top of page
Original.png

కచదేవయాని - పార్ట్ 75

17 hours ago
8 min read

కచ దేవయాని 75వ భాగంలో శుక్రాచార్యుడి సమక్షంలో శర్మిష్ఠను ప్రతిష్ఠానపురానికి తీసుకెళ్లాలని దేవయాని కోరుతుండగా ఆందోళన చెందుతున్న వృషపర్వుడు.
శర్మిష్ఠను తన వెంట తీసుకెళ్లాలన్న దేవయాని నిర్ణయం వృషపర్వుడిని ఆందోళనకు గురిచేసింది.

Kachadevayani - Part 75 - Telugu Mythological Serial | T. V. L. Gayathri

కచదేవయాని - పార్ట్ 75 - తెలుగు ఇతిహాస ధారావాహిక | T. V. L. గాయత్రి

Published In manatelugukathalu.com On 31/10/2026


కచదేవయాని - పార్ట్ 75 | దేవయాని ఎత్తుకు యయాతి పైఎత్తు!


యయాతి–శర్మిష్ఠల ప్రేమను విడదీయడానికి దేవయాని మరో కొత్త పన్నాగం పన్నింది. తన వివాహం అనంతరం శర్మిష్ఠను కూడా ప్రతిష్ఠానపురానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె అసలు ఉద్దేశాన్ని ముందుగానే గ్రహించిన యయాతి, శర్మిష్ఠ రక్షణ కోసం నహుష చక్రవర్తితో ప్రత్యేక చట్టాన్ని రూపొందించాడు.

మరోవైపు శర్మిష్ఠకు అండగా నిలిచేందుకు యయాతి అనుచరులు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేవయాని తనకు విశ్వాసపాత్రులైన దాసీలను రప్పించేందుకు ప్రయత్నించగా, యయాతి దానికి మరో పైఎత్తు వేశాడు.

వివాహానికి ఒక్కరోజు ముందు మయాచార్యుడిని ప్రతిష్ఠానపురానికి తీసుకెళ్లాలని యయాతి ఎందుకు నిర్ణయించుకున్నాడు? అతడి రహస్య ప్రణాళిక ఏమిటి?

టి. వి. యెల్. గాయత్రి గారి ఆసక్తికరమైన పౌరాణిక ధారావాహిక కచ దేవయాని – 75వ భాగం చదవండి.


జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 

దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.  శర్మిష్ఠ  ప్రేమించింది  యయాతిని అని తెలుసుకుంటుంది  దేవయాని.


తనకు  యయాతితో  వివాహం  జరిపించమని తండ్రిని కోరుతుంది. శుక్రాచార్యుని  సహాయం  కోసం  దేవయానిని వివాహం చేసుకోవడానికి సమ్మతిస్తాడు యయాతి. కానీ ప్రేమను వదులుకోలేక శర్మిష్ఠతో పడవలో బయలుదేరుతాడు. విమలా నదిలో పడవపై తప్పించుకుంటున్న ప్రేమికులను వృషపర్వుడి సైనికులు పట్టుకున్నారు.

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 53 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 54 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 55 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 56 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 57 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 58 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 59 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 60 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 61 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 62 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 63 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 64 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 65 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 66 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 67 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 68 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 69 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 70 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 71 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 72 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 73 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 74 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 75


ఆ రాత్రి తన భవిష్యత్తు ప్రణాళికను వివరిస్తూ, ధైర్యంగా ఉండమని కోరుతూ శర్మిష్ఠకు లేఖ రాసి, నారాచి చేత పంపించాడు యయాతి.


లేఖను చదువుకొని కాస్త స్థిమితపడింది శర్మిష్ఠ.


విందు ముగిసింది.


ఆ రాత్రి తన గదిలోకి వచ్చిన దేవయాని అసహనంతో పచార్లు చేస్తూ ఉంది.


ఎల్లుండి పెళ్లి.


పెళ్లయ్యాక తాను ప్రతిష్ఠానపురానికి వెళ్తుంది.


ఇక్కడ శర్మిష్ఠ ఏమి చేస్తుంది?


వాళ్ల నాన్న తెచ్చిన సంబంధాన్ని చేసుకొని సుఖంగా ఉంటుంది.


కాదు... కాదు...


అలా జరగడానికి వీల్లేదు.


శర్మిష్ఠ తన వైభవాన్ని చూస్తూ కుళ్లి కుళ్లి చావాలి. పెళ్లీ పెటాకులు లేకుండా, పిల్లాపాపా లేకుండా, తనకు జీవితాంతం దాసీగా సేవలు చేస్తూ ఉండాలి.


తాను, యయాతి సరాగాల్లో మునిగి తేలుతూ ఉంటే, శర్మిష్ఠ కుంగి కృశించిపోవాలి.


ఆలోచన వచ్చిందే తడవుగా తండ్రి దగ్గరికి వెళ్లింది దేవయాని.


అక్కడ తండ్రి ఒక్కడే లేడు. వృషపర్వుడు కూడా ఉన్నాడు. పెళ్లి ఏర్పాట్ల గురించి ఆచార్యుడికి వివరిస్తున్నాడు.


సందేహంగా ఆగిపోయింది దేవయాని.


“రామ్మా!” అని పిలిచాడు వృషపర్వుడు.


వచ్చి ఆసనం మీద కూర్చుంది ఆమె.


“ఏమిటి తల్లీ, ఇలా వచ్చావు? పెందలాడే నిద్రపోరాదూ! రేపు రోజంతా వేడుకలు జరుగుతాయి” అన్నాడు ఆప్యాయంగా శుక్రాచార్యుడు.


“నాన్నగారూ!”


“చెప్పు తల్లీ!”


“ప్రతిష్ఠానపురంలో అందరూ కొత్తవాళ్లు. నాకు ఒంటరితనంగా అనిపిస్తుంది. నాకు తోడుగా శర్మిష్ఠను తీసుకెళ్దామని అనుకుంటున్నాను. చెల్లెలు కూడా పక్కన ఉంటే అత్తగారింటిలో ధైర్యంగా ఉంటుంది. అందుకని...”


వృషపర్వుని ముఖం పాలిపోయింది.


“దాని దేముంది? తీసుకెళ్లు! ఇద్దరూ కొద్దిరోజులు తోడుగా ఉండండి! నువ్వు అక్కడ అలవాటు పడ్డాక చెల్లెల్ని పంపిద్దువుగానీ!” అన్నాడు శుక్రాచార్యుడు నవ్వుతూ.


“కానీ గురువుగారూ! అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి చేయాలని అనుకుంటున్నాము కదా! ఇప్పుడు ప్రతిష్ఠానపురానికి వెళ్తే...” అన్నాడు వృషపర్వుడు.


“సంబంధం కుదిరినప్పుడు వెనక్కు వస్తుంది. ఎంత దూరమని? పైగా కొత్త ప్రదేశం. అక్కడ ఉండే వింతలు, విశేషాలు చూసి వస్తుంది” అంది దేవయాని.


“అవును! వృషపర్వా! ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు!” అన్నాడు శుక్రాచార్యుడు.


కాదనలేకపోయాడు వృషపర్వుడు.


సంతోషంగా తన గదికి వచ్చింది దేవయాని.


ఆ రాత్రికే ఈ వార్త యయాతికి కూడా తెలిసిపోయింది.


దేవయాని మనసులో ఏమనుకుంటుందో అతడికి అర్థమైంది.


వెంటనే తండ్రి దగ్గరికి వచ్చాడు.


“విషయం తెలిసింది కదా, నాన్నగారూ!” అన్నాడు యయాతి.


తల ఊపాడు నహుషుడు.


“మనం ఒక కొత్త చట్టాన్ని చేద్దాము! ఒక రాజ్యానికి యువరాణిగా ఉన్న యువతిని దాసీగా చూడరాదని, ఆమెకు ఎటువంటి హాని కలిగించరాదని, ఒకవేళ ఆమెకు హాని కలిగితే శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని నియమాలను ఏర్పాటు చేయాలి.”


యయాతి చెప్పిన ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు.


చట్టం తయారైంది. రాజముద్రను వేశాడు నహుషుడు.


ఇంతలో అక్కడికి వృషపర్వ దంపతులు వచ్చారు.


“మీరేమీ దిగులు పడవద్దు! రాజకుమారి రక్షణ బాధ్యత పూర్తిగా మాది” అన్నాడు నహుషుడు.


“ఆ పిశాచం ఇంకా ఎన్ని ఎత్తులు వేస్తుందో తెలియడం లేదు” అంది సుమాలినీ దేవి.


“మనం కూడా తక్కువ వాళ్లమా? ఆమె వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుందాం! దేవయాని ఆటను కట్టిద్దాం. భయపడకండి, మహారాణీ!” అని వృషపర్వుని పక్కన వచ్చి కూర్చున్నాడు యయాతి.


చాలాసేపు అందరూ శర్మిష్ఠ రక్షణ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు.


రెండో రోజు ఉదయం స్నానం చేసి వచ్చాడు యయాతి.


అతడిని అలంకరిస్తున్నాడు గోపతి.


అక్కడికి వచ్చారు పింగళ, శక్తిధరులు.


“నీ పెళ్లితో పాటు మేము కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నాము” అన్నాడు శక్తిధరుడు.


చివ్వున తల ఎత్తి చూశాడు యయాతి.


“ఎవరిని?”


“నేను కణికను, వీడు మదనికను” బదులిచ్చాడు పింగళుడు.


“మీ ప్రేమకథల గురించి నాకు చెప్పలేదెందుకు?” విస్మయంగా అడిగాడు యయాతి.


“ప్రేమా లేదు. కథా లేదు. రాజకుమారికి తోడుగా రావడం కోసం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం. ఇదిగో! ఈ గోపతి నారాచిని చేసుకుంటున్నాడు. దాదాపు పాతిక మంది రాజకుమారి చెలికత్తెలకు మన సైన్యంలో వాళ్లతో పెళ్లి నిశ్చయమైంది. దానవరాజ దంపతులకు కొంచెం ఊరట లభిస్తుంది” వివరించాడు శక్తిధరుడు.


రాజభక్తి అంటే ఇలా ఉంటుందా?


గోపతి వైపు చూశాడు యయాతి. గోపతికి భార్యా పిల్లలు ఉన్నారు.


“రెండో భార్యగానా?”


“అవును ప్రభూ!” అన్నాడు గోపతి.


“వద్దు గోపతీ! నీ కుటుంబంలో కలతలు వస్తాయి. నా కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు” అన్నాడు యయాతి.


“ప్రభూ! మీ కోసం ప్రాణాలను ఇవ్వమంటే ఇస్తాము. రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా చిన్న విషయం” అన్నాడు గోపతి.


యయాతికి ఒక విషయం అర్థమైంది.


తాను పెళ్లి విషయంలో ఇంత బాధపడుతున్నాడు. అదే తన వాళ్లు మాత్రం అదే విషయాన్ని అతి తేలికగా చూస్తున్నారు.


అయితే, ఈ విషయంతో పాటు నహుషుడు చేసిన కొత్త చట్టం గురించి కూడా దేవయానికి తెలిసిపోయింది.


ఏమిటి చేయడం?


శర్మిష్ఠ వెంట ఆమె పరివారం వస్తోంది. అందులో నారాచి ప్రమాదకారి. శర్మిష్ఠ మీద ఈగనయినా వాలనివ్వదు.


ఏమీ తోచలేదు ఆమెకు.


ఆలోచిస్తూ కూర్చుంది.


మళ్లీ తండ్రి దగ్గరికి వచ్చింది.


ఈసారి ఆయన ఒక్కడే ఉన్నాడు.


“నా వెంట కొంతమంది దాసీలను పంపిస్తారా, నాన్నగారూ!”


“భద్రిణి, ముక్తలతో పాటు ఆశ్రమంలో ఉన్న వాళ్లను తీసుకెళ్లు!” అన్నాడు ఆయన.


“వాళ్లు దానవులు. నావెంట తాతగారి ఆశ్రమంలో ఉండే వాళ్లను పంపిస్తారా?”


“ఇప్పుడు అక్కడి నుంచి ప్రతిష్ఠానపురానికి దాసదాసీలు రావాలంటే సులభంగా నెల పడుతుంది. పైగా వాళ్లు తాపసుల దగ్గర సేవలు చేసేవాళ్లు. రాచనగరులో ఉండటం కష్టం” అన్నాడు శుక్రాచార్యుడు.


నిరుత్సాహంగా మొహం పెట్టింది దేవయాని.


“పోనీ! మీకు తెలిసిన వాళ్లల్లో ఎవరైనా దానవులు కాకుండా ఉంటే పంపిస్తారా?”


“దానవులు మనకు శిష్యులు. వాళ్లు శ్రద్ధగా నిన్ను చూసుకుంటారు. వాళ్లతో నీకు వచ్చిన సమస్య ఏమిటి?”


బదులు చెప్పలేదు దేవయాని.


ఏమని చెబుతుంది? శర్మిష్ఠను యయాతి ఏకాంతంగా కలుసుకోకూడదు. ఆమెను ఒక భవనంలో ఖైదు చేయాలి. ఆమెకు కనీస సౌకర్యాలు ఉండాలి తప్ప, రాజకుమారి అనుభవించే భోగభాగ్యాలను కల్పించకూడదు. పైగా ఎవ్వరితోనూ ఆమె వివాహం జరగకూడదు. జీవితాంతం ఆమె సంసార సుఖాలు లేకుండా కన్యగానే ఉండాలి. ఇవన్నీ తండ్రితో ఎలా చెబుతుంది?


చిన్నబుచ్చుకున్న దేవయాని ముఖాన్ని చూసి,


“సరే! తాతగారి ఇంటి నుంచి దాసదాసీలను పిలిపిస్తాను. వాళ్లను జాగ్రత్తగా చూసుకో!” అన్నాడు శుక్రాచార్యుడు.


కళ్లు మెరిశాయి దేవయానికి.


ఆ రాత్రి దుర్జయుడిని పిలిచి, భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి దాసీలను తీసుకొని ప్రతిష్ఠానపురానికి చేరమన్నాడు శుక్రాచార్యుడు.


దుర్జయుడు ఈ వార్తను యయాతికి చేరవేశాడు.


నవ్వాడు యయాతి.


“చూడు దుర్జయా! వెళ్లి దాసదాసీలను మా రాజ్యానికి తీసుకురా! కానీ, నువ్వు ఎంత ఆలస్యంగా వెళ్లాలంటే, నీ కంటే తాబేలు నడక నయమనిపించాలి. అంటే, మేము రాజధాని చేరాక రెండు నెలల తర్వాత మాత్రమే నువ్వు రావాలి” అన్నాడు.


“అలాగే యువరాజా!” అని వెళ్లిపోయాడు దుర్జయుడు.


పక్కనే ఉన్న దీర్ఘదర్శి,


“ప్రభూ! ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి?” అని అడిగాడు.


“శర్మిష్ఠకు కాపలాగా తన సొంత పరివారాన్ని నియమించాలని దేవయాని గారి ఉద్దేశం” అన్నాడు నవ్వుతూ యయాతి.


“ఇప్పుడేమి చేద్దాం?”


“ఏమీ లేదు. మయాచార్యుడిని మాతో పాటు మా రాజ్యానికి తీసుకుపోవడమే!”


దీర్ఘదర్శి ఇంకా అయోమయంగా చూస్తున్నాడు.


తాను చేయాల్సిన పనేమిటో యయాతికి తెలుసు. అతడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు.


రేపే వివాహం.


===============================================

ఇంకా వుంది..

కచదేవయాని - పార్ట్ 76 త్వరలో

===============================================



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y





T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

T. V. L. Gayathri

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు టి. వి. యెల్. గాయత్రి. పూర్తి పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి. మా పుట్టిల్లు నెల్లూరు జిల్లాలోని మొగలిచర్ల గ్రామం.నేను గృహిణిని. మా అమ్మగారు ప్రముఖ రచయిత్రి పవని నిర్మల ప్రభావతమ్మ గారు. మా నాన్నగారు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహ స్వామి మరియు మొగలిచర్ల దత్తాత్రేయస్వామి దేవస్థానములకు ధర్మకర్తగా ఉండేవారు.


నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవటం అలవాటు. అలా చదువుతూ, పద్యాలు కథలు వ్రాద్దామని అనుకున్నాను.

2009 లో పునాకు వచ్చాను.


2019 లో శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ గారి 'అనంతఛందస్సు' అనే పద్యశిక్షణా సమూహములో చేరి పద్యాలు వ్రాయడం నేర్చుకొని వ్రాస్తున్నాను.

అలా 2019 నుండి పద్యాలు, కవితలు వ్రాస్తున్నాను.2023 నుండి కథలు వ్రాయటం మొదలు పెట్టాను.మా గురువుగారు మా చేత క్రొత్త వృత్తాలతో "అనంత ఛందస్సౌరభం "అనే గ్రంథమును వ్రాయించారు.

అందులో నేను కూడా 100 పద్యాలు వ్రాసాను.

నేను వ్రాసిన "పల్లె పిలిచింది "అనే స్వతంత్ర కావ్యము "మన తెలుగు కథలు డాట్ కామ్ "పత్రికలో దారావాహికంగా వచ్చింది.

మా గురువుగారు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వివిధ ప్రక్రియలు నేర్పిస్తూ ఉంటారు. అందులో గర్భ కవిత్వం ఒకటి. దానిలో కూడా కొన్ని పద్యాలను వ్రాయడం జరిగింది.


నేను వ్రాసిన పద్యములను , కవితలను పోటీలకు పంపిస్తూ ఉంటాను. విజేతగా చాలా ప్రశంసా పత్రాలు లభించాయి.


కథలు వ్రాయటానికి నాకు ప్రేరణ మా అమ్మగారు.

నా మొదటి కథ 'పరివర్తన 'గో తెలుగు డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది.

నేను కవితలు శతకాలు, కావ్యాలే కాకుండా కథలు వ్రాయగలను అన్న విశ్వాసం కలిగింది.

నా మొదటి కథకు పారితోషికం ఏమీ లేదు.

ఇప్పటి వరకు నేను 112కథలు,"క్రొత్త నీరు "అనే నవల వ్రాసాను.' కచ దేవయాని ' సీరియల్ గా "మన తెలుగు కథలు డాట్ కామ్ "అంతర్జాల. పత్రికలో వస్తోంది.నేను వ్రాసిన కథల్లో సగం కథలు వివిధ పోటీల్లో బహుమతులు తెచ్చుకున్నాయి.


మా పిల్లలతో నేను వ్రాయబోయే కథల గురించి చర్చిస్తూ ఉంటాను. ఒక్కోసారి కథాంశాన్ని వాళ్ళు చెప్పినట్లుగా మార్చుతాను.

సాధారణంగా నేనే కథలు వ్రాసి చూసుకొని పత్రికలకు పంపిస్తాను.

నాకు నచ్చిన కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. చిన్నప్పటి నుండి వారి సాహిత్యాన్ని చదువుతూ పెరిగాను.

నేను సమాజానికి మేలు చేసే రచనలను ఇష్టపడతాను.

నేను వ్రాసిన రచనల్లో బాగా పేరు తెచ్చిన కథ 'కప్పు తేనీరు '.ఇంటికి దీపం, నీ అడుగు జాడలో, సర్దుబాటు లాంటివి.

నావి రెండు కథాసంపుటాలు వచ్చాయి.అవి "నవ్య కథా సౌరభం -1"మరియు "నవ్య కథా సౌరభం :2 "అనేవి.

మూడు కావ్యాలు, ఐదు శతకాలు కలిపి '1.శతక విజయం. 2. కవన త్రివేణీ సంగమం 'అనే పుస్తకాలు ప్రింట్ అయ్యాయి.

ఇంకా వందల సంఖ్యలో పద్యాలు వ్రాసాను.


2024లో తానావారి పద్య కావ్యపోటీలో పాల్గొని తొమ్మిదవ స్థానం పొందాను.

2022 లో స్టోరీ మిర్రర్ వారు "ది ఆథర్ ఆఫ్ ద ఇయర్ "అవార్డు ఇచ్చారు.

2024 లో సాయివనంలో సాహిత్యం వ్వాట్సాప్ సమూహం వారు "కవనమణి "బిరుదు ఇచ్చారు.

2026 జనవరిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థ. మంత్రపురి వారు నిర్వహించిన 100 రోజుల కవితా పండుగలో పాల్గొని విజేతగా నిల్చినందుకు స్వర్ణకంకణమును ఇంటికి పంపించారు. అనారోగ్య కారణాల వలన నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను.

2026 ఏప్రిల్ లో మహారాష్ట్ర ప్రభుత్వము మరియు మహారాష్ట్ర తెలుగు అకాడమీ సంయుక్తంగా పూణే లో ఉగాది సన్మానం చేసారు.

2026 నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూణే " ఆంధ్రా సంఘం "వారు సన్మానం చేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page