావచ్చు.

మనం ఒక ఫిజీషియన్ ఫామిలీ డాక్టరు పర్య వేక్షణలో వారి సలహా పాటించాలి.


బద్ధకించకుండా 40 ని. లు వాకింగ్ చేయాలి. షుగర్ బీపీ ఉంటే తప్పనిసరి.


మా డాక్టరు చెప్పింది - ఒక్కరోజు వాకింగ్ మానితే ఒక్క అడుగు బెడ్ కి దగ్గిర అవుతాం అని.. గోల్ పెట్టుకోమని..


నిజం అంటారు నా స్నేహితులు.

మహిళలు బాధపడే మరో సమస్య మోకాళ్ళు నొప్పులు.

సరిగ్గా 40 -50 ఏజ్ మధ్య మెనోపాజ్ స్టేజిలో ఆరోగ్య సమస్యలు ప్రారంభం అవుతాయి.


బీపీ షుగర్ జాయింట్ పెయిన్స్ మూడూ ఉంటాయి. 60 లో బి-12 లోపం వస్తుంది.


మనదేశంలో అడిగితే తప్ప బి-12, బోన్ డెన్సిటీ టెస్టులు చేయరు.


అనుమానం వస్తే కానీ బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రికమెండ్ చేయరు.


కాబట్టి ఫామిలీ డాక్టర్ ను తప్పకుండా ఎంచుకోండి. మనం డాక్టర్ను నమ్మితే ఆయన మనను కాపాడుతారు.


ఇక స్కిన్ రఫ్ గా తయారవుతుంది. ఏ సీజన్ ఐనా మాయిశ్చ రైజ్ క్రీమ్ తప్పని సరిగా వాడాలి.


సబ్బు అస్సలు వాడరాదు. దాని బదులు అమ్మ, అమ్మమ్మలు పాటించిన సున్నిపిండి వాడటం వలన చర్మం బాగుంటుంది. చాదస్తం.. పాత పధ్ధతి.. అని కాకుండా అనుసరిస్తే ఫలితం వుంది.


''అమెరికాలో ఉన్న పిల్లలు వృద్ధులైన తల్లి తండ్రులను శ్రద్ధగా చూస్తున్నాం.... అని విల్లాయో, 4bed రూముల పెద్ద ఫ్లాటో కొంటారు. ‘సుఖంగా వుండు’ అంటారు. కానీ మీరు రారు. అంత అవసరంలేదు.


ఒక్క రూము ఫ్లాటు చాలు. తక్కువ సామానుతో పనికూడా తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంది.


అమ్మ నాన్నలు ఎవరిపని వాళ్ళు చేసుకోలేని స్థితి తెచ్చు కోవద్దు. ‘ఒంటరిగా వున్నాం, మనలను ఎవరు చూస్తారు?’ అని ఆలోచించవద్దు.


హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ICCU లు VENTILATIORS వరకు వెళ్ళవద్దు... అనుకుంటే ఆరోగ్యం కాపాడుకోండి. ఎవరిమీదా ఆధారపడే దుస్థితి తెచ్చుకోవద్దు.


సినిమాలు చూడండి. సంగీతం, సినిమా పాటలు వినండి. రచనలు చేయడం.. పెయింటింగ్.. హిందీ కానీ ఏదో ఒక భాష నేర్చుకోండి. ఈ రోజు యూట్యూబ్ పాత రోజులు గుర్తు తెచ్చే ఎన్నో వీడియోలను అందిస్తోంది. మీ చిన్న నాటి రోజులను గుర్తు తెచ్చే ఎన్నో జ్ఞాపకాలు చర్విత చరణం చేసుకోండి. మనసుకి ఇష్టం కలిగించే వ్యాపకం ముఖ్యం.


పూలు, మొక్కలు, పక్షులు, అక్వేరియంలో చేపలు.. అబ్బో లెక్కలేనన్ని వ్యాపకాలు.


ప్రపంచం ఇప్పుడు అరచేతిలో వుంది. గూగుల్ సెర్చ్లో మహా మహుల చరిత్రలు, దేశ దేశాల వింతలూ విశేషాలు, సంగీతం, సముద్రాలు, లోయలు, ఐలాండ్స్, అడవులు, జంతువులూ.. అన్నీ తెలుసుకోవచ్చు.


అసలు నేను అనుకుంటా.. ఇంటర్నెట్ సదుపాయం, ఫోనులు,లాపీలు, ఐ ప్యాడ్లు అందుబాటులో ఉండటం వలన మనిషి జీవన ప్రమాణం ఇంతగా పెరిగిందేమో అని.


అందుకే శరీర అవయవాలు పనిచేసినంత కాలం ఒంటరితనం బాధించదు.


ఆ ఆరోగ్యంకోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధపడవచ్చు కదూ!


అవకాశాలను అందుకోండి. ఆచరణలో పెట్టండి. ఆనందంగా జీవించండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.












39 views0 comments
bottom of page