top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Love Challenge Episode 27' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

జనాలు అందరూ చేరి చలపతిని చితకబాది, బయటకు నెట్టి వేశారు. నిత్యా మేడం ఎవరూ లేని సమయం చూసి గురుమూర్తి కి కాల్ చేసి విషయం చెబుతుంది. అతను నిత్యా మేడంతో, స్టూడెంట్స్ కి ఒకరోజు రెస్ట్ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ల మన్నాడు. అక్కడ తన ప్లాన్ అమలు చేస్తానని చెప్పాడు. చందూ, చలపతి వెంట ఒక గుడిసె దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక అందమైన యువతి ని చూస్తాడు.

ఇక చదవండి…


చలపతి ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి చందూకి. ఏం చేయాలో అర్థం కాలేదతనికి.


చలపతి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ చందూ వైపు వస్తున్నాడు.

ఆ యువతి వైపు చూశాడు చందూ.


ఆమె చలపతితో "ఏమిటి మామా! దెబ్బలు బాగా తగిలాయా.. ఈ కుర్రాడితో మసాజ్ చేయించుకోవాలని వస్తున్నావ్? కోడె గిత్త కదా.. మంచి పట్లే పడతాడులే" అంది ఒళ్ళు విరుచుకుంటూ.


చలపతి, చందూ వంక చూస్తూ "ఇదేం నా పెళ్ళాం కాదులే. భయపడకు. అయినా మీ కాలేజీ అమ్మాయిలు ఒప్పుకోలేదా.. దీని వంక చూస్తున్నావ్?" అన్నాడు నవ్వుతూ.


కాస్త ధైర్యం వచ్చింది చందూకి.


"ఒక అమ్మాయి అంటే మోజు వుంది. కానీ ధైర్యం చాలడం లేదు. నువ్వు సహాయం చేస్తావా?' సందేహిస్తూనే అడిగాడు.


"మత్తు మందిచ్చి మోజు తీర్చుకోవడమే. నేను సహాయం చేస్తాను కానీ ఖర్చవుతుంది" అన్నాడు చలపతి.


"నేను ఇవ్వలేను గానీ గురుమూర్తి దగ్గర ఇప్పిస్తాను. అన్నట్టు ఆయన నీకు ఎంత ఇస్తానని చెప్పాడు? ప్రశ్నించాడు చందూ.

"ప్రస్తుతానికైతే ఐదు లక్షలు ఇస్తానన్నాడు. ఎలక్షన్ పూర్తయి, ఆయన కొడుకు గెలిస్తే మరో ఐదు లక్షలు ఇస్తారట" చెప్పాడు చలపతి.

వెంటనే గురుమూర్తి కి కాల్ చేశాడు చందూ.


"పెద్ద మొత్తం తీసుకున్నారు కాబట్టే పూర్నేష్, విక్కీ మీ పేరు బయట పెట్టలేదు. చలపతిని గట్టిగా నాలుగు తగిలిస్తే మీ పేరు చెప్పేస్తాడు. అతను నోరు తెరవనంత అమౌంట్ యిస్తే మంచిది" చెప్పాడు చందూ.


"ఎంత ఇమ్మంటావ్?" అడిగాడు గురుమూర్తి.


"కనీసం పాతిక లక్షలు ఇస్తే మన పేరు బయటకు రాకుండా పని అవుతుంది" సందేహిస్తూనే అడిగాడు చందూ.


వెంటనే "సరే. కానీ మన పేర్లు బయటకు రాకూడదు. నిత్యా మేడం ఏదైనా ప్లేస్ కి స్టూడెంట్స్ అందరితో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ రిత్విక్ చూస్తూ ఉండగా ఏదైనా అల్లరి చేయమని చలపతికి చెప్పు" " అన్నాడు గురుమూర్తి.


"అలాగే సర్! అన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు చందూ.

కాల్ కట్ చేసి "పాతిక లక్షలు.. ఎవరి పేర్లూ బయటకు రాకూడదు" అన్నాడు చలపతితో.


"పాతిక లక్షలా! జీవితాంతం నీకు ఊడిగం చేస్తాను" ఆనందంతో అన్నాడు చలపతి.


ఆ యువతి చలపతి ఎదురుగానే చందూని గట్టిగా హత్తుకుంది.


"ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్ ఉండాలి. ఎక్కడ పెట్టానబ్బా.." ఏదో వెతుకుతున్నట్లు తల పక్కకు తిప్పుకున్నాడు చలపతి. మంచం పక్కన పెట్టివున్న విస్కీ బాటిల్ తీసుకున్నాడు.


ఆ యువతిని విడిపించుకున్నాడు చందూ.


బాటిల్ ఆమె చేతికి ఇచ్చి, "ఇద్దరికీ గ్లాసుల్లో పొయ్యి" అన్నాడు చలపతి.


"ఏం? నువ్వు తాగవా..?" అందామె నవ్వుతూ.


చాలా సేపటికి అర్థం చేసుకొని, "ముగ్గురికీ పొయ్యి" అన్నాడు చలపతి, తను కూడా నవ్వుతూ.


బెరుకు తగ్గిన చందూ మందు కొడుతూనే, చలపతి తల పక్కకు తిప్పినపుడల్లా ఆ యువతి నడుము మీద చేయి వేస్తున్నాడు.


వాళ్ళతో సమంగా తను కూడా తాగిందామె.


తాగడం పూర్తయ్యాక ఇద్దరికీ అన్నం వడ్డించింది. తరువాత చలపతి "నాకు కడుపు ఉబ్బరంగా ఉంది. కాసేపు బయట వెన్నెల్లో తిరిగి వస్తాను" అన్నాడు.

"టార్చి తీసుకొని వెళ్ళు. నాలుగు అడుగులు తిరిగేసి, వెనక్కి రావద్దు. నాకు ఈ కుర్రాడు తోడు ఉన్నాడు లే. నీ కడుపు సెట్ అయ్యాకే నిదానంగా రా" అందామె .

చలపతి టార్చి తీసుకొని బయటకు వెళ్ళాడు.


ఆ యువతి అక్కడ ఉన్న నులక మంచం మీద పడుకొని, "తలుపు ముయ్యమని కూడా నీకు నేనే చెప్పాలా" అంది చందూని చూసి కన్నుకొడుతూ.


వెంటనే తలుపు మూసి ఆమెని ఆక్రమించుకున్నాడు చందూ.

***

మరుసటి రోజు ఉదయాన్నే రాఘవేంద్ర కు కాల్ చేసింది నిత్యా మేడమ్.


"స్టూడెంట్స్ బోర్ ఫీల్ అవుతున్నారు. పైగా నిన్నటి సంఘటనతో డిస్టర్బ్ అయ్యారు. ఒకరోజు ప్రాక్టీస్ కి బ్రేక్ ఇచ్చి, ఎక్కడికైనా తిప్పితే బాగుంటుంది. ఈరోజు జీవన్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి, రేపటికి ప్లాన్ చేద్దాం" అంది.

"సరే.. అలాగే చేద్దాం. అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఒక మంచినీళ్ల మడుగు ఉంది. ఆ చుట్టు పక్కల అంతా పార్క్ లాగా డెవలప్ చేశారు. అక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి" అన్నాడు రాఘవేంద్ర.

"సాయంత్రం వస్తారుగా.." అడిగింది నిత్యా మేడమ్.


"ఖచ్చితంగా వస్తాను. కానీ రాత్రికే మళ్ళీ రిటర్న్ కావాలి" చెప్పాడు రాఘవేంద్ర.


అతను ఫోన్ పెట్టేశాక, గురుమూర్తికి ఈ విషయం చెప్పింది నిత్యా మేడమ్.

అతను చలపతికి, చందూకి ఈ విషయం తెలియజేశాడు.


ఆ రోజు నిత్యా మేడం గ్రౌండ్ దగ్గరకు వచ్చి "రేపు ఒక చిన్న టూర్ ప్లాన్ చేసాము. దగ్గర్లో ఉన్న మడుగు దగ్గరకు వెళదాము. అక్కడ స్విమ్మింగ్ కూడా చెయ్యవచ్చు. ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అక్కడికే అరేంజ్ చేస్తాము. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి" అంది.


స్టూడెంట్స్ అందరూ సంతోషంతో ఈలలు వేశారు.


మధ్యాహ్నం వరకు అందరూ ప్రాక్టీస్ చేశారు. తరువాత జీవన్, కొందరు స్నేహితులతో నైట్ చేయబోయే ప్రోగ్రాం కోసం ప్రాక్టీస్ చేసాడు.


ఆ రోజు రాత్రి ఏడుగంటలకు స్టూడెంట్స్ అందరూ కళ్యాణమండపానికి చేరుకున్నారు.

గ్రామస్థులు కూడా అక్కడ రెడీగా ఉన్నారు.


రాఘవేంద్ర కూడా సమయానికి అక్కడకు వచ్చాడు.


సర్పంచి స్టేజి మీదకు వచ్చి మాట్లాడుతూ "ఉదయం పంచాయితీ పెట్టి చలపతిని విచారించాము. ఇక మీదట అలాంటి పొరపాట్లు చెయ్యనని చెప్పాడు. ఈ రోజు ఇటువైపు రావద్దని చెప్పాను. మీరు మాములుగా మీ ప్రోగ్రాం చేసుకోవచ్చు" అన్నాడు.


జీవన్ అండ్ టీం ప్రదర్శన ప్రారంభమయ్యింది.


జీవన్ మైక్ తీసుకుని “సమాజంలో కులాల ప్రభావం గురించి మీకు చెబుతాను” అన్నాడు.


స్టేజ్ మీదకి, మెడలో పలకలు తగిలించుకుని కొంతమంది వచ్చారు.


ఆ పలకల మీద ‘రైతు, వ్యాపారస్తుడు, ఉపాధ్యాయుడు..’ ఇలా రాసి ఉన్నాయి.


ముందుగా రైతు మాట్లాడుతూ “మా పొలంలో నారు పొయ్యాలి. ఎవరైనా సహాయం చేస్తారా?” అని అడిగాడు.


మరొక రైతు “నేను సహాయం చేస్తాను. నాకూ నీ అవసరం ఉంటుంది కదా” అన్నాడు.


అలాగే వ్యాపారస్తుడు “నేను కొన్ని వస్తువులు మరొకరితో మార్చుకోవాలి. ఎవరైనా ఉన్నారా?” అని అడిగాడు.


మరొక వ్యాపారస్తుడు “నేను ఉన్నాను. నీతో వస్తువులు మార్చుకుంటాను” అన్నాడు.


అలాగే ఇద్దరు ఉపాధ్యాయులు ఒక చోట కలిసి, ‘మీరు ఎలా పాఠాలు చెబుతున్నారు’ అని ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు.


అప్పుడు జీవన్ మాట్లాడుతూ "ఒకే వృత్తి లో ఉండేవారు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒకరి బాధలు మరొకరికి సులభంగా తెలుస్తాయి కాబట్టి, పరస్పరం సహకరించు కునేవారు. అలా వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి” అని చెప్పి పక్కకు వెళ్ళాడు.

ఇప్పుడు ప్రజలు తన మెడలో ఉండే వృత్తుల పేర్లు చెరిపేసి, 'ఒకటవ కులం', 'రెండవ కులం' అంటూ రాసుకున్నారు.


'ఒకటవ కులం' అని రాసుకున్న వాళ్లు ఒకవైపు, 'రెండవ కులం' అని రాసుకున్న వాళ్లు మరోవైపు, 'మూడో కులం' అని రాసి ఉన్న వాళ్ళు ఇంకో వైపు నిలుచున్నారు.


'ఒకటవ కులం' అని అని రాసి ఉన్న వ్యక్తి, 'రెండవ కులం' అని రాసి ఉన్న అమ్మాయి ఆ దారంట వెళుతూ వుంటే విజిల్ వేశాడు.


దాంతో 'రెండవ కులం' అని రాసుకొని ఉన్న వ్యక్తి ఇతన్ని కొట్టాడు.


ఇతను తన వాళ్ళ వద్దకు వచ్చి “రెండవ కులం వాళ్లు నా మీద దౌర్జన్యం చేశారు. మీరు ఊరికే కూర్చుంటే ఎలా” అని తన వాళ్లను రెచ్చగొట్టాడు. రెండు కులాల మధ్యా కొట్లాట జరిగి చాలామంది దెబ్బలు తగిలించుకున్నారు.


అప్పుడు జీవన్ స్టేజ్ మీదకు వచ్చి “ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం రావడం సర్వ సాధారణం. కానీ అందులో ఓడిపోయినవాడు, తన మద్దతు కోసం కులాన్ని రెచ్చగొడుతున్నాడు. ఆవేశం లో ఉన్న అతని కులస్థులు మరొక కులం వారితో గొడవ పడతారు. ఇలా ఏర్పడ్డ గొడవలు తరతరాలు కొనసాగుతాయి” అని చెప్పాడు.


తరువాత ఒక వ్యక్తి కోటు వేసుకుని, డబ్బున్న వాడి లాగా వెళుతూ ఉన్నాడు.


అతన్ని చూసిన మరొక వ్యక్తి “ఇతను మా వాడే! నాకు తమ్ముడు అవుతాడు” అని పక్కనున్న వ్యక్తి తో చెబుతాడు.


ఇంతలో 'పోలీసు' అని రాసుకొని ఉన్న వ్యక్తి కోటు వేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాడు.


“మీ తమ్ముడిని పోలీసులు తీసుకెళ్తున్నారు” అని చెప్తాడు పక్క వ్యక్తి.


“తమ్ముడా.. నాకెవరూ తమ్ముళ్లు లేరే! ఓహో.. వీడా.. మా వేలు విడిచిన మేనమామ కొడుక్కి వియ్యంకుడికి తమ్ముడు అవుతాడు.అంతే!” అన్నాడు మొదటి వ్యక్తి.


మరి కొంతసేపటికే కోటు వేసుకున్నతను, విడుదల అవుతాడు..


అప్పుడు ఇతను “మా తమ్ముడు అంటే ఏమనుకున్నారు? ఒక గంటలోనే బయటకు వచ్చేశాడు” అన్నాడు.


అప్పుడు జీవన్ మాట్లాడుతూ “ప్రారంభంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి కులాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటున్నారు. మనిషి మంచి స్థాయిలో ఉంటే ‘మావాడు’ అన్నవారే, అతను దెబ్బతింటే తమకు సంబంధం లేనట్లు ఉండిపోతున్నారు. తిరిగి అతనికి అధికారం, పదవులు వస్తే మళ్లీ అతనికి జై కొడుతున్నారు” అని చెప్పి పక్కకు వెళ్ళాడు జీవన్.

తర్వాత ఒక వ్యక్తి 'ఒకటవ కులం' అని ఒక బోర్డు, 'నాయకుడు' అని మరొక బోర్డు తగిలించుకున్నాడు.


అతని దగ్గరికి 'ఒకటవ కులం' అని బోర్డు తగిలించుకున్న మరో వ్యక్తి వచ్చి “ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు నాకు ఇప్పించాలి” అని అడిగాడు.


“మన వాళ్ళకు కాకుండా ఎవరికి ఇస్తాను?” అని చెప్పాడు నాయకుడు.

తరువాత అతని దగ్గరకు 'రెండవ కులం' బోర్డు తో ఒక వ్యక్తి వచ్చాడు.


“ఆ కాంట్రాక్ట్ నాకు ఇస్తే నీకు దండిగా డబ్బులు ఇస్తాను” అని చెప్పాడు.


నాయకుడు అప్పటికప్పుడే అతనికి కాంట్రాక్టు ఇచ్చాడు.


అతను వెళ్ళాక 'ఒకటవ కులం' వ్యక్తి వచ్చి “మనవాడివి అయి వుండి, నాకు సహాయం చేయలేదే” అని అడిగాడు.


“ నేను కులాలను పట్టించుకోను. ఆయనకి ఈ తరహా ప్రాజెక్ట్స్ లో అనుభవం వుంది. పైగా తక్కువ అమౌంట్ కి టెండర్ వేశాడు. కాబట్టి అతనికి ఇచ్చాను” అని చెప్పాడు నాయకుడు.


అప్పుడు జీవన్ స్టేజి మీదకు వచ్చి, “కులం అనే దాన్ని, తాము పైకి ఎక్కడానికి మెట్లుగా వాడుకుంటున్నారు. నిజానికి డబ్బు ఉండే వాళ్ళు అందరిదీ ఒకటే కులం. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఒకే కులం. వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇవన్నీ తెలియని సామాన్య ప్రజలే, కులం కోసం కొట్లాటలు పెట్టుకుంటారు” చెప్పడం ముగించాడు జీవన్.


అతన్ని అభినందిస్తూ అందరూ చప్పట్లు కొట్టారు.

ప్రోగ్రాం ముగిశాక, స్టూడెంట్స్ అందరూ హాస్టల్ కి చేరుకున్నారు. రాఘవేంద్ర గారు తిరిగి సిటీకి బయల్దేరడంతో నిత్యా మేడం, ఆద్య ఒక గదిలో పడుకున్నారు. దీప్య, శాన్వీ ఒక గదిలో పడుకున్నారు.


ఆరోజు రాత్రి పన్నెండు గంటలప్పుడు చందూ కి కాల్ చేశాడు చలపతి. ‘రెడీ గా ఉన్నావా..’ అంటూ.


“ఎందుకు?”.. అర్థం కాక అడిగాడు చందూ.


“నీ పని ఇప్పుడే కానిచ్చేయి. మత్తు మందు తీసుకొని వచ్చాను” అన్నాడు చలపతి.


విషయం అర్థమైన చందూ “ఇప్పుడా..” అని అడిగాడు.


“ఏం? రెడీగా లేవా..” అంటూ కొన్ని బూతు మాటలు మాట్లాడాడు చలపతి.


“అదేం లేదు. కానీ హాస్టల్ లోనా?” అని అడిగాడు చందూ.


“అవును. బయట అవకాశం దొరకడం కష్టం కదా. ముందు నువ్వు బయటికి రా. ఎలా చేయాలో నేను చెబుతాను” తొందర పెట్టాడు చలపతి.


ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


45 views0 comments

Comments


bottom of page