top of page
Original.png

ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు


Ugadi 2026 Telugu Story Competition Results By Admin - manatelugukathalu.com

Published In manatelugukathalu.com on 15/04/2026


తెలుగు రచయితల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న మనతెలుగుకథలు.కామ్ నిర్వహించినఉగాది 2026 కథల పోటీలు విజయవంతంగా ముగిశాయి.

అనేక అద్భుత కథల మధ్య నుంచి విజేతలను ఎంపిక చేయడం సవాలుగా మారింది.పాఠకుల అభిప్రాయాలు, న్యాయ నిర్ణేతల తీర్పుతో ఫలితాలు ప్రకటించబడ్డాయి.

ఇది కేవలం పోటీ కాదు…రచయితల ప్రతిభకు ఒక వేడుక 🎉

విషయ సూచిక

1. బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు

3. విజయదశమి 2026 కథల పోటీలు

4. ఉగాది షడ్రుచుల కథల పోటీలు

5. వారం వారం బహుమతులు: 30/09/2026 వరకు పొడిగింపు

6. గమనిక

7. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2026 ఫలితాలు


1. బహుమతులకు సహకరిస్తున్న వారు

*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీ భళ్ళముడి నాగరాజు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*G. S. S. కళ్యాణి గారు తమ అమ్మమ్మాతాతయ్యలు కీ. శే. ఉప్పలూరి సత్య ఫల్గుణ వెంకట అప్పారావు మరియు కీ. శే. ఉప్పలూరి లలిత నాంచారమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక బహుమతుల ఎంపికలో కూడా మాకు సహకరిస్తున్నారు.


*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


గతంలో కొసమెరుపు కథల పోటీలు, హాస్య కథల పోటీలు స్పాన్సర్ చేసిన శ్రీ కర్లపాలెం హనుమంత రావు గారు ఇప్పుడు ఉగాది షడ్రుచుల కథల పోటీలు స్పాన్సర్ చేస్తున్నారు.

( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )


*M. K. కుమార్, భళ్ళముడి నాగరాజు, Dr. లక్ష్మీ రాఘవ కామకోటి, Dr. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, Dr. M. N. బృంద, శ్రీపతి లలిత, కర్లపాలెం హనుమంత రావు ఇంకా మరికొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.


తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే మా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నందుకు వీరందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


2. ఉగాది 2026 కథల పోటీ ఫలితాలు:

ఎప్పటిలాగే ఊహించినదానికంటే ఎక్కువ కథలు పోటీకి వచ్చాయి.

దాదాపు అన్ని కథలు చక్కగా ఉన్నాయి.

కానీ పోటీ అన్నాక విజేతలను ప్రకటించాలి కాబట్టి న్యాయ నిర్ణేతల తీర్పును శిరసావహించి ఫలితాలు ప్రకటిస్తున్నాము.

పోటీల ప్రకటనలో చెప్పినట్లు బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడ్డాయి.

బహుమతులు పొందని రచయితలను నిరుత్సాహ పడవద్దని, భవిష్యత్తులో మరింత పోటీ ఇచ్చి, బహుమతులు గెలుచుకోవడానికి ప్రయత్నించమని సవినయంగా మనవి చేస్తున్నాము.


ప్రథమ బహుమతి పొందిన కథలు:

గత ఏడాది లాగే ఈసారి కూడా రెండు కథలు సమాన స్థాయిలో నిలవడంతో ప్రథమ బహుమతికి రెండు కథలను ఎంపిక చేసాము.

బహుమతి మొత్తం ఇద్దరు రచయితలకూ సమానంగా అందిచడం జరుగుతుంది.

చక్కటి రచనలను పంపిన ఇద్దరు రచయితలకూ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)

గమనిక: వరుస క్రమం యాదృచ్ఛికం. రెండుకథలూ చక్కటి కథలే.


విశిష్ట (ప్రత్యేక) బహుమతులు:

ముందుగా ఐదు విశిష్ట (ప్రత్యేక బహుమతులు) అందజేస్తామని ప్రకటించాము. 

కానీ బహుమతులు వచ్చినా రాకపోయినా, మనతెలుగుకథలు.కామ్ కు తరచుగా రచనలు పంపుతూ మా మీద అభిమానం చూపుతున్న రచయితలను ప్రోత్సహించడం కోసం ఈ సారి మరిన్ని కథలను విశిష్ట బహుమతులకు ఎంపిక చేసాం. 

(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.


రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)


విజయానికి దారేది

పల్లా వెంకట రామారావు

గమనిక: వరుస క్రమం యాదృచ్ఛికం. అన్నీ రచనలు మంచి రచనలే.


మార్చ్ 2026 నెలలో కొసమెరుపు కథల పోటీలో బహుమతి పొందిన కథ:

మార్చ్ 2026 నెలలో హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ:

పోటీల ప్రకటనలో చెప్పిన విధంగా అక్టోబర్ 2025 నుండి మార్చ్ 2026 వరకు హాస్యకథల పోటీలో గెలుపొందిన కథల నుండి రెండు కథలను విశిష్ట బహుమతికి ఎంపిక చేసాము.

3. విజయదశమి 2026 కథల పోటీలు:

01/04/2026 నుండి 31/10/2026 వరకు ప్రచురితమయ్యే కథల నుండి (20/03/2026 నుండి 18/10/2026 వరకు మాకు చేరే కథలనుండి) విజయదశమి 2026 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.


వారం వారం బహుమతులు పొందిన కథలతో పాటు ఉగాది షడ్రుచుల కథల పోటీలో బహుమతులు పొందిన కథలు కూడా విజయదశమి 2026 కథల పోటీలో ప్రథమ బహుమతి, విశిష్ట బహుమతులకు పరిశీలింప బడతాయి.


కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 18/10/2026

ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.


విజయదశమి 2026 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి : రూ: 5000 /- 

ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

(రెగ్యులర్ రచయితల కోసం మరిన్ని విశిష్ట బహుమతులు ఉంటాయి).

పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి: https://www.manatelugukathalu.com/post/vijayadasami-2026-telugu-story-competition


4. ఉగాది షడ్రుచుల కథల పోటీలు:

🏆 బహుమతులు

కీ.శే. కర్లపాలెం మోహనరావు గారి స్మారక పురస్కారం

  • 🥇 ప్రథమ బహుమతి – ₹500

  • 🥈 ద్వితీయ బహుమతి – ₹300

  • 🥉 తృతీయ బహుమతి – ₹250

👉 ప్రతి నెల 3 బహుమతులు 

👉 మొత్తం 12 నెలలు ఈ పోటీ కొనసాగుతుంది 

👉 ఒక రచయితకు ఒకసారి మాత్రమే బహుమతి.


బహుమతులను శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.

పూర్తి వివరాలు ఈ క్రింది పోస్ట్ లో చూడండి.


5. వారం వారం బహుమతులు: 

అత్యంత జనాదరణ పొందిన ఈ పథకాన్ని 30/09/2026 వరకు పొడిగిస్తున్నాము.

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.


రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.


వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.


వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.

NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2026 ఫలితాలు

(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)


6. గమనిక:

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.

కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.


మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

మీ రచనలు మెయిల్ ద్వారా మాకు పంపవలసిన చిరునామా: story@manatelugukathalu.com

(చివరన @gmail.com లాంటివి లేవు.)


మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు. గ్రూప్ లో చేరదలచినవారు 63099 58851 కి వాట్సాప్ చెయ్యండి.

ఈ గ్రూప్ లో పాఠకులు కూడా చేరవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


మాకు సహకరిస్తున్న రచయితలకు, పాఠకులకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page