top of page

వెంటాడే నీడ ఎపిసోడ్ 15

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 15' New Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…

గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్.

అతని మామగారు, అత్తగారు క్షేమంగానే ఉన్నట్లు చెబుతాడు ఏ సీ పీ ప్రతాప్.

మామిడి తోట దగ్గర ఒక అపరిచితుడు గుడిసె తలుపు తడతాడు.

వికాస్ నంబర్ కి కాల్ చేసిన సి ఐ కిషోర్, బయట ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ రింగ్ కావడం గమనిస్తాడు.

సుమంత్ ని బలవంతంగా బయటకు తీసుకొని వెళతాడు గోవిందు.

ఇక చదవండి…

తన రివాల్వర్ని పొజిషన్ లో ఉంచుకొని, డోర్ తెరవ మన్నాడు సీఐ కిషోర్.

ఒక కానిస్టేబుల్ డోర్ తెరుస్తూ ఉండగానే, బయట బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. కిషోర్ వేగంగా బయటకు వచ్చాడు. అప్పటికే ఆ ఆగంతకుడు గేట్ దాటుకొని, అంత పెద్ద వానను కూడా లెక్కచేయకుండా విజయవాడ రూట్ లో వెళ్తున్నాడు.

ఒక కానిస్టేబుల్ ని అక్కడే ఉండమని చెప్పి, మిగతా ఇద్దరి తో తన వెహికల్ లోకి ఎక్కి అతన్ని చేజ్ చేస్తాడు కిషోర్.

పెద్ద వాన కాబట్టి దూరంగా వెళ్లే వాహనాలు అతనికి కనపడడం లేదు. అలా వెళుతూనే ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేశాడు.

ప్రతాప్ మాట్లాడుతూ “అతను వెనక్కి తిరిగి వచ్చి, వికాస్ అత్తమామలకు హాని చేయవచ్చు. నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయ్. వాళ్లకు ప్రొటెక్షన్ గా ఉండు.


దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గర బైక్ లో సింగిల్ గా వస్తున్న వ్యక్తుల్ని ఆపి విచారించాలని లోకల్ పోలీసులకు నేను ఫోన్ చేస్తాను” అన్నాడు.


వెంటనే తన వెహికిల్ ని వెనక్కి తిప్పమన్నాడు కిషోర్.

ఒక బైక్ మామిడి తోట దగ్గర గేట్ నుండి లోపలికి వెళ్లడం చూశాడు.


వీళ్ళ వెహికల్ అక్కడికి చేరేసరికి, అతను గుడిసె తలుపును కాలితో బలంగా తన్నుతూ కేకలు పెడుతున్నాడు.


గేట్ బయట జీప్ ఆగిన శబ్దం వినగానే అతను తోటలోకి పరుగుతీశాడు.

అతని వెనకే పరుగెత్తాడు కిషోర్.

వెనకనుంచి అతని కాళ్ళకు గురిచూసి షూట్ చేశాడు కిషోర్.

కానీ అతనికి బుల్లెట్ తగ్గలేదు.

చెట్ల మధ్య పరుగెత్తుకుంటూ వెళ్లి, కిషోర్ కి కనపడకుండా పోయాడు.

తన కానిస్టేబుల్స్ ని చెరో వైపు వెదకమని, తను నేరుగా వెళ్ళాడు కిషోర్.

ఇంతలో అతనికి ప్రతాప్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా ఆ ఆగంతకుడు వెనకనుండి ఒక చెట్టు కొమ్మ తో అతని తలమీద బలంగా మోదాడు.

ఫోన్ జారవిడిచి, నేలమీద పడిపోయాడు కిషోర్.

***

రిసెప్షన్ దగ్గర ఉన్న వికాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్.

వికాస్ తో “కంగ్రాట్స్ సార్! మీకు బాబు పుట్టాడు. క్లీన్ చేసి, తీసుకువచ్చి చూపిస్తాము” అని చెప్పి వెళ్ళిపోయింది.

“ కంగ్రాట్స్ మిస్టర్ వికాస్! ఈ గుడ్ న్యూస్, మామిడి తోట దగ్గర ఉన్న మీ మావయ్య కు తెలియజేస్తాను” అంటూ సిఐ కిషోర్ కి కాల్ చేశాడు ప్రతాప్.

అటువైపునుంచి మాటలు వినపడక పోవడంతో “కిషోర్! వికాస్ గారికి అబ్బాయి పుట్టాడు. ఆ విషయం తోటలో ఉన్న డాక్టర్ ఫ్యామిలీ కి చెప్పండి. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? హలో.. హలో..” అన్నాడు.

అటువైపునుంచి వికృతమైన నవ్వు వినపడింది.

“హలో.. ఎవరు నువ్వు?” అంటూ ఆదుర్దాగా అడిగాడు ప్రతాప్.

“ఇప్పుడే నువ్వు అడుగుతున్న ఆ కిషోర్ ని తల పగలగొట్టి కింద పడుకోబెట్టాను. ఇంకా పాతిపెట్ట లేదు. వికాస్ కి అబ్బాయి పుట్టాడా.. కంగ్రాట్స్ చెప్పు. వాళ్ళ మామను కాసేపట్లో లేపేస్తాను. అబ్బాయికి ఆయన పేరు పెట్టుకోమను. లేదంటే నా పేరు.. అదే.. ‘గోవర్ధన్’ అని పెట్టుకోమను” అంటూ కాల్ కట్ చేశాడు.


ప్రతాప్ ముందుగానే మిగతా ముగ్గురు కానిస్టేబుల్స్ నెంబర్ లు తీసి పెట్టుకొని ఉండడంతో వరసగా ముగ్గురికీ కాల్ చేశాడు.

ఒక కానిస్టేబుల్ ‘గుడిసె లో ఉన్నాను’ అని చెప్పడంతో అతన్ని అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.

మిగతా ఇద్దరూ తాము ఆ మామిడి తోటలో చెరొక వైపు ఆ అగంతకుడి కోసం వెతుకుతున్నామని చెప్పారు. వాళ్ళిద్దర్నీ ఒకే చోట కలిసి ఉండమని, సిఐ కిషోర్ కోసం వెతకమని చెప్పాడు ప్రతాప్.


తర్వాత ఆయన తన మిత్రుడైన విజయవాడ ఏసిపి కి ఫోన్ చేసి “సుమంత్ అనే పేరు గల అబ్బాయి యాక్సిడెంట్ అయి, ఏ హాస్పిటల్ లో అయినా జాయిన్ అయ్యాడేమో కనుక్కొని దయచేసి చెప్పండి. అలాగే కంచికచర్ల కు దగ్గరలోని మామిడి తోటలో, మా సిఐ కిషోర్ మీద దాడి జరిగింది. సిటీలో సీరియల్ కిల్లింగ్ అనుమానితుడు దాడి చేసి ఉండవచ్చు. దగ్గరలో మీ వాళ్ళు ఉంటే వెంటనే అక్కడికి పంపించండి” అని రిక్వెస్ట్ చేసాడు.


అలాగే నన్నాడు ఆయన.

తర్వాత ఏసిపి ప్రతాప్, వికాస్ తో “మీరు భయపడకండి. మా కానిస్టేబుల్స్, మీ మామగారికి ప్రొటెక్షన్ గా ఉన్నారు” అని చెప్పాడు.

తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్లి అప్పుడే పుట్టిన బాబు ను చూశారు. మరోసారి వికాస్ కి కంగ్రాట్స్ చెప్పాడు ఏ సి పి ప్రతాప్.

***

సుమంత్ అడ్మిట్ అయిన హాస్పిటల్ డైరెక్టర్ కి, పోలీసుల నుండి ఫోన్ వచ్చింది.

“అన్ని హాస్పిటల్స్ ను ఎంక్వయిరీ చేస్తున్నాము. మీ హాస్పిటల్ లో సుమంత్ అనే పేరుతో ఎవరైనా యువకుడు బైక్ యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాడా? అతని ప్రజెంట్ పొజిషన్ ఏమిటి..?” అని అడిగారు.


“అతన్ని అడ్మిట్ చేసింది హైవే పెట్రోలింగ్ పోలీసులు. విషయం మీ డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాము. అయితే అప్పుడు అతని పేరు సుమంత్ అని తెలీదు. ప్రజెంట్ పొజిషన్ ఇప్పుడే కనుక్కొని చెబుతాను” అంటూ హాస్పిటల్ మేనేజర్ కి కాల్ చేశాడు హాస్పిటల్ డైరెక్టర్.

ఆయన 'ఇప్పుడే కనుక్కొని చెబుతాను' అంటూ సుమంత్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతను లేకపోవడంతో కంగారుగా బయట ఉన్న సెక్యూరిటీని ప్రశ్నించాడు.

"ఆ అబ్బాయి డిశ్చార్జ్ అయినట్టు మన గోవిందం చెప్పాడు. ఆ పేపర్లు మళ్లీ చూపిస్తానని, పేషెంట్ ని ఆటో ఎక్కించి వస్తానని ఇప్పుడే తీసుకొని వెళ్ళాడు” అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్.

“అతన్ని ఎవరూ డిశ్చార్జి చేయలేదు. పద.. అతను ఎక్కడ ఉన్నాడో చూద్దాం” అంటూ సెక్యూరిటీని తీసుకుని వర్షంలో తడుస్తూ రోడ్ లోకి వచ్చాడు మేనేజర్.

ఆ సందు మలుపు తిరిగితే మెయిన్ రోడ్డు వస్తుంది. ఆ మెయిన్ రోడ్డు ని సమీపిస్తున్నారు సుమంత్, గోవిందు.

రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందికి సుమంత్ ని తోసేయాలని ప్రయత్నించాడు గోవిందు.

కానీ ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఏదో శక్తి సుమంత్ ని పడిపోకుండా ఆపిందని అర్థమైంది అతనికి.

ఇంతలో వెనక నుండి హాస్పిటల్ మేనేజర్, సెక్యూరిటీ కేకలు పెడుతూ అక్కడికి చేరుకున్నారు.

వాళ్ళు దగ్గరకు వచ్చి, గోవిందు ను గట్టిగా పట్టుకొని “డిశ్చార్జ్ కాకుండానే పేషెంట్ ని ఎందుకు తీసుకొని వచ్చావు?” అని ప్రశ్నించారు.

గోవిందు కాసేపు పిచ్చి చూపులు చూసి, వాళ్లను విదిలించుకుని వేగంగా వస్తున్న కారు ముందుకు దూకాడు.

కారు డ్రైవర్ అప్రమత్తుడై వెంటనే బ్రేక్ వేసినప్పటికీ ఫ్రంట్ టైర్ గోవిందు ఛాతీ మీద నుండి వెళ్ళింది.


వెంటనే అతన్ని బయటకు లాగి అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.

***

“హోమం పూర్తయితే సుమంత్ కి ఏ ఆపదా లేనట్లే కదా” శంకరశాస్త్రి ని అడిగాడు చలపతిరావు.

“అవును. ఏ ఆపదా ఉండదు. కానీ శత్రువు సామాన్యుడు కాదు. హోమం జరగనివ్వకుండా చేయడానికి చివరి వరకు ప్రయత్నిస్తాడు. అలాగే హోమం ప్రారంభమయ్యే లోగానే సుమంత్ కి ఏదైనా హాని చేయాలని చూస్తాడు.


సుమంత్ ఫోటో ఒకటి ఇవ్వండి. అష్ట దిగ్బంధన మంత్రం నిక్షిప్తం చేసిన తాయత్తును ఆ ఫోటో పైన ఉంచి, విభూది జల్లుతాను. హోమం ముగిసేవరకు అతనికి రక్షణ లభిస్తుంది” అన్నాడు శంకరశాస్త్రి.


సుమంత్ ఫోటో ని ఆల్బం నుంచి బయటకు తీశాడు చలపతిరావు.

హఠాత్తుగా ఆ ఫోటో అతని చేతిలోంచి జారి కింద పడబోయింది.

దూరంగా కుర్చీలో కూర్చొని ఉన్న శంకరశాస్త్రి వేగంగా ముందుకు వచ్చి, తన కుడి చేతిని జాపి ఆ ఫోటో ని కింద పడకుండా అందుకున్నాడు. ఆయన అంత వేగంగా అక్కడికి ఎలా వచ్చాడో చలపతిరావు కి అర్థం కాలేదు.


ఒక ప్లేట్లో బియ్యం తెప్పించుకొని, దానికి ఎనిమిది వైపులా కుంకుమ బొట్లు పెట్టి, సుమంత్ ఫోటోను ప్లేట్ మధ్యలో ఉంచాడు. ఆ ఫోటో పైన తాయత్తునుంచి, మంత్రం జపిస్తూ విభూతిని చల్లాడు. తరువాత తనే స్వయంగా ఆ ప్లేట్ ను తీసుకుని దేవుడి గదిలో ఉంచాడు.

ఆందోళనతో ఉన్న చలపతిరావు తో “మంచే జరుగుతుంది. కంగారు పడకు” అన్నాడు శంకరశాస్త్రి.

మరో పది నిమిషాలకు చలపతిరావు ఫోన్ మోగింది.

అటువైపునుంచి సుమంత్ మాట్లాడుతూ “నాన్నా! ముందు స్పీకర్ ఆన్ చెయ్యి” అన్నాడు.

స్పీకర్ ఆన్ చేశాడు చలపతిరావు.

సుమంత్ మాట్లాడుతూ, తను ఉన్న హాస్పిటల్ పేరు చెప్పాడు.

తరువాత “ నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. ఏదో దుష్టశక్తి బైక్ లో నా వెనక కూర్చొని ఉన్నట్లు అనిపించింది. దాంతో బైక్ నుంచి పడిపోయాను. పూర్తి వివరాలు డైరెక్ట్ గా కలిసినపుడు చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ హాస్పిటల్ లో పనిచేసే గోవిందు అనే వ్యక్తి, నాతో బాగానే ఉంటాడు.

కానీ ఈ రోజు అతను నా దగ్గరికి వచ్చి ‘ఈ హాస్పిటల్ లో నీమీద డాక్టర్ గోవర్ధన్ హత్యా ప్రయత్నం చేస్తాడు. నిన్ను తప్పిస్తాను’ అంటూ నా చెయ్యి పట్టుకుని బలవంతంగా రోడ్డు మీదకు లాక్కొని వచ్చాడు.


వేగంగా వస్తున్న లారీ కిందకు నన్ను తొయ్యాలని చూసాడు.

అతను వదిలేస్తే నీరసంతో కింద పడిపోయేలా ఉన్న నేను, అతను బలంగా తోసినా ఉన్న చోట నుండి కదల్లేదు. ఏదో శక్తి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇక ఆ గోవిందు ని ఒక నీడ లాంటి వికృత ఆకారం ఆవహించి ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ ఆకారమే ఆరోజు మామిడితోటలో నా గొంతు నులమబోయింది. ఆ ఆకారమే యాక్సిడెంట్ జరిగిన రోజు బైక్ లో నా వెనక కూర్చున్నది. ” అని చెప్పాడు సుమంత్.


చలపతి రావు మాట్లాడుతూ “ఇప్పుడే మీ మామ గారు కింద పడబోతున్న నీ ఫోటో ని అమాంతం పడకుండా పట్టుకున్నారు. ఆ ఫోటో పైన మంత్రించిన విభూది ఉంచారు. తెల్లవారగానే మహా మృత్యుంజయ హోమం నీకోసం చేయబోతున్నాం. అది జరిగితే దుష్ట శక్తులు నీ మీద ప్రభావం చూపలేవు. హోమం పూర్తయ్యాకే మేము హాస్పిటల్ కి వస్తాము. ఈ లోపల నిన్ను కలవడానికి మన ఊరి నుండి కొందరు బంధువులను పంపిస్తాను. అలాగే విజయవాడలో ఉన్న మన వాళ్లను కూడా నిన్ను కాంటాక్ట్ చేయమని చెబుతాను” అని చెప్పాడు.

సుమంత్ మాట్లాడుతూ “ఈ నెంబర్ హాస్పిటల్ రిసెప్షన్ వాళ్లది. అవసరమైతే ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

తరువాత శంకరశాస్త్రి తన బావ మరిది చలపతిరావు తో "ఇందాక సుమంత్ మాటల్లో గోవర్ధన్ అనే పేరు వినపడింది. నాకు మత్తు మందు ఇవ్వాలని చూసిన వ్యక్తి తన పేరు గోవర్ధన స్వామి అని చెప్పాడు. అతనే దీక్ష మీద మత్తుమందు చల్లబోయాడు. ఆ పేరు గలవాళ్లు ఎవరైనా తెలుసా" అని అడిగాడు.

"సుమంత్ కోసం ఆ మామిడి తోట దగ్గర వెతికినప్పుడు స్థానికులు చెప్పినదాన్ని బట్టి ఆ తోట యజమాని, ఆ గ్రామ మాజీ సర్పంచ్ గోవర్ధన బాబు. అతను చనిపోయి చాలా కాలమైంది. అతని మనవడి పేరు కూడా గోవర్ధన్. అతను హఠాత్తుగా కనపడకుండా పోయాడట. అంతకు మించిన వివరాలు నాకు తెలియదు. సుమంత్ ను కలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి" అన్నాడు చలపతిరావు.

ఇంకా వుంది…


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


63 views0 comments

Comments


bottom of page