'Mokali Noppulu Vimukthi (Knee Pain Relief)'
New Telugu Article Written By A. Annapurna
రచన: ఏ. అన్నపూర్ణ
ఎన్ని తరాలు మారినా వైద్య రంగము, విద్యా రంగమూ ఎంతగా అభివృద్ధి చెందినా ఎదుర్కునే సమస్య ఒక్కటే.
నిరంతరం వేధించే మోకాళ్ళ జాయింట్ పెయిన్స్. సర్జరీ ద్వారా కొందరు నయం చేసుకోగలిగినా, మరికొన్ని వయసు వలన అనుభవించక తప్పదు. అంత మాత్రాన భయంలేదు. తగిన పరిష్కారమూ వుంది.
సాధారణంగా మెనోపాజ్ దశలో మహిళలకు ఈ నొప్పులు ప్రారంభం అవుతాయి. అది ఏజ్ తో పనిలేదు. ఇప్పటి రోజుల్లో 45 ఏళ్లకే మెనోపాజ్ వస్తోంది. అది బ్యాక్ పెయిన్ కావచ్చు నీ(Knee) పెయిన్ కావచ్చు. స్పాండిలోసిస్ భుజాలు మెడ నొప్పులూ కావచ్చు! ఇప్పుడు మోకాలి నొప్పులు గురించి మాటాడుకుందాం.
మొదట నొప్పులు ప్రారంభం అవగానే ఆయింట్మెంట్, హాట్ బ్యాగ్ తో కాపడం పెట్టుకోడం, వాకింగ్- ఎంత వీలు ఉంటే అంత.. 40 నిముషాల దాకా నడవటం, ఇంట్లోనే సైకిల్ తొక్కడం.. తప్పనిసరిగా రోజు వారీ దినచర్యగా పాటించాలి.
ఈ నొప్పులు సాధారణంగా వింటర్ లోనే ఉంటాయి. సమ్మర్కి కొంచెం బెటర్గా ఉంటాయి. అసలు ఉండవని చెప్పలేము. ఆలా అని ఓకే జాయింట్ లో రావు. వాటి దిశ మార్చుకుంటూ ఒకోసారి ఒకో జాయింట్ లో వస్తాయి.
వయసుతో బాటు పెరుగుతాయి కూడా. అందుకే 25 రాగానే పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంటే శరీరానికి ఎక్సర్ సైజ్ అలవాటు చేయాలి అన్నమాట.
ఎలా చేసినా లొంగలేదు, ఎక్కువ అవుతుంటాయి అనుకుంటే డాక్టర్ సలహాతో ఫిజియో థెరపీ చేయిన్చుకుని, D విటమిన్ - కేల్షియం మాత్రమే తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడద్దు.
ఇవేమి చేయకుండా హోమియోపతి ఆయుర్వేదం లాంటి ప్రయోగాలు చేయద్దు. (వాటిలో చాలావరకు స్టెరాయిడ్లు ఉంటున్నాయి. మంచి వైద్యుని గుర్తించడం కూడా చాలా కష్టం.)
యు ట్యూబ్ ఛానల్స్ చూసి మోసపోవద్దు. వేల రూపాయలు ఖర్చు చేసి అందరమూ జిమ్ముకు వెళ్ళలేము.స్టేషనరీ సైకిల్ -వాకింగ్- ఎక్సర్ సైజ్ ,చవక అత్యుత్తమం.! నొప్పులు బాధ పెడుతున్నాయి అని అస్సలు కూర్చోవద్దు.
ఇవన్నీ చేస్తున్నా, నడకలో వేగం తగ్గినా, బాలన్స్ తప్పి పడిపోతున్నా డాక్టర్ లు ఇంజక్షన్స్ ఇస్తారు. ఇది ఏడాది వరకు పనిచేస్తుంది. ఇలా రెండు, లేదా మూడు సం.ఇస్తారు. ఆ తరువాత ఇక సర్జరీ సూచిస్తారు.
సర్జరీ గురించి అపోహలు వద్దు. చేయించుకున్నాక చక్కగా నడుస్తారు. ఫిజియో థెరపీ 3 నెలలు చేయిన్చుకోండి. తరువాత మొదటినుంచి చేసే ఎక్సర్ సైజులు కంటిన్యూ చేయాలి. మానవద్దు. అప్పుడే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది.
ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ బాగానే చేస్తారు. ఫలితం ఎక్కువగా ఫిజియో థెరపీ మీద ఆధారపడి ఉంటుంది.పేషంట్కి పట్టుదల, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది నా స్వంత అనుభవం.!
ఆపరేషన్ చేయిన్చుకుని ఫిజియో థెరపీకి డబ్బు ఖర్చు ఎక్కువ .. అని మానుకుంటే ఆపరేషన్ వృధా ఐనట్టే.! ఆపరేషన్ ముందు, తరువాత కూడా ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేస్తే వేరే కారణాలు ఉంటే ఉండవచ్చు కానీ ఆపరేషన్ ఫెయిల్ అంటూ జరగదు.
అవును మన ఆరోగ్యం మన చేతులో ...వుంది, కొంతవరకు.
ఆచరణలో లోపం లేకుండా చేసుకోడం మన బాధ్యత.
కాదంటారా..?
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments