top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Srivari Kattu Kathalu Episode - 14' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


కనకరావును ఇంటర్వ్యూ చెయ్యడానికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వాళ్లకు పర్వీన్, శిల్పలను ఎరగా వెయ్యాలనుకుంటాడు కనకారావు. అలా చేస్తే తను చెయ్యబోయే పనికి ఏ అడ్డూ ఉండదని భావిస్తాడు…

ఇక చదవండి...


తనకు గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తూ ఉండగానే అతను గౌతమ్ అని గుర్తించింది సమీర. వెంటనే చేతిలోని స్ప్రే బాటిల్ ని వదిలేసి గౌతమ్ దగ్గరకు చేరుకుంది. తన చున్నీతో అతని ముఖం తుడిచింది.


"మరీ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయితే ఎలా" అన్నాడు గౌతమ్ కళ్ళు నులుముకుంటూ.


“ఇంకేం చెయ్యాలి? ఆలోచిస్తూ వుంటే ఈ లోపల నా మీద అటాక్ చెయ్యరూ.. అయినా అయం వెరీ సారీ" అంటూ అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తనూ పక్కనే కూర్చుంది.


అతను కాస్త రిలాక్స్ అయ్యాక అతన్ని దగ్గరకు లాక్కుంటూ "ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?" అంది.


"సారీ సమీరా! అయినా పర్వీన్ మన మనిషని అందుకే నీకు చెప్పాను, కాస్తన్నా కుదుటపడతావని" అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు.

కాస్త తెప్పరిల్లిన సమీర అతన్నుంచి దూరంగా జరుగుతూ "మనం ఎక్కడున్నామో మర్చిపోయావా" అంది.


అలా అందేగానీ ఆమెకు కూడా అతని కౌగిలిలో అలాగే ఉండిపోవాలని ఉంది.


"శత్రు స్థావరంలో ఇలా రొమాన్స్ చెయ్యడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదూ..." అంటూ మళ్ళీ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు గౌతమ్.


"థ్రిల్లింగ్ కాదు. ప్రమాదం" అంటూ మంచం మీదనుండి పైకి లేచింది.


"అసలు నువ్విక్కడికెలా వచ్చావు? పర్వీన్ మనవైపు రావడమేమిటి? ముందు ఇక్కడినుంచి ఇంటికి వెళ్లి అన్ని మాట్లాడుకుందాం" ఉద్వేగంగా అంది సమీర.


"మన ఇంట్లో స్నేహ ఉంది కదా . అందుకని.."


"అందుకని...?" అతని మాటల్లో ఉద్దేశం ఏమిటోనని ఆలోచిస్తూ అడిగింది సమీర.


"ఇక్కడే అన్నీ మాట్లాడుకుందాం" ముగించాడు గౌతమ్.


"అన్నీ అంటే.." పొడిగించింది సమీర.


"చూస్తుంటే అన్నీ నువ్వే మాట్లాడేలాగున్నావే.." అన్నాడు గౌతమ్.


'అదేం కాదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు సస్పెన్స్ మూవీ చూస్తున్నట్లు ఉంది. బాగా టెన్షన్ గా కూడా ఉంది" అంది సమీర.


సస్పెన్స్ మూవీ గానీ, హారర్ సీరియల్ ఎపిసోడ్ గానీ చూస్తున్నపుడు సమీరకు వేరే ఆలోచన ఉండదు . చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది.

అది గ్రహించిన గౌతమ్ సమీరను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. తరువాత తను ఆమె వెనక్కి చేరి, జడకున్న క్లిప్ ను తీసేసాడు.


"ఏయ్! ఏంచేస్తున్నావ్?" అర్థం కాక అడిగింది సమీర.


"నీ టెన్షన్ తగ్గడానికి హెడ్ మసాజ్ వరకూ ఇప్పుడు చేస్తాను. జరిగింది చెప్పే టైం లో ఊరకే ఉండటం ఎందుకు?" అన్నాడు గౌతమ్.


“అయ్యా మహానుభావా! నిన్ను పిలిపించింది కనకరావుకు మసాజ్ చెయ్యడానికి. నాకోసం కాదు.." అంది సమీర కాస్త రిలాక్స్ అవుతూ.


"వాడికి మసాజ్ చెయ్యడానికి ఇంకా టైం ఉందిలే.. అక్కడ ఇంటర్వ్యూ లో మావాళ్లు అతన్ని తికమక పెడుతూ ఉంటారు. పైకి వచ్చే ముందు నాకు మెసేజ్ పెడతారులే" అంటూ సమీర జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మృదువుగా నిమరసాగాడు.


గౌతమ్ చెయ్యి తగిలితేనే పులకరిస్తుంది సమీర. ఇక అతను తన జుట్టు నిమురుతూ వుంటే తట్టుకోలేక, "వద్దు గౌతమ్. మత్తులో స్పృహ కోల్పోతానేమో.." అంది.


"జరిగినవన్నీ ఇంటరెస్టింగ్ గా చెబుతాను. మత్తు వదులుతుందిలే.." అంటూ చెప్పడం ప్రారంభించాడు గౌతమ్.


“ఒకరోజు అనుకోకుండా చిన్నప్పటి స్నేహితుడు వినీత్ కలిసాడు.

మాటల మధ్యలో నేనెక్కడ ఉండేదీ చెప్పాను. ‘ప్రమోద్ ఉండేదీ అక్కడేనా’ అని అడిగాడు. అవునన్నాను.

‘ప్రమోద్ కారణంగా మా క్లాస్ మేట్, అతని కజిన్ స్నేహ ఆత్మహత్యాప్రయత్నం చేసిం’దని చెప్పాడు. ఆశ్చర్యంతో వివరాలు అడిగాను.


అతను చెప్పిన వివరాల ప్రకారం స్నేహ, సందీప్ అనే అబ్బాయిని ప్రేమించింది. సందీప్ వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మాన్. కోటీశ్వరుడు కూడా. తన కొడుకు పెళ్లి మరో ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో చెయ్యాలనుకున్నాడు. స్నేహను సందీప్ కి దూరం చెయ్యాలనుకున్నాడు. అతని కారు డ్రైవర్ ద్వారా విల్సన్ అనే వ్యక్తిని సంప్రదించాడు. విల్సన్, జయా ఆంటీ సహాయం తీసుకున్నాడు.


స్నేహ, ప్రమోద్ లు కొలీగ్స్ కావడంతో వాళ్ళు మామూలుగా కలిసి ఉన్నప్పటి ఫోటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి సందీప్ కి పంపారు. దాంతో సందీప్ హర్ట్ అయి, స్నేహతో బ్రేక్ అప్ చేసుకుంటున్నట్లు చెప్పి , ఆమెను అవాయిడ్ చేసాడు. ఆమె కాల్స్ అటెండ్ కావడం మానేసాడు.

మానసికంగా బాగా డిస్టర్బ్ అయినా స్నేహ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కాస్త రిలాక్స్ చెయ్యడానికి రెస్టారెంట్ కి తీసుకొని వెళ్లి ధైర్యం చెప్పాను.


సందీప్ కు, జరిగిన విషయాలు వివరంగా ఒక మెయిల్ పెట్టాను. ఆ మెయిల్ లో ఫోటోల గురించి కాక, వాటిని ఎవరు పంపారో, పంపిన వాళ్లకు ఆ అవసరం ఏమిటో కాస్త ఆలోచించమని, అతని తండ్రిని గట్టిగా నిలదీస్తే నిజం తెలిసిపోతుందని చెప్పాను.

నా మెయిల్ చూసిన అతను తన తండ్రికి ఫోన్ చేసి స్నేహ మోసం చేసిందనే బాధలో విషం మింగబోతున్నట్లు చెప్పాడట. దాంతో అయన కంగారు పడి, స్నేహ తప్పు లేదని, తను విల్సన్ అనే రౌడీ షీటర్ సహాయంతో ఆ ఫోటోలు తెప్పించానని ఒప్పుకున్నాడు. స్నేహతో పెళ్ళికి కూడా ఒప్పకున్నాడు. సందీప్ వెంటనే నాకు మెయిల్ చేసి ఇండియా బయలుదేరాడు.


విల్సన్ ను ఏ సి పి ప్రతాప్ గారు అదుపులోకి తీసుకున్నారు. నా సలహా ప్రకారం ఇందాకే సందీప్ జయా ఆంటీని కలిసాడు. తనను మోసం చేసిన స్నేహ మీద కసిగా ఉందనీ, ఆమెను తన కళ్ళ ముందే చంపితే కోటి రూపాయలు సుపారీ ఇస్తాననీ చెప్పాడు.


జయా ఆంటీ అంత తొందరగా బయటపడదు కదా! వెంటనే విల్సన్ కి ఫోన్ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న విల్సన్ సందీప్ చెప్పేది నిజమేనని చెప్పాడు. దాంతో ఆంటీ సందీప్ ని పూర్తిగా నమ్మింది.


నిన్ను కనకరావుకు అప్పగించే బాధ్యతను పర్వీన్ మీద ఉంచింది. ప్రవీణ్ కి ఫోన్ చేసి, తాము ఇంటికి వచ్చాక స్నేహను చంపాల్సి ఉంటుందని, సిద్ధంగా ఉండమని చెప్పింది. తరువాత సందీప్ తో ఇంటికి బయలు దేరింది. ఆమెతో బయలు దేరబోయే ముందు ఆ విషయం సందీప్ నాకు మెసేజ్ చేసాడు. ఆ తరువాత నాకు అతని దగ్గర్నుంచి ఏవిధమైన ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా పక్కనే వాళ్ళు ఉన్నందువల్ల వీలు కాక పోయి ఉండవచ్చు."


ప్రవీణ్ ప్రస్తావన రాగానే సమీర ముఖం కోపంతో ఎర్రబడింది. గౌతమ్ మాటలకూ అడ్డు వస్తూ


"ఆ వెధవ ఎంత అమాయకంగా నటించాడు! ‘అక్కా’ అంటూ జయా ఆంటీ ఇంట్లో నా కాళ్ళు పట్టుకొబోయాడు" అంది కోపంగా.


"తెలుసు. నువ్వు అతని భుజం పై చెయ్యి వేసిన ఫోటో కూడా నాకు పంపారు. చేసిన తప్పులకు వాళ్ళు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా మర్డర్ అటెంప్ట్ చేస్తూ దొరుకుతారులే" అన్నాడు గౌతమ్ ఓదార్పుగా.


"వాళ్ళు సందీప్ ను పూర్తిగా నమ్మినట్లేనా? జయా ఆంటీ అంత తొందరగా దొరుకుతుందని నాకనిపించడం లేదు." అంది సమీర.


"ఎందుకైనా మంచిదని వినీత్ ను మన ఇంటికి పంపాను. ఏ సి పి ప్రతాప్ గారితో చెప్పి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను కూడా పంపాను. కాబట్టి జయా ఆంటీ కథ ముగిసినట్లే. ఇక ఇక్కడ కనకరావును కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ప్లాన్ చేశాను...” అని అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆ గది తలుపు తట్టిన చప్పుడయింది. వెనకా ముందూ ఆలోచించకుండా గది తలుపు తియ్యబోతున్న గౌతమ్ ను ఆపింది సమీర.

***

కీ హోల్ నుండి లోపలి చూసాడు సందీప్.

బెడ్ రూమ్ నుండి స్నేహ బయటికి వస్తోంది.

అదేమాట ఆంటీతో చెప్పాడు.

"మేము ఇక్కడ ఉండటం పొరపాటు. ముందు నువ్వొక్కడివే వెళ్ళు. స్నేహకు సారీ చెప్పి నమ్మించు. ఆమె నమ్మినట్లు కనిపిస్తే మాకు మెసేజ్ పెట్టి, డోర్ తెరువు. వెంటనే వచ్చి అటాక్ చేస్తాం" అని చెప్పి ప్రవీణ్తో కలిసి తన అపార్ట్మెంట్ లోకి వెళ్ళింది. జయా ఆంటీ.

అంత హడావిడిగా తనను అపార్ట్మెంట్ లోకి లాక్కొని రావడంతో కాస్త ఆశ్చర్యంతో ఏమైందని అడిగాడు ప్రవీణ్.

"ఈ జయా ఆంటీ ఎవరినీ అంత తొందరగా నమ్మదని నీకు బాగా తెలుసు కదా. విల్సన్ ఒక కోడ్ వాడుతాడు. ఎప్పుడు ఫోన్ చేసినా 'గాడ్ ఈజ్ గ్రేట్' అంటూ మొదలుపెడతాడు. ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు..అంటే పక్కన ఎవరైనా ఉన్నా, ఎవరి బలవంతం మీదనైనా ఫోన్ చేసి ఉన్నా ఆ వాక్యం మాట్లాడడు. అటువంటప్పుడు మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇందాక నాతో ఆ వాక్యం చెప్పలేదు. కాబట్టి మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి.

ఈ లోపల ఆ సందీప్ ఆ స్నేహతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు.

అన్నట్లు చెప్పడం మరిచాను. నా హ్యాండ్ బాగ్ లో ఎప్పుడూ స్పై కెమెరాలు, మైక్రోఫోన్ లు ఉంటాయి కదా. ఎందుకైనా మంచిదని ఇందాక బైక్ లో వచ్చేటప్పుడు ఆ సందీప్ షర్ట్ కాలర్ కి ఒక మైక్రోఫోన్ తగిలించాను. అతను ఇప్పుడు స్నేహతో మాట్లాడే మాటలు మనకి వినిపిస్తాయి. అతని ఉద్దేశం ఏమిటో తెలిసి పోతుంది. అలాగే చేయబోయే మర్డర్ గురించి ముందుగా కనకరావుతో ఒకమాట చెప్పాలి. లేకుంటే రేపెప్పుడైనా ఇబ్బంది వస్తే 'నన్నడిగి చేసావా' అంటాడు" అంటూ కనకారావు సీక్రెట్ నంబర్ కి మరో ఫోన్ నుండి కాల్ చేసింది.

కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత అటువైపు నుండి పర్వీన్ గొంతు వినిపించింది.

ఇంకా వుంది…

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15 త్వరలో…

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




















96 views0 comments
bottom of page