top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 30

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/8nYhYHhQDhA

'Love Challenge Episode 30' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…

ఫైనల్ మ్యాచ్ లో రిత్విక్ అండ్ టీం ఘన విజయం సాధిస్తారు. జీవన్ డబుల్ సెంచరీ చేస్తాడు. హాస్పిటల్ లో చేరిన చలపతి మరణించాడు. 'లవ్ ఛాలెంజ్ విషయంగా మాట్లాడుకోవాలి' అని అనుకుంటారు రిత్విక్, జీవన్ లు.

ఇక చివరి ఎపిసోడ్ చదవండి…

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


మర్నాడు ఉదయం ఎప్పటిలాగా కాలేజీలో కలుసుకున్నారు అందరూ.

జీవన్, రిత్విక్ తో "ఈవెనింగ్, ఆద్య వాళ్ళ ఇంట్లో మీట్ అవుదాం" అన్నాడు.

రిత్విక్ "ముందుగా మన ముగ్గురం మాట్లాడుకుందాం. తర్వాత మిగతా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు" అన్నాడు.


అలాగే నన్నాడు జీవన్.


సాయంత్రం ముగ్గురూ కాలేజీ నుండి నేరుగా ఆద్యా వాళ్ళ ఇంటికి వెళ్లారు.

నిత్యా మేడమ్, రాఘవేంద్ర వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

"ఫ్రెండ్స్ అందరూ రావడానికి మరో గంట పడుతుందట. ఈలోగా మేము ముగ్గురం నిన్నటి మ్యాచ్ నిర్వహణ ఖర్చుల గురించి మాట్లాడుకుంటాం" అంది ఆద్య.

వాళ్ల ఉద్దేశం అర్థమై, అలాగే నన్నారు రాఘవేంద్ర, నిత్యా మేడమ్.

రిత్విక్, జీవన్, ఆద్య.. ముగ్గురూ ఒక గదిలోకి వెళ్లారు.

ముందుగా రిత్విక్ ప్రారంభిస్తూ “దీప్య విషయంలో నువ్వు ఏదో దాస్తున్నావు. ఏమిటది?" అని జీవన్ ని అడిగాడు.

జీవన్ మాట్లాడుతూ "మొదట్లో ఆద్య తో పరిచయం పెంచుకోవడానికి దీప్యను వాడుకోవాలని అనుకున్నాను. అందుకోసం చందూ బర్త్ డే అంటూ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. చందూకి దీప్య మీద చెడు ఆలోచనలు కలగడానికి అదే కారణం.


దీప్యకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత నాదే. ఇక చలపతిని చందూ సహాయం కోరడంతో, అతని దృష్టి దీప్య మీద పడింది. కాబట్టి అతను చేసిన పొరపాటుకు కూడా నేనే బాధ్యుడిని. అందుచేత ఈ లవ్ ఛాలెంజ్ నుంచి మానసికంగా విరమించుకుంటున్నాను" అన్నాడు.

"ఆ రోజు ఏమీ జరగలేదని నాకు తెలిసింది. కాబట్టి నువ్వు గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు" అన్నాడు రిత్విక్.

"మానభంగం జరిగితేనే నేరం జరిగినట్లు కాదు. ఒక అమ్మాయి అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను దగ్గరకు లాక్కోవడం, హగ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా నేరాలే. అలాంటి సంఘటనలను ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాల వరకూ మరచిపోలేదు. భయంకరమైన కలలు వచ్చి వణికి పోవడం లాంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోకి ఆద్య కోసం జరిగే ఈ పోటీకి నేను తగను" అన్నాడు జీవన్.

"దీప్య విషయం నలుగురిలో చర్చించాల్సినది కాదు. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో నాకు చెప్పు" అన్నాడు రిత్విక్.

"ఆరోజు స్టేజి మీద నేను చేసిన పెర్ఫార్మెన్స్ గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతకన్నా బాగా చేసి ఉండవచ్చా.. గ్రామస్థులు బాగానే రెస్పాండ్ అయ్యారా.. అని ఆలోచించాను. ఆరోజు ఎంతసేపటికీ నాకు నిద్ర పట్టలేదు. మంచి రాత్రి సమయంలో హాస్టల్ వెనక గోడ వైపు బైక్ ఆగిన శబ్దం వినపడింది. నేను ఉన్న రూమ్ అటువైపే ఉండడంతో నాకు ఆ శబ్దం బాగా వినపడింది. కానీ అప్పుడు నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరికొంతసేపటికి శాన్వీ నుండి బ్లాంక్ మెసేజ్ వచ్చింది. మా బ్యాచ్ లో ఆ మెసేజ్ కి అర్థం అర్జెంట్ గా కలవమని.

నేను పైకి వెళ్లాను. దీప్య వంటి మీద దుస్తులు సరిగా లేవు. శాన్వీ స్పృహలో లేదు. ఆ క్షణంలో నాలో విచక్షణ అదుపు తప్పింది. దీప్యను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించాను. కానీ దీప్య కదులుతూ ఉండడంతో భయపడి వచ్చేశాను. ఇంత పొరపాటు చేసిన నేను ఈ లవ్ ఛాలెంజ్ లో ఆద్య కోసం పోటీ పడలేను.." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న జీవన్ చెంప చెళ్లుమనిపించాడు రిత్విక్.

"మాతో శాన్వీ కూడా ఇలానే చెప్పింది. అది నువ్వు చెప్పించిందేనని, ఇప్పుడు అర్థం అయింది. దీప్య మీద సానుభూతితో ఆమెను పెళ్లి చేసుకోవాలని, 'పోటీ నుండి విరమించుకోవాలి' అనుకుంటున్నావు. ఎంత మంచిగా మారిపోయావు జీవన్? నువ్వే నేరం చేయలేదు. నిజం నాకు తెలుసు" అంటూ జీవన్ ని కౌగిలించుకున్నాడు రిత్విక్.

కాసేపటి తర్వాత జీవన్ తో మాట్లాడుతూ తనకు తెలిసిన విషయాలు ఇలా వివరించాడు రిత్విక్.


“ఆ రోజు చలపతి, చందూలు దీప్య ఉన్న గది వద్దకు వెళ్లారు.

ముందే ఊడదీసిన విండో ప్రేమ్ ను పక్కకు పెట్టాడు చలపతి. అందులోంచి ఇద్దరూ లోపలికి ఎంటర్ అయ్యారు. మత్తు మందు చల్లిన కర్చీఫ్ తో దీప్య, శాన్వీ లకు స్పృహ తప్పించారు. తాను బయట వెయిట్ చేస్తానని చెప్పాడు చలపతి.

కానీ భవిష్యత్తులో చందూని బ్లాక్ మెయిల్ చేయడానికి, కిటికీ చాటునుండి తన మొబైల్ లో వీడియో రికార్డ్ చేసాడు అతను.

లోపలి వెళ్లిన చందూ అమాయకంగా ఉన్న దీప్య ముఖాన్ని చూసి, ఆమెను కనీసం టచ్ చేయకుండా తిరిగి వచ్చేసాడు. తను కిటికీని తిరిగి ఎప్పటిలా బిగించి వస్తానని చెప్పి, చందూని రూమ్ కి వెళ్ళమన్నాడు చలపతి.


తరువాత అతను గదిలోకి ప్రవేశించి దీప్య మీదకు వెళ్ళాడు. ఆమెతో అసహ్యంగా ప్రవర్తించ బోయాడు. కానీ దీప్య ఒకసారి కళ్ళు తెరవడం, శాన్వీ కదులుతూ ఉండటంతో భయపడి బయటకు వచ్చేసాడు.

కిటికీని బిగించేలోగా మెట్ల వద్ద అడుగుల శబ్దం వినపడటంతో పక్కకు వెళ్లి దాక్కున్నాడు.

ఓపెన్ గా ఉన్న కిటికీలోంచి లోపలికి వెళ్ళావు నువ్వు.


నువ్వేదైనా తప్పు చేస్తే రికార్డ్ చెయ్యాలని, తిరిగి కిటికీ వద్దకు చేరాడు చలపతి.


లోపలికి వెళ్లిన నువ్వు, దీప్య దుస్తులు సరిచేసి దుప్పటి కప్పావు. శాన్వీ ముఖం పైన నీళ్లు చిలకరించి లేపావు.

నీకు మెసేజ్ చేశాక తిరిగి స్పృహ తప్పిన శాన్వీ, కళ్ళు తెరిచింది.


ఇక అక్కడ ఉండి లాభం లేదని గ్రహించిన చలపతి, బయటకు వచ్చేసాడు" చెప్పడం


ఆపాడు రిత్విక్.

"ఇవన్నీ నీకెలా తెలుసు? శాన్వీతో చెప్పవద్దన్నానే.." ఆశ్చర్యంగా అన్నాడు జీవన్.

"చలపతిని కార్లో హాస్పిటల్ కి తీసుకొని వెడుతుండగా, అతనికి స్పృహ వచ్చింది.

ముందు నాకు క్షమార్పణ చెప్పాడు.


తనతో పాటు నీళ్లలో తడిసిన తన మొబైల్ ని నాకు ఇచ్చాడు. తను తప్ప ఎవరూ పొరపాట్లు చెయ్యలేదని చెప్పి, తిరిగి స్పృహ తప్పాడు. ఆ మొబైల్ లో మెమరీ కార్డు ను బయటకు తీసి శుభ్ర పరిచాను. ఆ వీడియోలను చూసాను.


దీప్య కోసం నువ్వు త్యాగం చెయ్యవలసిన అవసరం లేదు.


తనకు ఏవైనా చేదు జ్ఞాపకాలు వుంటే కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. తన చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాం. అంతే గానీ నువ్వు పోటీనుండి తప్పుకోవడం ఎందుకు?" అన్నాడు రిత్విక్.

"నాకు దీప్య మీద ఉన్నది జాలి కాదు, ఇష్టం" అని చెప్పాడు జీవన్.


ఆశ్చర్యంగా అతని వంక చూశారు రిత్విక్, ఆద్య లు.

“దీప్యకి నేనంటే ఇష్టమని శాన్వీ చెప్పింది. కానీ నేను ఆద్య కోసం పోటీలో ఉండడంతో తన మనసులో మాట ఎక్కడా బయట పెట్టలేదట. శాన్వీ తో మాత్రం తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. శాన్వీ నాతో ఈ విషయం చెప్పింది. అప్పటి నుండి నాకు కూడా తనమీద ఆసక్తి పెరిగింది" అని చెప్పాడు జీవన్.

"మరి లవ్ ఛాలెంజ్ సంగతి ఏమిటి?" అని అడిగాడు రిత్విక్.

ఈ ఛాలెంజ్ అనేది ఇప్పుడు కేవలం మన ముగ్గురికీ సంబంధించిన విషయం కాదు. ఒక గ్రామాన్ని ఎలక్షన్ కోసం ఎంపిక చేసుకున్నాం. నేషనల్ మీడియా కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. మనిద్దరం కాక మరొక కంటెస్టెంట్ కూడా ఉన్నాడు. కాబట్టి ఎన్నికలు యథావిధిగా జరగనిద్దాం. నువ్వు గెలిస్తే ఏ సమస్యా ఉండదు. నేను గెలిస్తే బహుమతిగా దీప్య చేత 'ఐ లవ్ యు' చెప్పించు కుంటాను. మన అగ్రిమెంట్లో ఈ విధంగా మార్పులు చేద్దాం. ఈ విషయం బయట వాళ్లకు తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే గెలిచేది నువ్వే కాబట్టి" అన్నాడు జీవన్.

ఇంతలో నిత్యా మేడమ్ ఆ గది తలుపు తట్టి "మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు" అని చెప్పింది.


ముగ్గురూ బయటకు వచ్చారు.

బయట మిత్రబృందం, వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

జీవన్ వాళ్ళను ఉద్దేశించి "లవ్ ఛాలెంజ్ అగ్రిమెంట్లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. అందుకు మీ అందరి ఆమోదం కావాలి" అన్నాడు.

"ఏమిటా మార్పులు?" ఆసక్తిగా అడిగారు అందరూ.


“ఎన్నికలు ముగిశాక రిత్విక్ గెలిస్తే ఆద్య 'ఐ లవ్ యు' చెబుతుంది.


నేను గెలిస్తే మరొక అమ్మాయి 'ఐ లవ్ యు' చెబుతుంది" అన్నాడు జీవన్.

"ఎవరా లక్కీ గర్ల్?" అన్నాడు సందీప్.


"ఒకవేళ దీప్య ఏమో.." అంది శాన్వీ.

అందరూ దీప్య సమాధానం కోసం ఆమె వైపు చూసారు.


"నేనైతే ఎన్నికల వరకు ఎందుకు? ఇప్పుడే చెప్పేస్తాను" అంది దీప్య.

రిత్విక్ మాట్లాడుతూ "ఎంత అమాయకంగా ఉండేదో నా చెల్లెలు. జీవన్ మాయలో పడి ఇలా అయింది" అన్నాడు.

"ప్రతి చెల్లెలూ అన్నయ్య ముందు అలానే ఉంటుంది" అంది శాన్వీ.


"కానీ ఒక కండిషన్..." అంది దీప్య.


"అందరు అమ్మాయిలూ పెట్టే షరతులు కదా. చదువయ్యాకే పెళ్లి.. అంతవరకు నో డేటింగ్..అంతేనా" అంది శాన్వీ.


"నీకేం శాన్వీ! ఈ సంవత్సరంతో నీకూ మోటూకూ చదువు పూర్తవుతుంది కదా. వెంటనే మీ పెళ్లి." అన్నాడు రిత్విక్.


‘అవునా..’ అన్నట్లు శాన్వీ వంక చూశాడు జీవన్.

సిగ్గుపడింది శాన్వీ.

అందరూ ఆనందంగా నవ్వేశారు.

అగ్రిమెంట్ లో జీవన్ చెప్పిన మార్పులు చేసి, అందరూ సంతకాలు పెట్టారు.

"చందూ ఏమయ్యాడు? అతను కూడా విట్నెస్ కదా" బయటకు వచ్చాక జీవన్ ను అడిగింది శాన్వీ.

"వ్యాపారం చేసుకుంటానంటే పెట్టుబడికి డబ్బులిచ్చి నాగపూర్ పంపాను" అన్నాడు జీవన్.

అంతేనా! ఇంకా దృశ్యం సినిమాలోలా కనిపించని తీరానికి పంపావనుకున్నాను" అంది శాన్వీ.

నవ్వేశాడు జీవన్.

***

అందరూ ఎదురు చూసిన మోడల్ ఎన్నికల తేదీ వచ్చింది. ఆ గ్రామస్థులందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్ కి వచ్చి ఓట్లు వేశారు. పోలింగ్ జరుగుతున్న తీరును వీడియో తీసిన నేషనల్ మీడియా వాళ్ళు, ఒక మోడల్ ఎలక్షన్ కు ఇంతటి ప్రతిస్పందన ఇంతవరకూ చూడలేదని, గ్రామస్థులను అభినందించారు.

పక్క రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.

ఆ గ్రామంలో మొత్తం ఓటర్లు రెండు వేల ఆరు వందల మంది.

పోలైన ఓట్లు 2550. ఆశ్చర్యంగా చెల్లని ఓట్లు అసలు లేవు.

దాన్నిబట్టే రిత్విక్, జీవన్ లు ఓట్ ఎలా వెయ్యాలనేది చక్కగా నేర్పారని అందరికీ అర్థమయింది.


రిత్విక్ కి 1350 ఓట్లు జీవన్ కి 1170 ఓట్లు వచ్చాయి. స్థానిక అభ్యర్థికి 30 ఓట్లు వచ్చాయి. రిత్విక్ ఎన్నికైనట్లు గా ప్రకటించారు.

ఆ తరువాత జరిగిన అభినందన సభకు చక్రధరం, గురుమూర్తి, రాఘవేంద్ర హాజరయ్యారు. ఎన్నికైన రిత్విక్ ముందుగా గ్రామస్తులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. తరువాత మాట్లాడుతూ "ఈ మోడల్ ఎన్నికలు సక్రమంగా జరగడానికి తనతో సమానంగా జీవన్ కూడా కారణం" అని చెప్పాడు.


జనరల్ ఎలక్షన్స్ లో కూడా పోటీదారులు ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలు సక్రమంగా నిర్వహింపబడేలా చూడాలని కోరాడు. అభ్యర్థులు ప్రజల మనసుల్లోకి వెళ్లగలిగితే డబ్బు ప్రభావం, కుల మతాల ప్రభావం ఉండదని చెప్పాడు.

తరువాత జీవన్ మాట్లాడుతూ "మా కాలేజ్ లో ఆద్య అనే అమ్మాయి చేరింది. అప్పటి నుండి నా ప్రవర్తనలో మార్పు రావడంతో అందుకు కారణం ఆమె అని మొదట్లో అనుకున్నాను. అందుకోసమే పోటీ లోకి దిగాను.

కానీ తరువాత నాకు తెలిసిందేమిటంటే, నాలో మార్పుకు కారణం రిత్విక్ అని.

రిత్విక్ ఆద్యతో మాట్లాడడం చూసి సహించలేక, అతనితో పోటీకి దిగాను.

కానీ ఆద్య నన్ను ఇష్ట పడాలంటే నన్ను నేను మార్చుకోవాలి.


నేను కాస్త మారితే ఎలా ఉంటాను..

మరి కాస్త మారితే ఎలా ఉంటాను..

ఇలా ఆలోచించుకున్నాను.

నాకు నేను పూర్తిగా మారితే రిత్విక్ లా ఉంటాను అని తెలిసింది.

వశిష్ఠ మహర్షి కంటే గొప్ప అనిపించుకోవాలని విశ్వామిత్రుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ సాధించలేక పోయాడు. తన కోరిక తప్పని తెలుసుకున్న తర్వాతే అతను బ్రహ్మర్షి అయ్యాడు. రిత్విక్ తో జరిగిన ఈ పోటీలో నేను బ్రహ్మర్షిని కాకపోయినా, మనిషిని అయ్యాను" అన్నాడు.

సభికులంతా అతన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.


దీప్య, ఆద్యలు స్టేజ్ మీదకు వచ్చి రిత్విక్, జీవన్ ల మెడల్లో పూలమాలలు వేశారు.


సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

బురదానంద స్వామి కథ

లంకకు చేటు విభీషణుడా?

ఇచ్చిందే వస్తుంది

అశ్వత్థామ హతః కుంజరః

శతమానం భవతి

గబ్జీ వర్సెస్ కరోనా

తమలపాకుతో తానిట్టంటే…

అక్షయ పాత్ర

బ్రహ్మ రాతలో ఒక పేజీ

నన్ను కాపాడండి... ప్లీజ్!!

పీత కష్టాలు పీతవి

సి ఈ ఓ చందన

ఆత్మ విశ్వాసం

అనుకుంటే అంతా మనవాళ్లే

అనురాగ బంధం

అమ్మ మనసులో ఏముంది

నేనే కింగ్ మేకర్

సరే శివయ్య

మూడు తరాల ప్రేమ

కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 1 అతడే హంతకుడు)

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2 దొంగ దొరికాడు

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 దొంగ దొరికాడు(పార్ట్ 2)

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 ఉదయ రాగం

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2

వెంటాడే నీడ ఎపిసోడ్ 1

వెంటాడే నీడ ఎపిసోడ్ 2

వెంటాడే నీడ ఎపిసోడ్ 3

వెంటాడే నీడ ఎపిసోడ్ 4

వెంటాడే నీడ ఎపిసోడ్ 5

వెంటాడే నీడ ఎపిసోడ్ 6

వెంటాడే నీడ ఎపిసోడ్ 7

వెంటాడే నీడ ఎపిసోడ్ 8

వెంటాడే నీడ ఎపిసోడ్ 9

వెంటాడే నీడ ఎపిసోడ్ 10

వెంటాడే నీడ ఎపిసోడ్ 11

వెంటాడే నీడ ఎపిసోడ్ 12

వెంటాడే నీడ ఎపిసోడ్ 13

వెంటాడే నీడ ఎపిసోడ్ 14

శ్రీవారి కట్టు కథలు పార్ట్ - 1

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2

శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


41 views0 comments
bottom of page